
కడుపుతో ఉన్నప్పుడు- ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలాగే తినే ఆహార రకాల గురించి చాలా అప్రమత్తంగా ఉండటం సరైన పని. కివి పండుని చైనీస్ ఉసిరి రకాలలో ఒకటిగా భావిస్తారు, ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
కివి పండు ప్రెగ్నెన్సీ సమయంలో తినగలిగే చాలా మంచి పండు. కేవలం కివి పండుతో అలర్జీ ఉంటే మాత్రమే అది తినకుండా ఉండవచ్చు. పుప్పొడి ఇంకా లేటెక్స్ లతో అలర్జీ ఉన్నవారు సాధారణంగా కివి పండుతో కూడా అలర్జీకి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ అలర్జీ లక్షణాలలో చర్మంపై ర్యాష్లు, పెదవులు వాయడం ఇంకా ఇతర సాధారణ అలర్జీ లక్షణాలు ఉంటాయి. ఈ పండులో విటమిన్లు A,C,E, ఇంకా K, ఫోలేట్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో చక్కెర శాతం కూడా తక్కువగా ఉంటుంది, అందుకని ఆరోగ్యకరమైన స్నాక్ గా తినవచ్చు. రోజుకి రెండు మూడు కివి పండ్లు తినడం ఖచ్చితంగా సురక్షితమైనదే.
కడుపుతో ఉన్నప్పుడు రకరకాల వేవిళ్ళు అంటే ఏవైనా ఇష్టమైన పదార్థాలు తినాలన్న బలమైన కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే గర్భం యొక్క ప్రతిదశలో సరైన ఆహారం తినడం కూడా చాలా ముఖ్యం. గర్భవతిగా ఉన్న మహిళ ప్రెగ్నెన్సీ సమయంలో రోజూ కివి పండ్లని తినడం వలన వచ్చే లాభాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి ట్రైమిస్టరులో కివి పండ్లు తినటం చాలా బావుంటుంది, ఎందుకంటే దానిలో ఈ కింది అవసరమైన పోషకాలు ఉంటాయి: ఈ పండులో ఫోలేట్ తక్కువ మొత్తంలో ఉంటుంది. బిడ్డ యొక్క న్యూరల్ ట్యూబ్ లోపం నివారించడానికి ఫోలేట్ చాలా ముఖ్యమైనది. ఆడవారు గర్భం దాల్చడానికి ముందు ఇంకా తర్వాత తగినంత పోలిక్ యాసిడ్ ని శరీరంలో కలిగి ఉండాలి. ఒంట్లో ఫోలిక్ యాసిడ్ స్థాయి 400 MCG గా ఉండాలి. కివి పండులో దాదాపుగా 15-20 MCG ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. రోజుకి రెండు కివి పండ్లు తినటం మీ ఆరోగ్యానికి సాయపడుతుంది. శరీరం ఐరన్ ను పీల్చుకోవడానికి విటమిన్ C అవసరం. కివి పండులో దాదాపు 70MCG విటమిన్ C ఉంటుంది. కడుపుతో ఉన్న మహిళలు ఐరన్ ని పీల్చుకోగలగడం చాలా ముఖ్యం, ఎందుకంటే తల్లికి, బిడ్డకి ఐరన్ అవసరం. ఐరన్ న్యూరో ట్రాన్స్మిటర్లని తయారు చేయడంలో సహాయపడుతుంది. ఇవి సమాచారాన్ని చేరవేసే రసాయన నిర్మాణాలు. ఇవి లేకుండా శరీరం పనిచేయలేదు. కివిలో కాల్షియం కూడా తక్కువ మొత్తాలలో ఉంటుంది. తల్లీబిడ్డలు ఇద్దరికీ ఎముకల బలాన్ని రక్షించుకోవటం చాలా ముఖ్యం. కివి పండులో దాదాపు 2౦ – 25 MCGల కాల్షియం ఉంటుంది. ప్రత్యేకించి, లాక్టోస్ లేదా డైరీ పదార్థాలు పడనివారికి ఇది చాలా అద్భుతమైనది.
కివి పండ్లలో లెక్కించదగ్గ మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది. కివి పండ్లలో దాదాపు 2 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇది ప్రేగు కదలికలకి సాయపడుతుంది. సాధారణంగా కడుపుతో ఉన్నప్పుడు మలబద్ధకం నుండి విరేచనాల వరకూ రకరకాల ప్రేగు కదలికలు అనుభవంలోకి రావచ్చు. హార్మోన్ల స్థాయిలలో అదే పనిగా హెచ్చుతగ్గులు వీటికి కారణమని చెప్పవచ్చు. గర్భం 2వ ట్రైమిస్టరులోకి కొనసాగినప్పుడు, విటమిన్ A, జింక్, కాల్షియం, ఐరన్, అయోడిన్, అలాగే ఒమేగా-౩-ఫ్యాటీ యాసిడ్ల అవసరం పెరుగుతుంది. కివిలో దాదాపు 2 MCGల విటమిన్ A అలాగే ఇతర పోషకాల యొక్క అతి తక్కువ మొత్తాలు ఉంటాయి. కివి పండు విటమిన్ E యొక్క ముఖ్యమైన వనరు అని చెప్పవచ్చు, ఈ విటమిన్ తల్లీబిడ్డల శరీరంలో కణాలు నాశనం అవకుండా కాపాడుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.
మూడవ ట్రైమిస్టరులో గర్భవతిగా ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ కారణంగా వచ్చే తర్వాత స్థాయి ఆరోగ్య సమస్యలతో డీల్ చేస్తూ ఉంటారు, కడుపుతో ఉన్నప్పుడు వచ్చే డయాబెటిస్ అందులో ఒకటి. కివి పండులో గ్లూకోజ్ తక్కువ స్థాయిలో అంటే దాదాపు 1 టేబుల్ స్పూన్ అంత మాత్రమే ఉంటుంది. ఈ పండుని తీపి తినాలనిపించే కోరికని తగ్గించటానికి ప్రత్యామ్నాయంగా తినవచ్చు. కివి పండులో విటమిన్ K కూడా ఉంటుంది, ఇది ఆరోగ్యం సరికావడంలో అలాగే రక్తం గడ్డకట్టడంలో అవసరం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీలో గుండెల్లో మంట అంటే ఏమిటి: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స
ముందు చెప్పినట్లుగా, కొంతమందికి కివి పండ్లు అలెర్జీని కలిగిస్తాయి. ఈ అలెర్జీ కివి పండుని కొన్నిసార్లు తిన్నాక లేదా మీకు ఇదివరకే లేటెక్స్ లేదా పుప్పొడికి సంబంధించిన అలెర్జీ ఉంటే అభివృద్ధి చెందుతుంది.
ఫంగస్ వ్యతిరేక మందులతో కలిపినప్పుడు, ఇది ఎడిక్టివ్ ఎఫెక్ట్ను చూపిస్తుంది. నిజజీవితంలో ఈ కాంబినేషన్ ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియదు. మీ ఆహారంలో ఏదైనా కొత్త పదార్థం లేదా పండ్లను చేర్చుకునేటప్పుడు మీ గైనకాలజిస్ట్ ను అలాగే డైటీషియన్ను సంప్రదించడం మంచిది. వారు ప్రెగ్నెన్సీ సమయంలో మీ ఆరోగ్యానికి ఏది మంచిదో మెరుగైన సలహాని అందిస్తారు. కడుపుతో ఉన్నప్పుడు ఏమేం తింటున్నారో, ఖచ్చితంగా, జాగ్రత్తగా చూడడం ముఖ్యం. ఈ సమయంలో శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. కివి పండు బిడ్డ ఎదుగుదలకు సహాయపడే చాలా పోషకాలను అందించడంలో ఉపయోగపడుతుంది. ఏదైనా పరిమితిగా తినకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని ఆరోగ్యకరమైన ఆహారం అయినా, అనారోగ్యకరమైన ఆహారమైనా అన్నీ మితంగానే తినాలి.
Kiwi during pregnancy in telugu, Benefits of eating Kiwi during pregnancy in telugu, Side effects of eating Kiwi during pregnancy in telugu, Nutritional value of Kiwi fruit during pregnancy in telugu. Kiwi fruit benefits during pregnancy In English, Kiwi fruit benefits during pregnancy In Hindi, Kiwi fruit benefits during pregnancy In Tamil, Kiwi fruit benefits during pregnancy In Bengali
Yes
No

















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |