


Pregnancy Journey
3 November 2023 న నవీకరించబడింది
మీ స్తనాలు గర్భవతిగా ఉన్నప్పుడు అలాగే తర్వాత కూడా నిత్యం మారుతూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే మీ స్తనాలలోని పాల గ్రంథులలో జరిగే హెచ్చుతగ్గులే ప్రసవం తర్వాత స్తనాల బరువు మారడానికి కారణమవుతాయి. అలాంటి పరిస్థితులలో, మీరు సాధారణంగా వాడే బ్రాలని వాడలేరు. అందుకని మంచి మెటర్నిటీ బ్రాని కొనుక్కోవడం మీరు అనుకున్నదానికన్నా లాభదాయకం అవుతుంది! ఈ బ్రాలు ప్రసవం తర్వాత కూడా మీకు ఎంతో సాయం చేస్తాయి. అందుకని ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే వీటిని కొనండి. ఇవి చాలా రకాలుగా మీకు ప్రయోజనం కలిగిస్తాయి!
మెటర్నిటీ బ్రాలు ముఖ్యంగా మీ ప్రసవానికి ముందు అలాగే తర్వాత కూడా మీ స్తన అవసరాలని తీర్చే విధంగా డిజైన్ చేయబడ్డ బ్రాలు. నర్సింగ్ బ్రా యొక్క కొన్ని ప్రాథమిక ఫీచర్లలో వెడల్పాటి స్ట్రాపులు, అదనపు హుక్కులు మరియు లోపలివైపు మెత్తటి కాటన్ లైనింగ్ ఉంటాయి. కొన్ని రకాల నర్సింగ్ బ్రాలలో అండర్ వైర్లు ఉంటాయి, కొన్నిటిలో ఉండవు. గర్భవతిగా ఉన్నప్పుడు, మీ శరీరం లెక్కలేనన్ని మార్పులకి గురవుతుంది. ఈ మార్పులలో కొన్ని హార్మోన్ల స్థాయిలలో హెచ్చుతగ్గులుగా, స్తనాలలో మార్పులు అలాగే చనుమొనల సున్నితత్వం పెరగటం రూపంలో గమనించవచ్చు. ఇవేకాక బరువు పెరగటం అలాగే పాలగ్రంథుల పెరుగుదల కూడా ఈ దశలో శరీరంలో జరిగే మరికొన్ని మార్పులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ దశలో సాధారణంగా వాడే బ్రానే కొనసాగిస్తూ సరిపెట్టుకోవచ్చు అనుకోవడం సామాన్యమే. కానీ సౌకర్యవంతమైన, అనువైన మెటర్నిటీ బ్రాలని కొని మిమ్మల్ని మీరు కొద్దిగా విలాసంగా సంతోషపెట్టుకోవడం మీ శరీరానికి ఎంతో సహాయం చేయవచ్చు. పుట్టబోయే పాపాయి అవసరాలకి తగ్గట్టుగా మీ స్తనాలు బరువెక్కుతున్నందున, వాటికి సరిగ్గా అవసరమైన మద్దతునిచ్చే సౌకర్యవంతమైన మెటర్నిటీ బ్రాలని కొనటం సరైన నిర్ణయం అవుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రీయూజబుల్ నర్సింగ్ ప్యాడ్‌లను ఉపయోగించడం సురక్షితమేనా?
మీరింకా వీటిని కొనడానికి సందేహిస్తుంటే, మంచి నాణ్యమైన మెటర్నిటీ బ్రాను కొనడం ఎంత ఉపయోగమోనని నమ్మకం కలిగించే కొన్ని కారణాలు ఇక్కడ కింద ఉన్నాయి.
మెటర్నిటీ బ్రాలకి అండర్ వైర్లు ఉండవు. కాబట్టి అవి మీ చర్మానికి గుచ్చుకుంటూ లేదా ఏదైనా ఇతర అసౌకర్యాన్ని కానీ కలిగించవు. అదేకాక నర్సింగ్ బ్రా యొక్క లోపలి కాటన్ భాగం చనుమొనల వద్ద చర్మం, బ్రా లోపలి లైనింగ్ తో రాసుకోకుండా ఉండేలా చేస్తుంది. అలా నర్సింగ్ బ్రాలు సౌకర్యవంతమైనవనే ఖచ్చితమైన ఇవ్వబడుతుంది.
అండర్ వైర్లున్న బ్రాలని పాలిచ్చే స్తనాలకి వాడటం అనారోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా భావిస్తారు. ఇలా ఎందుకంటే అండర్ వైరు ఉన్న బ్రాలు పాల గ్రంథులపై ఎంతో ఒత్తిడిని కలిగించి, నెమ్మదిగా పాలు రానీయకుండా నిరోధిస్తాయి. అలా జరగటం నొప్పి లేదా ఇతర సమస్యలకి కూడా దారితీస్తుంది. అవేకాక అలాంటి బ్రాల వల్ల మాస్టిసిస్ అనే వ్యాధి కూడా రావచ్చు. ఇది మీ పసిబిడ్డపై కూడా ప్రభావం చూపించే ఒక సాధారణ స్తన ఇన్ఫెక్షన్.
ఈ పరిస్థితులన్నీ రావడం చాలా సాధారణం అయిపోయింది. కాబట్టి ఈ కాలంలో అనేక రకాల బ్యాక్టీరియా నిరోధక, తేమని పీల్చుకునే నర్సింగ్ బ్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నర్సింగ్ బ్రాలు స్తనాల ఇన్ఫెక్షన్లు ఇంకా వాటి సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాద అవకాశాన్ని కూడా తగ్గిస్తాయి.
ఇక పసిపిల్లలకి పాలిచ్చే విషయమైతే, విడిగాకన్నా మెటర్నిటీ బ్రా వేసుకున్నప్పుడే సులువుగా, వేగంగా తల్లి పాలని ఇవ్వవచ్చు. అసౌకర్యంగా కానీ లేదా అనువుగా లేకుండా చిరాకుగా అన్పించటం వంటి ఇబ్బందులైతే ఖచ్చితంగా ఉండవు.
మీ పసిబిడ్డకి పాలు పడుతున్నప్పుడు మీ బ్రాని పూర్తిగా హుక్కులతో సహా తీసివేయాల్సిన అవసరం ఉండదు. నిజం చెప్పాలంటే మెటర్నిటీ బ్రాను కేవలం ఒక చేత్తో కూడా విప్పవచ్చు. అంతేకాకుండా అదే సమయంలో మీరు మరో ఖాళీ చేతిని ఇతర పనులకి వాడుకోవచ్చు. ప్రసవం అయ్యాక మీ స్తనాల పరిమాణంలో హెచ్చుతగ్గులు రావడం గమనిస్తారు. ఈ స్థితిని మనస్సులో పెట్టుకుని, మీ స్తనాల మార్పులకి తగ్గట్టుగా నర్సింగ్ బ్రాలు సౌకర్యం ఇంకా అనుకూలతలని అందిస్తూ ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. ఈ సమయంలో మీ స్తనాలు పెద్ద సైజు కన్నా ఎక్కువ బరువుతో ఉన్నాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, మెటర్నిటీ బ్రాలతో పోలిస్తే సాధారణ బ్రాలు అంత సహాయపడవు. అందుకని, మామూలువాటితో పోలిస్తే వెడల్పాటి స్ట్రాపులు ఉండే నర్సింగ్ బ్రాలని ఎంచుకోవటం మీకు లాభం కలిగిస్తుంది. ఈ విధంగా బెల్టు మీ స్తనాల బరువుని ఆపుతూ, చర్మానికి గుచ్చుకోకుండా, భుజాలపై కదలకుండా నిలిచి ఉంటుంది.
తల్లిపాలని ఇచ్చే మహిళలు ఆ సమయంలో స్తనాలలో బిగువు పోయి సాగిపోవటాన్ని చూస్తారు. దానివల్ల చాలామంది సాధారణంగా అండర్ వైరు బ్రాలని వాడతారు. నిపుణులు పాలిస్తున్నప్పుడు అండర్ వైరు బ్రాలని వేసుకోకుండా మానేయాలని సలహా ఇస్తారు. ఎందుకంటే అలాంటి బ్రాలు మీ స్తనం యొక్క పూర్తి ఆకృతిని మార్చగలవు. అదేకాక నర్సింగ్ బ్రాలు మీ స్తనాల స్థితిని మొత్తం మీద చూసుకోవడమేకాక, ఎంతో అవసరమైన మద్దతుని అందిస్తాయి. ఈ కాలంలో మెటర్నిటీ బ్రాలు అనేక ఆకృతులు, శైలులలో వస్తాయి. నిజానికి, మీ అవసరాలన్నిటికీ సరిపోయే సరైన బ్రాని చాలా సులభంగా కనుగొనవచ్చు. మీరు ఒకవేళ మెటర్నిటీ బ్రా మిమ్మల్ని ముసలివారుగా లేదా గజిబిజిగా కన్పించేలా చేస్తుందని భావిస్తుంటే, ఇక ఆందోళన పడటం మానేయండి. ఈ కాలంలో అతుకులు లేని నర్సింగ్ మెటర్నిటీ మౌల్డెడ్ స్పేసర్ కప్ బ్రాలని ఆన్లైన్లో కూడా పొందవచ్చు!
వాస్తవానికి, ఇవాళే మీరు మెటర్నిటీ బ్రాని కొని తీరాలి! మీ నర్సింగ్ మెటర్నిటీ మౌల్డెడ్ స్పేసర్ కప్ బ్రా సైజు కూడా కాలంతోపాటు మారుతూ ఉంటుంది; అందుకని కొన్ని నెలలకోసారి మీ బ్రా యొక్క సైజు ఫిట్టింగులని కూడా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈకాలంలో కెరీర్ అలాగే పిల్లల సంరక్షణకి మధ్య సతమతమవుతున్న చాలామంది మహిళలకి మెటర్నిటీ బ్రాలని షాపింగ్ చేయటానికి సమయం ఉండట్లేదు.
అందుకని మీరు మెటర్నిటీ బ్రాని ఆన్లైన్లో కొనాలని నిర్ణయించుకున్నప్పుడు, కేవలం చట్టబద్ధమైన వెబ్సైట్లని మాత్రమే ఎంచుకుని వాటిల్లో వెతకండి. ఆ వెబ్సైట్ల యొక్క ఎక్స్ఛేంజి పాలసీ విధానాలని కూడా చదవండి. అనేక షాపింగ్ వెబ్సైట్లు మీరు సరిగ్గా సరిపోయే మేటి మెటర్నిటీ బ్రాలని ఎంచుకోవడంలో సహాయం చేయటానికి స్తనాల సైజు ఛార్టులని కూడా అందిస్తాయి.
మెటర్నిటీ బ్రాని కొనేముందు, వారు అందించే నర్సింగ్ మెటర్నిటీ మౌల్డెడ్ స్పేసర్ కప్ బ్రా సైజు ఛార్ట్ ని ఒకసారి నిశితంగా గమనించండి. మీరు అప్పుడు ఆన్లైన్లో కొన్ని నర్సింగ్ బ్రాలని డిస్కౌంట్ రేట్లలో కొని ప్రయత్నించవచ్చు. నిజానికి ఈ కాలంలో రకరకాల స్టైల్స్, ఆకృతులలో మెటర్నిటీ బ్రాలు దొరుకుతున్నాయి. అందుకని మీ అవసరాలు అన్నిటికీ సరిపోయే సరైన మెటర్నిటీ బ్రానే వెతికి కొనండి!
ఇవేకాక మెటర్నిటీ బ్రా కొనడానికి మీ డబ్బులు ఖర్చు పెట్టేముందు ఒకసారి అన్ని స్ట్రాపులు అలాగే మొత్తం మీద ఎంత అనుకూలంగా ఉందో చెక్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నాం. మేటి నర్సింగ్ బ్రా కొనడానికి ఇతర తల్లులతో కూడా మాట్లాడడం ఎంతో సహాయం చేస్తుంది!
Maternity bra during pregnancy in telugu, Maternity bra in telugu, Maternity bra benefits during pregnancy in telugu, When to wear maternity bra during pregnancy in telugu, reasons to wear maternity bra in telugu.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)