


Scans & Tests
21 January 2026 న నవీకరించబడింది
ఒకరికి ఎప్పుడైనా సరే వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక వ్యాధి వారికి ఉందో లేదో నిర్ధారించుకోవడం ఎలా? దీనిని స్క్రీనింగ్ టెస్ట్ సహాయంతో చేయొచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ముందస్తుగా గుర్తించడం. సాధారణంగా ఒక నిర్దిష్ట వ్యాధి సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చాలా మంది మహిళలు 50 సంవత్సరాల వయసులో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటారు. సాధారణంగా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం కోసం ఇది చేస్తారు.
స్త్రీలు యుక్తవయసు వచ్చినప్పటి నుంచి వారి శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ప్రతీ నెల రుతుచక్రం వల్ల స్త్రీ శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. వివిధ కారణాల వల్ల హార్మోన్ల స్రావంలో అసమతుల్యత ఉండవచ్చు. అందువల్ల తరచుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
అందుకు అవసరమైన కొన్ని పరీక్షలు ఇక్కడ ఉన్నాయి.
T4, T3, మరియు TSH అనేవి కీలకమైన హార్మోన్లు. థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియల ఉత్పత్తికి మరియు నియంత్రణకు సహకరిస్తుంది. మీకు థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నపుడు మీకు హైపోథైరాయిడిజం ఉంటే మీ జీవక్రియ మందగించవచ్చు. మరియు మీ శరీర పని తీరు ప్రభావితం అవుతుంది. అలసట, పొడి చర్మం, బరువు పెరగడం అనేవి కొన్ని లక్షణాలు. ఇంకా వేరే పరిస్థితుల్లో, హైపర్ థైరాయిడిజం వల్ల మీ గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, బరువు తగ్గడం, నిద్రలేమి వంటి సమస్యలు కలుగుతాయి.
పెరుగుతున్న ఒత్తిడితో ప్రతీ ఒక్కరిలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. హార్మోన్ల మార్పు, కొలెస్ట్రాల్, అధిక బరువు, గర్భం అనేవి రక్తపోటును ప్రేరేపించే ఇతర కారకాలు.. మైకం, మూర్చ, డీ హైడ్రేషన్ (నిర్జలీకరణం) అధిక చెమట వంటి వాటిని నిత్యం గమనిస్తూ ఉండాలి. ఇవి తరచూ వస్తుంటే రక్తపోటు పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి.
లిపిడి ప్యానెల్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మీ కొవ్వు స్థాయిలను మరియు ట్రైగ్లిసరైడ్ స్థాయిలను గుర్తించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ ఇది మహిళలకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు. మీకు అధికంగా కొవ్వు ఉంటే మీ ధమనుల్లో చేరి అవి బ్లాక్ (నిరోధించడం) కావొచ్చు. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కొవ్వు స్థాయిలు పెరిగితే మనకు ఎటువంటి లక్షణాలు కనబడవు. ఇది కేవలం పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది.
వయసు పెరిగే కొద్దీ మీ శరీరం మార్పులకు లోనవుతుంది. ప్రతి ఒక్కరూ నిరంతరం కార్సినోమిక్ (ఒక రకమైన ఔషధం) ఏజెంట్లకు గురవుతున్నారు. మమ్మల్ని నమ్మడం లేదా? మీరు ఎండలో ఎప్పుడూ బయటకి వెళ్లలేదా? UV రేడియేషన్లు కూడా క్యాన్సర్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నందున మీ వయసులో తరచుగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు సిఫారసు చేయబడ్డాయి. మరీ ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న రోగులకు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇందులో జన్యుపరంగా అనుమానస్పద రోగులు, పొగ మరియు పొగాకు ద్వారా ప్రమాదం ఉన్న వారు, ఇంతకు ముందు క్యాన్సర్ ఉన్న రోగులు కూడా ఉండవచ్చు. CT స్కాన్లు, బోన్ స్కాన్లు, MRI స్కాన్లు, పెట్ స్కాన్ల వంటివి కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ స్కాన్లు.
క్యాన్సర్‌ను గుర్తించేందుకు అంకాలజిస్ట్‌లు ప్రముఖంగా ఉపయోగించే పరీక్షల పేర్లు ఇక్కడ ఉన్నాయి.
పాలిప్స్ (చిన్న గడ్డలు) విషయంలో ప్రారంభ కణతులను గుర్తించేందుకు మరియు తొలగించేందుకు కొలొనోస్కోపిని ఉపయోగిస్తారు.
ఈ ప్రామాణిక పరీక్ష ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తిస్తుంది. ముఖ్యంగా పొగ ఎక్కువగా తాగే వారిలో..
ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షను ఆడవారికి సాధారణంగా ఉపయోగిస్తారు. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఇది సహాయపడుతుంది.
ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తిస్తారు.
మీకు దగ్గర్లోని వైద్యుడి వద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష గురించి మరింత తెలుసుకోండి. మరియు దానిని ఈ రోజే పూర్తి చేయండి.
స్క్రీనింగ్ పరీక్షలు శరీరానికి ఎటువంటి హాని కలిగించవు. ముఖ్యంగా మీ వయసులో ఉన్నపుడు ప్రతి ఏడాది ఒక్కసారైనా పూర్తి శరీరాన్ని స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడం అవసరం. స్త్రీలలో తరచుగా హార్మోన్ల హెచ్చు తగ్గులు సంభవిస్తాయి. దీని వలన వ్యాధులు వ్యాపిస్తాయి. అటువంటి సమయంలో స్క్రీనింగ్ పరీక్షలు ఎంతో ముఖ్యమైనవి.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips







యాపిల్ సిడార్ వెనిగర్ వాడకం వల్ల కలిగే దిమ్మతిరిగే ప్రయోజనాలు.. ఓ సారి చూడండి!

క్రెడిల్ క్యాప్(చిన్నారి తల మీద డాండ్రఫ్లా తయారవడం), చిన్నారుల్లో క్రెడిల్ క్యాప్, క్రెడిల్ క్యాప్‌కు చికిత్స, క్రెడిల్ క్యాప్‌ను తగ్గించే పద్ధతులు, అసలు క్రెడిల్ క్యాప్ అంటే ఏమిటి?

సేబాషియస్ సిస్ట్ (తైలాగ్రంథి తిత్తులు) - కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

మీ శిశువు పగటిపూట కునుకు తీయడానికి నిరాకరించినప్పుడు ఏమి చేయాలి? (What to Do If Your Child Refuses to Take a Nap in Telugu?)

సి-సెక్షన్ తర్వాత బరువు తగ్గడం: తక్షణ చిట్కాలు మరియు డైట్ ప్లాన్

కడుపుతో ఉన్నప్పుడు ఉల్లిపాయలు తినడం: ప్రయోజనాలు & దుష్ప్రభావాలు