
బిడ్డను జన్మనిచ్చేందుకు ఉత్సాహంగా అనిపిస్తున్నా, ప్రసవం ఎలా జరుగుతుందో అని భయపడుతున్నారా? మీరు అనుకుంటున్నది నిజమే. ప్రసవించడమనేది చాలా కష్టమైనది, ప్రత్యేకించి ఇది మీకు తొలిచూరు కానుపు అయితే. ఈ ప్రక్రియ నొప్పి ఇంకా సమస్యలతో కూడుకున్నది, ఎందుకంటే ప్రసవ సమయంలో ప్రసవపు నొప్పులను శరీరం తట్టుకోలేనంతగా ఉంటాయి. కానీ స్త్రీలు ప్రసవిస్తున్నప్పుడు నొప్పిని ఎదుర్కొనేందుకు తోడ్పడే ఉపాయం ఉన్నట్లయితే? ఇక్కడే హిప్నోబర్తింగ్ అనేది తెరపైకి వస్తుంది. హిప్నోబర్త్ అనేది స్త్రీలకు ప్రసవ సమయంలో ఇంకా ప్రసవపు నొప్పులను తట్టుకునేలా సహాయపడే ప్రక్రియ - కానీ మందుల వలె కాకుండా, ఈ పద్ధతి మనస్సును ఇంకా శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి సారించేలా చేస్తుంది. హిప్నోబర్తింగ్ పద్ధతి అనేది విశ్రాంతి, మానసిక ప్రేరేపణ ఇంకా ప్రగాఢ శ్వాసల మిశ్రమ కలబోతగా ఉంటుంది, ఇవి శరీరాన్ని శాంతింపజేసి, మనస్సును నొప్పి నుండి దూరంగా కేంద్రీకరించేందుకు దోహదపడతాయి.
హిప్నోబర్తింగ్ అంటే ఏమిటి అని అనుకుంటున్నారా? ఇది నొప్పి నివారణ టెక్నిక్‌గా పిలవబడుతుంది. ఈ ప్రక్రియలో, మహిళలు తమ ప్రసవ నొప్పులను తమాయించుకొనేందుకు కేవలం విశ్రాంతావస్థ ఇంకా శ్వాస పై ధ్యాస ఉంచి స్వీయ-వశీకరణ(సెల్ఫ్-హిప్నోసిస్) సహాయంతో చేయగల ప్రక్రియ. ప్రసవ ప్రక్రియను హాయిగా ఆస్వాదించేలా మహిళలకు సహాయపడటమే ఈ పద్ధతి ముఖ్యోద్దేశ్యం. కొందరు నిపుణుల మాటల్లో చెప్పాలంటే, హిప్నోబర్తింగ్ పద్ధతిలో స్త్రీలకు "మెరుగైన ప్రసవం" అవుతుంది ఇంకా ప్రసవించే స్త్రీ మరియు ఆమె వైద్యుల మధ్య సరిసమాన గౌరవభావాలు నిలిపి ఉంచేలా సహాయపడుతుంది. సాధారణ ఆసుపత్రి వాతావరణంలో లేదా ఇంటిలోని ప్రశాంత వాతావరణంలో ఎక్కడైనా కావచ్చు, హిప్నోబర్తింగ్‌ను ప్రయత్నించవచ్చు.
హిప్నోబర్తింగ్ అనేది ప్రసవం లోని మొదటి రెండు దశలను వేగవంతం చేస్తుందని, కొన్ని పరిశోధనల వల్ల తెలిసింది, ఇవి చాలాసేపు కొనసాగే ఇంకా అతి బాధాకరమైన దశలుగా పరిగణించబడతాయి. మొదటి దశ 12-19 గంటల వరకు ఉండటమే కాకుండా చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ దశను హిప్నోబర్తింగ్ ద్వారా కొన్ని గంటలపాటు తగ్గించవచ్చు, ఇది ప్రసవించే స్త్రీలకి మంచి విశ్రాంతిని అందిస్తుంది. హిప్నోబర్తింగ్ ద్వారా, స్త్రీలు ప్రసవానికి సంబంధించిన భయం ఇంకా నొప్పినుండి ఎలా బయటపడాలో నేర్చుకుంటారు - చివరికి, ఈ పద్ధతిలో నొప్పిని ఎదుర్కోవడాన్ని "శారీరక సమస్యలను అధిగమించే సంకల్ప శక్తి"గా చూస్తారు. హిప్నోబర్తింగ్ ప్రక్రియలో ఆలోచనలను నియంత్రించడానికి ఇంకా నొప్పులనుతో కూడిన ప్రసవపు ప్రక్రియను సులభతరం చేసేందుకు శరీరానికి ఆ దిశలో లగ్నం చేయడానికి ఇచ్చే మానసిక బలంతో పాటు , ఊరట కలిగించే మాటలు ఇలాంటి సానుకూల వాతావరణాన్ని కలిపిస్తుంది. హిప్నోబర్తింగ్ అనేది స్వయంగా కానీ లేదా హిప్నోథెరపిస్ట్ సహాయంతో కూడా చేయవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతరం వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి?
హిప్నోబర్తింగ్ అనేక పద్ధతులు ఇంకా సాంకేతికతలను కలిగి ఉంటుంది. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఈ క్రిందివి ఉన్నాయి:
హిప్నోబర్తింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరియు చాలా మంది వైద్యులు ఇంకా నిపుణులు ఈ పద్ధతిని ప్రచారం చేస్తున్నారు, ఎందుకంటే ఈ పద్దతిలో ఎలాంటి ఔషధాలు ఉపయోగించరు కాబట్టి దుష్ప్రభావాలనేవీ ఉండవు. అంతేకాకుండా, ప్రసవ సమయంలో పురిటినొప్పుల వల్ల తల్లి శరీరం ఎదుర్కొనే ప్రతీ సంఘర్శణ, శిశువుపై ప్రభావం చూపుతాయని వారు అంటున్నారు. అందువల్ల, పుట్టబోయే బిడ్డకు మరింత అనువైన పరిస్థితులు కల్పించడం ఎంతో అవసరం.
హిప్నోబర్తింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు క్రింద చూపిన విధంగా ఉన్నాయి:
సానుకూల వాస్తవ దృక్పధం ఇంకా విశ్రాంతావస్త కొరకు స్క్రిప్ట్‌లను తయారుచేసుకోవడం, ఇలా మీరు హిప్నోబర్తింగ్‌ని మొదలుపెట్టాలనుకుంటే చాలా చేయవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాస పద్ధతులను ప్రయత్నించడం నుండి మసాజ్ టెక్నిక్‌లను అభ్యసించడం మరియు సానుకూల ప్రసవ కథనాల గురించి చదివి వినిపించడం, ప్రసవించడం అనేది నొప్పిపై మాత్రమే దృష్టి పెట్టడం మాత్రమే కాదని, ఒక కొత్త జీవితానికి మీరు అంకురారార్పణ చేస్తున్నారని తెలుసుకొంటారు. కాబోయే తల్లిగా, మీకు హిప్నోబర్తింగ్‌ని మొదలుపెట్టాలనే ఆసక్తి ఉంటే, మీ ప్రసవాన్ని సుఖమయం చేసుకోవడానికి, ప్రతిరోజూ సాధన చేయగల కొన్ని పద్ధతులు ఉన్నాయి -
Hypnobirthing in Telugu, Meaning of Hypnobirthing in Telugu, Hypnobirthing during delivery time in telugu, Benefits of Hypnobirthing in telugu, Tips to try Hypnobirthing in Telugu, Hypnobirthing: Meaning & Benefits in English, Hypnobirthing: Meaning & Benefits in Hindi, Hypnobirthing: Meaning & Benefits in Tamil, Hypnobirthing: Meaning & Benefits in Bengali
Yes
No

















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |