
గర్భధారణ సమయంలో తల్లి ఆహారపు అలవాట్లు, తీసుకునే పదార్థాలు శిశువు ప్రధాన పోషకాహారంగా పనిచేస్తాయి. తల్లి మరియు అభివృద్ధి చెందుతున్న పిండం ఇద్దరికీ పోషకాలతో కూడిన ఆహారం అవసరం. పిండం పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందించడానికి గర్భిణీలు వివిధ రకాల ఆరోగ్యకరమైన భోజనం, పానీయాలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. గర్భం దాల్చిన 7వ వారంలో తినాల్సిన వస్తువులు, ఆరోగ్యకరమైన గర్భం కొనసాగించేందుకు ఇక్కడ కొన్ని ఆహార సూచనలు ఉన్నాయి.
గర్భం దాల్చిన 7 వారాల్లో ఉన్న పిండం మీ గర్భాశయంలోకి ప్రవేశించిన దానికంటే ఇప్పుడు 10వేల రెట్లు పెద్దగా ఉంటుంది. మీ పాప నిమిషానికి 100 కొత్త మెదడు కణాలను అభివృద్ధి చేసుకుంటుంది. ప్రస్తుతం మీ శరీరంలో హార్మోన్ల పెరుగుదల జరుగుతుంది. అది మీకు అనారోగ్యం కలిగించొచ్చు. ప్రొజెస్టిరాన్ హార్మోన్ అజీర్ణం మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ సమయంలో చికెన్ చూడగానే మీకు చిరాకు లేదా జున్ను వాసన మీ కడుపులో తిప్పినట్టు చేసినా, ఏదో తప్పు జరుగుతుంది అని గుర్తించాలి. గర్భధారణ సమయంలో ఇలా అనిపించడం చాలా సాధారణం. అయితే ఈ విషయాలు చాలా కలవరపరుస్తాయి. ముఖ్యంగా మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు సడన్ గా మీకు చల్లగా మరియు అసౌకర్యంగా అనిపించినప్పుడు.
క్రీగర్ ప్రకారం ముఖ్యంగా తొలి రెండు త్రైమాసికాల మధ్య, 7వ వారం గర్భవతి ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటుండాలి. రోజుకు పింగ్ పాంగ్ బంతి సైజులో 5 నుంచి 10 కూరగాయలు తినాలని సూచించింది. రంగురంగుల ఆహారాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, పోషకాలు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. శరీరం అనేక వ్యాధులతో పోరాడటానికి ఆకుకూరలు సహాయపడతాయని మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వాటిలో పోషకాలు సమృద్ధిగా, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ వెజిటేబుల్స్ మీ గర్భధారణ ఆహారంకు అదనపు పోషకాలను అందిస్తాయి. ఎందుకంటే అవి యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, ఫోలేట్, విటమిన్లు, పొటాషియం తదితరాలను కలిగి ఉంటాయి.
శిశువు ఎముకలు, దంతాల నిర్మాణానికి కాల్షియం ఎంతగానో ఉపయోపడతాయి. మీ శిశువు ఎముకలు మరియు దంతాల పెరుగుదలకు ఇది చాలా చాలా అవసరం. అకాడెమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం, మీ ఆహారంలో చాలా తక్కువ కాల్షియం ఉంటే పెలుసైన ఎముకలకు (బోలు ఎముకల వ్యాధి) దారి తీస్తుంది. ఎందుకంటే మీ నుంచే మీ శిశువు కాల్షియం తీసుకుంటుంది. శిశువు దంతాలు మరియు ఎముకలు అభివృద్ధి చెందడానికి కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా అవసరం. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, మీ శిశువు ఎముకలు మరియు దంతాల అభివృద్ధికి తోడ్పడే కాల్షియం మరియు ఫాస్పరస్ లను సమతుల్యత చేసేందుకు కూడా విటమిన్ డి అవసరం. దీనికితోడు చర్మం, కంటి ఆరోగ్యానికి కూడా విటమిన్ డి చాలా అవసరం.
పెరుగుతున్న శిశువు అవసరాలను సంతృప్తి పరిచేందుకు మీ రక్త సరఫరా పెరుగుతుంది. ఐరన్ ఈ సమయంలో చాలా కీలకం అవుతుంది. మీ కోసం, మీ పుట్టబోయే బిడ్డకు రక్తసరఫరా పెరిగేందుకు గర్భధారణ మొత్తం ఐరన్ చాలా కీలకం. మీ ఆహారం ప్రణాళికలో పాలకూర, స్టీక్, చికెన్, గుడ్లు మరియు టోఫు వంటి ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోండి. పొడి బీన్స్, ముదురు ఆకుకూరలు, గోధుమ గింజలు మరియు నారింజ రసం సహా ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గర్భధారణ సమయంలో రక్తహీనత రాకుండా ఉండేందుకు మీ ప్రీ నాటల్ విటమిన్లో ఐరన్ అధికంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే రోజూ తీసుకోవాల్సిన 27 మిల్లీ గ్రాములను ఆహారం ద్వారా అందించడం చాలా కష్టం. కాలే వంటి కూరగాయల్లో ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు విటమిన్ కె ఉంటాయి.
నారింజ, బ్రకోలీ మరియు స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి అధికంగా ఉంటాయి, ఇది పెరుగుతున్న శిశువు యొక్క ఎముకలు, కణజాలాల అభివృద్ధిలో సహాయపడుతుంది. అలాగే ఐరన్ శోషణ పెంచుతుంది. ఆరెంజ్ జ్యూస్‌లోని విటమిన్ సి మీ బిడ్డ ఐరన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఆరెంజ్ జ్యూస్ యొక్క ఫోలేట్, పొటాషియం మరియు విటమిన్ ‘సి’ని నింపొచ్చు. ఇది మీ పాపకు అవసరమైన పోషకాహారాన్ని అందించడమే కాకుండ పుట్టుకతో వచ్చే పలు సమస్యలను నివారిస్తుంది.
7వ వారం గర్భధారణ ఆహారంలో ఓట్ మీల్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణీ కార్బోహైడ్రేట్లు తీసుకోవాలి, ఎందుకంటే అవి మీరు రోజువారీ పనులు చేసుకోవడానికి త్వరగా శక్తిని అందిస్తాయి. కార్బోహైడ్రేట్లు, సెలీనియం, విటమిన్ బి, భాస్వరం, కాల్షియం వంటి వాటిని ఓట్ మీల్ అందిస్తుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఓట్ మీల్ ను అల్పాహారంగా తినండి.
తక్కువ పోషకాహారం తీసుకోవడం వల్ల ప్రసవము కష్టం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇది మీరు అధిక బరువు పెరిగేలా చేస్తుంది. పుట్టబోయే బిడ్డకు ప్రత్యేకమైన పోషకాహార అవసరాలను తీర్చడానికి, గర్భిణీలు 7వ వారంలో ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. చివర్లో మొదటి త్రైమాసికంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం, కానీ మీరు తినే ఆహారంలోని పదార్థాల గురించి చింతించకండి. ఎందుకంటే ఇప్పటికే ఆందోళతో ఉన్న మీకు అనవరసపు ఒత్తిడి పెంచుతుంది. మీకు ఖచ్చితంగా తెలియకుంటే మీ ప్రసూతి వైద్యులను సంప్రదించండి. వారు మీ గర్భధారణ మొదటి 7 వారాల్లో ఏమి తినాలి, ఏమి తాగాలనే దానిపై మీకు సలహాలు అందిస్తారు.
Yes
No














Actually I am 3 months pregnant but na egg quality bagoledo amo weeks daggare agipothunna
Amniotic fluid taggindhi and yolk sac undi but placenta inka raledu anta so placenta manchi food teskodam valana vache chance unda
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |