hamburgerIcon

Orders

login

Profile

STORE
Preg & NewSkin CareHair CareBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Games arrow
  • మీ పిల్లల సంపూర్ణ అభివృద్ధి కోసం ఉపయోగపడే 20 మోస్ట్ పాపులర్ గేమ్స్ ఇవే.. (20 Most Popular Games for Overall Development of Your Baby in Telugu) arrow

In this Article

    మీ పిల్లల సంపూర్ణ అభివృద్ధి కోసం ఉపయోగపడే 20 మోస్ట్ పాపులర్ గేమ్స్ ఇవే.. (20 Most Popular Games for Overall Development of Your Baby in Telugu)

    Games

    మీ పిల్లల సంపూర్ణ అభివృద్ధి కోసం ఉపయోగపడే 20 మోస్ట్ పాపులర్ గేమ్స్ ఇవే.. (20 Most Popular Games for Overall Development of Your Baby in Telugu)

    17 August 2023 న నవీకరించబడింది

    మీ శిశువు నేర్చుకోవాలన్నా, బాగుండాలన్నా, సంపూర్ణంగా అభివృద్ధి చెందాలన్నా ఆటలు ఆడటం చాలా అవసరం. శిశువులు ఆటల ద్వారానే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతారు. ఆటలతోనే ఇతరులతో ఇంటరాక్ట్ అవుతారు. దీంతోపాటు పిల్లలతో ఆడుతుంటూనే వారి గురించి మీరు మరింత తెలుసుకోగలరు.

    మీ పిల్లలతో ఆడుకోవడానికి ఐడియాలు ఇవే (Play ideas with your little one in Telugu)

    మీ పిల్లల సంపూర్ణ అభివృద్ధి కోసం ఉపయోగపడే 20 ప్లే ఐడియాస్ లిస్ట్ ఇక్కడ చూడండి.

    1) ఫేస్ టు ఫేస్ ప్లే (Face-to-face play):

    ఈ ఆటతో మీ పిల్లల విజువల్ స్కిల్స్ పెరుగుతాయి. మీ పిల్లలు మీ కళ్లల్లోకి చూస్తున్నప్పుడు, మీ నాలుకను మెల్లిగా బయటకు తీయండి. ఇలా 15-20 సెకండ్లకు ఓసారి చేయండి. కొంత సమయం పట్టొచ్చు, కానీ తొందర్లోనే మీ బిడ్డ మీ ముఖ కవళికల్ని అనుకరిస్తుంది.

    2) వేర్వేరు వస్తువుల్ని ఇవ్వడం (Feeling different things):

    సాఫ్ట్ టాయ్స్, పుస్తకాలు, వేర్వేరు టెక్స్చర్స్ ఉన్న గిలకలు లాంటి వస్తువుల్ని మీ పిల్లల చేతికి ఇవ్వాలి. వాటిని తాకడం ద్వారా పిల్లలు వేర్వేరు వస్తువుల గురించి తెలుసుకుంటూ ఉంటారు.

    3) ప్రతీ రోజూ టమ్మీ టైమ్ (Give them tummy time every day):

    నవజాత శిశువులు తమ తలను పైకి ఎత్తడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. విభిన్న దృక్పథంతో వస్తువుల్ని చూస్తుంటారు. అయితే ఈ సమయంలో ఏవైనా ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి.

    4) మాట్లాడుతూ ఉండండి (Have a conversation):

    ఈ యాక్టివిటీ వల్ల పిల్లలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. మీరు మాట్లాడుతూ, వాళ్లు కూడా వారి భాషలో మాట్లాడేలా ప్రోత్సహిస్తుండాలి.

    5) సంగీతం ప్లే చేయాలి (Play the music):

    మీ పిల్లలు ఏడుస్తున్నప్పుడు, చికాకుగా కనిపించినప్పుడు ఈ యాక్టివిటీ ట్రై చేయండి. పిల్లల్ని మీరు ఎత్తుకొని మంచి సంగీతం ప్లే చేయండి. మెల్లిగా ఊపుతూ ఉండండి. ఒకవేళ మీరు అలసిపోతే పిల్లల్ని కింద పడుకోబెట్టి మీరు విచిత్రమైన కదలికలతో నవ్వించండి. ఇలాంటివి పిల్లల్ని ఆకట్టుకుంటాయి.

    6) కొన్ని వస్తువుల్ని దగ్గరగా ఉంచుకోండి (Observe Stuff):

    పిల్లలకు కలర్‌ఫుల్‌గా ఉండే వస్తువులంటే చాలా ఇష్టం. పండ్లు, కూరగాయలు, దుస్తులు ఇలా ఏవైనా కావొచ్చు. ఇలాంటి వాటిని మీకు దగ్గరగా పెట్టుకోండి. ఒక అడుగు దూరం నుంచి పిల్లలకు వేర్వేరు వస్తువుల్ని చూపండి.

    7) బబుల్స్ బ్లో చేయండి (Blow Bubbles):

    పిల్లలు తమ చుట్టూ బబుల్స్ కనిపిస్తే ఆకర్షితులవుతారు. పిల్లలకు దగ్గరగా బబుల్స్ ఊదాలి. మీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడాలి. పిల్లలు బబుల్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అవి పగిలిపోతుంటాయి. దీంతో ఏ కారణాలతో ఎలాంటి పరిణామాలు ఉంటాయో వారికి తెలుస్తుంది.

    8) రాకెట్ షిప్ (Rocket Ship):

    మీ పిల్లలు తల పైకి ఎత్తడం నేర్చుకున్న తర్వాత రాకెట్ షిప్ ఆట ఆడొచ్చు. పిల్లల తలపై నుంచి, కిందకు ఆడిస్తూ అసలైన శబ్దాలు చేస్తుండాలి.

    9) టాయ్ క్యాచ్ పట్టడం (Catching Toys):

    ఏదైనా సాఫ్ట్ టాయ్ మీ పిల్లలకు దగ్గరగా రిబ్బన్‌తో కట్టాలి. మీ పిల్లలు ఆ టాయ్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దూరంగా ఊపాలి. ఒకవేళ పిల్లలు ఆ బొమ్మను తాకితే వారిని ప్రశంసించాలి. ఈ ఎక్సర్‌సైజ్‌తో చేతికి, కంటికి సమన్వయం మెరుగవుతుంది.

    10) పప్పెట్స్‌తో ఆడుకోవడం (Playing with Puppets):

    మీరు పప్పెట్ టాయ్స్ కొనొచ్చు లేదా ఇంట్లో పాత గ్లోవ్స్ ఉంటే పప్పెట్‌లా పట్టుకొని పిల్లల్ని ఆడించొచ్చు. వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువు కోసం పెంపుడు జంతువులు: భద్రత, జాగ్రత్తలు & మరిన్ని విషయాలు

    11) డబ్బా ఖాళీ చేయడం (Emptying Boxes):

    చిన్నచిన్న బొమ్మలు, బ్లాక్స్ లాంటివి ఉన్న డబ్బాని ఖాళీ చేయించాలి మళ్లీ నింపేలా చేయాలి. అంటే బాక్స్‌లోని ఒక్కో వస్తువును తీసుకురమ్మనాలి. మళ్లీ అన్నింటినీ బాక్స్‌లో వేయమనాలి.

    12) మినీ అబ్‌స్టాకిల్ కోర్స్ (Mini Obstacle Course):

    కుషన్స్, బ్లాక్ టాయ్స్‌తో మినీ అబ్‌స్టాకిల్ కోర్స్ చేయాలి. అంటే పిల్లలు వెళ్లే దారిలో వాటిని అడ్డం పెడితే పిల్లలు ఒక్కోటి క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు.

    13) పాకే ఆట (Crawl Race):

    పిల్లలు ఎలా పాకుతున్నారో మీరూ అలాగే అనుకరిస్తుండాలి. కొంత దూరం వెళ్లిన తర్వాత మిమ్మల్ని ఓడించేందుకు చిన్నగా తడుతూ ఉండాలి. దీని వల్ల పిల్లల కాళ్లలోని కండరాలు బలపడతాయి.

    14) బిల్డింగ్ బ్లాక్స్ (Building Blocks):

    మీ పిల్లలు కాస్త పెద్దైన తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ గేమ్‌తో పిల్లల జడ్జిమెంట్ మెరుగుపర్చవచ్చు.

    15) ఇమిటేషన్ గేమ్ (Imitation Game):

    మీ పిల్లలు అప్పుడప్పుడూ మిమ్మల్ని అనుకరిస్తూ ఉండొచ్చు. దీన్ని ఓ ఆటగా మార్చాలి. ఫన్నీ యాక్షన్స్‌తో ఈ గేమ్ ఆడాలి.

    16) ఫన్ ఫుడ్ గేమ్ (Fun Food Game):

    మీ పిల్లలు తినడానికి ఇబ్బంది పెడుతున్నారా? అయితే స్పూన్ సాధారణంగా పట్టుకొని పిల్లలు దగ్గరకు వచ్చిన తర్వాత మీ పిల్లలకు ఇష్టమైన శబ్దాలు చేస్తూ వారికి తినిపించాలి.

    17) క్లాపింగ్ గేమ్ (Clapping Game):

    క్లాపింగ్ గేమ్‌తో హ్యాండ్ కో-ఆర్డినేషన్ పెంచవచ్చు. ఇది వారికి థ్రిల్‌గా కూడా ఉంటుంది. నర్సరీ రైమ్స్‌ కలిపి ఈ ఆట ఆడించవచ్చు.

    18) కలరింగ్ (Coloring):

    పిల్లలు పెద్దైన తర్వాత వారికి కలర్స్‌ని పరిచయం చేయాలి. కలరింగ్ చేయించేప్పుడు సరైన పర్యవేక్షణ ఉండాలి. కలరింగ్ వేయడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. మోటార్ స్కిల్స్ మెరుగవుతాయి.

    19) సాఫ్ట్ బాల్ (Soft Boll):

    లైట్ వెయిట్ బాల్‌ను పిల్లలకు దగ్గరగా పెట్టాలి. బాల్‌ను ఊపడం, కాళ్లతో, చేతులతో కదిలించడం లాంటివి చేయించాలి. కాళ్లు, చేతుల కండరాలు బలపడేందుకు ఈ ఆట ఉపయోగపడుతుంది.

    20) పాడండి, ముచ్చట్లు చెప్పండి (Sing, chat, blow raspberries, have fun):

    ఏవైనా పాటలు పాడండి. పిల్లలతో ముచ్చట్లు చెప్పండి. ఇలాంటివన్నీ మీ పిల్లల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. పిల్లలు నర్సరీ రైమ్స్‌ని ఎక్కువగా ఇష్టపడతారు. మీ పిల్లలతో పాటు మీరు ఎంజాయ్ చేస్తూ ఫన్ యాక్టివిటీగా మార్చాలని గుర్తుంచుకోండి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ పిల్లల అభివృద్ది కోసం ముఖ్యమైన గేమ్స్, యాక్టివిటీస్

    Tags:

    Games and activities for your kids in telugu, games for your baby in telugu, brain development games for your baby, brain development activities in telugu, 20 Most Popular Games for Overall Development of Your Baby in English, 20 Most Popular Games for Overall Development of Your Baby in Hindi, 20 Most Popular Games for Overall Development of Your Baby in Tamil, 20 Most Popular Games for Overall Development of Your Baby in Bengali.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    Image related to Developmental Disorders

    Developmental Disorders

    పసిపిల్లల్లో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్ నిర్వహణ ఎలా చేయాలి (Management of Developmental Disorders in Toddlers in Telugu) ?

    Image related to undefined

    మీరు గర్భవతి కావడానికి ఫర్టిలిటీ సప్లిమెంట్లను తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి (Before You Take Fertility Supplements to Get Pregnant in Telugu)?

    Image related to Baby Sleep Management

    Baby Sleep Management

    మీ చంటిబిడ్డ స్వతంత్రంగా (తనకు తానుగా) నిద్రించేలా ఎలా ప్రోత్సహించాలి ( How to Encourage Your Toddler to Sleep Independently in Telugu?)

    Image related to Developmental Disorders

    Developmental Disorders

    పసిపిల్లలలో అభివృద్ధి లోపాలను గుర్తించడం (Identifying Developmental Disorders in Toddlers in Telugu)

    Image related to Toys & Gifts

    Toys & Gifts

    6 వ నెల నుండి పిల్లల బొమ్మలు (Baby Toys from 0-6 Months Onwards in Telugu)

    Image related to Infant

    Infant

    బిడ్డ పుట్టిన తరువాత ఔటింగ్ కి ఎప్పుడు వెళ్లొచ్చు? ట్రిప్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి (Trying to Figure Out What it is the Best Time to Take Your New-born for an Outing: Read this in Telugu)?

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.