
శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందినప్పుడు ఒక స్త్రీ గర్భవతి అవుతుంది. కొన్నిసార్లు ఈ దశలు కలగాపులగం అయిపోయి అసాధారణ ప్రెగ్నెన్సీకి దారితీయవచ్చు. మోలార్ ప్రెగ్నెన్సీ అరుదైన గర్భసంబంధ ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి. ఫలదీకరణం సమయంలో అండం, శుక్రకణం సరిగ్గా కలయిక చెందకుండా ఆరోగ్యకరమైన ప్లేసెంటా బదులుగా క్యాన్సర్ లేని కణితిని ఏర్పరుస్తాయి. అప్పుడు ఈ స్థితి వస్తుంది. ఈ కణితి పెరుగుతున్న పిండానికి అండనివ్వలేదు. అందుకని గర్భస్రావం జరిగిపోతుంది. దీన్ని హైడాతిడిఫార్మ్ మోల్ అని కూడా అంటారు. మామూలు మాటల్లో చెప్పాలంటే.. గర్భాశయంలో ఒక కణితి పెరిగి, ద్రవం నిండిన తిత్తిని (సిస్టు) ఏర్పరుస్తుంది.
మొదటిది పూర్తిస్థాయి మోలార్ ప్రెగ్నెన్సీ, మరొకటి పాక్షికమైన మోలార్ ప్రెగ్నెన్సీ.
పూర్తిస్థాయి మోలార్ ప్రెగ్నెన్సీలో.. ప్లేసెంటా లేదా మావి యొక్క కణజాలం ఒక ద్రవం నిండిన సిస్టుని ఏర్పరుస్తుంది. ఈ కేసులో పిండం అనేదే ఉండదు. అదే పాక్షికమైన మోలార్ ప్రెగ్నెన్సీలో.. రెండు రకాల కణజాలాలు అంటే క్రమ పద్ధతిలోనివి అలాగే క్రమ పద్ధతిలో లేకుండా ఉన్నవి, రెండూ ప్లేసెంటా లేదా మావిలో కన్పిస్తాయి. ఈ కేసులో పిండం ఉండవచ్చు కానీ బతకదు. మోలార్ ప్రెగ్నెన్సీ ఒక అరుదైన క్యాన్సర్ రకానికి దారితీయవచ్చు. అందుకని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయడం అవసరం.
సాధారణంగా.. మొదట్లో మోలార్ ప్రెగ్నెన్సీ కూడా సాధారణ గర్భంలాగానే అన్పిస్తుంది. కానీ ఈ స్థితిలో అత్యంత సాధారణంగా కన్పించే లక్షణాలు ఇవి -
మీకు ఇది కూడా నచ్చుతుంది: కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి?
ఒక ఆరోగ్యకరమైన మనిషి కణంలో.. సాధారణంగా 23 క్రోమోజోముల జతలు ఉంటాయి. సాధారణ ఫలదీకరణంలో అయితే ఒక జతలో ఒక క్రోమోజోము తండ్రి నుండి మరొక క్రోమోజోము తల్లి నుండి వస్తాయి. ఒక పూర్తిస్థాయి మోలార్ ప్రెగ్నెన్సీలో.. ఒక అండంతో ఒకటి కన్నా ఎక్కువ శుక్రకణాలు ఫలదీకరణం చెందుతాయి. తండ్రి యొక్క క్రోమోజోములు నకలు కాబడతాయి. ఫలితంగా తల్లి యొక్క క్రోమోజోములు కన్పించకుండా పోతాయి.
అదే పాక్షిక మోలార్ ప్రెగ్నెన్సీలో.. రెండు శుక్రకణాలు ఒక అండంతో కలుస్తాయి. ఫలితంగా పిండంలో తల్లి నుండి ఒక క్రోమోజోము వస్తుంది. కానీ తండ్రి నుండి రెండు క్రోమోజోములు వస్తాయి. అలా పిండంలో 45 క్రోమోజోములకి బదులుగా మొత్తం 69 క్రోమోజోములు ఉంటాయి.
ఈ ముత్యాల గర్భ స్థితి అభివృద్ధి చెందటానికి సాయపడే ప్రమాద కారకాలు కింద ఇవ్వబడ్డాయి: తల్లి యొక్క వయస్సు- 43 ఏళ్ళ కన్నా ఎక్కువ లేదా 15 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న తల్లులకి మోలార్ ప్రెగ్నెన్సీ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోలార్ ప్రెగ్నెన్సీ యొక్క చరిత్ర- ఒకవేళ ఒక మహిళకి గతంలో మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చిన చరిత్ర ఉంటే, ఆమెకి రెండవసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ రెండవసారి వచ్చే అవకాశం రేటు 1: 100 గా ఉంటుంది.
ఒకవేళ డాక్టరు ముత్యాల గర్భమని అనుమానించినా లేదా గుర్తించినా, వారు ఒక రక్తపరీక్ష అలాగే అల్ట్రాసౌండు పరీక్షని చేయమని సూచిస్తారు.
8 – 9 వారాల సమయంలో పూర్తిస్థాయి మోలార్ ప్రెగ్నెన్సీ స్థితిలో అల్ట్రాసౌండు చిత్రం ఈ కింది లక్షణాలని చూపించవచ్చు-
పాక్షిక మోలార్ ప్రెగ్నెన్సీ యొక్క అల్ట్రాసౌండ్ చిత్రంలో ఈ కింది లక్షణాలని పరిశీలించవచ్చు:
పై ఫలితాలతో మోలార్ ప్రెగ్నెన్సీని నిర్థారించాక, మీ డాక్టరు అదనపు మెడికల్ స్థితుల గురించి పరీక్షిస్తారు. అవేంటంటే:
hCG హార్మోన్ స్థాయి సాధారణంగా ఉందని నిర్థారించుకోవటానికి క్రమం తప్పకుండా రక్తం ఇంకా మూత్ర పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఒకవేళ ఆ హార్మోన్ స్థాయి సాధారణానికి రాకపోతే.. మరింత చికిత్స అవసరపడుతుంది.
మోలార్ ప్రెగ్నెన్సీ లేదా ముత్యాల గర్భం తొలగించబడ్డాక శారీరకంగా అలాగే మానసికంగా కోలుకోవటానికి సమయం పడుతుంది. ఏ తల్లికైనా తన గర్భాన్ని కోల్పోవటం సవాలుగానే ఉంటుంది. మోలార్ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రత్యేకించి శారీరకంగా అలాగే మానసికంగా కోలుకోవటానికి కొంతకాలం పడుతుంది. అందుకని కోలుకోవటానికి తగినంత సమయం ఇవ్వాలి. మీ భావోద్వేగాల గురించి మీ కుటుంబం, స్నేహితులతో పంచుకోవటం మీ దుఃఖాన్ని అధిగమించేలా చేస్తాయి. మీ భావోద్వేగాలని మేనేజ్ చేయటంలో ఇబ్బందిగా అన్పిస్తే, మీ డాక్టరుని లేదా కౌన్సెలర్‌ని సంప్రదించండి.
మీరు ఒకవేళ గర్భవతిగా ఉండి, వికారం, వాంతులు తీవ్రంగా ఉండి, యోని నుండి రక్తం అలాగే ద్రాక్ష పండ్లలాంటి సిస్టులు బయటకి స్రవిస్తూ ఉంటే వెంటనే మా డాక్టరు వద్ద అపాయింట్మెంట్ బుక్ చేయడానికి మమ్మల్ని సంప్రదించండి. సమస్య మరీ సంక్లిష్టంగా మారకుండా నివారించటానికి ముందుగానే గుర్తించడం, దానికి చికిత్స చేయడం చాలా అవసరం. మీరు మైలోఫ్యామిలీలో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా నేరుగానే మమ్మల్ని సంప్రదించవచ్చు.
Yes
No














Hello madam
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |