
గర్భధారణ సమయంలో సెక్స్ ముందరిలా కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మీ చిన్న బేబీ బంప్ పూర్తి స్థాయి గర్భంలా కనిపిస్తుంది కాబట్టి.. ప్రతి పొజిషన్ మీకు మరియు మీ భాగస్వామికి సౌకర్యంగా గానీ, సంతృప్తికరంగా గానీ ఉండకపోవచ్చు. అందువల్ల గర్భధారణ సమయంలో ఉత్తమమైన సెక్స్ పొజిషన్‌లు ఏవో చూడండి. మీరు చేయకూడనివి ఏవైనా ఉన్నాయా, ప్రతి మూడు నెలలకు ఎలా మారాలో, ఎలా ఉండాలో చూడండి.
గర్భధారణ సమయంలో మీరు ప్రయత్నించదగిన ప్రెగ్నెన్సీ సెక్స్ పొజిషన్లు ఎన్నో ఉన్నప్పటికీ.. సాధారణంగా మీ భాగస్వామితో మాట్లాడటం, తన సలహాలను కూడా తీసుకోవడం ఉత్తమం. వాస్తవానికి లైంగిక జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, ఉపశమనం కలిగించే ఒకే ఒక మార్గం - మాట్లాడుకోవటం. మరింత శారీరక సాన్నిహిత్యాన్ని పెంచడానికి సెక్స్ తర్వాత కౌగిలించుకోవడం మంచిదని తెలుసుకోండి. ఇది ఖచ్చితంగా మీ ఇద్దరినీ సంతోషంగా, లైంగికంగా సంతృప్తికరంగా ఉంచుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మూడో త్రైమాసికంలో సెక్స్‌లో పాల్గొనడం సురక్షితమేనా
మీరు సౌకర్యవంతంగా ఉన్నంత వరకు దాదాపు ఏ స్థానం అయినా బాగానే ఉంటుంది. మీరు చూసుకోవాల్సిన ఏకైక విషయం ఏమిటంటే.. మీరు మీ పొత్తికడుపుపైన ఎక్కువ ఒత్తిడి లేదా భారం వేయకూడదు. అంతేకాకుండా.. మీ లైంగిక జీవితానికి మరింత మసాలా జోడించడానికి మీరు సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని సెక్స్ టాయ్‌లను కూడా మీరు ఉపయోగించవచ్చు! మీ భాగస్వామి ఏమి ఇష్టమో మరింత బాగా తెలుసుకోవడానికి తనతో మాట్లాడటానికి ప్రయత్నించండి.
అయినప్పటికీ.. గర్భం అభివృద్ధి చెందుతున్నప్పుడు, పెరుగుతున్న గర్భం వల్ల చుట్టూ పెనవేసుకోవడం కష్టమవుతుందని మీరు తెలుసుకోవచ్చు. కానీ మీ గర్భం మధ్యలో వస్తున్నట్లు అనిపిస్తే.. మీరు, మీ భాగస్వామి ప్రయత్నించడానికి గర్భానికి వీలుగా ఉండే విధానాలు ఎన్నో ఉన్నాయి. ప్రెగ్నెన్సీలో ఉపయోగపడే ఉత్తమ సెక్స్ పొజిషన్‌లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. మీరు వీటిని ఖచ్చితంగా ప్రయత్నించాలి!
పక్కకి పడుకోవడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఎదురెదురుగా ఉన్నా సరే ఒకరి వెనుక మరొకరు ఉన్నా సరే. ఈ రెండు విధానాలలోను నడుము పైన బరువు పడకుండా ఉంటుంది. మీ నడుము క్రింది భాగంలో బరువు పడితే మీ మోకాళ్ళ మధ్యన ఒక తలగడ ఉంచుకొని, మీ భాగస్వామి మీ వెనుక ఉండేలా చూసుకోండి.
శాస్త్రీయమైన “కౌగర్ల్” పొజిషన్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనివల్ల పొట్ట పైన బరువు పడదు. దీనివల్ల లోతుగా కదలిక ఉంటుంది. క్లిటోరల్ ప్రేరణ అధికంగా ఉంటుంది. గుర్తుంచుకోవలసిన విషయాలు: ప్రెగ్నెన్సీ చివరి రోజులలో, మీ పొట్ట చాలా పెద్దగా అవుతుంది. అంత పెద్దగా అవుతుందని మీరు ఎప్పుడూ ఊహించుకొని ఉండరు. మీరు ఈ పొజిషన్లో కదలడం ఇబ్బందిగా ఉంటుంది. మీరు డెప్త్ కంట్రోల్ చేయడానికి మీ భాగస్వామిని మీ చర్మాన్ని పట్టుకోమని అడగవచ్చు. దీనివల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది.
మీ భాగస్వామి మీ వెనుక ఉండాలి. అంటే మీ భాగస్వామి మీ పొట్టని తాకే అవకాశం ఉండదు. మీ చేతులు గోడకి ఆనించి నిలబడటానికి ప్రయత్నించండి. లేదా మీ భాగస్వామిని కుర్చీలో కూర్చోమని మీరు తన వైపు వీపు పెట్టి అతని ఒడిలో కూర్చోవాలి. చిన్నపిల్లలు పాకేటప్పుడు ఉన్నట్టు పడుకోవడం (మోకాళ్ళు మోచేతుల మీద పడుకోవడం) కూడా ఒక ఆప్షన్. మీరు మీ పొట్ట బరువును మోయావలసిన అవసరం ఉండదు. మీ సెక్స్ లైఫ్‌లో ఇంకా మసాలా జోడించడానికి ఎన్నో సెక్స్ టాయ్స్ కూడా ఉపయోగించవచ్చు.
తొందరగా చేస్తే మిషనరీ స్టైల్లో కూడా చేయచ్చు. అయితే.. మీ భాగస్వామి మీ పొట్టపై బరువు వేయకుండా తన బరువును తన చేతులపై వేసుకొని ఉండాలి. మీ భాగస్వామి చేతులు ఫ్రీగా ఉంచుకోవాలని అనుకుంటే, మీరు మీ నడుము క్రింది భాగం బెడ్ చివరలో ఉండేలా కాళ్ళు నేలపైకి వ్రేలాడేలా బెడ్ చివరన వెల్లకిలా పడుకొని, మీ భాగస్వామిని మోకాళ్ళ పైన కూర్చోమనాలి. మీ నడుము కింద తలగడ ఉంచుకుంటే మీ పైన బరువు పడకుండా ఉంటుంది. ఇది కూడా ప్రెగ్నెన్సీలో ఉపయోగపడే ఒక మంచి సెక్స్ పొజిషన్. మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ లో చేయాల్సినవి మరియు చేయకూడనివి
నిజానికి, ప్రెగ్నెన్సీలో సెక్స్ చేయడం చాలా ఉపశమనంగాను, ఆహ్లాదకరంగాను ఉంటుంది. అంతే కాకుండా.. ఈ దశలో మీరు తప్పించవలసిన సెక్స్ పొజిషన్లు ఏవీ ఉండవు. అయితే.. మీరు మీ బొడ్డుపైన లేదా మీ పొత్తికడుపుపైన ఎక్కువ ఒత్తిడిని కలిగించని సెక్స్ పొజిషన్‌లను ఎంచుకోవాలి. అంతే కాకుండా, సన్నిహితంగా ఉండే సమయమంతా మీరు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.
మీ డాక్టర్ మీకు వద్దని చెబితే తప్ప, ఏదీ మాననవసరం లేదు. రెండవ త్రైమాసికంలో.. మీ భాగస్వామి నేరుగా మీ పైన పడుకోవడం లేదా మీరు మీ పొట్టపై పడుకోవడం వంటి మీ పొట్టపై బరువును పెంచే పొజిషన్స్ మీరే ఇష్టపడరు. కాబట్టి.. మీ కోసం ఇప్పటికీ పని చేసే చాలా ప్రీ ప్రెగ్నెన్సీ ఫేవరెట్‌లను చూడటానికి సంకోచించకండి. తెలుసుకొని ఆనందించండి! అంతేకాకుండా మీరు మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం కూడా చాలా ముఖ్యం! అంతేకాకుండా, బెడ్‌రూమ్‌లో కొత్త వస్తువులను ప్రయత్నించడం వల్ల మీ భాగస్వామితో మరింతగా దగ్గర అవ్వవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ ప్రెగ్నెన్సీ రెండో త్రైమాసికంలో మీరు మీ భాగస్వామితో సెక్స్ చేయడం సురక్షితమేనా?
సెక్స్ తర్వాత కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, లైంగిక సంబంధాలను మెరుగుపరచడంలో ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. మీరు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడవచ్చు. మీ పొట్టపై మసాజ్ చేయమని మీ భాగస్వామిని అడగవచ్చు. ఎలాగైనా, లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి, భాగస్వాములతో బంధాన్ని పెంచుకోవడానికి ఇవి కొన్ని గొప్ప మార్గాలు.
మీ బంధాన్ని మరింత బలంగా ఉంచుకోవడానికి మీరు మీ భాగస్వామితో కలిసి రాత్రిపూట సినిమా చూడటం లేదా డేట్ నైట్‌లు గడపడం వంటివి కూడా చేయవచ్చు. ఈ అందమైన క్షణాలన్నీ మిమ్మల్ని ఒత్తిడి నుండి విముక్తులను చేసి సంతోషంగా ఉంచుతాయి! నిజానికి, మీ ప్రెగ్నెన్సీలో రాత్రులు, మీ జీవితంలో చిరస్మరణీయమైనవి అవుతాయి!
మీరుప్రెగ్నెన్సీలో బెస్ట్ సెక్స్ పొజిషన్‌ను ప్రయత్నించిన తర్వాత ఏదైనా నొప్పి వస్తే, మీరు మీ డాక్టర్‌ని సంప్రదించవచ్చు. మీ డాక్టర్ వేరొక పొజిషన్‌ను ప్రయత్నించమని లేదా దానికి బదులుగా మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాన్ని చెప్పవచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి కొత్త సెక్స్ టాయ్‌లను కూడా ప్రయత్నించవచ్చు. మీ భర్తతో మీ లైంగిక, మానసిక, ప్రవర్తనా సంబంధాన్ని పెంపొందించడానికి అసాధారణమైన మార్గం సెక్స్. అందువల్ల, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో, సెక్స్ మరింత ఉపశమనంగా, ఆహ్లాదకరంగా ఉండటానికి మార్గాలను వెతకడం మంచిది.
Sex during pregnancy in telugu, Safe sex positions during pregnancy in telugu, Best sex positions during pregnancy in telugu, Is sex safe during pregnancy in telugu.
Yes
No














Is it safe during pregancy
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |