Get MYLO APP
Install Mylo app Now and unlock new features
💰 Extra 20% OFF on 1st purchase
🥗 Get Diet Chart for your little one
📈 Track your baby’s growth
👩⚕️ Get daily tips
OR
Article Continues below advertisement
Updated on 9 January 2023
గర్భధారణ సమయంలో లోలయింగ్ ప్లాసెంటాతో బాధపడుతుండడం గర్భవతిగా ఉన్న తల్లికి బాధను కలిగిస్తుంది. గర్భం లోపల శిశువు ఎదిగేందుకు మావి అనేది కీలకం. దాని స్థానం దిగువగా ఉన్నపుడు గర్భధారణ సమయంలో సమస్యలు వస్తాయి. అయినప్పటికీ డాక్టర్‌తో తరచూ చెకప్‌లు చేయించుకోవడం వలన ఈ సమస్యను ముందుగానే నిర్ధారణ చేసుకుని, చికిత్స ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు.
లోలయింగ్ ప్లాసెంటాకి గల కారణాలు, లక్షణాలు, ఇంకా చికిత్స విధానం గురించి మరింత తెలుసుకోండి.
గర్భధారణ సమయంలో మావి అని పిలువబడే ఒక తాత్కాలిక అవయవం గర్భాశయం లోపల అభివృద్ధి చెందుతుంది. గర్భం దాల్చిన తక్కువ సమయంలోనే గర్భాశయ గోడకు జత చేసుకుంటుంది. బొడ్డు తాడు శిశువును మావితో కలుపుతుంది. దీని ద్వారానే శిశువు ఆక్సిజన్ మరియు పోషకాలను అందుకుంటుంది. మావి శిశువు రక్తం నుంచి వ్యర్థాలు ఇంకా కార్బన్ డయాక్సైడ్ను ఫిల్టర్ చేస్తుంది.
Article continues below advertisment
సాధారణంగా గర్భం ప్రారంభ రోజుల్లో ఫలదీకరణం చెందిన గుడ్డు గర్భాశయ గోడలో ఎక్కడ అమర్చబడిందో అక్కడ మావి అభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. ఇది గర్భాశయం చుట్టూ పెరుగుతుంది. తక్కువ పడి ఉన్న ప్లాసెంటా అంటే అది గర్భాశయాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పి ఉంచుతుంది. గర్భం పెరుగుతున్నా కొద్ది ఇది గర్భాశయం నుంచి పైకి జరుగుతుంది. కొన్నిసార్లు ఇది గర్భధారణ సమయంలో గర్భం దిగువ స్థానంలో ఉంటుంది. ప్రీనేటల్ చెకప్ సమయంలో అల్ట్రాసౌండ్ లేదా ట్రాన్స్వాజినల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా లోలయింగ్ ప్లాసెంటాను గుర్తిస్తారు, లేదా యోని రక్తస్రావం సంఘటన ద్వారా గుర్తిస్తారు.
ప్లాసెంటా ప్రీవియా అనేది మావి గర్భాశయాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పి ఉంచే పరిస్థితి. ఇది గర్భధారణ సమయంలో డెలివరీ తర్వాత రక్తస్రావాన్ని కలిగిస్తుంది. చాలామంది గర్భస్థ స్త్రీలకు ఇది గుర్తించబడుతుంది. రెండో త్రైమాసికంలో వైద్యులు ఇందుకు సంబంధించిన జాగ్రత్తలను సూచిస్తారు. చాలా సందర్భాల్లో ఈ పరిస్థితి మూడో త్రైమాసికంలో సాల్వ్ చేయబడుతుంది. లోలయింగ్ ప్లాసెంటా అనేది ప్రతిసారి ప్లాసెంటా ప్రీవియాకు దారి తీయదు.
మావి గర్భాన్ని పూర్తిగా చుట్టుముడితే ఆ పరిస్థితిని ప్లాసెంటా ప్రీవియా అని అంటారు. గర్భాశయం మావి అంచుల మధ్య 20 mm దూరం ఉంటే. దానినే లోలయింగ్ ప్లాసెంటా అని పిలుస్తారు.
చాలా సందర్భాల్లో లోలయింగ్ ప్లాసెంటా వచ్చేందుకు కారణాలు అస్పష్టంగా ఉన్నాయి. కొన్ని ప్రమాద కారకాలు ఇలా దోహదపడవచ్చు.
1. తల్లివయస్సు
Article continues below advertisment
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ రివ్యూ (IJMRR) ప్రకారం, 35 సంవత్సరాలు దాటిన స్త్రీలలో లోలయింగ్ ప్లాసెంటా వచ్చే అవకాశం 3.6 శాతం ఎక్కువగా ఉంటుంది. 20 ఏళ్ల లోపు మరియు 30 సంవత్సరాలు పైబడిన మహిళల్లో ప్లాసెంటా ప్రీవియాకు ఎక్కువ అవకాశం ఉంది. IVF వలన కూడా మావి సమస్యలు వస్తాయి.
2. పిండం అసాధారణ స్థానం
సాధారణ పరిస్థితుల్లో పిండం తలకిందులుగానే ఉంటుంది. ఇది శిశువు ప్రసవానికి సహాయపడుతుంది. అయినప్పటికీ శిశువు నిటారు స్థానం లోలయింగ్ ప్లాసెంటాకు కారణం కావొచ్చు.
3. మొదటి గర్భధారణ సమయంలో సమస్యలు
రెండో గర్భం దాల్చిన అందరూ లోలయింగ్ ప్లాసెంటా అనుభవం చవి చూడరు. మొదటి గర్భంలో ఎండోమెట్రియంలో ఏదైనా ప్రమాదం జరిగితే, రెండోసారి లోలయింగ్ ప్లాసెంటా ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది వరకే ఒకసారి జన్మనిచ్చిన వారిలో లోలయింగ్ ప్లాసెంటా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గర్భాశయాన్ని డ్యామేజ్ చేసే గత C-సెక్షన్స్ వలన ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి.
Article continues below advertisment
4. ఒకే సమయంలో బహుళ గర్భాలు
బహుళ గర్భాలు లోలయింగ్ ప్లాసెంటా మరియు ప్లాసెంటా ప్రీవియా వచ్చేందుకు కారణం అవుతాయి. ఎందుకంటే బహుళ గర్భాలు ఉన్నపుడు గర్భం ఎక్కువగా విస్తరిస్తుంది.
5. జీవనశైలి
చైన్ స్మోకింగ్, మాదకద్రవ్యాల వినియోగం, మద్యం తాగడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా లోలయింగ్ ప్లాసెంటా మరియు ప్లాసెంటా ప్రీవియా వస్తుంది. ధూమపానం ప్లాసెంటల్ హైపర్ట్రోఫీకి దారితీస్తుంది. అసాధారణంగా హెవీ ప్లాసెంటా మావి పైకి కదలడం మరింత కష్టతరం చేస్తుంది.
1.మొత్తం
Article continues below advertisment
మావి పూర్తిగా గర్భాశయాన్ని కప్పి ఉంచితే దానిని టోటల్ ప్లాసెంటా ప్రీవియా అని అంటారు. ఈ సమయంలో ప్రసవం కోసం C-సెక్షన్ డెలివరీ అవసరమవుతుంది.
2. మార్జినల్
ఈ సందర్భంలో మావి గర్భాశయం కింద ఉంటుంది. కానీ గర్భాశయాన్ని కవర్ చేయదు.
3. పార్షియల్ (కొద్ది భాగం)
పేరులో సూచించిన విధంగా కొద్ది భాగం మాత్రమే మావి గర్భాశయాన్ని కప్పి ఉంచుతుంది.
Article continues below advertisment
• గర్భధారణ రెండో దశలో నొప్పి లేకుండా యోని నుంచి రక్తస్రావం
• రక్తస్రావంతో పాటు సంకోచాలు లేదా తిమ్మిర్లు
• ఎనిమియా, తక్కువ రక్తపోటు మరియు లేత చర్మం
లోలయింగ్ ప్లాసెంటా మరియు ప్లాసెంటా ప్రీవియాలకు చికిత్స లేదు. గడువు తేదీ దగ్గరకు వచ్చినపుడు రక్తస్రావాన్ని కంట్రోల్ చేసేందుకు వైద్యుడు ప్రయత్నిస్తాడు. అకాల ప్రసవాన్ని నిరోధించేందుకు ఇంకా కార్డికోస్టెరాయిడ్ షాట్లను నివారించేందుకు వైద్యుడు మందులను సూచించవచ్చు. పరిస్థితులను బట్టి చికిత్సలు మారుతుంటాయి.
- రక్తస్రావం అయిన మొత్తం (తక్కువగా లేదా ఎక్కువగా)
Article continues below advertisment
- గడువు తేదీకి రోజుల సంఖ్య
- తల్లి మరియు బిడ్డ ఆరోగ్యం
- మావి మరియు బేబీ స్థానం
చివరగా
ప్లాసెంటా ప్రీవియా గర్భంతో ఉన్న తల్లులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యేకంగా మొదటిసారి గర్భం దాల్చినపుడు ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా బిడ్డ ఆరోగ్యం కోసం ఆందోళన చెందడం మంచిది కాదు. నైతిక మద్దతు కోసం ప్లాసెంటా ప్రీవియా ఉండి ఆరోగ్యమైన శిశువులకు జన్మనిచ్చిన వారిని సంప్రదించొచ్చు. చివరగా డాక్టర్లకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి సురక్షితమైన డెలివరీ కోసం వారు మీకు మార్గనిర్దేశం చేస్తారు.
Article continues below advertisment
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
Eating Spicy Food During Pregnancy: Is it Safe or Not?
(9,419 Views)
7 Tips to Help Your Toddler Transition From Potty to Toilet
(8,697 Views)
Embryo Freezing: Purpose & Outcome
(2,364 Views)
Exercises to Help Strengthen Weakened Pelvic Floor Muscles
(50,762 Views)
How Moms are Approaching 2023 - Mylo's Survey This Year End
(16,816 Views)
Second Trimester of Pregnancy
(65,502 Views)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |