


Exercise & Fitness
3 November 2023 న నవీకరించబడింది
జీవితంలో అనేక పనులు పూర్తి చేయడానికి, ఫిట్‌గా ఉండటానికి స్టామినా చాలా అవసరం. స్టామినా పెంచుకోవడం ద్వారా మీరు ఎక్కువకాలం శారీరక శ్రమ, మానసిక శ్రమను భరించగలరు. అయితే ప్రధానంగా వచ్చే ప్రశ్న- స్టామినా ఎలా పెంచుకోవాలి? అని. అందులోనూ సహజంగా స్టామినా ఎలా పెంచుకోవాలి? అని తెగ ఆలోచిస్తుంటారు. ప్రజల నమ్మకాలకు విరుద్ధంగా ఇంట్లోనే మంచి వ్యాయామం, డైట్, లైఫ్‌స్టైల్‌తో స్టామినా పెంచుకోవచ్చన్న విషయం మీకు తెలుసా?
వ్యాయామం ద్వారా బలం, స్టామినా ఎలా పెంచుకోవాలి? ఈ ప్రశ్న మిమ్మల్నీ వేధిస్తోందా? వ్యాయామాన్ని సమర్థవంతంగా ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఇంట్లోనే రోజూ 30 నిమిషాల శారీరక వ్యాయామం భారీ మార్పు వైపు దారీ తీస్తుంది. ఈ కింద ఇచ్చిన వ్యాయామాలు మీ స్టామినాను పెంచుతాయి-
మంచి పోషకాలు ఉన్న ఆహారంతో దీర్ఘకాలంలో స్టామినా పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు.
బలం, స్టామినాను ఎలా పెంచుకోవాలి అని తెలుసుకుంటున్న మీరు, ఇందుకోసం ఏఏ ఆహారపదార్థాలను వదిలేయాలో కూడా తెలుసుకోవాలి:
స్టామినా ఎలా పెంచుకోవాలి అని తెలుసుకునేవారు ఇంట్లోనే స్వయంగా ఇదంతా ఎలా చేయాలో తెలుసుకోవాలి. డైట్, ఎక్సర్‌సైజ్ కాకుండా మరిన్ని విషయాలను గుర్తుంచుకోవడం అవసరం.
సహజంగా స్టామినా పెంచుకోవాలనుకుంటే, ముందుగా మీ శరీరంలోని ఎండ్యూరెన్స్ లెవెల్ ఎంతో మర్చిపోకూడదు. రాత్రికి రాత్రే స్టామినా పెరగదు. నిదానంగా మార్పులు వస్తాయి. నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. తొందరపడితే మీ శరీరానికి మీరే హాని చేసుకుంటారు. ఒక్కోసారి ఆ నష్టాలను తిరిగి పూడ్చుకోలేరు.
ఇంట్లోనే స్టామినా పెంచుకునే ప్రయత్నంలో కేవలం ప్రొటీన్స్ లేదా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలపై ఆధారపడకూడదు. మీ శరీరానికి అవసరమైన బ్యాలెన్స్‌డ్ డైట్ రూపొందించుకోవాలి. ప్రతీసారి మంచి పోషకాలు ఉన్న భోజనం చేయాలి.
స్టామినా పొందాలన్న మీ లక్ష్య సాధన మీకు బాధగా లేదా బోరింగ్‌గా ఉండకూడదు. యోగా ఇష్టమైతే యోగా, లేదా పుషప్స్, HIIT ఇలా మీకు ఏది ఇష్టమైతే అది ఆనందంతో చేయండి. ఈ ప్రాసెస్ మీకు ఆనందం కలిగించాలి తప్ప ఒత్తిడి కాదు.
మీరు విరామం తీసుకునే సమయాన్ని తగ్గించండి. మీ శరీరం రికవర్ కావడానికి విరామం అవసరం. అలాగని ఇనాక్టీవ్‌గా కాకూడదు. స్టామినా పెంచే యాక్టీవ్ లైఫ్‌స్టైల్‌కు మీ శరీరాన్ని అలవాటు చేయాలి.
కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యానికి మంచివి కావన్న అపోహ చాలామందిలో ఉంది. శరీరానికి అధికంగా కొవ్వును యాడ్ చేస్తుందని, దీని వల్ల వ్యాయామం చేసినా వృథానే అన్న అపోహలున్నాయి. ఇది అపోహ మాత్రమే. నిజం కాదు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ లాగానే కార్బోహైడ్రోట్స్ కూడా అవసరం. ఇందులో బాడీ స్టామినా పెంచడానికి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రొటీన్ ఫాలో కావడం ద్వారా మీ స్టామినాను సహజంగా ఎలా పెంచుకోవాలన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే ఏమిటి | దాని ప్రాముఖ్యత & లక్షణాలను అర్థం చేసుకోవడం
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)