


Breast Lump
3 November 2023 న నవీకరించబడింది
ఈ రోజుల్లో రొమ్ము నొప్పి అనేది సహజం. ఇది సాధారణంగా హార్మోన్ల మార్పుల వల్ల సంభవిస్తుంది. ముఖ్యంగా రుతుస్రావం సమయంలో లేదా కొన్నిసార్లు గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల రొమ్ముల మార్పులతో పాటు నొప్పిగా తయారవుతాయి. అంతే కాకుండా రొమ్ము మార్పు వల్ల అసౌకర్యంతో పాటు నొప్పి కూడా వస్తుంది.
రొమ్ము సమస్యలతో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించేందుకు మంచి క్వాలిటీ గల సపోర్టివ్ బ్రాను ధరించాలి. ముఖ్యంగా మీరు నిద్రపోయే సమయంలో మీరు బ్రా ధరించడాన్ని స్కిప్ (దాటవేయడం) చేయొచ్చు. మరో చిట్కా ఏమిటంటే. మీరు కాఫీతో పాటు ఇతర కెఫిన్ పానీయాలను తీసుకోవడం కూడా తగ్గించండి. మీరు ధూమపానం లేదా మద్యం తాగడం కూడా మానేయాలని అనుకోవచ్చు. మహిళలకు రొమ్ము నొప్పి వచ్చినపుడు ఐస్ ప్యాక్ కూడా ఉపశమనంగా మారుతుంది. పైన పేర్కొన్న చిట్కాలు ఏవి కూడా మీకు ఉపశమనాన్ని కలిగించకపోతే.. మీరు ఏదో ఒక రొమ్ము వ్యాధితో బాధపడే అవకాశం ఉంది. మీ రొమ్ము పరిస్థితిని గురించి తెలుసుకునేందుకు ఈ పరిస్థితిని ఎలా నయం చేయాలో తెలుసుకునేందుకు మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అలా కాకుండా.. మీ రొమ్ము నొప్పి అనేది నార్మల్ కాకపోతే.. మీరు మీ GP (జనరల్ ఫిజీషియన్ (సాధారణ వైద్యుడు))తో మాట్లాడాల్సి ఉంటుంది.
కొన్ని సార్లు మీ రొమ్ము కణజాలంలో ద్రవంతో కూడిన సంచి డెవలప్ అవుతుంది. సాధారణంగా వయసు పైబడిన స్త్రీల రొమ్ములలో ఇది సర్వసాధారణంగా ఏర్పడుతుంది. వయసులో ఉన్న స్త్రీల రొమ్ములలో గడ్డలు ఏర్పడతాయి. వీటి గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ గడ్డలు రాత్రిపూట ఏర్పడతాయి. వీటి వలన పీరియడ్స్ సమయంలో చాలా నొప్పి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే వీటి పరిమాణం పెరుగుతుంది. అంతే కాకుండా ఇవి మరింత నొప్పిని కలుగజేస్తాయి. మీ రొమ్ము ఉపరితలానికి దగ్గరగా గడ్డ ఏర్పడినట్లయితే దానిని ముట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చూస్తే చిన్న పొక్కులా అనిపిస్తూ ఉంటుంది. అయినా ఇది రొమ్ము కణజాలంలోకి లోతుగా ఏర్పడినట్లయితే రొమ్ము కణజాల పొరలు దానిని కప్పి ఉంచడం వలన లోపల ద్రవంతో కూడిన గట్టిముద్దలా అనిపించవచ్చు. ఏదైనా సమయంలో రొమ్ము నొప్పి కలగొచ్చు. ఇటువంటి సమయంలో వైద్యుడిని సంప్రదించి మీ పరిస్థితిని గురించి మరింత తెలుసుకోవడం ఉత్తమం.
ఈ గడ్డలు నేటి మహిళల్లో సర్వసాధారణం. వీటివల్ల ఎటువంటి అపాయం ఉండదు. ఏ వయస్సులో ఉన్న స్త్రీలైనా ఫైబ్రోడెనోమాస్ను అనుభవించొచ్చు. ఈ గడ్డలు నొప్పి లేకుండా ఉంటాయి. ఇవి రొమ్ముల కణజాలాలలో కూడా స్వేచ్ఛగా కదులుతాయి. ఈ గడ్డల పరిమాణాలు మారుతూ ఉంటాయి. మీ రొమ్ము కణజాలాలలో ఇవి ఎక్కడైనా సరే పెరుగుతాయి.
ఈ స్థితిలో ఒక దృఢమైన ముద్ద ఉంటుంది. కానీ ఎటువంటి నొప్పి ఉండదు. దెబ్బతిన్న కొవ్వు కణజాలం కారణంగా ఈ ముద్ద ఏర్పడుతుంది. స్త్రీకి పెద్ద సైజ్‌లో రొమ్ములు ఉంటే లేదా ఆమె రొమ్ముల మీద గాయాలు కానీ దెబ్బులు కానీ ఉంటే ఆ స్త్రీ ఫ్యాట్ నెక్రోసిస్తో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ గడ్డలు ప్రాణాంతకమైనవి కానందున మీరు క్యాన్సర్ వస్తుందా? అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్యాట్ నెక్రోసిస్ అనేది మీ రొమ్ము మీద ఉన్న క్యాన్సర్ గడ్డకు రేడియేషన్ థెరపీ చేసిన తర్వాత రావొచ్చు. ఆ ముద్దను తొలగించడం అవసరమా? కాదా? అని నిర్ణయించేందుకు మీ వైద్యుడు ఒక పరీక్షను నిర్వహిస్తాడు.
కొన్ని సార్లు రొమ్ము కణజాలాలు ఊహించని విధంగా పెరుగుతాయి. వీటివల్ల ఊహించని నొప్పి వస్తుంది. ఈ పరిస్థితిని స్ల్కెరోసింగ్ అడెనోసిస్ అని అంటారు. వీటి పెరుగుదల చిన్నగా ఉన్నప్పటికీ మామోగ్రామ్స్ ద్వారా చూసినపుడు ఇవి చాలా పెద్దగా స్పష్టంగా కనిపిస్తాయి. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో గడ్డలు మరియు పాలనొప్పికి కూడా ఈ పరిస్థితులు కారణం అవుతాయి.
ఈ పరిస్థితిని సాధారణంగా ఫైబ్రోసిస్టిక్ వ్యాధి అని పిలుస్తారు. రొమ్ములలో సాధారణ గడ్డలు ఉన్న స్థితిని ఇలా పిలుస్తారు. సాధారణ గడ్డలు అసలైన హెయిల్ లంప్స్‌ను(హెయిర్ ఉన్న ప్లేస్‌లో ఏర్పడే గడ్డలు) కనుగొనడాన్ని కష్టతరం చేస్తాయని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని ఫలితంగా రోగి.. కొద్ది నొప్పిని అనుభవించిన తర్వాత ఇంటికి వెళతాడు. అటువంటి లక్షణాలను సంకేతాలను గుర్తించేందుకు మీరు మీ రొమ్ములను పరీక్షించాలని అనుకోవచ్చు.
రొమ్ము క్యాన్సర్ అనేది కఠినంగా మరియు బాధగా ఉండే ఒక రకమైన గడ్డ. ఇది ఏ వయసు స్త్రీలలోనైనా సర్వసాధారణం. మీరు రొమ్ము పరీక్ష సమయంలో కఠినమైన గడ్డలాగా ఉండే రొమ్మును కనుక గుర్తిస్తే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. మీ పరిస్థితిని గురించి తెలుసుకునేందుకు మీ వైద్యుడు మామోగ్రామ్ పరీక్షను సిఫారసు చేయొచ్చు. ఈ గట్టి ముద్ద మీ రొమ్ము డింప్లింగ్ ద్వారా కూడా వర్గీకరించబడుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: రొమ్ము క్యాన్సర్, రకాలు, కారణాలు మరియు లక్షణాలు
మీరు ఇటీవల అసాధారణ చనుమొన (నిపిల్) ఉత్సర్గ లేదా మస్టాల్జియాని గమనించినట్లయితే మీరు రొమ్ము వ్యాధితో బాధపడుతున్నారని అనేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అంతే కాకుండా చాలా మంది మహిళలు తమ రొమ్ముల సైజ్‌లో మరియు షేప్‌లో చేంజెస్ గమనించవచ్చు. మొత్తం రొమ్ము ఆకృతిలో కూడా మార్పులు కనిపిస్తాయి. అంతే కాకుండా రొమ్ము రుగ్మత అనేది పుక్కర్డ్ బ్రెస్ట్ (రొమ్ముల మీద శరీరాకృతిలో మార్పులు రావడం) ముడతలు పడిన లేదా పొలుసుల చనుమొనల ద్వారా కూడా వర్గీకరించబడుతుంది. రొమ్ము సమస్యల యొక్క ఈ లక్షణాలన్నీ అసౌకర్యాన్ని మరియు నొప్పిని కలుగజేస్తాయి. అందువల్ల మీరు మీ వైద్యుడిని సంప్రదించి రోగ నిర్దారణ ప్రక్రియను వెంటనే ప్రారంభించడం చాలా ముఖ్యం. అదే మస్టాల్జియా విషయానికి వస్తే ముందస్తుగా గుర్తించడం అనేది మంచి ఔషధంగా పని చేస్తుంది.
మీ డాక్టర్ మామోగ్రామ్ (ఒక రకమైన పరీక్ష) చేయడం ద్వారా మీ రొమ్ములను పరీక్షిస్తాడు. మామోగ్రామ్ అనేది ఒక రకమైన X-రే. మీ వైద్యుడు మామోగ్రామ్ సహాయంతో మీ రొమ్ముల్లో ఏవైనా అసాధారణతలు ఉంటే గుర్తించగలడు. రొమ్ములలో గడ్డలు ఉంటే మామోగ్రామ్‌లో తెలిసిపోతుంది. మామోగ్రామ్ మాత్రమే కాకుండా అనేక ఇతర రోగనిర్దారణ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, గెలాక్టోగ్రఫీ, నీడిల్ బయాస్పీ వంటి ఇతర సాధారణ రోగనిర్దారణ పరీక్షలు కూడా ఉన్నాయి.
రొమ్ములను ముందస్తుగా గుర్తించడం అనేక రొమ్ము సమస్యలను గుర్తించి నివారించడంలో సహాయపడుతుంది. మీ రొమ్ముల కణజాలంలో ఏవైనా గడ్డలు లేదా ఇతర ఏదైనా అసాధారణ పరిస్థితిని గుర్తించేందుకు వైద్యుడు బ్రెస్ట్ బయోస్పైని కూడా ఉపయోగించవచ్చు.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)