


Teething
3 November 2023 న నవీకరించబడింది
సాధారణంగా శిశువుల్లో దంతాలు రావడం 6 నుంచి 12 నెలల మధ్యలో ప్రారంభం అవుతుంది. అయితే కొంత మందిలో ఇది ఆలస్యం కావచ్చు. ఒకవేళ దంతాలు రావడం ఆలస్యమైతే ఎటువంటి దిగులు చెందకండి. ప్రతి బిడ్డ శైలి వేరుగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి. వయసు పరిధి 6 నుంచి 12 నెలల వరకు ఉంటుంది కానీ.. మొదటగా మనకు దంతాలు 14 నెలల సమయంలో కనిపిస్తాయి. మీ శిశువు దంతాల సమస్య గురించి మీరు ఆందోళన చెందుతుంటే మీ ఆరోగ్యనిపుణుడితో మాట్లాడండి.
ఈ మొత్తం కాలవ్యవధి 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మీ బిడ్డకు రెండు లేదా మూడు సంవత్సరాలు వచ్చేసరికి వారికి 20 దంతాలు ఉంటాయి. 6 లేదా 7 సంవత్సరాల వయసులో ఈ దంతాలు ఊడిపోతాయి. వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి. మొత్తం 32 దంతాలు కనిపించేందుకు చాలా సంవత్సరాల కాలం పడుతుంది.
దంతాలు ఎటువంటి లక్షణాలు లేకుండా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దంతాల లక్షణాలు మూడు, నాలుగు రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి.
దంతాలు కనిపించినపుడు ఈ కింది లక్షణాలు ఉంటాయి.
1. తక్కువ జ్వరం: దంతాల వల్ల శరీర ఉష్ణోగ్రత కొంత మేర పెరుగుతుంది. కానీ ఇది 101 డిగ్రీలకు చేరుకునే అవకాశం లేదు. ఒక వేళ మీ శిశువు ఉష్ణోగ్రత 101 డిగ్రీలు లేదా 100.4 డిగ్రీలకు చేరుకుంటే (శిశువు వయసు 3 నెలల లోపు ఉన్నపుడు), జ్వరానికి గల కారణం ఏంటో తెలుసుకునేందుకు మీ వైద్యుడిని సంప్రదించండి.
2. నమలడం: మీ శిశువుకు కొత్తగా దంతాలు వచ్చినపుడు వారు తమ సొంత వేళ్లను కూడా కొరుక్కుంటారు. అటువంటి సందర్భాల్లో మీరు మీ శుభ్రమైన వేలుతో మీ శిశువు చిగుళ్లను మసాజ్ చేయొచ్చు. లేదా వారికి కోల్డ్ పాసిఫయర్ (తేనె పీపా లేదా బుగ్గ) ను కొరికేందుకు ఇవ్వండి.
3. ఉబ్బిన చిగుళ్లు: వారి చిగుళ్లు కొంచెం వాపు వచ్చినట్లు ఉండొచ్చు. వారి చిగుళ్ల మీద కనుక మీరు వేలితో రుద్దితే దంతం వచ్చేచోట ఉబ్బెత్తుగా ఉన్నట్లు అనిపించొచ్చు.
4. తినేందుకు నిరాకరించడం: ఈ సమయంలో మీ బిడ్డ ఏమీ తినేందుకు ఇష్టపడదు. కానీ మీరేం దిగాలు చెందకండి. ఈజీగా మింగేందుకు అవకాశం ఉన్న ఆహారపదార్థాలను అందించండి. మీ బేబీకి సరైన పోషకాహారం అందిందో లేదో నిర్ధారించుకోండి.
5. ఎక్కువ డ్రూలింగ్ (చొంగ కారడం): సాధారణంగా ఈ సమయంలో శిశువులు ఎక్కువ డ్రూల్ చేస్తారు. చిగుళ్ల చికాకును తగ్గించుకునేందుకు అదనపు లాలాజలాన్ని సృష్టిస్తారు. ఇదే డ్రూలింగ్కు కారణం.
6. క్రాంకినెస్ (గజిబిజిగా ఉండడం): శిశువులు నొప్పి వల్ల ఈ కాలంలో క్రంకీగా ఉంటారు. శుభ్రమైన చేతులతో వారి చిగుళ్లను తరుచూ మసాజ్ చేయడం ద్వారా లేదా ఏదైనా మెత్తటి బొమ్మ ఇవ్వడం ద్వారా వారి నొప్పిని తగ్గించేందుకు ప్రయత్నించండి.
7. తరుచూ మేల్కొలపడం (ముఖ్యంగా రాత్రి సమయాల్లో): దంతాలు వచ్చే సమయంలో రాత్రిళ్లు శిశువులు తరచుగా తల్లులను నిద్రలేపి దంతాల గుర్తులను చూపిస్తారు. పెరుగుతున్న పళ్ల వల్ల ఏర్పడే అసౌకర్యం వలన ఇలా చేస్తారు. వారి పళ్ల సమస్యను తగ్గించేందుకు మీరు వారికి సాయం చేయండి. మీకు తెలిసిన ప్రతి ఉపాయాన్ని వారు నొప్పిని తగ్గించేందుకు ట్రై చేయండి. పంటి సమస్యల నుంచి వారు ఉపశమనం పొందేలా చేయండి.

Baby Toothbrush - Blue - Pack of 2
Silicone Finger Toothbrush & Tongue Cleaner | Relieves Teething Discomfort | BPA Free
₹ 245

4.4
(1299)


8776 Users bought
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)