స్ట్రెచ్ మార్కుల గురించి పరిచయం (An Introduction to Stretch Marks in Telugu)
చర్మం త్వరగా కుచించుకుపోయినప్పుడు లేదా సాగినప్పుడు స్ట్రెచ్ మార్కులు లేదా స్ట్రైయే అట్రోఫికస్ ఏర్పడతాయి. 90% మందికి పైగా మనుషులకి బరువు తగ్గడం వల్ల వారి పొట్ట, చేతుల పైభాగం, స్తనాలు, తొడలు లేదా పిరుదులపై స్ట్రెచ్ మార్కులు ఏర్పడతాయి. ఈ మచ్చలు లేదా చారల వల్ల మీ ఆరోగ్యంపై ఏమన్నా ప్రభావం పడుతుందా? అదృష్టవశాత్తూ, లేదు. ఇతర మచ్చలలాగానే, స్ట్రెచ్ మార్కులు చర్మంపై గీతలలాగా లేదా గంటు పెట్టినట్టుగా ఏర్పడతాయి. అవి కొన్నిసార్లు నొప్పిగా లేదా దురదగా కూడా అనిపించవచ్చు. కానీ అంతకుమించి అస్సలు హాని కలిగించవు.
మంచివార్త ఏంటంటే ఈ స్ట్రెచ్ మార్కులు కాలంతోపాటు సమసిపోతాయి. కాకపోతే వాటిని ఎలా నయం చేసుకోవచ్చో మీకు తెలియాలి. ఈ బ్లాగ్ పోస్ట్ మీకు దాని గురించే తెలుపుతుంది. అందుకని మేము ఈ క్విక్ గైడ్లో స్ట్రెచ్ మార్కులకి సంబంధించి అవసరమైన వస్తువులు, నయం చేయగల ప్రత్యామ్నాయాలని గురించి వివరిస్తున్నందున శ్రద్ధగా చదవండి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చర్మ సంరక్షణ - అనుసరించాల్సిన చిట్కాలు
బరువు తగ్గాక స్ట్రెచ్ మార్కులు రావడానికి గల కారణాలు (Causes of Stretch Marks after Weight Loss in Telugu)
బరువు తగ్గాక స్ట్రెచ్ మార్కులు ఎందుకు వస్తాయి? మీరు దాని గురించి తెలుసుకోవాల్సిన మొత్తం సమాచారాన్ని ఇక్కడ ఇచ్చాం:
- ఎప్పటి నుంచో ఉంటున్న స్ట్రెచ్ మార్కులు: బరువు పెరగటం వల్ల స్ట్రెచ్ మార్కులు వచ్చాయా? నిజమైతే, వాటిని బరువు తగ్గాక కూడా ఆపలేరు. ఎందుకంటే అవి అప్పటికే మీ చర్మం మీద ఉన్నాయి. బరువు తగ్గాక ఇంతకుముందుకన్నా మరింత స్పష్టంగా, గుర్తించేలా మారాయి.
- అదనంగా మిగిలిన చర్మం: బరువు తగ్గడం వలన చర్మం సాగిపోతుంది. చర్మంపై ఈ అదనంగా మిగిలిన పొరలు చర్మం యొక్క ఇతర భాగాలపై బరువుగా పడతాయి. అవి ఆరోగ్యంగా ఉన్న చర్మాన్ని లాగినప్పుడు, దానివల్ల మచ్చలు పడటం, చిట్లడం అలాగే సాగిపోవడం జరుగుతుంది.
- కండరాల పెరుగుదల: మీరు బరువు తగ్గడానికి స్ట్రెంత్ ట్రయనింగ్ వ్యాయామం చేస్తున్నారా? నిజమైతే, కండరాలు వేగంగా పెరగటం వల్ల చర్మం సాగి స్ట్రెచ్ మార్కులు ఏర్పడవచ్చు. అందుకని మీరు ఒకే రకమైన వేగంతో కండరాలని పెరగనివ్వటానికి ప్రయత్నించండి. పైగా దీని కోసం ఎటువంటి స్టెరాయిడ్లు వాడవద్దు.
- వేగంగా బరువు తగ్గడం: చర్మం యొక్క ఆకారంలో ఏదన్నా హఠాత్తు మార్పు వస్తే స్ట్రెచ్ మార్కులకి దారితీయవచ్చు. అందుకని మీరు మరీ నాటకీయంగా కాకుండా నెమ్మదిగా స్థిరవేగంతో బరువు తగ్గుతున్నారో లేదో చెక్ చేసుకోండి. తీవ్రంగా వ్యాయామం చేయడం, హఠాత్తుగా ఆహారంలో మార్పులు ఇవన్నీ చర్మంపై ప్రభావం చూపించి గాఢంగా కన్పించే స్ట్రెచ్ మార్కులకి దారితీస్తాయి.
- ఆరోగ్య పరిస్థితులు: ఆఖరిదే కానీ తక్కువ ప్రాముఖ్యత ఉన్నది కాదు. కుషింగ్ సిండ్రోం, మార్ఫాన్ సిండ్రోం వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు కూడా స్ట్రెచ్ మార్కులు వచ్చేలా ప్రేరేపించవచ్చు. మార్ఫాన్ సిండ్రోం వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. అదే విధంగా కుషింగ్ సిండ్రోం చర్మం సున్నితత్వానికి దారి తీసే హార్మోన్లని అధిక స్థాయిలో ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
బరువు తగ్గినప్పుడు స్ట్రెచ్ మార్కులు రాకుండా ఎలా నివారించాలి ? (How to Prevent Stretch Marks from Losing Weight in Telugu?)
మీ చర్మంపై స్ట్రెచ్ మార్కులు ఏర్పడకుండా 100% ఆపలేరని దయచేసి అర్థం చేసుకోండి. కానీ, కొన్ని నివారణ చిట్కాలు పాటించి అవి వచ్చే రిస్కుని తగ్గించుకోవచ్చు. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
- మీరు జీవితాంతం మీ బరువు పెరగకుండా లేదా ఆరోగ్యకరమైన BMI లోనే ఉండే విధంగా చూసుకోండి.
- కొన్ని నెలలలోనే శిల్పంలాగా అందంగా మారతారని నమ్మబలికే క్రాష్ డైటింగ్ వాగ్దానాల జోలికి వెళ్లకండి.
- మీ చర్మం యొక్క సహజమైన సాగే గుణాన్ని కాపాడుకోవటానికి మీ భోజనంలో చాలా రకాల ఖనిజ లవణాలు, విటమిన్లను చేర్చండి. అంతేకాదు, విటమిన్ సి, విటమిన్ ఎ, సిలికాన్ ఇంకా జింక్ వంటివి బరువు తగ్గేటప్పుడు మీ చర్మానికి సపోర్టుని అందిస్తాయి.
- ఎప్పుడూ బరువుని క్రమపద్ధతిలో, నెమ్మదిగా తగ్గటాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. హఠాత్తుగా బరువు తగ్గటం వల్ల చర్మం సాగిపోయి, స్ట్రెచ్ మార్కులు స్పష్టంగా ఏర్పడతాయి.
- అంతేకాదు, మీరు ఒక వారం లేదా నెలలో తగ్గే బరువు కూడా స్ట్రెచ్ మార్కులు రావడానికి కారణం అవుతుంది. మేటి ఫలితాల కోసం వారానికి మీరు ప్రస్తుతం ఉన్న బరువులో 1% మాత్రం తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
- చివరగా, మీరు ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలని పెట్టుకోండి. నీరు మీ బరువు తగ్గే ప్రక్రియని చక్కగా మేనేజ్ చేస్తూ, చర్మాన్ని కూడా మృదువుగా, తేమతో ఉంచుతుంది.
స్ట్రెచ్ మార్కులు వచ్చే రిస్కుని తగ్గించే ఇతర పద్ధతులు (Other Ways to Reduce Stretch Marks Risk in Telugu)
కొన్ని చర్మం పైన పూతలతో చేసే చికిత్సలు కూడా బరువు తగ్గాక స్ట్రెచ్ మార్కులు రాకుండా నివారించటంలో సాయం చేస్తాయి. ఆ ప్రత్యామ్నాయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం:
- స్ట్రెచ్ మార్కుల క్రీములు: ఈ లోషన్లలో నిజానికి చర్మంలో ఎలాస్టిన్ అలాగే కొల్లాజెన్ ని ప్రేరేపించే పెప్టైడ్లు ఇంకా లిపిడ్లు ఉంటాయి. ఇవి నయం కావడానికి, ఆ ప్రదేశంలో చర్మం తిరిగి రావడాన్ని ప్రోత్సహిస్తాయి. అవి స్ట్రెచ్ మార్కులు ఏర్పడకుండా నియంత్రించడం ద్వారా చర్మాన్ని ధృఢంగా బలోపేతం చేస్తాయి.
- మైక్రో నీడ్లింగ్ థెరపీ : ఇది స్ట్రెచ్ మార్కులు, ముడతలు, మచ్చల వంటి చర్మ సమస్యలని బాగు చేయడానికి డెర్మా రోలర్ పరికరాన్ని ఉపయోగిస్తూ చేసే ఆధునిక స్కిన్ ట్రీట్మెంట్ ప్రత్యామ్నాయం. మేటి ఫలితాల కోసం కనీసం మూడుసార్లు మైక్రో-నీడ్లింగ్ సెషన్లని తీసుకోవడానికి ప్రయత్నించండి.
బరువు తగ్గటం వల్ల కన్పించే స్ట్రెచ్ మార్కులని స్పష్టంగా కన్పించకుండా తగ్గించటానికి చిట్కాలు (Tips to Reduce Stretch Marks Visibility from Weight Loss in Telugu)
బరువు తగ్గాక వచ్చే స్ట్రెచ్ మార్కులని అంత స్పష్టంగా కన్పించకుండా తగ్గించటంలో మీకు సాయం చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ ఇచ్చాం:
- చర్మం పొడిబారకుండా రోజంతా ద్రవ పదార్థాలతో హైడ్రేటడ్ గా ఉండేలా చూసుకోండి. నీరు మాత్రమే కాకుండా, విటమిన్ సి ఉండే పండ్ల రసాలు, స్మూతీలు అలాగే మిల్క్ షేకులని కూడా తాగవచ్చు.
- చర్మం యొక్క సాగే గుణం, మృదుత్వం నిలబడటానికి ఏడెనిమిది గంటల పాటు మంచి నిద్ర చాలా ముఖ్యం. ఇది మీ స్ట్రెచ్ మార్కులని స్పష్టంగా కన్పించకుండా ఉంచటంలో కూడా సాయపడవచ్చు.
- రోజూ కనీసం 15 నిమిషాల పాటు వ్యాయామం ఇంకా స్ట్రెచెస్ చేయండి. అవి మీ శరీరంలో రక్త ప్రసరణని పెంచి స్ట్రెచ్ మార్కులు రావడాన్ని తగ్గిస్తుంది.
- బరువు తగ్గడం వల్ల వచ్చిన స్ట్రెచ్ మార్కులని తగ్గించడానికి మీరు పైన పూతతో తగ్గించే చికిత్సా పద్ధతులని కూడా ఉపయోగించవచ్చు. కానీ మీ చర్మంపై ఏ ఉత్పత్తిని అయినా వాడేముందు మీ డెర్మటాలజిస్టుని సంప్రదించండి.
Tags:
Weight Loss tips in telugu, Stretch marks due to weight loss in telugu, How to get rid off stretch marks due to weight loss in telugu, stretch marks cream benefits in telugu, tips to get rid off stretch marks in telugu.