hamburgerIcon

Orders

login

Profile

Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Stem Cell Banking arrow
  • స్టెమ్ సెల్స్ (మూలకణాలు) దాచిపెట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? (What Are The Benefits Of Stem Cell Preservation in Telugu?) arrow

In this Article

    స్టెమ్ సెల్స్ (మూలకణాలు) దాచిపెట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? (What Are The Benefits Of Stem Cell Preservation in Telugu?)

    Stem Cell Banking

    స్టెమ్ సెల్స్ (మూలకణాలు) దాచిపెట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? (What Are The Benefits Of Stem Cell Preservation in Telugu?)

    5 December 2023 న నవీకరించబడింది

    ఇటీవలి రోజుల్లో స్టెమ్ సెల్ థెరపీ అనేది బాగా అభివృద్ధి చెందింది. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ సెల్స్​ బ్యాంక్స్ స్థాపన అనేది స్టెమ్​ సెల్​ ప్రీజర్వ్ చేసేందుకు, వాటిని కాలుష్యం నుంచి పరిరక్షించేందుకు ఉద్దేశించబడింది. అంతే కాకుండా భవిష్యత్​లో చేసే చికిత్సల కోసం కూడా వీటిని ప్రిజర్వ్ చేస్తారు. స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ సెక్టార్ అనేది వేగంగా వృద్ధి చెందుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా చాలా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, ప్రైవేటు కంపెనీలు వివిధ రకాల దాతల నుంచి మూలకణాలు తీసుకుని భద్రపరుస్తున్నాయి. భవిష్యత్​లో స్టెమ్ సెల్ థెరపీ కోసం ప్రజలకు స్టెమ్ సెల్స్ అందుబాటులో ఉంటున్నాయి. .

    మానవ శరీరంలో స్టెమ్ సెల్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. పిండాలు(చిన్నపిల్లలు), పెద్దవారు ఇద్దరూ తమ శరీరాల్లో స్టెమ్ సెల్స్​ను కలిగి ఉంటారు. స్టెమ్ సెల్స్​ను వాటి స్వీయ పునరుద్ధరణ(సెల్ఫ్ రెన్యూవల్), మల్టీ డైరెక్షనల్ భేదం వలన యూనివర్సల్ సెల్స్ లేదా సీడ్ సెల్స్ అని కూడా పిలుస్తారు. పరిశోధనల కోసం మూలకణాలను కలెక్ట్ చేయడం, సిద్ధం చేయడం, నిల్వచేయడం వలన ఇది లైఫ్ బ్యాంక్​గా కూడా పరిగణించబడుతుంది. బయోలాజికల్ మెటీరియల్స్ సేకరణ మరియు వాడకం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఏదేమైనప్పటికీ మూలకణాలతో ఇటీవల జరిపిన పరిశోధనలు వాటి మీద దృష్టి పడేలా చేశాయి. ఫలితంగా చికిత్స, థెరపీ కోసం పనికొచ్చే మూలకణాల అవసరం పెరిగింది.

    స్టెమ్ సెల్ (మూలకణ) ప్రీజర్వేషన్ (సంరక్షణ) అంటే ఏమిటి? (What Is Stem Cell Preservation?)

    స్టెమ్ సెల్ సంరక్షణను స్టెమ్ సెల్ నిల్వ లేదా స్టెమ్ సెల్ బ్యాంక్ అని పిలుస్తారు. ఈ పద్ధతిలో మానవ శరీరం నుంచి స్టెమ్ సెల్స్​ను బయటకు తీసి భవిష్యత్​ ఉపయోగాల కోసం వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. స్టెమ్ సెల్ బ్యాంక్స్​లో తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. స్టెమ్ సెల్స్ బయోలాజికల్ ప్రాపర్టీస్​ను ఇవి కాపాడుతాయి. కాలుష్యం బారిన పడి అవి పాడుకాకుండా స్టెమ్ సెల్ బ్యాంక్స్ కాపాడుతాయి. స్టెమ్ సెల్స్​ను ఎక్కువ రోజులు భద్రపరిచేందుకు అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. చిన్నారి పుట్టినపుడు బొడ్డు తాడు నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్​ను భద్రపరచడం వల్ల ఆ బిడ్డకే కాకుండా భవిష్యత్​లో కుటుంబసభ్యులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

    మూలకణాల రకాలు (Types Of Stem Cells in Telugu)

    మూలకణాల రకాలకు బట్టి వాటిని ఈ కింది విధాలుగా వర్గీకరించవచ్చు. అవి..

    1. యునిపోటెంట్​ సెల్స్ (Unipotent cells):

    ఈ కణాలు ఒకే రకమైన కణాలను అభివృద్ధి చేసుకోగలవు. వాటి రకం ఉన్న కణాలనే డెవలప్ చేస్తాయి. అవి తమను తాము పునరుద్ధరించుకోగలవు కాబట్టి వాటిని ఒక విధమైన మూకలకణాలుగా పరిగణిస్తారు.

    2 ఒలిగోపోటెంట్​ సెల్స్ (Oligopotent cells):

    ఈ కణాలు వివిధ రకాల కణాలుగా విభజించబడతాయి. ఉదాహరణకు చూస్తే.. అడల్ట్ లింఫోయిడ్ లేదా మైలోయిడ్ మూలకణాలు ఉన్నాయి.

    3. మల్టీపోటెంట్ సెల్స్ (Multipotent cells)

    ఈ సెల్స్ దగ్గరి సంబంధం ఉన్న కణాల కుటుంబంగా విభజించబడతాయి. ఉదాహరణకు హెమటోపోటిక్ స్టెమ్ సెల్స్ అనేవి తెల్లరక్తకణాలు, ఎర్రరక్తకణాలు, రక్తఫలకికలు (ప్లేట్​లెట్స్)లో, లింఫోయిడ్ స్టెమ్ సెల్స్ మరియు మజిల్ స్టెమ్ సెల్స్​లా అభివృద్ధి చెందుతాయి.

    4. టోటిపోటెంట్ (Totipotent cells):

    అన్ని రకాల కణాలను వేరుచేయగల సామర్థ్యం ఉన్న సెల్స్​ను టోటిపోటెంట్ స్టెమ్ సెల్స్ అని పిలుస్తారు. ఉదాహరణకు: జైగోట్ అని పిలువబడే అండం ఫలదీకరణ సమయంలో విభజించబడ్డ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ ఎటువంటి కణంలోనైనా అభివృద్ధి చెందుతాయి.

    5. ప్లురిపోటెంట్ సెల్స్ ( Pluripotent cells):

    ఈ సెల్స్ ఎటువంటి సెల్స్​గానైనా మారుతాయి. ఎర్లీ ఎంబ్రియో నుంచి ఏర్పడ్డ సెల్స్ ప్లాసెంటాలో ఉన్న కణాలు మినహా ప్లురిపోటెంట్ సెల్స్​గా పరిగణించబడతాయి. ఉదాహరణకు చెప్పుకుంటే.. ఎర్లీ స్టేజ్ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్​ భేదం నుంచి ఉత్పత్తి అయిన సెల్స్ మీసోడెర్మ్, ఎక్టోడెర్మ్, మరియు ఎండోడెర్మ్ సూక్ష్మక్రిమి లేయర్లుగా డెవలప్ అవుతాయి.

    స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ వల్ల ఉపయోగాలు (Benefits of Preserving Stem Cells in Telugu):

    పిండంలో ఉండే మూలకణాలు పూరిపోటెంట్ మూలకణాలు. అవి శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల మూలకణాలుగా విభజించబడతాయి. ప్రారంభ దశలో ఉన్న పిండాన్ని బ్లాస్టోసిస్ట్ అని పిలుస్తారు. బ్లాసోసిస్ట్ యొక్క లోపల ఉన్న కణాల ద్రవ్యరాశి అనేది పిండకణాలను ఏర్పరుస్తుంది. స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ ప్రయోజనాలు సైట్స్ మధ్య కణాల కదలికలను, భద్రత మరియు నాణ్యత పరీక్షలను పూర్తి చేసేందుకు అనుమతిస్తాయి.

    స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ (సంరక్షణ) వల్ల కలిగే కొన్ని రకాల ప్రయోజనాలు

    1. ఇది ప్రాణాలను కాపాడుతుంది ( It can save lives):

    బొడ్డు తాడు రక్తం అనేది స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉండే సోర్స్. ఈ స్టెమ్ సెల్స్ వలన బ్లడ్ క్యాన్సర్, జన్యుపరమైన వ్యాధులు, రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా లేక వచ్చేటటువంటి 80 రకాల ప్రాణాంతక వ్యాధులకు చికిత్స చేసి ప్రాణాలను రక్షించవచ్చు. ఎముక మజ్జ మార్పిడికి (బోన్ మారో ట్రాన్స్​ప్లాంటేషన్​) ఇది ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది కీమోథెరపీ తర్వాత రోగనిరోధక శక్తిని తిరిగి నిర్మించగలదు.

    ·2. బొడ్డుతాడు నుంచి తీసిన మూలకణాలు ఎల్లప్పుడూ మీ శిశువుకు సరిగ్గా మ్యాచ్ అవుతాయి (Cord blood stem cells will always be a perfect match for your baby):

    మీ శరీరం గాయపడినపుడు ఏవైనా సెల్స్ పాడయిపోయినపుడు వాటికి చికిత్స చేసేందుకు మరియు పునఃనిర్మించేందుకు మిమ్మల్ని స్టెమ్ సెల్స్​ అనుమతిస్తాయి. ఇవి కేవలం మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబసభ్యులకు కూడా ఉపయోగపడతాయి.

    3. బొడ్డుతాడు నుంచి తీసిన స్టెమ్ సెల్స్ మీ తోబుట్టువుకు లేదా కుటుంబసభ్యునికి కూడా ఉపయోగపడతాయి (Cord blood stem cells can be of use to a sibling or a family member):

    మీ మూలకణాలు మీ తోబుట్టువులకు సరిగ్గా సరిపోయేందుకు 25శాతం అవకాశం ఉంది. కార్డ్ బ్లడ్ ట్రాన్స్​ప్లాంట్ ద్వారా ఖచ్చితమైన పోలికను ప్రతిసారి కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన స్టెమ్ సెల్స్ సంఖ్యను బట్టి తక్కువగా మ్యాచ్ అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారు.

    4. స్టెమ్ సెల్​ పరిశోధన వలన భవిష్యత్​లో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ( Stem cell research has exciting future uses):

    సైన్స్ ప్రతిరోజూ పురోగమిస్తోంది. ప్రతిరోజు అనేక క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి(చేపడుతున్నారు). బొడ్డు తాడు రక్తం మరియు తాడు కణజాలాల స్టెమ్ సెల్స్ బ్లడ్ రుగ్మతలు, అంతే కాకుండా మానసిక రుగ్మతలైన ఆటిజం, స్ట్రోక్, సెరిబ్రల్ ప్లాసీ, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీ వంటి పరిస్థితుల కోసం క్లినికల్ ట్రయల్స్​లో ఉపయోగించబడుతున్నాయి.

    5. బొడ్డుతాడు స్టెమ్​సెల్స్ ఎక్కువ చికిత్సా సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి (Umbilical cord stem cells have greater therapeutic potential):

    బొడ్డుతాడు ద్వారా సేకరించిన మూలకణాలు యంగ్​గా, యాక్టివ్​గా ఉంటాయి కాబట్టి.. ఎముకమజ్జ ద్వారా సేకరించిన స్టెమ్ సెల్స్​తో పోల్చితే అవి వేగంగా వేరుచేయగలవు. బొడ్డుతాడు స్టెమ్ సెల్స్ కూడా " ఇమ్యునాజికల్లీ నెయివ్"(ప్రతిఘటించే శక్తి లేకపోవడం)గా ఉంటాయి. ఎందుకంటే అవి ఇన్ఫెక్షన్ల వంటి బయటి రోగనిరోధక ప్రేరణకు గురికావు. తోబుట్టువుల మధ్య కూడా మార్పిడి సంబంధిత సమస్యలను కలిగించే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి.

    మీ శిశువు పుట్టగానే స్టెమ్ సెల్స్​ స్టోర్ చేయడం వలన భవిష్యత్​లో ఎప్పుడు అవసరమైనా తిరిగి వాడుకోవచ్చు. వీటిని పుట్టగానే సేకరించి భద్రపరుస్తారు. మీరు ఎముకమజ్జ మార్పిడి కోసం ప్రయత్నిస్తే దాత కోసం చూడాల్సిన అవసరం లేదు. ఎముక మజ్జ మార్పిడి దాత కోసం చూడాల్సిన అవసరం లక్షమందిలో ఒకరికి ఉంటుంది.

    6. శిశువు స్టెమ్ సెల్​ను 20 సంవత్సరాలకు పైగా ప్రీజర్వ్ చేయొచ్చు (Your baby's stem cell can be preserved for more than 20 years:):

    స్టెమ్ సెల్స్ ప్రత్యేకంగా తయారు చేసిన క్రయో-ప్రీజర్వేషన్ బ్యాగులలో ప్యాక్ చేయబడతాయి. వీటిని విడివిడిగా అల్యూమినియం ప్రొటెక్టివ్ కేస్​లలో చుట్టి ఉంచుతారు. ఇలా చేసిన స్టెమ్ సెల్స్​కు ప్రతి ప్యాక్​కు ఒక యూనిక్ కోడ్​ను కేటాయించి క్రయోప్రిజర్వేషన్ ట్యాంకులలో భద్రపరుస్తారు. ఇలా ప్రంచస్థాయి ప్రమాణాలతో 23సంవత్సరాల పాటు స్టోర్ చేసిన తర్వాత స్టెమ్ సెల్స్ ఉపయోగించడం మంచిది.

    7. మీ బేబీ స్టెమ్ సెల్స్ మీరు ఎంచుకున్న దాని ప్రకారంగా లోకల్​గా లేదా అంతర్జాతీయంగా స్టోర్ చేయబడతాయి ( Your baby's stem cells can be stored locally or internationally based on your choice):

    మీరు తరచూ వేర్వేరు స్థలాలకు మారుతుంటే.. మీరు ఉంటున్న ఏరియాకు దగ్గరకి మీ స్టెమ్ సెల్స్ మార్చమని స్టెమ్ సెల్ బ్యాంకుకు చెప్పొచ్చు. ఈ స్టెమ్ సెల్స్ ప్రోజెన్ (చల్లటి ప్రదేశాలలో స్టోర్ చేయడం) స్టేట్​లో ఉంటుంది కనుక ప్రపంచంలోని ఎక్కడికైనా తరలించేందుకు వీలుంటుంది. అయితే వాటిని వేరే బ్యాంకులో స్టోర్ చేసేందుకు తరలింపు ఖర్చులను మాత్రం మీరే భరించాల్సి ఉంటుంది.

    స్టెమ్ సెల్స్​ అనేవి అత్యంత ఆసక్తిని కలిగించే విషయాలలో ఒకటి. స్టెమ్ సెల్స్​పై పరిశోధనలు ప్రతి రోజు వేగంగా పెరుగుతున్నాయి. ఒకానొక సమయంలో నయం చేయలేని చాలా రకాల వ్యాధులకు నేడు స్టెమ్ సెల్స్ ద్వారా చికిత్స సాధ్యం అవుతుంది. స్టెమ్ సెల్స్ ద్వారా ఆరోగ్యకరమైన కొత్త కణజాలాలను క్రియేట్ చేయొచ్చు. ఆ సెల్స్ ఎన్నో రకాల రుగ్మతలకు చికిత్స చేయడంలో సహాయపడుతున్నాయి. స్టోర్ చేయబడిన లేదా ప్రీజర్వ్ చేయబడిన స్టెమ్ సెల్స్ ద్వారా నయం చేయగల కొన్ని రకాల వ్యాధులు:

    8. మానవ కణజాలం మరియు అవయవాల పునరుత్పత్తి ( Human tissue and organ regeneration):

    నిల్వ చేసిన లేదా ప్రీజర్వ్ చేసిన స్టెమ్ సెల్స్​ను ఉపయోగించి కణజాలాలను, అవయవాలను పునరుత్పత్తి చేయొచ్చు. అవయవాలు ఫెయిల్ అయిన సందర్భాల్లో డిమాండ్​ను బట్టి అవయవాలను ఉత్పత్తి చేయడం, దానం చేయడం, మార్పిడి చేయడం వంటివి చేయొచ్చు.

    9. టైప్ 1 డయాబెటిస్​కు చికిత్స (Type 1 diabetes treatment):

    ప్యాంక్రియాట్రిక్ కణాలు అనేవి సరిగ్గా పని చేయనపుడు టైప్ 1 డయాబెటిస్ వస్తుంది. దీని కారణంగా శరీరం చాలా తక్కువ మొత్తంలో ఇన్సులిన్​ను ఉత్పత్తి చేస్తుంది. ప్రీజర్వ్ చేసిన స్టెమ్ సెల్స్​ను ఉపయోగించి.. టైప్ 1 డయాబెటిస్​తో బాధపడే రోగులలో ప్యాంక్రియాట్రిక్ కణాలను మార్పిడి చేయొచ్చు. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వలన ఎవరి రోగనిరోధక శక్తయితే క్షీణిస్తుందో వారిలో ప్రీజర్వ్ చేసిన స్టెమ్ సెల్స్​తో ఆ కణాలను భర్తీ చేసి వారి సమస్యను పరిష్కరించవచ్చు.

    10. కార్డియోవాస్కుల్యార్ (గుండె సంబంధిత) సమస్యలకు చికిత్స (Cardiovascular disease treatment):

    గుండె సంబంధిత వ్యాధులు ప్రధానంగా రక్తనాళాల్లో సమస్యలు ఉత్పన్నం అయినపుడు వస్తాయి. కొంత మంది పరిశోధకులు స్టెమ్ సెల్స్ ఉపయోగించి కొత్త రక్తనాళాలను ఉత్పత్తి చేశారు. ఇవి చూసేందుకు మరియు పనితీరు పరంగా కూడా సహజ(ఒరిజినల్) రక్తనాళాల వలే ఉంటాయి. వివిధ రకాల కణజాలాలు బ్యాంకు నుంచి వచ్చిన స్టెమ్ సెల్స్ ద్వారా రిపేర్ చేయబడతాయి. లేదా రీజెనరేట్ (పునరుత్పత్తి) చేయబడతాయి. వాస్కులర్ మరియు కార్డియోవాస్కులర్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయి.

    11. బ్లడ్​కు సంబంధించిన సమస్యలకు చికిత్స (Blood-related issues treatment):

    బొడ్డుతాడు రక్తం మరియు ప్లాసెంటాలో హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని ఇతర రక్తకణాలుగా విభజించబడతాయి. ఇది లుకేమియా, సికెల్​సెల్​ ఎనిమియా, ఇతర రకాల రోగనిరోధక వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

    12. బ్రెయిన్ డిసీజెస్​కు(వ్యాధులకు) చికిత్స (Brain disease treatment):

    గాయాల తర్వాత నాడీసంబంధిత రుగ్మతలు చాలా వస్తాయి. అటువంటి రుగ్మతలు ఉంటే స్టెమ్ సెల్స్​తో చికిత్స చేయొచ్చు. పార్కిన్సన్​(మెదడుకు వచ్చే ఒక రకమైన రుగ్మత) రుగ్మత మెదడు కణాలు దెబ్బతినడం వల్ల కండరాల కదలికలను నియంత్రిస్తుంది. మెదడులో దెబ్బతిన్న కణజాలానికి చికిత్స చేసేందుకు స్టెమ్ సెల్స్​ను ఉపయోగించవచ్చు. ఈ న్యూ బ్రెయిన్ సెల్స్ అనియంత్రిత కండరాల కదలికలను నియంత్రించగలవు.

    స్టెమ్ సెల్ బ్యాంకింగ్ సమస్యలు (Stem Cell Banking Issues in Telugu)

    మానవులకు వచ్చే వ్యాధులను క్యూర్ చేసేందుకు స్టెమ్ సెల్స్ అనేవి చాలా ముఖ్యం. అందుకోసమే స్టెమ్​ సెల్స్​ను రక్షించాల్సిన అవసరం ఉంది. స్టెమ్ సెల్స్ సంరక్షణకు యూనివర్సల్ పద్ధతి (సార్వత్రిక పద్ధతి) అంటూ ఏమీ లేదు. మెసెన్చైమల్ మరియు ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్​ను సంరక్షించేందుకు హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ ప్రీజర్వ్ చేసేందుకు వాడిన ప్రొటోకాల్స్​ను తిరిగి పొందడం చాలా కష్టం అవుతుంది. ప్రతి కణానికి ప్రత్యేక శాస్త్రం ఉందని ఇవి రుజువు చేస్తాయి. వాటిని ప్రిజర్వ్ చేసే టెక్నిక్స్ తప్పనిసరిగా వాటి మీదే ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.

    కణాలను ప్రిజర్వ్ చేసేందుకు చాలా విధానాలు ఉన్నాయి. కానీ సైన్స్ అనేది కొత్త విధానాలను కనుక్కోవాలి లేదా పాత వాటిని సవరించాలి. సరైన విధంగా ప్రీజర్వ్ చేయకపోవడం, వేడిచేయకపోవడం, నిల్వచేయకపోవడం వంటివి జరిగినపుడు ప్రొటోకాల్‌లోని ప్రతి ఎలమెంట్ సెల్స్​ను డ్యామేజ్ చేస్తుంది. ప్రీజర్వేషన్ సమయంలో ప్రతీది ఎంత జాగ్రత్తగా చేయాలో వ్యక్తులకు శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం కణాలను ప్రీజర్వ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రస్తుతం కణాలను సజీవంగా తీసుకునేందుకు ఎంతో శ్రమ మరియు అనే మెషీన్ల మీద ఆధారపడాల్సి రావొచ్చు. మనకు అందుబాటులో లేని పరికరాలు కూడా అవసరం కావొచ్చు. ఇది తప్పనిసరిగా మొదట పరిగణించాల్సిన విషయం. వారి నైతికతకు భద్రతకు భరోసా ఇవ్వడానికి వైద్య మరియు శాస్త్రీయ ఇంప్రూవ్​మెంట్స్​ను జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకోవాలి.

    స్టెమ్​సెల్ బ్యాంకింగ్​ సవాళ్లు.. (Stem Cell Banking Challenges in Telugu)

    స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ద్వారా అధిక నాణ్యత ఉన్న స్టెమ్ సెల్స్​ను పొందడం సవాలుతో కూడుకున్న పని. ఆరోగ్యకరమైన ఎటువంటి వ్యాధి లేకుండా ఉన్న కణజాలం నుంచి మాత్రమే స్టెమ్ సెల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టెమ్ సెల్స్ ద్వారా తిరిగి శక్తిని పొందేందుకు వాటిని సరిగ్గా ప్రాసెస్ చేయడం అవసరం. స్టెమ్ సెల్స్ అవసరం ఉన్న వ్యక్తులకు స్టెమ్ సెల్ బ్యాంక్స్ అందుబాటులో ఉండేలా చూడడం మరొక సవాలు. కొన్ని ప్రైవేటు స్టెమ్ సెల్ బ్యాంక్స్ ఖర్చుతో కూడుకున్నవి కాగా, మరికొన్ని ప్రభుత్వ స్టెమ్ సెల్ బ్యాంక్స్ అందరి డిమాండ్లను నెరవేర్చే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోవచ్చు.

    స్టెమ్​ సెల్స్ ప్రీజర్వ్ చేసేందుకు ఎంత ఖర్చు అవుతుంది? (How Much Does Stem Cell Preservation Cost in Telugu?)

    స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ చార్జ్ అనేది మీరు ఎంచుకునే బ్యాంకుని బట్టి, ప్లాన్​ను బట్టి ఉంటుంది. స్టెమ్ సెల్​ బ్యాంకింగ్ అనేది గణనీయమైన (ఎక్కువగా ఉండే) పెట్టుబడి అయినప్పటికీ కొన్ని ప్రైవేటు కంపెనీలు మీకు వివిధ రకాల పేమెంట్ ప్లాన్లు మరియు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. వీటి వల్ల ఈ పెట్టుబడి మరింత సులభం అవుతుంది. మీరు మీ కోసం ప్రత్యేకమైన ప్యాకేజీని ఎంచుకోవడానికి ప్రయోజనాలు మరియు ఖర్చులను అంచనా వేయడం సరైన విధంగా ఉంటుంది.

    మన దేశంలో స్టెమ్ సెల్ ప్రీజర్వేషన్ ఖర్చులు అనేవి ఒక నగరం నుంచి మరొక నగరానికి వేరుగా ఉంటాయి. ఈ ఖర్చులు వివిధ కారకాలను బట్టి ప్రభావితం అవుతాయి. వివిధ బ్యాంకులు మరియు సంస్థల ఖర్చులలో తేడాలు ఉంటాయి. ఏ రకంగా ప్రీజర్వ్ చేస్తారు. ఎలా సేకరిస్తారనే విషయం మీద కూడా ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను నిర్వహించే నిపుణుల ఆంశం కూడా ప్రీజర్వేషన్ ఖర్చులను ప్రభావితం చేసే మరో ఆంశం.

    భారతదేశంలో స్టెమ్​సెల్ బ్యాంకింగ్ రకాలు (Types Of Stem Cell Banking In India in Telugu)

    మన దేశంలో స్టెమ్ సెల్ బ్యాంకులు ప్రధానంగా ఇలా ఉన్నాయి..

    1. ప్రైవేటుగా నిర్వహించబడే బ్యాంకులు (Privately held banks):

    ఈ బ్యాంకులను సాధారణంగా ఫ్యామిలీ బ్యాంక్స్ అని పిలుస్తారు. ఇక్కడ తల్లిదండ్రులు వారి పిల్లల బొడ్డు తాడు రక్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఇక్కడ భద్రపరుస్తారు. ఇక్కడ స్టెమ్​ సెల్స్​ను పిల్లలు లేదా తోబుట్టువుల వంటి కుటుంబసభ్యులు ఉపయోగించవచ్చు.

    2. ప్రభుత్వ బ్యాంకులు (Public banks):

    ఈ స్టెమ్ సెల్ బ్యాంకులు ప్రజల సహకారంతో పని చేస్తాయి. ఈ బ్యాంకులలో తల్లిదండ్రులు శిశువు బొడ్డుతాడు రక్తాన్ని డొనేట్ చేస్తారు. ఎవరికైతే అవసరం ఉంటుందో వారు ఇప్పటికే ప్రభుత్వ స్టెమ్ సెల్ బ్యాంకులలో భద్రపరిచిన స్టెమ్ సెల్స్​ను వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. నిల్వ చేయబడిన ఈ స్టెమ్ సెల్స్ పరిశోధనల కోసం కూడా ఉపయోగించబడతాయి. తల్లిదండ్రులు కూడా స్టెమ్ సెల్స్​ను డొనేట్ చేసేందుకు అర్హత కలిగి ఉండాలి. వారికి కూడా కొన్ని అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ బ్యాంకుల డేటాబేస్(మొత్తం వివరాలు) డాక్టర్లకు అందుబాటులో ఉంటుంది. వారికి అవసరం వచ్చినపుడు వారు ఉపయోగించుకోవచ్చు. చికిత్సకు అవసరమైన సందర్భంలో ఉపయోగించుకుంటారు.

    3. కమ్యూనిటీ స్టెమ్ సెల్ బ్యాంక్స్ (Community Stem Cell Banks):

    ఈ రకమైన స్టెమ్ సెల్ బ్యాంక్స్ ప్రభుత్వ మరియు ప్రైవేటు స్టెమ్ సెల్ బ్యాంకుల ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ పద్ధతిలో బొడ్డు తాడు నుంచి విడదీసిన స్టెమ్ సెల్స్ కమ్యూనిటీ పూల్​కు యాడ్ చేయబడతాయి. వైద్య పరంగా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినపుడు స్టోర్ చేసిన అన్ని రకాల స్టెమ్ సెల్స్​ను యాక్సెస్ చేసేందుకు కమ్యూనిటీ బ్యాంక్ మెంబర్స్​కు అనుమతి ఉంటుంది. ఈ విధానం చాలా ప్రత్యేకమైనది. మన భారతదేశంలో ఈ విధానమే ఉపయోగించబడుతుంది.

    చివరగా.. (Conclusion)

    స్టెమ్ సెల్ పరిశోధన యొక్క భవిష్యత్ అవసరాల కోసం స్టెమ్ సెల్స్ ప్రీజర్వేషన్ చాలా ముఖ్యం. మనకు సులభంగా లభించే టాప్ నాచ్​ బయోస్పెసిమెన్ (రీసెర్చి కోసం ఉపయోగపడేవి) డిమాండ్​ను ఇవి పెంచుతాయి. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి రోజు ఎంతో పురోగతిని సాధిస్తూనే ఉంది. వివిధ రకాల వ్యాధులకు స్టెమ్ సెల్స్ ద్వారా ఇప్పటికే విజయవంతంగా చికిత్స చేశారు. భవిష్యత్​లో మందులు, చికిత్స విషయంలో స్టెమ్ సెల్స్ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. 80 కంటే ఎక్కువ ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో స్టెమ్ సెల్ ప్రీసర్వేషన్ ఉపయోగపడుతుంది. అయినా కానీ స్టెమ్ సెల్స్​ను ప్రీజర్వ్​ చేసుకోవాలా? వద్దా? అనేది వ్యక్తి ఇష్టం.

    Tags:

    Stem cell banking in telugu, what is stem cell preservation in telugu?, benefits of stem cell preservation in telugu, issues in stem cell preservation in telugu, why should we preserve stem cells in telugu.

    What Are The Benefits Of Stem Cell Preservation in English, What Are The Benefits Of Stem Cell Preservation in Tamil, What Are The Benefits Of Stem Cell Preservation in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Swetha Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Image related to Pimples and Acne

    Pimples and Acne

    శిశువుల్లో మొటిమలు: కారణాలు & లక్షణాలు | Baby Acne : Causes and Symptoms in Telegu

    Image related to Travel & Holidays

    Travel & Holidays

    మీ చిన్నారితో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ బిడ్డతో ఆనందించే సెలవుల కోసం 5 అత్యంత ఉపయోగకరమైన టిప్స్|Planning a Trip with Your Little One? Here are 5 Extremely Useful Tips for an Enjoyable Holiday with Your Baby in Telegu

    Image related to Pregnancy Myths

    Pregnancy Myths

    బేబీ గర్ల్ బెల్లీ Vs బేబీ బాయ్ బెల్లీ: మీ పొట్ట ఆకారం లేదా పరిమాణం మీరు అబ్బాయిని కలిగి ఉన్నారని చెప్పగలరా? | Baby Girl Belly Vs Baby Boy Belly in Telugu

    Image related to Potty Training

    Potty Training

    మీ చిన్నారులకు పాటీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చేయాల్సినవి, చేయకూడనివి ( Do’s and don’ts when Potty Training Your Newborn in Telugu?)

    Image related to Teething

    Teething

    శిశువు మొదటి దంతాలు: తల్లిదండ్రులు తెలుసుకోవలసిన 5 వాస్తవాలు (Baby’s First Tooth: 5 Facts Parents Should Know in Telugu)

    Image related to Tips For Normal Delivery

    Tips For Normal Delivery

    ర్మల్ డెలివరీ లేదా సిజేరియన్ డెలివరీలలో ఏది మంచిది? ఎందుకు మంచిది? | Which Is Better Normal Or Cesarean in Telugu

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.