

Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
బాడీ పాలిషింగ్ అనేది మీతో మీరు కాస్త విలాసంగా హాయిగా, తిరిగి గొప్పగా ఫీలవటానికి సరైన మార్గం. ఇది పూర్తి-శరీరానికి సంబంధించిన ట్రీట్మెంట్, ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది అలాగే తిరిగి సజీవమైన అనుభూతిని తిరిగి తెస్తుంది. ఇది స్పా ఇంకా కాస్మెటిక్ సేవల యొక్క చక్కని సమ్మేళనం, కాబట్టి మహిళలు రెండు ప్రపంచాలకి సంబంధించిన మేటి విషయాలని పొందవచ్చు!
బాడీ పాలిషింగ్ అనేది ఒక రకమైన పూర్తి శరీరానికి చెందిన ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియ, ఇది చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది, కణాలు తిరిగి ఉత్పత్తి అవటాన్ని ప్రోత్సహిస్తుంది అలాగే చర్మానికి కాంతిని కూడా అందిస్తుంది. ఇది ఫేషియల్ చేయించుకోవడంలాంటిదే, కానీ మొత్తం శరీరానికి చేయడం జరుగుతుంది! ఈ ప్రక్రియలో చర్మానికి హైడ్రేషన్ అందించటంపై దృష్టిపెట్టే ఏడు స్టెప్పులు ఉంటాయి. వివిధ ఫలితాల కోసం ఒక్కో స్టెప్పులో వేర్వేరు కాస్మెటిక్ ఉత్పత్తులు ఉపయోగించబడతాయి.
బాడీ పాలిషింగ్ యొక్క లాభాలు చాలా ఉంటాయి. కానీ తరచుగా చర్చించబడవు. ఇంట్లో చేసుకునే ఒక సాధారణ బాడీ పాలిషింగ్ ఎలా మీకు తిరిగి సజీవమైన అనుభూతినిస్తుంది, అలాగే శక్తినిస్తుంది అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
బాడీ పాలిషింగ్ ప్రక్రియ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేసి చర్మం యొక్క పై పొర నుండి మృత చర్మకణాలని తొలగిస్తుంది. ఇది మృదువైన, తాజా లుక్ని ఇస్తూ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
మాయిశ్చరైజర్లు అలాగే ఇతర చర్మ సంబంధ ట్రీట్మెంట్లు ప్రభావవంతంగా పనిచేయాలంటే, అవి చర్మం యొక్క రంధ్రాల వరకూ వెళ్ళి, చొచ్చుకుపోవాలి. బాడీ పాలిషింగ్ చర్మం యొక్క రంధ్రాలను తెరుస్తుంది, చర్మం కేవలం పాలిష్ నుండి మాత్రమే కాకుండా ఇతర చికిత్సల నుండి కూడా పోషకాలను గ్రహించేలా చేస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడంలో బాడీ పాలిషింగ్ మంచి పద్ధతి. ఇది చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా నివారిస్తుంది, కణాల పెరుగుదలని ప్రోత్సహిస్తుంది, అలాగే వయస్సు మీదబడే లక్షణాలని తగ్గిస్తుంది. చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా, హైడ్రేటడ్గా ఉంచుతూ, అది చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
బాడీ పాలిష్ని వాడటం వలన, చర్మం యొక్క ఉపరితలంపై కొత్త కణాల పొర బయటకి వస్తుంది, అదే సమయంలో కొత్త కణాల పెరుగుదలని ప్రోత్సహిస్తుంది
చర్మం యొక్క రంధ్రాలు మలినాలకి, దుమ్ముకి సంబంధించిన చిన్న చిన్న అయస్కాంతాలలాగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ ధూళిని తొలగించకపోతే, అది చర్మంపై మంట అలాగే మొటిమల వంటి సమస్యలకి దారితీయవచ్చు. బాడీ పాలిష్ ఈ దుమ్ము ధూళిని బయటకి లాగి తొలగించటంలో సాయం చేస్తుంది, రంధ్రాలని శుభ్రపరుస్తుంది!
చర్మం లోపల పెరిగే వెంట్రుకలు సాధారణమైన, చికాకుపెట్టే సమస్య. ముఖ్యంగా ట్వీజింగ్ లేదా షేవింగ్ చేసినప్పుడు ఈ సమస్య మరింత చికాకుపెడుతుంది. ఇవి నొప్పి కలిగించవచ్చు, దురద పెడతాయి అలాగే వదిలించుకోవటం కూడా కష్టం. బాడీ పాలిష్ని వాడటం వలన అసలు చర్మం లోపల వెంట్రుకలు పెరగటమే మొదట తగ్గిపోతుంది!
మాయిశ్చరైజర్లు చర్మ ఆరోగ్యానికి మెరుగైన లాభం అంటూ చూపడం లేదు అంటే, చర్మం యొక్క మృత కణాలు పేరుకుపోయి చర్మం మాయిశ్చరైజరుని సరిగ్గా గ్రహించలేకపోవడమే దీనికి కారణం కావచ్చు. బాడీ పాలిష్ ఆ చర్మం యొక్క మృతకణాలని వదిలించుకోవడానికి సహాయపడుతుంది, అలా మీకు ఇది మంచి మాయిశ్చరైజర్ అనుభవాన్ని అందిస్తుంది!
ఏ ట్యానింగ్ ట్రీట్మెంట్ కి అయినా ముందు, మృదువాటి సమమైన చర్మం ఉండటం ముఖ్యం – లేకపోతే ఫలితాలు అంత మంచిగా ఉండవు. బాడీ పాలిషింగ్ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయటంలో సాయపడి, దానిపై పొడిదనాన్ని తొలగించి చర్మాన్ని సమం చేసి ట్యాన్ కి సరిపోయే చక్కని కాన్వాస్ గా మారుస్తుంది.
వెంట్రుకలు మొత్తం పోకుండా మిగిలిపోయినప్పుడు షేవింగ్ పై విసుగు వస్తుంది, అయితే ఇది సాధారణంగా మృతకణాలు పేరుకుపోయిన కారణంగా జరుగుతుంది. షేవింగ్‌కు ముందు బాడీ పాలిష్‌ని ఉపయోగించడం వల్ల దాదాపు పూర్తిగా అలాగే మరింత ప్రభావవంతంగా షేవ్ అవుతుంది!
బాడీ పాలిషింగ్ వలన చర్మం యవ్వనవంతంగా కనిపిస్తుంది. ఇది చర్మాన్ని త్వరగా తాజాగా మారుస్తుంది, మృదువుగా చేస్తుంది, దాని రూపాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా యవ్వన మెరుపును ఇస్తుంది.
బాడీ పాలిషింగ్‌లో మంచి విషయం ఏమిటంటే ఇది ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు. ఎవరైనా సింపుల్గా ఇంటిలో తయారుచేసుకునే (డిఐవై) బాడీ పాలిషింగ్ కిట్‌ను తయారు చేసుకుని చర్మానికి అప్లై చేయవచ్చు. ఈ పద్ధతి మొత్తం స్టెప్పుల వారీగా కింద ఇవ్వబడింది:
1. ఇంట్లో బాడీ పాలిషింగ్ చేసుకోవటానికి ప్యూమిస్ స్టోన్, లూఫా, ఆలివ్ నూనె అలాగే డిఐవై లేదా కొన్న బాడీ పాలిషింగ్ కిట్ వంటి ప్రాథమిక వస్తువులు అవసరం.
2. ఒకసారి కిట్ తయారు అయ్యాక, మీ శరీరాన్ని గోరువెచ్చని నీటితో స్నానం చేసి సిద్ధం చేయాలి.
3. ఆ తర్వాత స్టెప్పులో వెచ్చబెట్టిన ఆలివ్ నూనెని కొద్దికొద్దిగా ఒళ్లంతా రాయాలి.
4. తర్వాత, డిఐవై బాడీ పాలిష్నినెమ్మదిగా లూఫాతో 10 నిమిషాలపాటు చర్మం మొత్తం మసాజ్ చేయాల్సి ఉంటుంది.
5. ప్యూమిన్ స్టోన్ని ఉపయోగించి మోకాలు, మడమలు అలాగే మోచేతుల వంటి కఠినమైన ప్రాంతాలని నెమ్మదిగా స్క్రబ్ చేయాలి.
6. ఆఖరుగా, బాడీ పాలిష్ని గోరువెచ్చని నీటి స్నానంతో కడిగేయవచ్చు. కానీ దాని పోషకాలు నిలిచి ఉండటానికి సబ్బుని వాడకండి.
ఒంటిపై చర్మాన్ని తరచుగా నిర్లక్ష్యం చేస్తాం ఎందుకంటే అది ఎప్పుడూ బయటికి ఎక్కువ కన్పిస్తుంది అలాగే ముఖంపై చర్మంలాగా సులభంగా దెబ్బతగిలే లేదా ముడతలు పడే సంకేతాలను చూపదు. అప్పుడప్పుడు పూర్తి-శరీరానికి స్పాలో ఈ సర్వీసుని బుక్ చేయడం ద్వారా దానికి కావలసిన ప్రేమను అందించటాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఇలాంటి మరిన్ని సమాచారాన్ని అందించే ఆర్టికల్స్ కోసం, మైలో కుటుంబ బ్లాగ్‌ని ఫాలో అవండి.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)