hamburgerIcon

Orders

login

Profile

STORE
Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • మీరు గర్భధారణ సమయంలో సస్టెన్ 200 తీసుకోవడం ఎప్పుడు ఆపాలి? (When Should You Stop Taking Susten 200 During Pregnancy in Telugu)? arrow

In this Article

    మీరు గర్భధారణ సమయంలో సస్టెన్ 200 తీసుకోవడం ఎప్పుడు ఆపాలి? (When Should You Stop Taking Susten 200 During Pregnancy in Telugu)?

    Pregnancy

    మీరు గర్భధారణ సమయంలో సస్టెన్ 200 తీసుకోవడం ఎప్పుడు ఆపాలి? (When Should You Stop Taking Susten 200 During Pregnancy in Telugu)?

    3 November 2023 న నవీకరించబడింది

    సస్టెన్ 200 ఎంజి క్యాప్సూల్ ఎన్నో రూపాల్లో తయారు చేయబడుతుంది. దీన్ని ప్రాథమికంగా క్యాప్సూల్స్‌గా తయారు చేస్తారు. ఇది ఫీమేల్ ఇన్‌ఫెర్టిలిటీ, హార్మోన్ల అసమతుల్యత వంటి అనారోగ్యాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వీటితో పాటుగా, ఇది సాధారణంగా ఎక్కువ సార్లు గర్భస్రావాలు అవడాన్ని నిరోధించడానికి, అమెనోరియా, అసాధారణ గర్భాశయ రక్తస్రావం, అడ్వాన్స్డ్ మరియు ఆపరేషన్ చేయడానికి వీలు లేని ఎండోమెట్రియల్ కార్సినోమా - ఇటువంటి వాటికి చికిత్స ను నిర్ధారించడానికి లేదా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రొజెస్టెరోన్ లోపం వల్ల సంభవించే గర్భస్రావం కాకుండా ఉండేందుకు గర్భం దాల్చిన మహిళలకు మొదటి మూడు నెలలు కూడా దీన్ని వాడమని సిఫార్సు చేస్తారు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటీ? దీన్ని ఎలా నయం చేయాలి?

    సస్టెన్ 200 కంపోజిషన్, దానిలోని మూలపదార్ధాలు (Susten 200 Composition And Active Ingredients in Telugu)

    సస్టెన్ 200 క్యాప్సూల్‌లో అండాశయాల ద్వారా స్రవించే సహజ స్త్రీ సెక్స్ హార్మోన్ మాదిరిగానే ప్రొజెస్టెరోన్ అనే మూల పదార్ధం ఉంటుంది. ఇది ఒక్కొక్క క్యాప్సూల్‌లో 200 ఎం.జి చొప్పున ఉంటుంది. దీన్ని నోటి ద్వారా తీసుకుంటారు లేదా ఇది యోని ద్వారా చొప్పించబడుతుంది.

    సస్టెన్ 200 ఎలా పని చేస్తుంది? (How Does Susten 200 Work in Telugu?)

    సస్టెన్ 200 అనేది ఫీమేల్ హార్మోన్ ప్రొజెస్టెరాన్ సప్లిమెంట్‌ గల మృదువైన జెలటిన్ క్యాప్సూల్. ఒక మహిళ తగినంత ప్రొజెస్టెరాన్ ఉత్పత్తి చేయకపోతుంటే, దానివల్ల పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, గర్భధారణ సమయంలో ఇబ్బందులు కలగటం వంటివి జరుగుతాయి. ఈ సప్లిమెంట్ సహజమైన ప్రొజెస్టెరాన్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. గర్భధారణ ప్రారంభ సమయంలో యోని, గర్భాశయంలో మార్పులను ప్రేరేపించడం వంటివి చేస్తుంది. ఇది గర్భాశయం గోడ గట్టిపడటాన్ని నిరోధించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ అభివృద్ధి అయ్యే ముప్పును కూడా తగ్గిస్తుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మెటా టైటిల్: రొమ్ము క్యాన్సర్, రకాలు, కారణాలు మరియు లక్షణాలు

    సస్టెన్ 200 ఉపయోగాలు, ప్రయోజనాలు (Susten 200 Uses And Benefits in Telugu)

    ప్రొజెస్టెరాన్ హార్మోన్ తక్కువ అవడం వల్ల పీరియడ్స్‌లో వచ్చే అనారోగ్యాలను క్రమబద్ధీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా, ఈ క్రింది అనారోగ్యాలకు కొంతవరకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు:

    • అమెనోరియా: సస్టెన్ 200 అనేది వారి శరీరంలో ప్రొజెస్టెరాన్ లేకపోవడం వల్ల గర్భం వచ్చే వయస్సులో ఉన్న స్త్రీలలో అమెనోరియా చికిత్సకు ఉపయోగిస్తారు.
    • మెనోపాజ్ తరువాత చేసే హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ: మెనోపాజ్‌లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ తగ్గడం వల్ల కలిగే బాధను తగ్గించడానికి సస్టెన్ 200 మెనోపాజ్ తరువాత చేసే హార్మోన్ రీప్లేస్‌మెంట్ చికిత్సలో ఉపయోగిస్తారు.
    • అవాంఛిత గర్భాశయ రక్తస్రావం: గర్భం వల్ల గానీ గర్భస్రావం వల్ల కాకుండా హార్మోన్‌ల స్థాయిలలో మార్పుల కారణంగా సంభవించే అవాంఛిత రక్తస్రావాన్ని అరికట్టడానికి చేసే చికిత్సగా కూడా దీన్ని ఉపయోగిస్తారు.
    • గర్భధారణ సమయంలో ప్రొజెస్టెరాన్ లోపం: సస్టెన్ 200 క్యాప్సూల్ గర్భస్రావాల నివారణకు, లూటల్ ఫేజ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయిలు అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉన్న వారిలో ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగిస్తారు. అయినప్పటికీ, రెండవ త్రైమాసికంలోను, మూడవ త్రైమాసికం తరువాత దీనిని వాడమని సిఫారసు చేయరు.
    • ప్రీమెన్సుట్రువల్ సిండ్రోమ్: ఈ టాబ్లెట్‌ను పీరియడ్స్‌లో భాగంగా సెక్స్ హార్మోన్ స్థాయిలలో కలిగే కాలానుగుణ మార్పుల వల్ల కలిగే లక్షణాల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు.
    • ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా: ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియాలో, ప్రొజెస్టెరాన్ అసమతుల్యత, అధిక రక్తస్రావం లేదా పీరియడ్స్ మధ్య అడపాదడపా రక్తస్రావం జరగకుండా నిరోధించడానికి సస్టెన్ క్యాప్సూల్ ఉపయోగిస్తారు.
    • గర్భనిరోధకంగా: గర్భనిరోధకత కోసం ఈ క్యాప్సూల్‌ని యోనిలోకి కూడా చొప్పించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలో సస్టెన్ 200 టాబ్లెట్ ఉపయోగాలు: ఇది ఎందుకు సూచించబడుతుంది?

    సస్టెన్ 200 క్యాప్సూల్స్ యొక్క కొన్ని ప్రయోజనాలు:

    1. హార్మోన్స్ రీప్లేస్‌మెంట్ థెరపీ: వేడి ఆవిర్లు రావటం, రాత్రిపూట చెమటలు పట్టటం, మూడ్ స్వింగ్‌లు, యోని పొడిగా అవ్వటం, సెక్స్ పట్ల విరక్తి వంటి మెనోపాజ్ లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు ఈ థెరపీని ఉపయోగిస్తారు. మెనోపాజ్ చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది కాబట్టి ఈ చికిత్స వల్ల మీ రోజువారీ జీవితంలోను, మానసిక స్థితిలోను చాలా మార్పు వస్తుంది. ఈ చికిత్సలో ఉపయోగించే రెండు క్లిష్టమైన హార్మోన్లు ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్. డాక్టర్ సలహా తీసుకోండి. అయితే, ఇది మీ అన్ని లక్షణాలకు చికిత్స చేయకపోవచ్చు. డాక్టర్ సూచించినంత కాలం ఈ మందులు తీసుకోండి.

    2. ఫీమేల్ ఇన్‌ఫెర్టిలిటీ చికిత్స: సస్టెన్ సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్‌లో ప్రొజెస్టెరాన్ ఉంటుంది, ఇది అండోత్సర్గాన్ని, ఋతుక్రమాన్ని నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెనోపాజ్‌ దశకు రాకపోయినా కూడా శరీరంలో సహజ ప్రొజెస్టెరాన్ లేకపోవడం వల్ల పీరియడ్స్ రాని మహిళల్లో ఋతుక్రమాన్ని ప్రేరేపించడానికి దీన్ని ఉపయోగిస్తారు. గర్భాశయం గోడను మందంగా మార్చడం ద్వారా, ఈ మందు గర్భాశయాన్ని గర్భం కోసం సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల గర్భధారణ విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇది ప్రభావవంతంగా ఉండాలంటే, దానిని సూచించిన విధంగా వినియోగించాలి. మీరు గర్భవతి అయిన తర్వాత కొంత కాలం పాటు ఈ మందు వాడమని చెప్పవచ్చు.

    సస్టెన్ 200 సైడ్ ఎఫెక్ట్స్ (Susten 200 Side Effects in Telugu)

    సస్టెన్ 200 కొన్ని అవాంఛిత దుష్ప్రభావాలు, ఇంకా వాటి ప్రభావాలకు కారణం కావచ్చు. అటువంటి సందర్భాలలో మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. మీకు ఈ క్రింది దుష్ప్రభావాలలో ఏవైనా ఉంటే మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి:

    • మలబద్ధకం, గ్యాస్
    • ముక్కు కారడం
    • మూడ్ స్వింగ్స్
    • వాంతులు లేదా విరోచనాలు
    • తలనొప్పి, తీవ్రమైన దగ్గు
    • కండరాలు లేదా కీళ్ల నొప్పి
    • రొమ్ములో నొప్పి
    • బ్రౌన్ లేదా వైట్ డిస్‌చార్జ్
    • జ్వరం, వేడి ఆవిర్లు
    • మైకము, మగత
    • బరువు పెరగడం లేదా తగ్గడం
    • తలనొప్పి, మూర్ఛలు
    • యోనిలో దురద, మంట, పొడిగా ఉండటం
    • పుండ్లు పడడం
    • మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేదా స్ట్రోక్
    • హార్మోన్ రీప్లేస్‌మెంట్ ‌థెరపీలో ప్రొజెస్టెరాన్‌ను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల రొమ్ము క్యాన్సర్
    • అలెర్జీ, చర్మం పై దద్దుర్లు
    • కండరాలు, కీళ్ల నొప్పులు

    సస్టెన్ 200 తీసుకోవలసిన మోతాదు (Susten 200 Dosage in Telugu)

    సస్టెన్ 200 తీసుకోవలసిన మోతాదు, వాడవలసిన విధానం చికిత్స పొందుతున్న వ్యక్తికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండవచ్చు. సరైన మోతాదు, వాడవలసిన విధానం, సమయం, వ్యవధిని తెలుసుకోవడానికి మీ డాక్టర్‌ని సంప్రదించండి.

    సస్టెన్ 200కి వైరుధ్యాలు (Contradictions For Susten 200 in Telugu)

    ఈ క్యాప్సూల్ ఈ క్రింది ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి సిఫార్సు చేయకూడదు:

    • అలెర్జీ: మీకు దానిలోని మూల పదార్ధం ప్రొజెస్టెరోన్ అలెర్జీ చరిత్రను కలిగి ఉంటే, సస్టెన్ 200 సిఫార్సు చేయబడదు. క్యాప్సూల్‌లో వేరుశెనగ నూనె ఉండవచ్చు. కాబట్టి వేరుశెనగ అంటే అలెర్జీ ఉన్న రోగులకు ఇది మంచిది కాదు.
    • రొమ్ము క్యాన్సర్: క్యాన్సర్ ఉన్నా లేదా ఉందనే అనుమానం ఉన్న రోగులకు ఇది మంచిది కాదు.
    • అసాధారణ రక్తస్రావం: మీకు అసాధారణమైన గోధుమ రంగు రక్తస్రావం అవుతుంటే మీ డాక్టర్ తెలియజేయండి, సస్టెన్ 200 క్యాప్సూల్స్‌ను ఉపయోగించవద్దు.
    • గుండె జబ్బులు: స్ట్రోక్, గుండెపోటు లేదా థ్రోంబోఎంబోలిజం వంటివి ఉన్న రోగులు ఉపయోగించడం మంచిది కాదు.
    • గర్భస్రావం: మీకు తరచుగా గర్భస్రావాలు అవుతున్నా, అసంపూర్ణ గర్భస్రావం అయినా లేదా గర్భస్రావం తప్పిన చరిత్ర ఉంటే ఇది సిఫార్సు చేయరు.
    • కాలేయ సమస్య: కాలేయ పనితీరు బలహీనపడిన వారికి లేదా కాలేయ వ్యాధుల వంటి కాలేయ సమస్యలతో బాధపడుతున్న రోగులలో ఉపయోగించడానికి సస్టెన్ సిఫారసు చేయరు.

    సస్టెన్ 200 తీసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు (Precautions While Taking Susten 200 in Telugu)

    మీరు ఇతర మందులను తీసుకుంటే సస్టెన్ 200 యొక్క ప్రభావాలు మారుతాయి. ఉదాహరణకు, ఇది దుష్ప్రభావాల ప్రమాదాన్ని పెంచుతుంది లేదా మందు ప్రభావవంతంగా పని చేయకపోవచ్చు. ఔషధ పరస్పర చర్యలను నివారించడానికి, నిర్వహించడానికి డాక్టర్ సహాయం చేయవచ్చు.

    మీరు గర్భవతి అయినా, లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, మీ డాక్టర్‌కి తెలియజేయండి

    రొమ్ము స్కాన్, గైనకాలజీ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోండి

    సస్టెన్ తీసుకోవడం వల్ల కొన్నిసార్లు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది

    ఇది పిల్లలు ఉపయోగించడం సురక్షితం కాదు

    రక్తం గడ్డకట్టడం, కాలేయ పనితీరు, థైరాయిడ్ పనితీరు పరీక్షలు వంటి వైద్య పరీక్షలు చేయించుకునే ముందు సస్టెన్ 200 ఎంత మోతాదులో తీసుకుంటున్నారనే దాని గురించి డాక్టర్‌కి తెలియజేయండి, ఎందుకంటే దీనివల్ల పరీక్షకు అంతరాయం కలుగుతుంది, సరైన ఫలితాలు రావు.

    గర్భధారణ సమయంలో సస్టెన్ యొక్క ఉపయోగాలు (Uses Of Susten During Pregnancy in Telugu)

    సస్టెన్‌లో ఫీమేల్ హార్మోన్ ప్రొజెస్టెరాన్‌ ఉంటుంది, ఎందుకంటే ఈ హార్మోన్ లోపం వంధ్యత్వానికి దారితీయవచ్చు, దీనిని ఇన్‌అడిక్వేట్ లూటియల్ ఫేజ్ ఇన్‌ఫెర్టిలిటి అని అంటారు. ఇది ఐవిఎఫ్ వంటి సహాయక పునరుత్పత్తి పద్ధతులకు లోనయ్యే సంతానం లేని స్త్రీలు ఉపయోగించడం కోసం ఆమోదించబడింది. అనేక నివేదికలను బట్టి, ఈ మందు సూచించబడకపోయి ఉంటే గర్భాశయంలోనే బిడ్డ మరణించడం లేదా యాదృచ్ఛిక గర్భస్రావం సంభవించవచ్చు. దురదృష్టవశాత్తూ, అనేక సంస్థల దూకుడు, తరచుగా ప్రోత్సాహక ఆధారిత ప్రచార పద్ధతులచే ప్రభావితమై, భారతదేశంలో చాలా మందులు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. మీకు ప్రొజెస్టెరాన్ లోపం లేకుంటే, సస్టెన్ తీసుకోకూడదు.

    గతంలో కొంతమంది వైద్యులు పునరావృత గర్భస్రావం లేదా గర్భస్రావం కోసం దీనిని సిఫార్సు చేశారు. అయినప్పటికీ, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉన్నట్లు ఋజువు లేదు. కాబట్టి మేము గర్భధారణ ప్రారంభంలో దీనిని ఉపయోగించకూడదని సలహా ఇస్తున్నాము. ఈ మందు వల్ల ఒక సమస్య ఏమిటంటే, ఆడ శిశువులు ముఖంపైన, ఛాతీ పైన అతిగా వెంట్రుకలు పెరగడం – అంటే హిర్సుటిజంతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా, దీనిని తీసుకునే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. గర్భధారణ సమయంలో ఉపయోగించడం గురించి చాలా మంది వైద్యులకు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. తల్లి పాలిచ్చేవారికి కూడా ఇది అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది తల్లి పాలలోకి వెళ్ళి శిశువుకు హాని కలిగిస్తుంది.

    సస్టెన్ 200 క్యాప్స్యూల్ ఎలా ఉపయోగించాలి? (How to Use a Susten 200 Capsule in Telugu?)

    మీ డాక్టర్ సూచించినట్లుగా సూచించిన మోతాదులోను, వ్యవధిలోను ఈ మందు తీసుకోండి. నమలడం, పొడి చేయడం లేదా చింపడం వంటివి చేయవద్దు; దాన్ని పూర్తిగా మింగేయండి. ఇది సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలని చెప్తారు. మీరు ఒక మోతాదు తీసుకోవడం మర్చిపోతే వెంటనే గమనించి తీసుకోండి. అయినప్పటికీ, మీకు గుర్తు వచ్చేసరికి దాదాపుగా మీరు మందు వేసుకోవలసిన సమయం మళ్ళీ వచ్చేస్తే, మర్చిపోయిన మోతాదు వేసుకోవడం మానేయండి, డబుల్ డోస్ తీసుకోకండి. మీ రెగ్యులర్ షెడ్యూల్‌కు కట్టుబడి ఉండండి.

    సస్టెన్ 200 క్యాప్స్యూల్ ఎలా పని చేస్తుంది? (How Does Susten 200 Capsule Work in Telugu?)

    ఈ టాబ్లెట్‌లో ప్రొజెస్టెరాన్ అనే ఫీమేల్ హార్మోన్ ఉంటుంది, ఇది గర్భాన్ని నిలిపి ఉంచడానికి, సహాయపడుతుంది. ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల కలిగే ఎండోమెట్రియం (గర్భాశయం యొక్క లైనింగ్) చాలా మందంగా అవడాన్ని నిరోధిస్తుంది.

    ముగింపు (Conclusion)

    సస్టెన్ 200 క్యాప్సూల్స్‌ను హార్మోన్ చికిత్సలో ఉపయోగిస్తారు. స్త్రీలలో తగినంత ప్రొజెస్టెరాన్‌ ఉత్పత్తి అవనప్పుడు దాన్ని నోటి ద్వారా స్త్రీ శరీరంలోకి పంపబడుతుంది. ఇది మెనోపాజ్ యొక్క దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. దీన్ని గర్భనిరోధకంగా కూడా ఉపయోగించవచ్చు. సస్టెన్ 200 తీసుకోవడం వల్ల విరోచనాలు, కడుపు నొప్పి, గ్యాస్, దద్దుర్లు, జలదరింపు, బద్ధకం, వాంతులు, అసౌకర్యం వంటి కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. డాక్టర్లు ఈ మందు నిద్రవేళలో వేసుకుంటే చాలా ఎక్కువ నీటితో పాటు వేసుకోమని సిఫార్సు చేస్తారు. ఈ మందు పిల్లలకు మంచిది కాదు. మీరు గర్భవతిగా ఉన్నట్లయితే లేదా గర్భం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ మందు ఉపయోగించవద్దు. ఇది గర్భధారణ సమయంలో అవాంఛిత దుష్ప్రభావాలను కలిగించవచ్చు. మందులను ఆపడానికి ముందు మీ డాక్టర్ సలహా తీసుకోండి.

    Tags:

    Susten 200 tablets uses in telugu, Susten 200 during pregnancy in telugu, benefits of Susten 200 tablets in telugu, can pregnants use Susten 200 tablets in telugu, side effects of Susten 200 tablets in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Kakarla Sirisha

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.