


Women Specific Issues
13 January 2026 న నవీకరించబడింది
రొమ్ము ఆరోగ్యాన్ని ప్రతిబింబించే అనేక పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు, మీ శరీరంలో బ్రెస్ట్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని మీకు అనుమానం వచ్చినప్పుడు, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రొమ్ముల స్వీయ పరీక్ష చేయడం ద్వారా ఆ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టవచ్చు. మహిళలకు రొమ్ము స్వీయ పరీక్ష చాలా అవసరం. ఇది క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి.
రొమ్ములో ఏవైనా గడ్డలు ఉన్నాయా అని మహిళలు తమకు తాముగా పరీక్షించుకునే పద్ధతినే రొమ్ము స్వీయ-పరీక్ష అంటారు. మీరు మీ రొమ్ముల్లో గడ్డలు ఏర్పడ్డాయా, పరిమాణంలో మార్పులు ఉన్నాయా, ఎప్పట్లా కాకుండా ఏవైనా తేడాలు కనిపిస్తున్నాయా అని రొమ్ము స్వీయ పరీక్ష ద్వారా చూడొచ్చు. మీ రొమ్ముల్లో ఏవైనా మార్పులు కనిపించినట్టైతే వైద్యుల్ని కలవాలి. చాలావరకు ఇలాంటి మార్పులు ఎలాంటి అపాయానికి దారితీయవు. క్యాన్సర్ కూడా కాకపోవచ్చు. అయితే.. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపించడానికి క్యాన్సర్ కారణం కావచ్చు.
చాలావరకు కేసుల్లో.. రొమ్ముల స్వీయ పరీక్షను ఆస్పత్రులు సిఫార్సు చేయవు. ఎందుకంటే ఈ పరీక్ష వల్ల క్యాన్సర్‌ను గుర్తించడం సాధ్యం కాదు. కానీ మీ రొమ్ముల్లో ఏవైనా మార్పులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అవసరం. మార్పుల్ని గమనిస్తే మీ పరిస్థితి గురించి డాక్టర్‌కు వివరించే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్‌తో పాటు, మామ్మోగ్రామ్స్, బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా అవసరం.
మహిళలు తమ రొమ్ము ఆరోగ్యం కోసం తమను తాము పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రతీ నెలా రొమ్ము స్వీయ పరీక్ష చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ లేదా రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలతో బయటపడే అవకాశాలు పెరుగుతాయి. అయితే వైద్యులు సూచించిన పరీక్షలు, స్క్రీనింగ్ టెస్టులకు బదులుగా రొమ్ము స్వీయ పరీక్ష చేయడం సరికాదు.
రొమ్ము స్వీయ పరీక్ష చేసుకునే ముందు, కొన్ని సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. అవేంటంటే:
ఈ సంకేతాలు ఉన్నట్టైతే మీ రొమ్ము లేదా ఛాతీలో ఏదైనా లోపం ఉందని గుర్తించడానికి సూచనలుగా భావించాలి. మీరు రొమ్ము స్వీయ పరీక్ష చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఒక సంకేతం లేదా పలు రకాల మార్పులు ఉన్నట్టైతే వైద్యుల్ని సంప్రదించాలి. శరీరంలోని ఇతర భాగాల లాగానే.. మీరు మీ రొమ్ముల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం అవసరం. ఎందుకంటే రొమ్ములు చాలావరకు దుస్తుల లోపలే ఉంటాయి. కాబట్టి వాటిని మర్చిపోతుంటారు. అయితే.. తరచూ రొమ్ముల పరీక్షలు జరుపుతుండటం ద్వారా మీ శరీరానికి పూర్తి ఆరోగ్యాన్ని అందించవచ్చు. రొమ్ము స్వీయ పరీక్ష చేయడం చాలా సులభం. మీరు స్నానం చేసేప్పుడు లేదా దుస్తులు విప్పేటప్పుడు లేదా దుస్తులు వేసుకునేప్పుడు రొమ్ము స్వీయ పరీక్ష చేసుకోవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: బ్రెస్ట్ సిస్ట్ (రొమ్ము తిత్తి) అంటే ఏమిటి: రకాలు, కారణాలు, లక్షణాలు & చికిత్స
మీ రొమ్ముల్ని చూడటం ద్వారా ఈ విధంగా స్వీయ పరీక్ష చేయొచ్చు.
రొమ్ములో ఏవైనా మార్పులు కనిపించి, కొన్ని రోజుల పాటు ఆ మార్పులు అలాగే ఉన్నట్టైతే వైద్యుల్ని సంప్రదించాలి. రంగు మారడం, నొప్పి కలగడం, రొమ్ము నుంచి ఏదైనా కారుతున్నట్టు కనిపించడం లాంటి మార్పులు ఉన్నట్టైతే తప్పనిసరిగా వైద్యుల్ని కలవాలి.
ప్రతీ రోజూ రొమ్ము స్వీయ-పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి చేస్తే చాలు. ఈ ప్రక్రియ ద్వారా మీ శరీరంలో ఏవైనా మార్పులు సంభవించినట్టైతే సులువుగా గుర్తించవచ్చు. ఈ విధంగా మీరు ముందుగానే డాక్టర్ దగ్గరకు వెళ్లి, ప్రాథమిక స్థాయిలోనే చికిత్స పొందడానికి వీలవుతుంది.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips







గర్భవతిగా ఉన్నప్పుడు బర్గర్: ప్రయోజనాలు, ప్రభావాలు | Burger During Pregnancy Benefits & Effects in Telugu
మీకు ఈవెన్ స్కిన్‌టోన్ కావాలా? అయితే ఈవెన్ స్కిన్ టోన్ సహజంగా పొందేందుకు 5 ఉత్తమ మార్గాలు మీకోసం (Do you want an even skintone? Top 5 best ways to get an even skin tone naturally in Telugu)

అనోమలి (2వ అల్ట్రాసౌండ్) స్కాన్ ఉద్దేశం ఏమిటి? (What is the Purpose of Anomaly 2 Scan in Telugu?)

మూత్రంలో ఎపిథీలియల్ కణాలు

శిశువులు ఎప్పుడు కంటిచూపుని కలుపుతారు (When Do Infants Make Eye Contact in Telugu)?

సర్వైకల్ మ్యూకస్ మెథడ్ (గర్భాశయ శ్లేష్మం పద్ధతి) అంటే ఏమిటి & ఎలా తనిఖీ చేయాలి?