


Cold & Cough
17 December 2025 న నవీకరించబడింది
మీ బిడ్డ స్కూలు నుండి విపరీతమైన దగ్గుతో వస్తే, జ్వరం కూడా ఉన్నది కాబట్టి జలుబు వల్ల ఇవన్నీ అని మీరు అనుకున్నారు. కొన్నిరోజుల తర్వాత జ్వరమైతే తగ్గిపోయింది కానీ, దగ్గు మాత్రం వారాలపాటు కొనసాగుతోంది.
అయితే మరి జలుబు మాత్రం ఇంకా ఎందుకు ఉంది? అది జ్వరం వల్లనా లేదా మరింకేదైనా కారణం ఉందా? మీరు ఈ కింది విషయాలను గమనించి, దీని గురించి తెలుసుకోవచ్చు.
అలెర్జీలు తుమ్ములు,కళ్లు, ముక్కులలో దురద, మంట, అలాగే గొంతు నొప్పి వచ్చేలా చేస్తాయి, కానీ అలెర్జీతో జ్వరం రాదు. మీ బిడ్డకి ముక్కు కారటం, కళ్లలో దురద, తర్వాత జ్వరం వచ్చాక జలుబు నెమ్మదిగా రావచ్చు. మీ పిల్లల స్నేహితులలో కూడా ఎవరైనా ముక్కు చీదటం లేదా దగ్గటం చేస్తున్నారేమో చెక్ చేయండి. మీ పిల్లలకి వారి స్నేహితుల నుండి కూడా జలుబు వ్యాపించవచ్చు.
జలుబు 1-2 వారాలలో తగ్గిపోతుంది కానీ అలెర్జీలకి తగ్గటానికి మరింత సమయం పడుతుంది. ఒకవేళ మీ బిడ్డకి పుప్పొడి అలెర్జీ ఉంటే, ముక్కులో అలెర్జీ ఏడాది పొడుగునా ఎప్పుడైనా రావచ్చు. ఇలా ఏడాది మొత్తంలో ఎప్పుడైనా వచ్చే అలెర్జీల కారకాలు దుమ్ము, ధూళులలో ఉండే పురుగులు, బూజులు, పెంపుడు జంతువులు అలాగే బొద్దింకలు. వసంత రుతువులో, పువ్వులు, చెట్ల నుండి వచ్చే పుప్పొడి ఎక్కడైనా పడవచ్చు, కాబట్టి ఆ సమయంలో ఒకవేళ మీ బిడ్డ తుమ్మడం లేదా శ్వాస తీసుకుంటున్నప్పుడు శబ్దం రావటం వంటివి జరిగితే అది పుప్పొడి వల్లనే అవుతుంది. అలెర్జీలు అనేవి జీవితంలో ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ బయటి కారకాల వలన వచ్చే అలెర్జీలు సాధారణంగా 4 నుండి 6 సంవత్సరాల వయస్సు మధ్యలో వస్తాయి.
మీ పిల్లల ముక్కులోంచి బయటకి వచ్చే పదార్థాలు అది అలెర్జీనా లేదా ఇన్ఫెక్షనా అని సూచించే మరో ఆధారం అవుతాయి. ఒకవేళ ముక్కులో నుంచి వచ్చే పదార్ధం ఆకుపచ్చని రంగులో, మందంగా ఉంటే అది ఇన్ఫెక్షన్ వలన కావచ్చు, అదే జారుడుగా నీటిలాగా ఉంటే అది అలెర్జీల వలన కావచ్చు. ముక్కు రంధ్రాలలో దిబ్బడ తొలగించడానికి, మీరు ఏదైనా సెలైన్ ద్రావణాన్ని లేదా ఫ్లూటికసోన్ వంటి మెడికల్ షాపులో ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా దొరికే మందులని ఉపయోగించవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అప్పుడే పుట్టిన పసిబిడ్డలలో కండ్లకలక (పింక్-ఐ)
ఒకవేళ మీకు లేదా మీ భాగస్వామి/భర్తకి అలెర్జీలు ఉంటే, మీ బిడ్డకి అలెర్జీలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని జన్యుపరమైన స్థితిగా పరిగణించవచ్చు.
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











పసిబిడ్డల ఎదుగుదల: పసిపిల్లలలో హఠాత్తు వేగంతో జరిగే ఎదుగుదల దశలు (గ్రోత్ స్పర్ట్స్) ఎప్పుడు వస్తాయి (Baby Growth: When do Growth Spurts Occur in Babies in Telugu) ?

గర్భవతులు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? | Should Pregnant Women Get Flu Shots in Telugu

లాపరోస్కోపిక్ అండాశయ డ్రిల్లింగ్: PCOS-సంబంధిత వంధ్యత్వానికి సురక్షితమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారం | Laparoscopic Ovarian Drilling in Telugu

మహిళలు బరువు తగ్గేందుకు డైట్ ప్లాన్

When Should You Start Brushing Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu| ఫింగర్ టూత్ బ్రష్‌తో మీ శిశువు పళ్లను బ్రష్ చేయడం ఎప్పుడు మొదలుపెట్టాలి?

ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులకు కారణం ఏమిటి?