


Pregnancy Tests
3 November 2023 న నవీకరించబడింది
గర్భధారణ పరీక్ష ఎప్పుడు చేసుకోవాలో గుర్తించడం చాలా ఒత్తిడితో కూడుకున్నది. ప్రత్యేకించి మీరు గర్భవతి కావాలని ఆశిస్తుంటే.. లేదా దేని గురించి ఆశించినా.. మీరు ఒత్తిడికి గురికాకండి. ఓపిక పట్టండి. మీ శరీరం మార్పులకు లోనయ్యేందుకు పాజిటివ్ లేదా నెగటివ్ రిజల్ట్‌ను చూపేందుకు కొంత సమయం పడుతుంది. మీరు గర్భధారణ పరీక్షను ముందుగానే తీసుకోవడం వలన మీకు తప్పుడు ఫలితాలు రావొచ్చు. గర్భధారణ నిర్దారణ కావడానికి గరిష్టంగా ఎన్ని రోజులు పడుతుంది. ఎంత త్వరగా గర్భధారణ పరీక్షలో పాజిటివ్ ఫలితం వస్తుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకుందాం.
మీరు ఇటీవల ఎటువంటి రక్షణ లేకుండా సెక్స్ చేశారా? మీరు మీ పీరియడ్‌ను మిస్ అయ్యారా? మీరు గర్భవతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఈ రోజుల్లో గర్భధారణ పరీక్షలు చాలా నమ్మదగినవిగా ఉంటున్నాయి. ప్రత్యేకించి మీరు పీరియడ్ మిస్ అయిన మొదటి రోజు చేసుకున్న పరీక్ష. త్వరితగతిన గర్భధారణ ఫలితం పొందేందుకు మీకు దగ్గర్లో ఉన్న మందుల దుకాణం నుంచి గర్భధారణ టెస్టింగ్ కిట్ తీసుకొచ్చి.. ఫలితాలు చెక్ చేసుకోండి. కానీ ఖచ్చితమై ఫలితాల కోసం.. మీ కలయిక తర్వాత సరైన సమయం వరకు వేచి ఉండడం మంచిది.
మీ పీరియడ్ మిస్ అవడానికి 7 రోజుల ముందు పాజిటివ్ గర్భధారణ పరీక్ష చేసుకున్నారా? మీరు గర్భవతిగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ఎంత సమయం పడుతుందని మీరు ఆలోచిస్తున్నారా? మీ ప్రశ్నలన్నింటికీ ఇక్కడ సమాధానాలు ఉన్నాయి.
చాలా చోట్ల చెప్పిన దాని ప్రకారం.. పరిశోధనల ఫలితం ప్రకారం ఫలదీకరణం (సెక్స్) జరిగిన 7–10 మధ్యలో స్త్రీ శరీరం hCG హార్మోన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అత్యంత ఖచ్చితమైన ఫలితాల కోసం ఫలదీకరణం తర్వాత 2 వారాల పాటు వేచి చూడడం మంచిది. ఈ రెండు వారాల సమయంలో మీ శరీరం తగినంత స్థాయిలో hCGని ఉత్పత్తి చేస్తుంది. అది మీ మూత్రంలో చూపించబడుతుంది. ఖచ్చితమైన గర్భధారణ పరీక్షకు ఇది సహాయపడుతుంది. 12 రోజుల వ్యవధి అనేది కొంత ముందుగానే కావొచ్చు. 14 రోజుల తర్వాత గర్భధారణ పరీక్షను తీసుకోవడం ఉత్తమ నిర్ణయం అవుతుంది. మీరు మీ ఇంట్లోనే ప్రెగ్నన్సీ టెస్టింగ్ కిట్ సాయంతో గర్భధారణ పరీక్ష చేసుకోవచ్చు.
మీ పీరియడ్ తప్పిపోయిన తర్వాత ఎన్ని రోజులకు గర్భం నిర్దారణ అవుతుందని ఆలోచిస్తున్నారా. సాధారణంగా డాక్టర్లు మరియు హెల్త్ కేర్ నిపుణులు స్త్రీ పీరియడ్ తప్పిపోయిన మొదటి రోజునే గర్భధారణ పరీక్షను చేసుకోవాలని సిఫారసు చేస్తారు. గర్భధారణ పరీక్ష అనేది మన శరీరంలో ఉన్న hCG స్థాయిలను కొలుస్తుంది. ఈ హార్మోన్ ఫలదీకరణం తర్వాత 14 రోజులకు సాధారణంగా విడుదలవుతుంది. ఖచ్చితమైన ఫలితాల కోసం మీ పీరియడ్ డేట్ తర్వాత ఒక వారం రోజుల వరకు వేచి ఉండాలని కొన్ని సందర్భాల్లో వైద్యులు సిఫారసు చేస్తారు.
స్త్రీలు వివిధ రకాల పీరియడ్ సైకిల్స్‌ను కలిగి ఉంటారు. కొంత మందికి 28 రోజుల సైకిల్స్ ఉంటాయి. కొంత మందికి ఇవి రెగ్యులర్‌గా ఉండకపోవచ్చు. మీకు 35 రోజుల సైకిల్ ఉంటే గర్భం కోసం ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? మొదట గుర్తుంచుకోవాల్సింది మీరు ఎటువంటి ఒత్తిడికి గురికాకూడదు. ఇర్రెగ్యులర్ (క్రమరహిత) పీరియడ్స్ అనేవి సాధారణం. మీకు కనుక 35 రోజుల సైకిల్ ఉంటే.. మీ చివరి పీరియడ్ స్టార్ట్ డేట్ నుంచి 35–36 రోజులు లెక్కించండి. మీరు గర్భవతిగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు మీ శరీరం సరిపోయేంత స్థాయిలో hCG హార్మోన్లను రిలీజ్ చేసి ఉండాలి.
మీ గర్భధారణ పరీక్షలో నిర్దిష్టమైన ఫలితాల కోసం చూస్తున్నారా? మీరు దానిని ఎప్పుడు తీసుకోవచ్చు. గర్భధారణ పరీక్ష ఎప్పుడు తీసుకుంటే పాజిటివ్ వస్తుందని ఆలోచిస్తున్నారా? ముందుగా చెప్పినట్లు కలయిక లేదా ఫలదీకరణం జరిగిన తర్వాత 12 నుంచి 14 రోజుల సమయం పాటు వేచి ఉండాలి. అప్పడు మీకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది మహిళలు తమ పీరియడ్ మిస్ అయిన మొదటి రోజునే గర్భధారణ పరీక్షను తీసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని సార్లు నెగటివ్ రిజల్ట్ చూడాల్సి వస్తుంది. కాబట్టి టెస్ట్‌ను తీసుకునేందుకు కొంత సమయం వేచి ఉండడం ఉత్తమం. కనీసం మీ పీరియడ్ మిస్ అయ్యే వరకు లేదా మీరు చివరిసారిగా కలిసిన తర్వాత 21-28 రోజుల వరకు వేచి ఉండండి.
1. మూత్రపరీక్ష ద్వారా గర్భధారణ పరీక్ష చేసుకుంటే ఎన్ని రోజులకు పాజిటివ్ వస్తుంది?
మూత్రంలో చూపించేంత hCG స్థాయిలను డెవలప్ చేసేందుకు ఫలదీకణం తర్వాత శరీరానికి రెండు వారాల సమయం పడుతుంది. అందువల్ల ఫలదీకరణం జరిగిన 14 రోజుల తర్వాత మూత్రం ద్వారా గర్భధారణ పరీక్ష చేసుకుంటే పాజిటివ్ వస్తుంది.
2. 28 రోజుల పీరియడ్స్ చక్రం ఉన్నపుడు నేను ఎప్పుడు గర్భధారణ పరీక్ష చేసుకోవాలి?
hCG లేదా హ్యూమన్ క్రోనిక్ గొనడోట్రోపిన్ అనేది స్త్రీ గర్భవతిగా ఉన్నపుడు రిలీజ్ అయ్యే హార్మోన్. ఈ హార్మోన్‌ను శరీరం తగినంత స్థాయిలో విడుదల చేసేందుకు మరియుమూత్రపరీక్షలో గుర్తించేందుకు దాదాపు 14 రోజుల సమయం పడుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒవొల్యూషన్ (అండోత్సర్గము) పీరియడ్ తర్వాత 12–15 రోజుల సమయం తీసుకుంటుంది. 28 రోజుల రుతుచక్రంలో ఇలా జరుగుతుంది. డాక్టర్లు కూడా మీ పీరియడ్ మిస్ అయిన తర్వాత గర్భధారణ పరీక్షను చేసుకోవాలని సూచిస్తారు.
Pregnancy test in telugu, How to perform pregnancy test in telugu, Pregnancy testing kit in telugu, Can we confirm pregnancy through pregnancy testing kit in telugu, positive pregnancy result in telugu, negative pregnancy result in telugu.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)