


Care for Baby
7 January 2026 న నవీకరించబడింది
బిడ్డను కనటంతోనే ఎన్నో బాధ్యతలను తలెత్తుకుంటారు తల్లిదండ్రులు. బిడ్డ కోసం నమ్మకమైన, నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకోవటం చాలా కీలకమైన పని. నిత్యం వాడేందుకు సురక్షితమైన బేబీ వైప్స్ ను ఎంచుకోవటం చాలా అవసరం. ఎంతోమంది తల్లిదండ్రుల దైనందిన జీవితంలో నవజాత శిశువుకు బేబీ వైప్స్ వాడటం అనేది ఒక ముఖ్య భాగం అయిపోయింది. ఈ వాడకం రానురాను పెరుగుతూ వచ్చింది, తల్లిదండ్రులకు, బిడ్డలకు కూడా సౌకర్యాన్ని, సంరక్షణను పెంచుతూ వచ్చింది. బేబీ వైప్స్ ను ఎలా ఉపయోగించాలో, అవి సురక్షితమో కాదో ఈ వ్యాసంలో చర్చించుకుందాము.
నవజాత బేబీ వైప్స్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాము. బట్ట లాంటి లేదా టిష్యూ లాంటి పదార్థంతో తయారుచేయబడి, చిన్న లేదా మధ్యమ పరిమాణంలో, తడిగా ఉండి, మడత పెట్టబడి, విడివిడిగా సౌకర్యవంతంగా అమర్చబడినవాటినే బేబీ వైప్స్ అంటారు. నవజాత శిశువుల వైప్స్ ను తరచు శుభ్రత కోసం ఉపయోగిస్తారు. వైప్స్ లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి కానీ, వాడబడ్డ రసాయనాలను బట్టి అవి వేరువేరు ఉపయోగాలను అయ్యుండవచ్చు. ఉదాహరణకు ఆఫీసులో శుభ్రం చేయటానికి, వైద్యరంగంలో వాడటానికి వాడే వైప్స్ చర్మ పరిశుభ్రతకు పనికిరావు.
తడి వైప్స్ లో తొంభై శాతం వరకు పాలీఎస్టర్ లేదా పాలీప్రొపిలీన్ పురులతో తయారుచేయబడి ఉంటాయి. వినియోగాన్ని బట్టి, వాటిని సాధారణంగా నీటితో గానీ, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వంటి ద్రవాలతో గానీ తడుపుతారు. స్పర్శ, ఘ్రాణ లక్షణాలను మెరుగుపరచటానికి ఆ పదార్థాన్ని కండీషనర్లతోను, లోషన్లతోను, సుగంధ ద్రవ్యాలతోను ట్రీట్ చేస్తారు. ప్యాకేజీలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మక్రిములు పెరగకుండా మిథైల్ ఐసో థైఎజోలినోన్ వంటి సంరక్షణకారులను వాడతారు. తడి వైప్స్ ను మడతపెట్టి, అరచేతి పరిమాణం గల ప్యాకేజ్ లో సర్దుతారు.
బిడ్డకు డైపర్ వేసే ప్రాంతం చుట్టూ ఉన్న చర్మానికి తరచు తడి, మలమూత్రాలు తగులుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో చర్మానికి ఇతర ప్రదేశాల కంటే ఎక్కువ ముడతలు ఉండటం వల్ల, శుభ్రం చేయటం కష్టతరమైన విషయం. ఈ ప్రధాన కారణం వల్లనే ఎక్కువమంది పిల్లలకు డైపర్ ర్యాష్ (డైపర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒరుసుకుపోవటం) ఎదురవుతూ ఉంటుంది.
డైపర్ ర్యాష్ ను నివారించటానికి, చికిత్స చేయటానికి తరచు ఆ ప్రాంతంలోని చర్మానికి అంటి ఉన్న మలమూత్రాల ఎంజైములు పూర్తిగా పోయేలా శుభ్రం చేయటం, డైపర్ మారుస్తూ ఉండటం, శానిటైజ్ చేయటం అవసరం. డైపర్ మార్చిన ప్రతిసారీ చుట్టూ ఉన్న చర్మాన్ని శుద్ధిపరచటం చాలా కీలకం. ఈ పనిని శ్రమ తెలియకుండా, త్వరగా చేయటానికి తడి వైప్స్ ఉపయోగపడతాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ బిడ్డకు ఎలాంటి బేబీ మసాజ్ ఆయిల్ ఉత్తమం?
నవజాత శిశువుల చర్మం సున్నితంగా ఉండటం వల్ల ఏ ఉత్పత్తి పడితే దానిని వాడకూడదు. మృదువైన చర్మరక్షాకర ఉత్పత్తులు అవసరం. సుగంధభరిత వాసన ఉండకుండా, ఆల్కహాల్ లేదా ఇతర హానికర పదార్థాలతో కలిసినవి కానంతవరకు, బిడ్డ సున్నితమైన చర్మానికి బేబీ వైప్స్ ను ఉపయోగించవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: శిశువులలో పొడి చర్మం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?
బిడ్డను జాగ్రత్తగా చూసుకోవటం అంటే వారి పరిశుభ్రతను కూడా చూసుకోవటం. డైపర్ వేసినంత మాత్రాన మీ బిడ్డకు సంతృప్తి ఉండదు. డైపర్ మార్చిన ప్రతిసారీ బిడ్డ చర్మం ఉరుసుకుపోవటానికి, పొడారిపోవటానికి ఆస్కారం ఉంటుంది. కనుక సరైన రీతిలో శుభ్రపరచకపోతే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఉంది.
తరచూ చంటిబిడ్డకు స్నానం చేయించటం సరైన పరిష్కారం కాదు. ఏ సమయంలో అయినా చేతిలో బేబీ వైప్స్ ను అందుబాటులో ఉంచుకోవటం వల్ల శుభ్రం చేయటం సౌకర్యవంతం అవుతుంది. శీతాకాలంలో, చలి వాతావరణంలో అస్తమానం బిడ్డను సబ్బుతో రుద్ది, స్నానాలు చేయిస్తే, వారి సున్నితమైన చర్మం పొడారిపోతుంది. ముఖ్యంగా టీకాలు వేయించినప్పుడు, ఒంట్లో బాగాలేని సమయంలోను వైప్స్ తో శుభ్రం చేసే విధానం సులభతరమైనది, వేగవంతమైనది కూడా.
ఎన్నో ప్రసిద్ధమైన బేబీ వైప్స్ కు సన్నగా పరిమళం ఉంటుంది. కానీ నవజాత శిశువులకు అవి సరిపడుతున్నాయని రూఢీగా తెలిస్తే తప్ప సుగంధ పరిమళాలు వెదజల్లే వైప్స్ వాడటం అంత శ్రేయస్కరం కాదు. పరిమళాలు లేని వైప్స్ ను ఎంచుకోవటం మంచిది. ఉదాహరణకు నీటితో తడిసి ఉన్న వైప్స్ కు కృత్రిమ పరిమళం ఉండదు కనుక నవజాత శిశువులకు ఇవి వాడటం మంచిది. దురద వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా నీటి వైప్స్ సురక్షితం, సుపరిశుభ్రం.
ఒక రోజుకు ఒక నవజాత శిశువుకు దాదాపు 30 వైప్స్ అవసరం అవుతాయి. డైపర్ మార్చినప్పుడల్లా పడకకు వాడిన పక్కను కూడా వైప్ తో శుభ్రం చేసే అలవాటు ఉన్నా, ప్రతిసారీ ఎక్కువ సంఖ్యలో వైప్స్ ను వాడే అలవాటు ఉన్నా వైప్స్ ఎక్కువ అవసరం అవుతాయి. దాదాపు ఒక నవజాత శిశువుకు ఒక రోజుకు పది సార్లైనా డైపర్ ను మార్చవలసి వస్తుంది. ఒక్కోసారీ ఒకటి నుండి ఐదు వరకు వైప్స్ అవసరం అవ్వచ్చు. మీరు న్యాపీ మార్చినప్పుడు ఒకటి , ఆ తరువాత శుభ్రం చేయడానికి మరి కొన్ని వైప్స్ వాడాల్సి వస్తుంది.
సాధారణంగా బేబీ వైప్స్ తయారైన దగ్గర నుండి 2-3 ఏళ్ళ లోపు వాటిని వినియోగించుకోవాలని బేబీ వైప్స్ తయారీ సంస్థలు చెబుతుంటాయి. ఆ సమయం దాటితే అవి అంత ప్రభావవంతంగా పనిచేయవని అంటారు. ప్యాక్ ను తెరవకపోయినప్పటికీ, వైప్స్ కి ఉన్న తడి ఆరిపోవటమే కాక, శుభ్రపరచే శక్తి కూడా క్షీణిస్తుంది. ఎండ, వేడి తగలకుండా, చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశంలో వైప్స్ ని ఉంచటం వల్ల అవి ఎక్కువ కాలం పదిలంగా ఉంటాయి. ఆరిపోకుండా, పాడవ్వకుండా ఉంచటానికి, తెరచి ఉన్న వైప్స్ ప్యాకెట్ ను వాడిన వెంటనే మళ్లీ జాగ్రత్తగా మూసేస్తూ ఉండాలి. బేబీ వైప్స్ ఉపయోగాల ప్రాముఖ్యత గురించి మీకు అర్థమయ్యింది కనుక, మీరు మీ బిడ్డ సంరక్షణను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. బేబీ వైప్స్ విషయంలో అలా మీరు తెలివైన, సురక్షితమైన నిర్ణయాలు తీసుకోవటంలో సహకరించే ఒక బ్రాండ్ Mylo Family. మరింత సమాచారం కోసం వారి వెబ్సైట్ ను సందర్శించండి.
How to use baby wipes and why its important In Telugu, What are baby wipes In Telugu, Why Should You Use Baby Wipes In Telugu, Is Baby Wipes Suitable for Newborn Skin In Telugu, How Many Wipes Do You Need to Change a Nappy In Telugu, How to use baby wipes and why its important In English, How to use baby wipes and why its important In Hindi, How to use baby wipes and why its important In Tamil, How to use baby wipes and why its important In Bengali.

Gentle Baby Wipes with Lid - Pack of 3
98% Pure Water | Dermatologically Tested
₹ 249

4.5
(32772)


124576 Users bought
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips







ప్రసవానంతర రక్తస్రావం యొక్క కారణాలు మరియు రకాలు ఏమిటి?

గర్భధారణలో స్టార్ ఫ్రూట్ తినవచ్చా? దీని వల్ల ప్రయోజనాలు ఏమిటి? | Star Fruit Benefits During Pregnancy in Telugu

జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి టాప్ 5 చిట్కాలు | Top 5 Tips To Control Hair Fall in Telugu

గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్: తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Brown Rice During Pregnancy: Benefits & Precautions in Telugu

ఈటింగ్ డిజార్డర్స్: అర్థం, కారణాలు, రకాలు & చికిత్స

గర్భిణీ స్త్రీలలో అండం విడుదల అవుతుందా?