This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your ovulation on mylo app

జంటల కోసం ఫెర్టిలిటీ డైట్ ప్లాన్- ఇది ఉపయోగకరంగా ఉంటుందా మరియు ఇది ఎలా పని చేస్తుంది?

Getting Pregnant
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
జంటల కోసం ఫెర్టిలిటీ డైట్ ప్లాన్- ఇది ఉపయోగకరంగా ఉంటుందా మరియు ఇది ఎలా పని చేస్తుంది?
Likes20 Likes|
Read time5 min

భాగస్వాములు గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తుంటే.. వారు ఏదో కోల్పోయినట్లుగా ఇంకా భావోద్వేగంగా కనిపిస్తూ ఉంటారు. వారు చాలా విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఒవొల్యూషన్ (అండోత్సర్గం) ట్రాక్ చేయడం దగ్గరి నుంచి వారు సరైన డైట్ తింటున్నారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కానీ డైట్ గురించి ఎక్కువగా చింతించకండి. మేము ఈ కథనంలో ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ గురించి మీకు వివరించాం. అసలు ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ అంటే ఏమిటి? అది ఎలా పని పని చేస్తుంది. అందరికీ అది సరైనదా కాదా ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి) డైట్ ప్లాన్ అంటే ఏమిటి?

ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ అనేది మీ సంతానోత్పత్తి అవకాశాలను పెంచేందుకు మరియు మీరు త్వరగా గర్భం దాల్చేందుకు రూపొందించబడిన ఒక నిర్దిష్ట ప్రణాళిక. ఈ డైట్​ ప్లాన్​లో ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారం ఉండవచ్చు. లేదా ఇది మరింత ఆరోగ్యకరమైన ఆహార అలవాటు కావొచ్చు. కొన్ని ఆహార మార్పులు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయని సూచించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మరింత పరిశోధన అవసరం. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఉంటారో వారు ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ తీసుకోవచ్చో లేదో తెలుసుకునేందుకు వారి వైద్యుడితో మాట్లాడాలి.

ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న జంటలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జింక్ మరియు ఫోలేట్ వంటి ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వలన గర్భవతి అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ అనేది మహిళ మెనుస్ట్రువల్ (ఋతుచక్రం) సైకిల్​ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గర్భం దాల్చే అవకాశాలను మరింతగా పెంచుతుంది.

ఫెర్టిలిటీ డైట్ ప్లాన్​లో జంటలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

సంతానోత్పత్తి కోసం ఆహారం తీసుకునేటపుడు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ముందుగా మీరు అన్ని రకాల పోషకాలను సరైన మోతాదులో తీసుకుంటున్నారని నిర్ధారించుకోవాలి. అంటే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకర కొవ్వులను పుష్కలంగా తీసుకోవాలి.

సంతానోత్పత్తి విషయానికి వస్తే సమయపాలన అనేది మరీ ముఖ్యం. మీరు రోజు మొత్తంలో తరచుగా భోజనాలు, ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటున్నారని నిర్ధారించుకోండి. ఏ రకమైన భోజనాన్ని మిస్ చేయొద్దు. ఈ సాధారణ గైడ్ లైన్స్(మార్గదర్శకాలు) మీరు గర్భం దాల్చేందుకు ఉండే అవకాశాలను పెంచుతాయి.

ఫెర్టిలిటీ డైట్​ ప్లాన్​లో ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి?

ఎవరైనా గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తుంటే వారు దూరం పెట్టాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఫెర్టిలిటీ డైట్ ప్లాన్​లో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ వివరంగా ఉంది. తమ సంతానోత్పత్తికి హాని కలిగించే ఎటువంటి ఆహారాలనైనా దూరం పెట్టాలని దంపతులు అనుకోవచ్చు. ఇటువంటి వాటిలో ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్ (ఆహారాలు), కృతిమ తీపి పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్లు మొదలయినవి ఉన్నాయి. ఇంకా ఏం ఏం ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

ఆల్కహాల్ (మద్యం): ఆల్కహాల్ తాగడం వల్ల గర్భం ధరించే అవకాశాలు తగ్గిపోతాయి. ఆల్కహాల్ తీసుకోవడాన్ని పూర్తిగా మానేయాలని సిఫారసు చేయబడినప్పటికీ.. అది సాధ్యం కాకపోతే.. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి.

కెఫిన్: కెఫిన్ కూడా మీరు గర్భం పొందే అవకాశాలను తగ్గిస్తుంది. కాఫీని అమితంగా ఇష్టపడే ప్రజలు కాఫీని తీసుకోవడం తగ్గించాలి. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో కెఫిన్ తీసుకోవడం వలన సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడతాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్: ఎక్కువ మొత్తంలో ప్రిజర్వేటివ్​లు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలు మీ సంతానోత్పత్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. వీలైనంత వరకు పూర్తిగా ప్రాసెస్ చేయని ఆహారాలకే కట్టుబడి ఉండండి.

చెక్కెర: ఎక్కువ చెక్కెర తీసుకోవడం వల్ల అధిక బరువు పెరుగుట మరియు ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఈ రెండు కూడా గర్భం పొందేందుకు ఆటంకాలను ఏర్పరుస్తాయి. చెక్కెరను రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకండి.

జంటలు ఎంతకాలం ఫెర్టిలిటీ డైట్ ప్లాన్​ను అనుసరించాలి?

గర్భం దాల్చే అవకాశాలను పెంపొందించుకోవడం కోసం ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ అనేది ఉత్తమ మార్గం. అయితే ప్రతి జంట భిన్నంగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవడం ముఖ్యం. అందుకే ఎన్ని రోజుల పాటు ఈ డైట్ ప్లాన్ పాటించాలనే విషయం మీద వారు వైద్యుడితో మాట్లాడాలి. సాధారణంగా మీరు గర్భం దాల్చేందుకు కనీసం మూడు నెలల పాటు ఈ ప్లాన్​ను అనుసరించాలని సిఫారసు చేయబడింది. కానీ కొన్ని జంటలు ఎక్కువ రోజుల పాటు ఈ ప్లాన్ పాటించాల్సి ఉంటుంది.

ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ యొక్క కీ కంపోనెంట్స్ (ముఖ్య భాగాలు)

గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న వారు ఏం తింటారనే విషయం ముఖ్యం. ఫెర్టిలిటీ డైట్ అనేది భాగస్వాములిద్దరూ సంతానం కోసం ప్రయత్నిస్తున్నపుడు పాటించడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరుస్తుంది.

ఫెర్టిలిటీ డైట్ ప్లాన్​లో కొన్ని ముఖ్య భాగాలు ఉన్నాయి.. అవేంటంటే

1. తగినంత ఫోలిక్ యాసిడ్​ను పొందండం: ఫోలిక్ యాసిడ్ అనేది ఆకు కూరలు, చిక్కుళ్లు, గింజలు, మరియు రొట్టె, తృణధాన్యాల వంటి ఆహారాల్లో లభించే పోషక పదార్థం. ఫోలిక్ యాసిడ్ అనేది పురుషులు మరియు స్త్రీలు ఇద్దరికీ అవసరమే. ఎందుకంటే ఇది పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. ప్రసవ సమయంలో ఉన్న మహిళలు రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సిఫారసు చేయబడింది.

2. ఆరోగ్యకరమైన కొవ్వులను తినడం: హార్మోన్ల ఉత్పత్తి మరియు ఒవొల్యూషన్ (అండోత్సర్గము) కొరకు ఆరోగ్యకరమైన కొవ్వులు అనేవి చాలా ముఖ్యం. ఆలివ్ ఆయిల్, అవకాడోలు, విత్తనాలు మరియు ధాన్యాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

3. ఒత్తిడి స్థాయిలను నిర్వహించడం (మేనేజ్ చేయడం): ఒత్తిడి అనేది హార్మోన్ల స్థాయిలపై మరియు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. యోగా లేదా ధ్యానం ద్వారా ఒత్తిడిని నిర్వహించుకునేందుకు ప్రయత్నించండి.

చివరగా

ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి) డైట్ ప్లాన్ అనేది గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తున్న జంటలకు ఒక ప్రముఖ ఎంపిక. ఇది ప్రతి ఒక్కరి విషయంలో పని చేస్తుందనే గ్యారంటీ లేనప్పటికీ, గర్భం దాల్చేందుకు ఇది సహాయకారిగా ఉంటుందని చాలా మంది జంటలు కనుగొన్నారు. ఒక జంటకు ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి) డైట్ ప్లాన్ సరైనదో కాదో తెలుసుకునేందుకు మీ డాక్టర్​ను కానీ సంతానోత్పత్తి నిపుణుడితో గానీ మాట్లాడండి.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Nayana Mukkamala
Nayana Mukkamala

Related Articles

Questions about this article

  • Asked when 33 weeks pregnant

    Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me

  • Asked when 7 weeks pregnant

    Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .

  • 26 weeks pregnant

    Baby kicks KB Marta hai Plz tell mi

  • trying to conceive

    PCOD kya hota hai

  • Asked when trying to conceive

    How to detect pcos

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.