


Care for Baby
2 February 2026 న నవీకరించబడింది
శిశువు ఘనపదార్థాలు తిననప్పుడు, వారికి పళ్లు లేనప్పుడు నాలుక శుభ్రం చేయాల్సిన అవసరం ఏంటని అనుకుంటారు. కానీ శిశువులకు కూడా వారి నోరు శుభ్రం చేయడం అవసరం. ఎంత ముందుగా ఇది ప్రారంభిస్తే అంత మంచిది. నోటి పరిశుభ్రత పెద్దలకు, పిల్లలకు మాత్రమే కాదు, నవజాత శిశువులకు కూడా అవసరం. శిశువు నాలుక ఎలా శుభ్రం చేయాలి అనే అంశంపై ఈ బ్లాగ్ అన్ని సందేహాలను తీరుస్తుంది. పసిపిల్లల నోరు ఎలా శుభ్రం చేయాలనే అంశంపై సలహాలు, సూచనలు అందిస్తుంది.
మీ నోటిలో కొంత బ్యాక్టీరియా ఉన్నట్టే, పిల్లల నోటిలో కూడా ఉంటుంది. నోటిలో పాల అవశేషాలు తుడిచివేయడానికి శిశువు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మీకు నోటిలో ఉత్పత్తి అయినంత లాలాజలం శిశువులకు ఉత్పత్తికాదు. ఇది వాళ్ల నాలుకపై పేరుకుపోయి, తెల్లని పూత ఏర్పడుతుంది. ఈ పరిస్థితికి పరిష్కారంగా వారి నాలుకను శుభ్రం చేస్తే చాలు. కానీ శిశువు నాలుక ఎలా శుభ్రం చేయాలి? శిశువు నాలుకను తడిగా ఉన్న వస్త్రంతో శుభ్రం చేయడం వల్ల నోటి పరిశుభ్రత అలవాటు అవుతుంది. వాళ్లు టూత్‌బ్రష్‌తో నోటిని శుభ్రం చేసే సందర్భం వచ్చినప్పుడు వారికి కొత్తగా ఏమీ అనిపించదు.
నవజాత శిశువు నాలుక శుభ్రం చేయడం ఎలా అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి:
1. ముందుగా మీ చేతుల్ని సబ్బుతో, నీళ్లతో కడుక్కోవాలి.
2. మీ నవజాత శిశువును ఒడిలో కూర్చోబెట్టుకొని, తలను చేతితో పట్టుకోవాలి.
3. మీ వేలితో వస్త్రాన్ని వేడి నీళ్లల్లో ముంచాలి.
4. మీ శిశువు నోటిని నెమ్మదిగా తెరవాలి. నాలుకపై వృత్తాకారంలో మృదువుగా శుభ్రం చేయాలి.
5. మీ వేలితో చిగుళ్లు, బుగ్గల లోపలి భాగాలను మృదువుగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి.
నవజాత శిశువు నాలుక ఎలా శుభ్రం చేయాలి? అన్న అంశం తల్లిదండ్రుల్ని కంగారుపెడుతుంది. శిశువు నాలుకపై పేరుకుపోయిన పాల అవశేషాలను తొలగించడానికి మెత్తటి ఫింగర్ బ్రష్ ఉపయోగించవచ్చు. దీంతో వారి చిగుళ్లను కూడా మర్దన చేయొచ్చు. మీ బిడ్డ నాలుకను రోజులో కనీసం రెండుసార్లు శుభ్రం చేయాలి.
శిశువు నాలుకపై తెల్లటి పదార్థం ఎలా శుభ్రం చేయాలి? అని తెలుసుకోవడానికి ముందు, పిల్లల నాలుకపై తెల్లటి పదార్థం కనిపించడానికి పాలు మాత్రమే కారణం కాదన్న కీలక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని థ్రష్ అని అంటారు. నోటిలో తెల్లని పూతలా కనిపిస్తుంది. థ్రష్ పాల అవశేషాల లాగానే ఉంటుంది. తేడా ఏంటంటే పాల అవశేషాలను సులువుగా తుడిచేయొచ్చు. కానీ థ్రష్ తుడవడం ద్వారా తొలగించలేం. ఓరల్ థ్రష్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ నోటిలో ఏర్పడుతుంది. ఓరల్ క్యాండిడయాసిస్ ఫలితంగా నోటి పైభాగంలో, బుగ్గల లోపల, చిగుళ్లపై, నాలుకపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. నాలుకపై థ్రష్‌ను ఎలా శుభ్రం చేయాలి? అనే విషయం తెలుసుకుందాం. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు యాంటీఫంగల్ మెడిసిన్ ఉపయోగించాలి. కొన్నిసార్లు తుడిచిన తర్వాత కూడా నోటిలో తెల్లటి పూత తొలగిపోకపోతే పీడియాట్రీషియన్‌ను కలవాలి.
పిల్లల నాలుక శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్, పిల్లలకు సౌకర్యంగా ఉండే మెత్తటి టూత్‌బ్రష్ ఉపయోగించాలి. మీ పిల్లలకు ఆరు నెలల తర్వాత, మొదటి దంతం కనిపించినప్పుడే ఇలా చేయాలి. ప్రత్యామ్నాయంగా.. మీ పిల్లలు కాస్త పెద్దగా అయ్యేంత వరకు ఫింగర్ బ్రష్, వాష్‌క్లాత్, గోజ్ ఉపయోగించాలి. టూత్‌బ్రష్ ఉపయోగించి మీ పిల్లల నాలుక, చిగుళ్లు మృదువుగా శుభ్రం చేయొచ్చు. మీ పిల్లలకు ఆరు నెలల వయస్సు వచ్చేవరకు కొద్దిగా అంటే బియ్యం గింజ పరిమాణంలో టూత్‌పేస్ట్ ఉపయోగించి నోటిని శుభ్రం చేయాలి. పిల్లల వయస్సు మూడేళ్లు వచ్చిన తర్వాత బఠానీ సైజ్‌లో టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు.
పిల్లల నోరు ఎలా శుభ్రం చేయాలి? అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి:
1. తడిగా ఉన్న టూత్‌బ్రష్‌పై కొంత పేస్ట్ పెట్టుకోవాలి.
2. మీ టూత్‌బ్రష్‌తో మీ పళ్లను శుభ్రం చేస్తూ, పిల్లలకు చూపించాలి.
3. ఆ తర్వాత పిల్లల టూత్‌బ్రష్ తీసుకొని, వారి పళ్లను శుభ్రం చేయాలి. ఎలా బ్రష్ చేస్తున్నారో వారికి వివరించాలి.
4. పిల్లలు స్వయంగా బ్రష్ చేసుకునేలా ప్రోత్సహించాలి. ఎలా బ్రష్ చేస్తున్నారో చూస్తూ వారిని గైడ్ చేయాలి. పిల్లలు కాస్త పెద్దయిన తర్వాత వాళ్లు పళ్లు ఎలా శుభ్రం చేస్తున్నారో గమనించాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువులలో పొడి చర్మం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?
పసివాళ్లు, శిశువులకు తరచూ బ్రష్ చేస్తుండటం, నాలుకను శుభ్రం చేస్తుండటంతో పాటు, వారిని పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి చెకప్ చేయిస్తూ ఉండాలి. శిశువుకు మొదటి డెంటల్ అపాయింట్‌మెంట్ ఆరు నెలలలోపు లేదా మొదటి దంతం వచ్చినప్పుడు తీసుకోవాలి. డెంటిస్ట్ పిల్లల పళ్లు, దవడ, చిగుళ్లను పరిశీలిస్తారు. అదనంగా, దంత క్షయం, నోటి మోటార్ అభివృద్ధిలోని సమస్యలు డెంటిస్ట్ పరిశీలిస్తారు. ఏవైనా నోటి సమస్యల్ని గుర్తించినట్టైతే, శిశువు నాలుకను శుభ్రం చేయడానికి ఇంటి చిట్కాలు సూచిస్తారు.
మంచి నోటి సంరక్షణ చిన్న వయస్సులోనే ప్రారంభం అవుతుంది. అయితే చిన్న వయస్సులో తాము నోటిని శుభ్రం చేసుకున్నామని పిల్లలకు గుర్తురాకపోయినా.. ఈ రొటీన్ వల్ల వారి దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మంచి అలవాట్లు కొనసాగించేలా వారిని ప్రోత్సహిస్తుంది. నవజాత శిశువు నాలుక ఎలా శుభ్రం చేయాలి అన్న అంశంపై గల అన్ని సందేహాలను ఈ బ్లాగ్ తీర్చి ఉంటుంది. పేరెంటింగ్, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ లాంటి అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మైలో ఫ్యామిలీ వెబ్‌సైట్ సందర్శించండి.
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











స్టెమ్ సెల్స్ (మూలకణాలు) దాచిపెట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? (What Are The Benefits Of Stem Cell Preservation in Telugu?)

బ్రోన్కియెక్టాసిస్: అర్థం, రకాలు, కారణాలు, లక్షణాలు, చికిత్స

గర్భిణీ మహిళల రోజువారీ సమతుల్య ఆహారం: ఏం తినాలి ఇంకా ఏం తినకూడదు

గర్భధారణ సమయంలో కిందకి వంగడం ఎప్పుడు ఆపాలి? (When To Stop Bending During Pregnancy in Telugu?)

ప్రెగ్నెన్సీ 6వ నెలకు ఆరోగ్యకరమైన డైట్ మరియు మీల్ ప్లాన్ (Diet and Meal Plan for 6 Month Pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో చిలగడదుంప: ప్రయోజనాలు, ప్రమాదాలు & దుష్ప్రభావాలు | Benefits & Risks of Sweet Potato During Pregnancy in Telugu