
గర్భవతి కావడం ప్రతీ మహిళకు ఎంతో ఉత్తేజంగా ఉంటుంది. అంతే సవాలుగా కూడా ఉంటుంది. మహిళ గర్భవతి అయినప్పుడు, గర్భాశయం లోపల పెరుగుతున్న పిండానికి అనుగుణంగా శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. కొన్ని అవయవాలు విస్తరిస్తూ ఉంటాయి. నిజానికి, ఈ సమయంలో, మహిళ శరీరంలో ఓ కొత్త అవయవం ఏర్పడుతుంది. దాన్నే ప్లాసెంటా అంటారు. ప్లాసెంటాను గర్భస్థ మావిగా పిలుస్తారు. కొందరు దీన్ని మాయ అని కూడా అంటారు. గర్భస్థ మావి పనితీరుతో పాటు, ప్లాసెంటాతో సంబంధం ఉన్న కొన్ని సమస్యలు, ఈ సమస్యల్ని నివారించి ఆరోగ్యకరంగా గర్భధారణను కొనసాగించడానికి గల మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.
మహిళ గర్భవతి అయినప్పుడు గర్భాశయంలో గర్భస్థ మావి ఏర్పడుతుంది. ఇది కడుపులో పెరుగుతున్న శిశువుకు కావాల్సిన ఆక్సిజన్, పోషకాలు ఇవ్వడంతో పాటు, అదే సమయంలో శిశువు శరీరం నుంచి వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ అవయవం బొడ్డుతాడు గోడ, గర్భాశయాన్ని కలుపుతూ తయారవుతుంది. ఫలదీకరణ చెందిన అండం గర్భాశయంలోని ఎండోమెట్రియంలో లేదా లైనింగ్‌లో అమరినప్పుడు ఏర్పడే తాత్కాలిక అవయవం ఇది. కడుపులో శిశువు పెరుగుతున్న కొద్దీ ప్లాసెంటా కూడా పెరుగుతుంది. శిశువు జన్మించిన తర్వాత ఖాళీ అవుతుంది.
ప్లాసెంటా చేసే ప్రధాన పని విషయానికి వస్తే ఇది తల్లి రక్తం నుంచి శిశువు రక్తంలోకి ఆక్సిజన్‌తో పాటు పోషకాలను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు శిశువు రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను ప్లాసెంటా తొలగిస్తుంది. శిశువు బొడ్డుతాడుకు ప్లాసెంటా కనెక్ట్ అయి ఉంటుంది. బొడ్డుతాడులో రెండు ధమనులు, ఒక సిర ఉంటాయి. వీటిలో ధమనులు ఆక్సిజన్ లేని రక్తాన్ని శిశువు నుంచి మావికి తీసుకెళ్తాయి. సిర ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తాన్ని ప్లాసెంటా నుంచి శిశువు శరీరంలోకి తీసుకెళ్తుంది.
మహిళ గర్భాశయంలో పెరిగే ముఖ్యమైన అవయవం ప్లాసెంటా. పెరుగుతున్న పిండానికి కావాల్సిన పోషకాలను, ఆక్సిజన్‌ను అందిస్తుంది. ప్లాసెంటా ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం, ఆమె తీసుకునే ఆహారం, టాక్సిన్స్ లేదా ఇన్ఫెక్షన్లకు గురి కావడం లాంటివన్నీ గర్భస్థ మావిపై ప్రభావం చూపిస్తాయి. గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు ఇవే:
ప్లాసెంటల్ సమస్యలు మూడో ట్రమిస్టర్‌లో సర్వసాధారణం. ఈ సమయంలో మాయ వేగంగా పెరుగుతుండటమే కారణం.
గర్భధారణ సమయంలో పలురకాల ప్లాసెంటల్ సమస్యలు వస్తాయి. వీటికి సాధారణ లక్షణం బ్లీడింగ్ కావడం. గర్భధారణ సమయంలో ఎప్పుడైనా రక్తస్రావం కొద్దిగా కనిపించడం దగ్గర్నుంచి తీవ్రంగా కావడం వరకు ఉంటుంది. ఇతర లక్షణాల విషయానికి వస్తే గర్భంలోని శిశువు కదలికలు తక్కువగా ఉండటం, పొత్తికడుపు లేదా ఉదరంలో నొప్పి, సంకోచాలు లాంటివి ఉంటాయి. ఎవరికైనా ఈ లక్షణాల ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
ప్లాసెంటా ఓ సంక్లిష్ట అవయవం. గర్భధారణ సమయంలో పిండానికి సపోర్ట్‌గా పెరుగుతూ ఉంటుంది. తల్లికి, బిడ్డకు మధ్య పోషకాలు, వ్యర్థపదార్థాల మార్పిడికి ఉపయోగపడుతుంది. కడుపులోని శిశువు ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
గర్భస్థ మావి సరిగ్గా ఏర్పడనప్పుడు ప్లాసెంటల్ సమస్యలు రావొచ్చు. లేదా గర్భాశయ గోడ నుంచి వేరుచేయబడినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు తల్లికి, బిడ్డకు అనారోగ్యం రావడానికి కారణం అవుతాయి.
ప్లాసెంటల్ సమస్యల్ని తగ్గించడానికి పలు అంశాలను గుర్తుంచుకోవాలి:
చివరగా, తల్లి గర్భంలో శిశువు అబివృద్ధికి పనిచేసే ముఖ్యమైన అవయవం ప్లాసెంటా అని తెలుసుకున్నాం. అంతేకాదు, ప్లాసెంటా ఎలా పనిచేస్తుంది? ఆరోగ్యకరమైన గర్భధారణకు అది ఎలా ఉపయోగపడుతుంది? అన్న ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకున్నాం. ప్లాసెంటా పనితీరును ప్రభావితం చేసే, దెబ్బతీసే అనేక అంశాలు ఉన్నాయి. అందుకే ముందుజాగ్రత్త చర్యల్ని తీసుకోవడం ద్వారా, ఆ సమస్యల్ని నివారించవచ్చు. ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు, పాటించాల్సిన టిప్స్ గురించి తెలుసుకొని ఆరోగ్యకరమైన ప్రసవం పొందడానికి మైలో ఫ్యామిలీ వెబ్‌సైట్ ఫాలో అవండి.
Tags:
Placental Problem in telugu, Placental Problem during pregnancy in telugu, cure to Placental Problem in telugu, risks of Placental Problem in telugu, Symptoms of Placental Problem in telugu.
Yes
No

















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |