hamburgerIcon

Orders

login

Profile

Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Diapering arrow
  • పసిపిల్లలకు డైపర్లు వాడే విధానం – పిల్లలకు డైపర్లను ఎంత తరచుగా మారుస్తూ ఉండాలి? DIAPER ETIQUETTES FOR BABIES- HOW OFTEN SHOULD YOU CHANGE THE BABY'S DISPOSABLE DIAPER in TELEGU arrow

In this Article

    పసిపిల్లలకు డైపర్లు వాడే విధానం –  పిల్లలకు డైపర్లను ఎంత తరచుగా మారుస్తూ ఉండాలి? DIAPER ETIQUETTES FOR BABIES- HOW OFTEN SHOULD YOU CHANGE THE BABY'S DISPOSABLE DIAPER in TELEGU

    Diapering

    పసిపిల్లలకు డైపర్లు వాడే విధానం – పిల్లలకు డైపర్లను ఎంత తరచుగా మారుస్తూ ఉండాలి? DIAPER ETIQUETTES FOR BABIES- HOW OFTEN SHOULD YOU CHANGE THE BABY'S DISPOSABLE DIAPER in TELEGU

    28 November 2023 న నవీకరించబడింది

    క్రొత్తగా తల్లిదండ్రులు అయినవారికి చాలా విషయాలు కంగారును కలిగించడం సహజం. అందులో ముఖ్యమైనది ఈ డైపర్ల విషయం. అందువల్లనే మొదటిసారిగా తలిదండ్రులు అవబోతున్నవారు కొందరు డైపర్లను మార్చడం అనే ప్రక్రియను బొమ్మలమీద, సాఫ్ట్ టోయస్ మీద నేర్చుకోవడం చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ.. పిల్లలు సుమారు నాలుగు నెలల వయసుకు వచ్చి, పాకడం మొదలైనప్పటి వరకు కూడా ఈ డైపర్ల మార్పిడి ప్రక్రియ వారికి చాలా అసౌకర్యంగానే ఉంటుంది.

    అలాంటి క్రొత్త తల్లిదండ్రులకు డైపర్ల విషయంలో తీసుకోవలసిన తగు జాగ్రత్తలు, ఎలా, ఎంత తరచు వాటిని మార్చాలి? దానివల్ల కలిగే ఉపయోగాలు, మార్చకపోయినందువల్ల ఇబ్బందులు, డైపర్ రాష్ రాకుండా తీసుకునే జాగ్రత్తలు వీటి అన్నింటికీ ఈ కథనంలో జవాబు దొరుకుతుంది.

    ఈ డిస్పోజబుల్ డైపర్లు ఎలా తయారుచేయబడతాయి? (WHAT IS A DISPOSABLE DIAPER MADE OF in Telegu)

    వాడుకుని పారవేసే డిస్పోజబుల్ డైపర్లను చెక్క గుజ్జు, ప్లాస్టిక్, టిస్యూ పేపర్, పాలియస్టర్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్‌లతో తయారుచేయబడిన ‘పోరస్ ఫిల్మ్’తో తయారు చేస్తారు. ఇప్పుడిప్పుడు చాలా డైపర్లకు SAP (Superabsorbent Polymers) లను కూడా వాడుతున్నారు. ఈ రకం వస్తువుల్ని వాడడం వల్ల డైపర్లు నానిపోకుండా ఉంటాయి.

    పిల్లలకు ఎప్పుడెప్పుడు డైపర్లను మార్చాలి? (WHEN TO CHANGE THE DISPOSABLE NAPPIES FOR BABIES in Telegu)

    ముందు చెప్పుకున్నట్లుగా పుట్టిన కొత్తలో పసిపిల్లలు రోజుకు సుమారుగా పది నుంచి ఇరవై సార్లు మూత్రవిసర్జన, సుమారుగా నాలుగు సార్లు మల విసర్జన కూడా చేస్తూంటారు. దీనికి కారణం వారి ఆహారం వారికి సుమారు ఆరు నెలలు వచ్చేవరకు పూర్తిగా పాలు మాత్రమే కావడం. అందువల్ల వారికి తరచుగా అంటే రెండు మూడు గంటలకు ఒకసారి డైపర్లు మార్చాల్సి ఉంటుంది. కొంచెం పెద్దపిల్లలు అయినప్పుడు సుమారు ఆరు నుంచి ఎనిమిదిసార్లు మార్చితే సరిపోతుంది.

    పిల్లలు పడుకునేముందు మాత్రం తప్పనిసరిగా డైపరు మార్చి పడుకోబెడితే.. నిద్రలో వారు ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేసినా, డైపరు బరువెక్కిపోవడం, డైపర్ రాష్ రావడం జరగకుండా ఉంటుంది.

    డైపరు మార్చడం ఆలస్యం చేయడం వల్ల కలిగే అనర్థాలు (DELAY IN CHANGING DISPOSABLE DIAPERS IN BABIES in Telegu

    పసిపిల్లలకు తరచుగా డైపర్లను మార్చడం అవసరమౌతుంది. వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్లనే వారు డైపర్ను తడిపిన వెంటనే మార్చాలి. లేకపోతే చర్మంపై పొక్కులు వచ్చే అవకాశం టుంది. అలా జరిగినప్పుడు వారి తొడలు, జననాంగాలు, పిర్రలు భాగంలోని చర్మమంతా ఎర్రగా, గరుకుగా తయారవుతుంది. పిల్లలు కూడా డైపరు మార్చేటప్పుడు పేచీలు పెడుతూ, అయోమయంగా ఏడుస్తూంటారు. ఈ రాష్ ఒక్కోసారి ఇంటి వైద్యాలతో తగ్గిపోతుంది. గాలి తగలనివ్వడం, ఆయింట్మెంట్లు పూయడం, తరచు డైపర్ మార్చడం చేయడం ద్వారా ఈ రాష్ తగ్గించవచ్చు.

    పిల్లలలో ఈ రకం రాష్ రావడానికి దోహదపడే కొన్ని కారణాలు

    1. · డైపర్ మార్చడం ఆలస్యం కావడం
    2. · బిగువైన, చర్మాన్ని ఇబ్బందికి గురిచేసే డైపర్లను వాడడం
    3. · పిల్లల చర్మానికి పడని డైపర్లను వాడడం
    4. · ఈస్ట్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్‌లు
    5. · సున్నితమైన చర్మాన్ని కలిగి ఉండడం
    6. · తల్లి పిల్లలకు పడని ఆహారాన్ని తినడం
    7. · పిల్లలకు క్రొత్తగా ఘనపదార్ధాలు తినిపించడం వల్ల వారికి విరోచనాలు రావడం.
    8. ఒకవేళ మనం ఇంట్లో తీసుకొనే జాగ్రత్తల వల్ల వారికి ఈ రాష్ తగ్గకుండా, ఈ క్రింది లక్షణాలు కనబడితే, వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
    9. · జ్వరం
    10. · అసాధారణమైన చర్మం
    11. · ఇంటి వైద్యం ద్వారా తగ్గని రాష్
    12. · రక్తం లేదా రసి కారుతున్న రాష్
    13. · పసిబిడ్డకు మూత్ర, మల విసర్జనకు ఇబ్బంది కలిగించే రాష్

    డైపర్ రాష్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు(TIPS TO PREVENT DIAPER RASHES in Telegu)

    · ఆలస్యం కాకుండా డైపర్లను మారుస్తూ ఉండాలి

    · డైపర్ మార్చేముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి

    · పిల్లలను గోరువెచ్చని నీటితో కడిగి, కాటన్ టవల్ తో గాని, వూల్ టవల్ తో గాని, బేబీ వైప్స్ తోగాని శుభ్రం చేయాలి. వారు మూత్రవిసర్జన చేసినా, మల విసర్జన చేసినా గాని వారి కటిభాగాన్ని శుభ్రంగా తుడవాలి.

    · పసిపిల్లల్ని పూర్తిగా అన్ని ముడతల్లోనూ సుతిమెత్తగా, భద్రంగా, శుభ్రంగా తుడవాలి.

    · వాతావరణం వెచ్చగా ఉండినట్టయితే, వారిని డైపర్లు లేకుండా మెత్తని పక్కపై పడుకోబెట్టాలి. అస్తమానం డైవర్లు వేయడం వల్ల తరచు రాష్ వచ్చే అవకాశం ఉంటుంది.

    · డైపర్ వేసే ముందు ఆ ప్రాంతం అంతా శుభ్రంగా, పొడిగా ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించి వేయాలి.

    · పిల్లలు ఎదుగుతున్న కొద్దీ, వారి సైజుకు సరిపడే డైపర్లను కొని వాడాలి. మరీ వదులుగా గాని, మరీ బిగుతుగాగాని లేని డైపర్లను ఎన్నుకొని కొనాలి.

    · వారి కటి ప్రదేశంలో క్రీము గాని, ఆయింట్మెంటు గాని తరచుగా రాస్తూ ఉండాలి. డైపర్ బిగించే ప్రదేశంలో క్రీముల్లాంటివి రాస్తే అవి పూర్తిగా బిగింపబడవు. దానివల్ల డైపర్ ఊడిపోయే అవకాశం ఉంటుంది.

    మళ్ళీ మళ్ళీ ఉపయోగించగలిగిన డైపర్లు (REUSABLE NAPPIES in Telegu)

    కొన్ని రకాల డైపర్లు ఒక్కసారి వాడకానికి మాత్రమే కాక మళ్ళీ మళ్లీ వాడుకొనేలా ఉంటాయి. అవి రకరకాల సైజుల్లో దొరుకుతాయి. క్రొత్తగా తల్లిదండ్రులు అయినవారు తమ బిడ్డకు అనుగుణమైన వాటిని పరిశీలించి కొనాలి. ఒకసారి వాడి పడేసే డైపర్ల వల్ల కొన్ని లాభాలున్నాయి. కానీ.. ఖరీదు, మన్నిక, సౌలభ్యం వంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. నిజానికి బట్టతో చేసిన న్యాపీలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ వాటిని వాడకముందు, వాడిన తర్వాత శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. వాషింగ్ మిషన్‌లో 60 డిగ్రీల దగ్గర వాటిని శుభ్రం చెయ్యవచ్చు.

    మళ్లీ మళ్లీ వాడదగిన డైపర్లకు క్రింద డైపర్ లైనర్సును వేయడం మర్చిపోకూడదు.

    పసిపిల్లలు డైపర్ల వల్ల సుఖంగా ఉండగలుగుతారు. కానీ ఎక్కువసేపు ఒకే డైపర్‌తో ఉంచకుండా తరచు మారుస్తుండాలి. మెత్తని మస్లిన్ క్లాత్‌తో చేసిన డైపర్లు రాష్ వచ్చి బాధ పడుతున్న పిల్లలకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

    సారాంశం (OVERVIEW)

    క్రొత్తగా తలిదండ్రులు అయిన దంపతులకు డైపర్ మార్చడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. కాని దీనికి కఠినమైన నిబంధనలు అంటూ ఏమీ లేవు. క్రమంగా అలవాటు పడటమే పరిష్కారం. ప్రతి బిడ్డా ప్రత్యేకమైనదే. కాబట్టి తమ పిల్లలకు అనుగుణమైన పద్ధతిని తల్లిదండ్రులు అలవరచుకోవాలి. అందులో భాగంగానే ఈ డైపర్లు మార్చడం అనేది వారి వారి అవసరాన్ని గ్రహించి పాటించాలి. అవసరాన్ని బట్టి.. డైపర్ మార్చడానికి ఉపయోగపడే ఛార్టును తయారుచేసుకోవడం ద్వారా ఈ క్లిష్టమైన పనిని సులభంగా చేయడం అలవరుచుకోవచ్చు కూడా.

    Tags

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Image related to Breast Changes

    Breast Changes

    చనుమొన డిశ్చార్జ్‌కి సంభావ్య కారణాలు: కాన్సర్ కలిగించేవి - కాన్సర్ కానివి (Reasons for Nipple Discharge - Cancer & Non Cancer in Telugu)

    Image related to Feeding Schedule

    Feeding Schedule

    మీ 6 నెలల పసిబిడ్డకి ఎంత మొత్తంలో & ఎంత తరచుగా ఘన పదార్థాలు ఆహారంగా పెట్టవచ్చు?|How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old in Telegu

    Image related to Diet & Nutrition

    Diet & Nutrition

    పుట్టినప్పటి నుండి 1 ఏడాది వరకు మీ పసిబిడ్డకి ఆహారంగా ఏం పెట్టాలి (What to Feed Your Baby from Birth to 1 Year in Telugu)

    Image related to Weight Gain

    Weight Gain

    శిశువుల వెయిట్ చార్ట్ ఇదీ: పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు | Ideal Baby Weight Chart: Birth to 1 Year in Telugu

    Image related to Women Specific Issues

    Women Specific Issues

    మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏది సహాయపడుతుంది? | What Helps in Improving Women's Mental Health in Telugu

    Image related to Therapies

    Therapies

    చిన్ననాటి రుగ్మతలు అనగానేమి? ఇవి ఎలా ఉంటాయి? వీటికి కారణాలు, చికిత్స ఏమిటి? | Childhood Disorders: Meaning, Symptoms & Treatment in Telugu

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.