


Pregnancy Best Foods
23 December 2025 న నవీకరించబడింది
చాలా మంది గర్భవతులు(తల్లి కావాలని ఆశించేవారు) తమ బిడ్డ మెదడు అభివృద్ధి కోసం సహాయపడే ఆహారాల కోసం వెతుకుతున్నారు. శిశువు మొత్తం పెరుగుదల కోసం ఉద్దేశించబడిన వివిధ రకాల సప్లిమెంట్లు, మరియు విటమిన్లను కూడా వైద్యులు సిఫారసు చేస్తారు. ఏదేమైనప్పటికీ తల్లి కావాలని ఆశించే వారు తమ బిడ్డ మెదడు అభివృద్ధి కోసం ఎటువంటి ఆహారం ఉపయోగపడుతుందనే విషయాన్ని డైట్ మార్చే ముందే తెలుసుకోవడం ఉత్తమమైనది.
శిశువు మెదడు అభివృద్ధి అనేది గర్భం దాల్చినప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది గర్భం చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. జన్యువులు, పోషకాలు అనేవి శిశువు మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. శిశువు మెదడు అభివృద్ధి అనేది సాధారణంగా గర్భధారణ 22వ వారంలో గమనించవచ్చు. గర్భధారణ 25వ వారం నాటికి మెదడు అనేది కాఫీ బీన్ పరిమాణంలోకి, గర్భధారణ 40వ వారం నాటికి మెదడు అనేది వాల్నట్ పరిమాణంలోకి చేరుకుంటుంది.
ఈ కింద పేర్కొన్న కారకాలు శిశువు మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అవేంటంటే..
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో టైఫాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి?
గర్భధారణ సమయంలో శిశువు మెదడుని ఎలా అభివృద్ధి పరచాలనే విషయంలో గర్భవతులు తరచుగా ఆశ్చర్యపోతారు. సరైన పోషకాహారం అనేది శిశువు మెదడును ఎలా ప్రభావితం చేస్తుందో వారు సరిగ్గా అర్థం చేసుకోలేరు. గర్భవతులు శిశువు మొత్తం శరీర అభివృద్ధి కోసం సరైన సప్లిమెంట్లు మరియు పోషకాలు ఎక్కువ మోతాదులో ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
శిశువు మెదడు అభివృద్ధికి పోషకాలు అవసరమని అర్థం చేసుకున్న తర్వాత ఎక్కువగా అడిగే ప్రశ్న ఏమిటంటే.. — నా బిడ్డ మెదడు అభివృద్ధి కోసం నేను ఏమి తినాలి?
గర్భధారణ సమయంలో మెదడు అభివృద్ధి చెందేందుకు ఉత్తమ ఆహారాలు
గర్భధారణ సమయంలో శిశువు మెదడుని అభివృద్ధి చేసే కొన్ని ఆహారాలు కింద ఇవ్వబడ్డాయి.
గర్భిణీ స్త్రీలు వారి ప్రీనేటల్ విటమిన్లను వైద్యుడు సూచించిన విధంగా తీసుకోవాలి. సాధారణంగా విటమిన్లు ఉండే తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోమని సూచిస్తారు. ఈ విటమిన్లు అనేవి మనం తీసుకునే ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని ఆశించే తల్లులు అర్థం చేసుకునేందుకు ఈ సలహా సహాయపడుతుంది.
శిశువు మెదడు మరియు నాడీ వ్యవస్థ, కళ్లు సరైన విధంగా అభివృద్ధి చెందేందుకు ఒమేగా-3 కొవ్వుల ఆమ్లాలు అత్యంత అవసరం. ఇందుకోసం ప్రతిరోజు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలలో ఒక మూలకంగా ఉండే DHAను 200 mg తీసుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తారు. ఒమేగా 3 అధికంగా ఉండే కొన్ని రకాల సహజ ఆహారాలు
శిశువు మెదడు, వెన్నముక, న్యూరోట్రాన్స్మిటర్స్ అభివృద్ధి చెందేందుకు కోలిన్ చాలా ముఖ్యం. ఇది శిశువులో సరైన విధంగా జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేసేందుకు కూడా.. సహాయపడుతుంది. కోలిన్ విటమిన్ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు:
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు మెదడును అభివృద్ధి చేసే ఆహారాలు ఏవో తెలుసా? ఓ లుక్ వేయండి!
ప్రొటీన్లలోని అమైనో ఆమ్లాలు కణాల పునరుత్పత్తి మరియు మరమ్మతుకు అవసరం. ఈ ప్రొటీన్లు గర్భధారణ సమయంలో మెదడు కణాల పెరుగుదలకు మరియు మెదడు అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కూడా సహాయపడతాయి.
గర్భవతులు తినాల్సిన కొన్ని ప్రొటీన్ రిచ్ ఫుడ్స్..
తాజా పండ్లు మరియు కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శిశువు మెదడు కణాలు దెబ్బ తినకుండా ఉండేందుకు ఇవి సహాయం చేస్తాయి. గర్భవతులు రోజుకు కనీసం ఏడు సార్లు తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు:
హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఐరన్ సహాయపడుతుంది. ఆక్సిజన్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లేందుకు హిమోగ్లోబిన్ కీలకం. గర్భధారణ సమయంలో శిశువు యొక్క మెదడు అభివృద్ధి ఎక్కువగా ఆక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది. కింద పేర్కొన్న కొన్ని ఆహారాలతో గర్భవతులు ఐరన్ తీసుకునే మొత్తాన్ని పెంచుకోవచ్చు.
గర్భిణీ స్త్రీ యొక్క థైరాయిడ్ గ్రంథి తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ కావాల్సిన హార్మోన్లను ఉత్పత్తి చేయాలి. గర్భం దాల్చిన 20 వారాల వరకు శిశువుకు థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చెందకపోవడమే దీనికి కారణం. అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు మరియు సప్లిమెంట్లు బిడ్డ మెదడు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. గర్భవతుల కోసం అయోడిన్ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలు
శిశువు మెదడు అభివృద్ధి కోసం జింక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మెదడు సెల్స్ మరియు కణజాలాల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. గర్భిణీ స్త్రీలు తమ బిడ్డ మెదడు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన కొన్ని జింక్ రిచ్ ఫుడ్స్.. ఈ ఆహారాలలో జింక్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
శిశువు మెదడు పనితీరులో అవసరమైన వివిధ భాగాలను అభివృద్ధి చేయడంలో విటమిన్ B కాంప్లెక్స్ కీలకపాత్రను పోషిస్తుంది. DNA/RNA రిపేర్ మరియు సంశ్లేషణ, సిగ్నలింగ్ మాలిక్యూల్స్ (అణువులు), మరియు శక్తి ఉత్పత్తి అనేవి సూక్ష్మపోషకాల కోసం అవసరమయ్యే శిశువు మెదడులోని కొన్ని అంశాలు.
విటమిన్ B కాంప్లెక్స్ ఈ కింది ఆహారాలలో సహజంగా ఉంటుంది.
గర్భధారణ సమయంలో తాజాగా ఉన్న బలవర్థకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా మహిళలు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శిశువు మెదడు అభివృద్ధి కొరకు సరైన వ్యాయామం మరియు ఒత్తిడిని నివారించడం కూడా అవసరం.
Best foods for baby brain development in telugu, Best foods for pregnant ladies in Telugu, What foods pregnants need to eat for baby brain developement in telugu, List of foods for the development of baby brain during pregnancy in telugu.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











గర్భధారణ సమయంలో గుండె దడ: లక్షణాలు, కారణాలు & చికిత్స | Palpitation in Pregnancy: Symptoms, Causes & Treatment in Telugu

గర్భధారణ సమయంలో అటుకులు: ప్రయోజనాలు, రకాలు & వంటకాలు | Poha During Pregnancy: Benefits, Types & Recipes in Bengali

గర్భధారణ సమయంలో రాగి: ప్రయోజనాలు మరియు పోషక విలువలు

గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలకు HCG ఇంజెక్షన్ ఎందుకు సిఫార్సు చేస్తారు? (Recommended HCG Injection During Pregnancy in Telugu)

మహిళలకి సంబంధించిన టాప్ 10 ఆరోగ్య సమస్యలు (Top 10 Health Issues Related To Women in Telugu)

ప్రెగ్నెన్సీలో వికారం వాంతులు ((Nausea and Vomiting During Pregnancy in Telugu)