

Travel & Holidays
4 December 2023 న నవీకరించబడింది
చాలా మంది తల్లిదండ్రులకు వారి సమయాన్ని పూర్తిగా చిన్నపిల్లల తోనే గడపడంవల్ల రాబోయే కొన్ని సంవత్సరాల వరకు జీవితం ఆగిపోతుందనే అపోహ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. ప్రయాణాలు మీ చిన్నారికి కేవలం స్థల మార్పిడి మరియు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం మాత్రమే ఇవ్వవు. ఇది మీ చిన్నారికి వెలుగులు నింపే మరియు కళ్లు తెరిచే అనుభవంగా కూడా ఉంటుంది. కొత్త ఆహారాల నుండి కొత్త అనుభవాల వరకు వారికి పరిచయం చేస్తూ వారి పరిధిని విస్తరించే అవకాశం కల్పిస్తుంది.
ఇదంతా బాగానే ఉంటుంది. కానీ మీ చిన్నారితో ప్రయాణించడం మీకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది - సుదీర్ఘమైన ప్యాకింగ్ లిస్ట్, క్రేజీ షెడ్యూల్‌లు, మీ నియంత్రణలో లేని నిద్ర వేళలు లాంటివి, ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొనే సవాళ్లలో కొన్ని. ఈ క్రేజీ జర్నీని మీరు చెయ్యడానికి మీకు సహాయం చేయడానికి, మీరు మీ సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి సాయం చెయ్యడానికి మేము ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మీరు మరియు మీ కుటుంబం అప్పుడప్పుడు మంచి సెలవులను ఆస్వాదించడానికి అర్హులు కాబట్టి .
1. బేబీ-ఫ్రెండ్లీ డెస్టినేషన్‌ను ఎంచుకోండి (Choose a baby-friendly destination)
గోవాలోని తాజ్ ఎక్సోటికా, బెంగళూరులోని వండర్లా రిసార్ట్, సోహ్నా లోని వెస్టిన్ సోహ్నా రిసార్ట్ మరియు స్పా, వంటి గమ్యస్థానాలు మీ చిన్నారితో పాటు ప్రయాణించడానికి అనువైనవి. ఎందుకంటే ఈ ప్రదేశాలలో చిన్నపిల్లలకు ప్రత్యేకంగా రూపొందించబడిన చాలా సౌకర్యాలు మరియు యాక్టివిటీస్ ఉంటాయి. ఈ స్పా అండ్ రిసార్ట్‌లలో చాలా వరకు ప్రత్యేకమైన బేబీ సిట్టర్ ఉండటం, బేబీ ప్లే ఏరియా, లైఫ్‌గార్డ్‌తో కూడిన బేబీ స్విమ్మింగ్ పూల్, మరియు పిల్లల కోసం స్పెషల్ గా ఆరెంజ్ చెయ్యబడిన బఫే వంటివి ఉంటాయి!
2. స్థానిక వాతావరణం మరియు పరిస్థితుల కోసం సిద్ధం కండి (Prepare for the local climate and conditions)
మీ వెళుతున్న ప్రదేశం యొక్క వాతావరణానికి అనుగుణంగా ప్యాక్ చేసుకోండి. చల్లని వాతావరణం కోసం వేడి కలిగించే బట్టలు మరియు వేడి వాతావరణం కోసం తేలికపాటి షార్ట్ మరియు షర్టులను ప్యాక్ చేయడం మాత్రమే సరిపోదు. మీరు సన్ గ్లాసెస్, టోపీలు, మస్కిటో అండ్ ఇంజక్ట్ రిపలెంట్, కొంత ఆహారం మరియు వాతావరణ సంబంధిత అనారోగ్యాన్ని నిరోధించే మందులను కూడా ప్యాక్ చేసుకోవాలి.
3.ఓవర్‌ప్యాకింగ్ చేయడం మంచిది (Overpacking is better)
పిల్లలకు అవసరమయ్యే బేబీ ఫార్ములా ఫుడ్, మార్చుకునే బట్టలు, డైపర్‌లు, గేమ్‌లు లేదా అవసరమయ్యే పుస్తకాలు వంటి శిశువు సంబంధిత విషయాల విషయానికి వస్తే తక్కువగా తీసుకెళ్లడం కంటే కొంచెం ఎక్కువ ప్యాక్ చేసుకోవడమే మంచిది . మీ వెకేషన్ లో ఈ విషయాలు అయిపోకూడదనే మీరు కోరుకుంటారు.
4. మీ నిద్ర సమయాన్ని బాగా వినియోగించుకోండి (Embrace nap time)
బాగా బిజీ అయిన విహారయాత్ర లేదా ప్రయాణంలో మీ బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి ఉత్తమ మార్గం శిశువుతో పాటు నిద్రపోవడం. పిల్లలు ఎక్కువ సేపు ఒకే చోట కూర్చునేందుకు ఇష్టపడరు కాబట్టి మీరు మీ ప్రయాణ షెడ్యూల్‌ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకొని, సాధ్యమైనంత వరకు మీ చిన్నారి నిద్రిస్తున్నప్పుడు ప్రయాణం చేస్తే మంచిది.
ప్రయాణ సమయంలో చింతించడం లేదా భయాందోళన చెందటం చెందకండి. పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రవర్తనను సులభంగా పట్టేస్తారు. మీరు విసుగు చెందితే పిల్లలు తల్లితండ్రులతో ప్రయాణం ప్రశాంతంగా ఉండదు అని భావిస్తారు. ప్రశాంతంగా ఉండండి మరియు అవసరమైతే సహాయం కోరండి. మీవల్ల సాధ్యం కాకపోతే మీ తోటి ప్రయాణికులు లేదా ఎయిర్ హోస్టెస్ ను సహాయం కోసం అడగండి.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips







బేబీ గర్ల్ బెల్లీ Vs బేబీ బాయ్ బెల్లీ: మీ పొట్ట ఆకారం లేదా పరిమాణం మీరు అబ్బాయిని కలిగి ఉన్నారని చెప్పగలరా? | Baby Girl Belly Vs Baby Boy Belly in Telugu

మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేయాల్సినవి, చేయకూడనివి ( Do’s and don’ts when Potty Training Your Newborn in Telugu?)

ర్మల్ డెలివరీ లేదా సిజేరియన్ డెలివరీలలో ఏది మంచిది? ఎందుకు మంచిది? | Which Is Better Normal Or Cesarean in Telugu

ప్రసవానంతర బరువు తగ్గించే ప్రణాళికను తీసుకునే ముందు మీ గైనకాలజిస్ట్‌ని అడగడం అవసరమా? |Is It Necessary To Ask Your Gynecologist Before Taking Up A Postpartum Weight Loss Plan?

గైనకాలజీలో లాపరోస్కోపీ|Laparoscopy In Gynaecology in Telegu

పసిపిల్లలకు డైపర్లు వాడే విధానం – పిల్లలకు డైపర్లను ఎంత తరచుగా మారుస్తూ ఉండాలి? DIAPER ETIQUETTES FOR BABIES- HOW OFTEN SHOULD YOU CHANGE THE BABY'S DISPOSABLE DIAPER in TELEGU