hamburgerIcon

Orders

login

Profile

STORE
Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • గైనకాలజీలో లాపరోస్కోపీ|Laparoscopy In Gynaecology in Telegu arrow

In this Article

    గైనకాలజీలో లాపరోస్కోపీ|Laparoscopy In Gynaecology in Telegu

    Pregnancy

    గైనకాలజీలో లాపరోస్కోపీ|Laparoscopy In Gynaecology in Telegu

    28 November 2023 న నవీకరించబడింది

    గైనకాలజికల్(స్త్రీ జననేంద్రియ) లాపరోస్కోపీ అంటే ఏమిటి? (What is Gynaecological Laparoscopy in Telegu)

    గైనకాలజికల్ (స్త్రీ జననేంద్రియ) లాపరోస్కోపీ అనేది ఒక వైద్య ప్రక్రియ. ఈ ప్రక్రియలో పెల్విక్(జననేంద్రియాలు ఉండే ప్రాంతం) ప్రాంతాన్ని పరిశీలించేందుకు లాపరోస్కోప్ (కెమెరాతో కూడిన సన్నని గొట్టం) ఉపయోగించబడుతుంది. ఆ ప్రాంతంలో అసాధారణతలు లేదా పెరుగుదలను తనిఖీ చేసేందుకు ఇది సహాయపడుతుంది. అండాశయ తిత్తి తొలగింపు, లాపరోస్కోపీ ద్వారా గర్భాశయ తొలగింపు (హైస్టెరోక్టమీ), లేదా ఎక్టోపిక్ గర్భం ద్వారా గర్భాశయాన్ని తొలగించడం వంటి పెద్ద చికిత్సలు చేసేందుకు కూడా.. వైద్యులకు ఇది సహాయం చేస్తుంది. ఓపెన్ సర్జరీకి బదులుగా గైనకాలజికల్ లాపరోస్కోపీ అనేది సురక్షితమైన మార్గం.

    ఇది ఎందుకు చేస్తారు? (Why is it done in Telegu)

    గైనకాలజీలో లాపరోస్కోపీ ఈ కింది వైద్య పరిస్థితులను నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు.

    • ఎండోమెట్రియాసిస్

    • అండాశయ కణతులు లేదా తిత్తులు

    • ఫైబ్రాయిడ్లు

    • పెల్విక్ మచ్చ కణజాలం

    • పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి

    • పెల్విక్ పస్ (చీము)

    • ఎక్టోపిక్ గర్భం

    • అండాశయ క్యాన్సర్

    • పెల్విక్ ప్రోలాప్స్

    ఈ కింది వాటికి చికిత్స చేసేందుకు గైనకాలజికల్ లాపరోస్కోపీ

    ఉపయోగిస్తారు.అండాశయ తొలగింపు (ఊఫోరెక్టోమీ)

    గర్భాశయ తొలగింపు కోసం లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స (హైస్టెరెక్టోమీ)

    ఫైబ్రాయిడ్స్ తొలగింపు

    ట్యూబల్ లిగేషన్ (గర్భధారణ కాకుండా ఉండేందుకు ఫెలోపియన్ నాళాలను బ్లాక్ చేయడం)

    ఎక్టోపిక్ గర్భాన్ని తొలగించడం

    ఆపుకోలేని మూత్రవిసర్జన (మూత్రవిసర్జన మీద నియంత్రణ లేకపోవడం)

    ప్రోలాప్స్ గర్భాశయం

    ప్రక్రియ కోసం సిద్ధమవుతోంది (ప్రక్రియకు ముందు ఏం జరుగుతుందంటే..)

    పరిస్థితిని నిర్ధారించేందుకు లాపరోస్కోపిక్ గైనకాలజిస్ట్ ఇమేజింగ్ పరీక్షలను సిఫారసు చేస్తాడు. వ్యక్తి తన వైద్య చరిత్రను గురించి తన మందుల గురించి వైద్యుడితో చర్చించాలి. ఈ ప్రక్రియకు కొన్ని రోజుల ముందు ఆ మందులు తీసుకోవడం ఆపేయమని డాక్టర్ వ్యక్తిని అడిగే అవకాశం ఉంది. స్త్రీ జననేంద్రియ లాపరోస్కోపీని నిర్ధారించేందుకు 30 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టవచ్చు.

    ప్రక్రియ సమయంలో(During the procedure in Telegu)

    ఈ ప్రక్రియ సమయంలో వ్యక్తికి ఎటువంటి నొప్పి కలగకుండా ఉండేందుకు వైద్యుడు సాధారణ అనస్థీషియా(మత్తుమందు)ను ఇస్తాడు. కార్బన్​డైయాక్సైడ్ వాయువుతో ఉండే ఒక చిన్న సూది మీ పొత్తి కడుపుకు ఇస్తారు. ఇది ప్రక్రియ సమయంలో గాయాల నుంచి అవయవాలను రక్షిస్తుంది.

    నాభిపై ఒక చిన్న రంద్రం చేసి.. లాపరోస్కోప్​ని చొప్పిస్తారు.స్క్రీన్​పై స్పష్టమైన చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఏవైనా అసాధారణతలు ఉంటే చెక్ చేసేందుకు వైద్యుడిని ఇది అనుమతిస్తుంది. గర్భాశయం యొక్క లాపరోస్కోపీ విషయంలో అనేక కోతలు జరుపుతారు. ఈ కోతల ద్వారా ఇతర పరికరాలు చొప్పించబడతాయి. లాపరోస్కోప్ మార్గదర్శకత్వంలో సర్జన్ ఈ ప్రక్రియను నిర్వహిస్తాడు.

    ఒకసారి ప్రక్రియ పూర్తయిన తర్వాత, అన్ని పరికరాలు(ఆపరేషన్ కోసం వాడినవి) తీసివేయబడతాయి. సరైన విధంగా కుట్లు వేస్తారు. అనస్థీషియా (మత్తుమందు) యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు వ్యక్తిని రికవరీ గదికి తరలిస్తారు.

    ప్రక్రియ తర్వాత (లాపరోస్కోపిక్ తర్వాత) (After the procedure in Telegu)

    అక్కడ ఉన్న నర్సులు ముఖ్యమైన లక్షణాలను పరిశీలిస్తూ ఉంటారు. మనకు ఇచ్చిన అనస్థీషియా (మత్తుమందు) ప్రభావం తేలిపోయే వరకు వేచి చూస్తారు. మనకు చేసిన ప్రక్రియ యొక్క రకాన్ని బట్టి రోగి.. అదే రోజు లేదా కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్లొచ్చు. నాభి నొప్పిగా అనిపించడం మరియు గాయాలు ఏర్పడడం అనేది సాధారణం. రోగిని ఇంటికి పంపే ముందు లాపరోస్కోపిక్ గైనకాలజిస్ట్ సరైన సలహాలు మరియు సూచనలు ఇస్తాడు. సూచనలతో పాటుగా నొప్పిని తగ్గించేందుకు మరియు ఇన్ఫెక్షన్​ను నివారించేందుకు కొన్ని మందులు మరియు యాంటీ బయాటిక్స్​ను కూడా ఇస్తాడు. ఒక వ్యక్తి కొన్ని వారాలు లేదా నెల రోజుల తర్వాత తన రోజు వారీ కార్యకలాపాలను చేసుకోవచ్చు.

    గర్భాశయం తొలగించినపుడు ఏం జరుగుతుంది? (What happens when the uterus is removed in Telegu)

    గర్భాశయ లాపరోస్కోపిక్ సర్జరీ అనేది గర్భాశయాన్ని తొలగించేందుకు సహాయపడడానికి లాపరోస్కోప్ ఉపయోగించే ఒక వైద్య ప్రక్రియ. లాపరోస్కోపీ స్త్రీ జననేంద్రియ నిపుణుడు మిగతా శస్త్రచికిత్సను పూర్తి చేస్తాడు. మరియు యోని ద్వారా గర్భాశయాన్ని తొలగిస్తాడు.

    గర్భాశయ లాపరోస్కోపీ వల్ల ప్రయోజనాలు

    ఓపెన్ సర్జరీతో పోలిస్తే లాపరోస్కోపిక్ గర్భాశయాన్ని తొలగించడం ద్వారా క్రింది ప్రయోజనాలు ఉంటాయి.

    • తక్కువ నొప్పి
    • తక్కువగా రక్త నష్టం
    • ఆసుపత్రిలో తక్కువ సమయం ఉండడం
    • వేగవంతమైన రికవరీ
    • ఇన్ఫెక్షన్ ప్రమాదం తక్కువ

    లాపరోస్కోపిక్ సర్జరీ సురక్షితమేనా? (Is Laparoscopic surgery safe in Telegu)

    ఓపెన్ సర్జరీతో పోలిస్తే గర్భాశయంలో లాపరోస్కోపిక్ సర్జరీ అనేది సురక్షితమైన సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. మీరు ముందుగా లాపరోస్కోపిక్ గైనకాలజిస్ట్​ను సంప్రదించి ఈ ప్రక్రియ ప్రమాదాలు మరియు ప్రయోజనాలను గురించి అర్థం చేసుకోండి.

    ప్రమాదాలు మరియు సమస్యలు (Risks/ Complications in Telegu)

    కింది కారణాలు స్త్రీ జననేంద్రియ లాపరోస్కోపీ తర్వాత సమస్యల ప్రమాదాన్ని

    పెంచుతాయి. ఊబకాయం

    దీర్ఘకాల పేగు వ్యాధులు

    పెల్విక్ ఇన్ఫెక్షన్

    తీవ్రమైన ఎండోమెట్రియాసిస్

    గుండె శస్త్రచికిత్స

    ఉదర శస్త్రచికిత్స

    ఊపిరితిత్తుల పరిస్థితి

    గుండె పరిస్థితి

    తక్కువ బరువు

    ఎక్కువ వయసు

    స్త్రీ జననేంద్రియ లాపరోస్కోపీ తర్వాత ఒక వ్యక్తి కింది సమస్యలను ఎదుర్కోవచ్చు.

    అలెర్జిక్ రియాక్షన్ (అలెర్జీ వల్ల సమస్య)

    నరాల డ్యామేజ్

    రక్తం గడ్డకట్టడం

    మూత్రవిసర్జనలో ఇబ్బంది

    గర్భాశయం లేదా పెల్విక్ నిర్మాణాలకు నష్టం

    రక్తస్రావం

    నొప్పి

    గాయాలు

    వికారం

    పుండ్లు పుట్టడం

    అలసట

    భుజం నొప్పి

    హెర్నియా

    ఇన్ఫెక్షన్

    వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి (When to see the doctor in Telegu)

    గర్భాశయ లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత ఒక వ్యక్తి చాలా కాలం పాటు కింది లక్షణాలను కలిగి ఉంటే తప్పక వైద్యుడిని సంప్రదించాలి.

    తీవ్రమైన జ్వరం

    రక్తస్రావం

    స్త్రచికిత్స ప్రాంతంలో ఇన్ఫెక్షన్

    తీవ్రమైన కడుపు నొప్పి

    వాంతులు మరియు వికారం

    ఎర్రగా మారడం

    శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

    రుతుచక్ర సమయంలో అతిగా రక్తస్రావం

    చివరగా(Conclusion)

    స్త్రీ జననేంద్రియ లాపరోస్కోపీ అనేది ఒక వైద్య ప్రక్రియ. రోగాలను నిర్ధారించేందుకు మరియు చికిత్స చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఓపెన్ సర్జరీ కి ఇది సురక్షితమైన మరియు ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం. తిత్తులు, ఫైబ్రాయిడ్లు లేదా పునరుత్పత్తి క్యాన్సర్ ఉన్న వ్యక్తులు ఈ ప్రక్రియకు అనువైన వారు. కొంత మంది వ్యక్తులు రక్తస్రావం, ఇన్ఫెక్షన్, లేదా హెర్నియా వంటి సంక్లిష్టతలను ఎదుర్కొంటారు. అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి మరియు వికారం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

    References

    Agarwal P, Bindal N, Yadav R. (2016). Risks and Benefits of Total Laparoscopic Hysterectomy and the Effect of Learning Curve on Them. NCBI

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Image related to Diapering

    Diapering

    పసిపిల్లలకు డైపర్లు వాడే విధానం – పిల్లలకు డైపర్లను ఎంత తరచుగా మారుస్తూ ఉండాలి? DIAPER ETIQUETTES FOR BABIES- HOW OFTEN SHOULD YOU CHANGE THE BABY'S DISPOSABLE DIAPER in TELEGU

    Image related to Breast Changes

    Breast Changes

    చనుమొన డిశ్చార్జ్‌కి సంభావ్య కారణాలు: కాన్సర్ కలిగించేవి - కాన్సర్ కానివి (Reasons for Nipple Discharge - Cancer & Non Cancer in Telugu)

    Image related to Feeding Schedule

    Feeding Schedule

    మీ 6 నెలల పసిబిడ్డకి ఎంత మొత్తంలో & ఎంత తరచుగా ఘన పదార్థాలు ఆహారంగా పెట్టవచ్చు?|How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old in Telegu

    Image related to Diet & Nutrition

    Diet & Nutrition

    పుట్టినప్పటి నుండి 1 ఏడాది వరకు మీ పసిబిడ్డకి ఆహారంగా ఏం పెట్టాలి (What to Feed Your Baby from Birth to 1 Year in Telugu)

    Image related to Weight Gain

    Weight Gain

    శిశువుల వెయిట్ చార్ట్ ఇదీ: పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు | Ideal Baby Weight Chart: Birth to 1 Year in Telugu

    Image related to Women Specific Issues

    Women Specific Issues

    మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏది సహాయపడుతుంది? | What Helps in Improving Women's Mental Health in Telugu

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.