hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • బేబీ వేరింగ్ (శిశువును మోసుకెల్లే సాధనాలు) టిప్స్, ప్రయోజనాలు & గైడ్ arrow

In this Article

    బేబీ వేరింగ్ (శిశువును మోసుకెల్లే సాధనాలు) టిప్స్, ప్రయోజనాలు & గైడ్

    Baby Care

    బేబీ వేరింగ్ (శిశువును మోసుకెల్లే సాధనాలు) టిప్స్, ప్రయోజనాలు & గైడ్

    3 November 2023 న నవీకరించబడింది

    బిడ్డను మోయడం అంత తేలికైన పని కాదు. వారు ఒక స్థాయి తర్వాత బరువు ఎక్కువైనట్లు అనిపిస్తారు. ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనుల విషయంలో. అందుకే.. ఇలాంటి సమయంలో శిశువును ధరించే ఉత్పత్తులు బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి వ్యవహారం చాలా కాలంగా ఆచరణలో ఉంది ఇంకా వివిధ సంస్కృతుల వారు తమ శిశువులను విధినిర్వహణలో ఉన్నప్పుడు, ప్రయాణాలలో ఇంకా మరెన్నో పనులు చేసుకునేటప్పుడు వీటిని ఉపయోగిస్తున్నారు.

    బేబీ వేరింగ్ అంటే ఏమిటి?

    "బేబీ వేరింగ్" అనే పదానికి కేవలం బేబీ క్యారియర్ సహాయంతో బిడ్డను మోయడం అని అర్థం. ఈ క్యారియర్‌ను వివిధ రకాల పదార్థాలతో తయారు చేయవచ్చు. ఇందులో సాంప్రదాయ పద్ధతిలో వస్త్రాన్ని వాడుతారు. ఈ రోజుల్లో.. తల్లిదండ్రులు రింగ్ స్లింగ్‌లు ఇంకా బ్యాక్‌ప్యాక్‌లతో సహా అనేక రకాలు డిజైన్‌లలో ఉన్న బేబీ క్యారియర్‌లను చూడవచ్చు.

    బేబీ వేరింగ్ ఎప్పుడు ప్రారంభించాలి?

    తల్లిదండ్రులు తమ నవజాత శిశువుకి కూడా బేబీ వేర్ ఐటెమ్‌ను వాడటం మొదలుపెట్టవచ్చు. వాస్తవానికి, నవజాత శిశువులు తక్కువ బరువుతో సున్నితంగా ఉంటారు కాబట్టి కొన్ని చేయవలసిన ఇంకా చేయకూడని పనులున్నాయి. అయితే.. బేబీ వేర్‌ను ఉపయోగించడం వల్ల తల్లీ-బిడ్డలిద్దరికీ అనేక విధాలుగా ఇంకా సుధీర్ఘకాల ప్రయోజనం చేకూరుతుంది.

    బేబీ వేరింగ్ వల్ల ప్రయోజనాలు

    బేబీ వేరింగ్ తనదైన ప్రయోజనాలను కలిగి ఉంది ఇంకా అనుభవజ్ఞులైన తల్లిదండ్రులతో వీటి ప్రయోజానాలను తెలుసుకోవచ్చు. కొందరు ఈ విషయంలో సైన్స్ మద్దత్తు తీసుకొంటే, మరికొందరు తీసుకోరు. అయినప్పటికీ.. పెద్ద సంఖ్యలో ప్రజలు వాటిని ప్రయోజనకారిగా భావిస్తారు. అందువల్ల, సంవత్సరాలుగా వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు.

    • బంధం ఏర్పరుస్తుంది: శిశువుకి తనను ఎత్తుకొని ఉన్న ప్రతిసారి సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందువల్ల, బేబీ వేరింగ్ సాధనంతో తల్లిదండ్రులు బిడ్డలతో బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. అంతేకాక బిడ్డ ఆకలితో ఉన్నా, అలసిపోయినా, తేలికగా గమనించి వాటిని అర్థం చేసుకోవచ్చు.
    • ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ముఖ్యంగా నెలలు నిండని శిశువుల విషయంలో వారి హృదయ స్పందన, శ్వాసించే విధానాలు, శరీర ఉష్ణోగ్రత మరియు మరిన్నింటిని నియంత్రించడం ద్వారా, బేబీ వేర్ ఐటెమ్‌ను వాడటం వలన ఇలాంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
    • శిశువు ఏడ్వటాన్ని తగ్గిస్తుంది: శిశువును ఎత్తుకొనేందుకు బేబీవేర్ ఉపయోగిస్తున్నట్లయితే, ఒకవేళ అతను/ఆమె ఏడుస్తున్నప్పుడు, తను తల్లితండ్రులకు చేరువలో ఉన్నట్లు వారు అనుకుంటారు అపుడు అది కొంతవరకు ఏడుపును తగ్గించడంలో సహాయపడుతుంది.
    • పని చేసుకొనే సౌకర్యం: శిశువును ఎత్తుకెళ్లడానికి బేబీవేర్‌ను వాడటం వల్ల ఒకటి కంటే ఎక్కువ పనులు ఒకేసారి చేయడం సులభతరం అవుతుంది. వంట చేయడం, ఉతకడం లేదా కిరాణా సరుకులకు వెళ్లినప్పుడు కూడా, బేబీవేర్ సాధనం సౌలభ్యాన్ని అందిస్తుంది. చేతులు పెద్దగా బాధించవు కాబట్టి ఇతర పనులకు వాటిని ఉపయోగించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: బేబీ స్లీపింగ్ బ్యాగులలో శిశువులకి గాఢమైన నిద్ర పడుతుందా?

    బేబీ వేర్ సాధనాలు సురక్షితమేనా?

    బేబీ వేరింగ్ ఉత్పత్తులు సరైన సైజువి అయితే, చక్కగా నప్పినట్లయితే, వాటిని ఉపయోగించినపుడు ఖచ్చితంగా సురక్షితంగా ఉండే మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ TICKS పద్ధతిని అనుసరించాలి:

    • అది శిశువు తల్లిదండ్రులతో దగ్గరగా ఇంకా సురక్షితంగా ఉండేంత బిగుతుగా ఉండాలి
    • శిశువు ముఖం పూర్తిగా కనిపించేలా ఉండాలి
    • నుదిటిపై ముద్దు పెట్టుకొనేంత దగ్గరగా అంటే తల్లిదండ్రుల గడ్డానికి దగ్గరగా ఉండాలి
    • శిశువు ఛాతీకి ఇంకా గడ్డానికి మధ్య కనీసం ఒక వేలుపట్టే ఖాళీ ఉండాలి
    • వీపు ఇంకా మెడకు ఊతమిచ్చినపుడు శ్వాస తీసుకునేందుకు ఆటంకాలు కలగకుండా ఉండాలి

    బేబీ క్యారియర్లలో రకాలు

    తల్లిదండ్రులు ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్‌లో వివిధ రకాలైన బేబీ క్యారియర్లను కనుగొనవచ్చు. వాటిల్లో ప్రముఖమైనవి కొన్ని:

    1. బేబీ ర్యాప్‌లు: అత్యంత విభిన్న రకానికి చెందినవిగా పరిగణించబడుతున్న బేబీ ర్యాప్‌లు ప్రాథమికంగా నేసిన లేదా సాగే గుణమున్న అల్లిన వస్త్రాల పొడవైన ముక్కలై ఉంటాయి.
    2. సాఫ్ట్ స్ట్రక్చర్డ్ బేబీ క్యారియర్: ఇవి బ్యాక్‌ప్యాక్‌ల వలె కనిపిస్తాయి ఇంకా వీటిని ముందువైపు కూడా ధరించవచ్చు. ఇది మెత్తని భుజం పట్టీలు, చక్కగా రూపొందించిన నడుము పట్టీ మరియు సౌకర్యం కోసం సర్దుబాటు చేయగల బకిల్స్‌తో పాటు వస్తుంది.
    3. రింగ్ స్లింగ్స్ ఇంకా పౌచ్: భుజంపైనుండి ఒక రింగు సహాయంతో నడుముచుట్టి వ్రేలడుతూ ధరించేలా డిజైన్ చేయబడి, బిడ్డను మోయడానికి ముందు భాగంలో జేబు(సంచి)లాంటి ఏర్పాటు ఉంటుంది. స్లింగ్స్ మెరుగ్గా ఫిట్ అయ్యేలా సర్దుబాటు చేయవచ్చు.
    4. మెహ్ దై: ఇందులో నడుము ఇంకా భుజాల చుట్టూ ఉండే రెండు మెత్తని పట్టీలు ఉంటాయి. దీనిలో బిడ్డను ముందు, వెనుక లేదా నడుముపై మోయవచ్చు.

    బేబీ వేరింగ్ తల్లికి ఎలా సహాయపడుతుంది?

    బేబీ వేరింగ్ వల్ల తల్లికి శిశువుతో ప్రత్యేక బంధాన్ని ఏర్పరడటానికి ఇంకా తన బిడ్డకు దగ్గరగా మసలుకొనేందుకు సహాయపడుతుంది. ఇది బిడ్డకు పాలుపట్టే ప్రక్రియను సులభతరం చేసేలా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఒక తల్లి తన బిడ్డ అవసరాలకు తగినవిధంగా ప్రతిస్పందించడంలో, ఇంకా బిడ్డలు మాటలు నేర్చడంలో దోహదం చేస్తుంది. ఇది బిడ్డకు ఒత్తిడిని తగ్గించి సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది.

    బిడ్డను సురక్షితంగా మోసుకెళ్ళేందుకు టిప్స్

    భద్రత ఇంకా సౌకర్యాన్ని సరిచూసుకొనేందుకు కుటుంబంలో ఎవరినైనా లేదా అనుభవజ్ఞులైన సిబ్బంది సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఒకసారి ఇది విజయవంతమైతే, శిశువును మోసుకెళ్లడం ఎంతో సంతోషకరమైన అనుభవంగా మారుతుంది. గుర్తుంచుకోవలసిన రెండు ముఖ్యమైన టిప్స్ ఏవంటే:

    1. నవజాత శిశువులకు: నవజాత శిశువుకు ఎలాంటి వైద్యపరమైన సమస్యలు లేనప్పుడు మాత్రమే బేబీ వేరింగ్ ధరించాలి. అలాగే, శిశువు బరువు కనీసం 3.5 కిలోలు ఉందని సరిచూసుకోవడం ముఖ్యం. శిశువులు తమ తలలను తమంతటా తామే పైకి లేపడానికి వారి మెడలో తగినంత బలం ఉండదు మరియు బేబీ క్యారియర్‌లో వారున్న స్థానం సరిగ్గా లేకపోతే, మెడను ముందుకి వెనక్కి వాల్చడం వల్ల ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగే సమస్యలకు కారణం కావచ్చు.
    2. కొనడానికి ముందు ఇవి ప్రయత్నించండి: ప్రతి ఒక్కరికీ బేబీ వేరింగ్ ఉత్పత్తిని ఉపయోగించడంలో సౌకర్యం అనిపించదు. అందువల్ల, బొమ్మ లేదా మీ పరిచయస్తుల శిశువు (సౌకర్యవంతంగా ఉంటే) సహాయంతో వాటిని కొనే ముందు ప్రయత్నించడం ముఖ్యం. గర్భధారణ ప్రారంభంలో లేదా అంతకుముందు, కాబోయే తల్లి ఈ బేబీ క్యారియర్‌ను ప్రయత్నించి చూడటం మంచిది, ఎందుకంటే తరువాతి దశలో ఇవి ధరించినప్పుడు అంత అసౌకర్యంగా అనిపించదు.

    ముగింపు

    కొత్తగా తల్లైనా లేదా అనుభవజ్ఞురాలు అయినా సరే, ఈ బేబీ వేరింగ్ తప్పనిసరిగా వారి పనిని సులభతరం చేస్తుంది ఇంకా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఒక మంచి పెట్టుబడి అవుతుంది. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒకసారి దీనిని ప్రయత్నించాలి.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.