


Pregnancy Tests
3 November 2023 న నవీకరించబడింది
ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ చేయించడం చాలా ప్రాముఖ్యత పొందినందువల్ల, గర్భిణీ స్త్రీలలో అది సురక్షితమా కాదా అనే అనుమానం వస్తుంది. ఈ ప్రినేటల్ స్కాన్‌లు పెరుగుతున్న పిండానికి హాని కలిగిస్తాయా లేదా దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగిస్తాయా అనే దాని గురించి చాలా మంది భయపడుతుంటారు. బిడ్డ మనుగడ గురించి, స్క్రీనింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి డాక్టర్లు హామీ ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా అల్ట్రాసౌండ్ స్కాన్‌లు చేయించుకోవాలా వద్దా అనేది పూర్తిగా ఆ గర్భిణీ స్త్రీ ఇష్టాన్ని బట్టే చేయాలని అంగీకరిస్తున్నారు.
చాలా దశాబ్దాలుగా ఎందరో డాక్టర్లు ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేస్తున్నారు. అల్ట్రాసౌండ్ స్కాన్‌లు గర్భిణీ స్త్రీలకు లేదా వారి గర్భస్థ శిశువులకు హాని కలిగించవని నిరూపించే రుజువులు ఈ స్కాన్స్‌ని సమర్థిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్వహించిన మల్టీసెంటర్ అధ్యయనం ప్రకారం.. గర్భధారణ సమయంలో డయాగ్నస్టిక్ అల్ట్రాసౌండ్ చేయించుకోవడం సురక్షితమేనని తెలుస్తోంది. కాబట్టి.. గర్భధారణ సమయంలో మొదటి అల్ట్రాసౌండ్ చేయించుకోబోతున్నవారి అయోమయానికి స్వస్తి పలకడానికి ప్రయత్నిద్దాం.
అల్ట్రాసౌండ్ సురక్షితమా కాదా అనేదాన్ని తెలుసుకోవడానికి, ప్రెగ్నెన్సీలో మీ మొదటి అల్ట్రాసౌండ్‌కి ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, అవి ఎలా పని చేస్తాయో తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ మీ కడుపులోని బిడ్డ యొక్క చిత్రాన్ని రూపొందించడానికి హై ఫ్రీక్వెన్సీ ఉన్న ధ్వని తరంగాలను ఉపయోగిస్తుంది. ఈ తరంగాలు ప్రతిధ్వనులను అభివృద్ధి చేస్తాయి. అవి తెరపై చిత్రంగా మారుతాయి. పరీక్ష నిర్వహించే వ్యక్తి (సోనోగ్రాఫర్) బిడ్డ యొక్క స్థానం, కదలికలు, అవయవాల గురించి తెలుసుకోవడానికి ఈ చిత్రాల వివరాలు ఇస్తారు.
15-30 నిమిషాల జరిగే ఈ ప్రక్రియలో వాడే మెషీన్ మీ చర్మంపైన మృదువుగా కదలడానికి వీలుగా సోనోగ్రాఫర్ మీ పొత్తికడుపుపై ఒక జెల్ అప్లై చేస్తారు. మీ బిడ్డ చిత్రాన్ని స్క్రీన్‌పై తీయడానికి ఒక ట్రాన్స్‌డ్యూసర్‌ను ఉపయోగిస్తారు. ఇది ధ్వని తరంగాలను విడుదల చేసే ఒక రకమైన పరికరం. సోనోగ్రాఫర్‌లు శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు. వాళ్ళు మీరు, మీ బిడ్డ సురక్షితంగా ఉండటానికి అవసరమైన సరైన మార్గదర్శకాలన్నింటినీ అనుసరిస్తారు.
ప్రెగ్నెన్సీలో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్‌లలో వేడి ఎక్కువ రాకుండా ఉండటానికి అత్యల్ప స్థాయిలో, తక్కువ సమయంలో ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు. అంతే కాదు.. ఈ ప్రినేటల్ స్కాన్‌లలో ఎక్స్-రేలు గానీ రేడియేషన్ గానీ ఉండవు. ప్రెగ్నెన్సీలో చేసే మొదటి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఏ మాత్రం ఇబ్బంది కలిగించదు. ఏ విధమైన నొప్పిలేకుండా ఉంటుంది. వైద్య అధ్యయనాలను బట్టి పుట్టుకతో వచ్చే లోపాలు లేదా చిన్నతనంలో వచ్చే క్యాన్సర్ లేదా పుట్టిన తరువాత ఉండే మానసిక అభివృద్ధిలో ఉండే సమస్యలకి అల్ట్రాసౌండ్‌తో ఎటువంటి సంబంధం ఉండదు.
ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసేటప్పుడు, ట్రాన్స్‌డ్యూసర్ పొత్తికడుపు ద్వారా గ్రహించిన కొద్దిపాటి వేడిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా.. ప్రినేటల్ స్కాన్‌లలో 1 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అది కూడా చాలా మేర వ్యాపిస్తుంది. దీనివల్ల పెరుగుతున్న బిడ్దకు ఎటువంటి హాని జరగదు. ఇంకా మీ బిడ్ద చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం, బిడ్ద కదలికలు ఈ వేడిని మరింత వ్యాప్తి చేయడానికి సహాయపడతాయి.
ప్రెగ్నెన్సీలోని మొదటి మూడునెలలలో.. గర్భిణీ స్త్రీలో మార్పులు ఎక్కువగా కనిపించకపోవచ్చు కానీ ఆమె లోపల ఎన్నో మార్పులు జరుగుతాయి. ప్రెగ్నెన్సీలోని మొదటి మూడునెలలు, బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి, సాధారణ అభివృద్ధికి కీలకమైనది. దీనివల్ల చాలా మంది గర్భిణీ స్త్రీలు తమ చిన్నారికి హాని కలుగకుండా ఉండటానికి ప్రెగ్నెన్సీలో మొదటి అల్ట్రాసౌండ్‌ను దాటవేస్తారు. అయితే నిజానికి ప్రెగ్నెన్సీలో ఏవైనా ఇబ్బందులు గానీ సమస్యలు గానీ ఉంటే వాటిని పరిష్కరించడానికి ఈ మొదటి అల్ట్రాసౌండ్ ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రెగ్నెన్సీలోని మొదటి మూడునెలలలో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్, డ్యూ డేట్ నిర్ణయించడంలోను, గర్భంలో ఎంతమంది ఉన్నారనేదాన్ని తెలుసుకోవడంలోను, గర్భాశయాన్ని పరిశీలించడంలోను కీలకపాత్ర పోషిస్తుంది. దీనితోపాటుగా.. వైద్యులు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందేమో చూస్తారు. పిండం అసాధారణతలను గుర్తించవచ్చు. గర్భస్రావం జరిగే ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు. ప్రెగ్నెన్సీలో మొదటి అల్ట్రాసౌండ్ వైద్యులకు గర్భాశయంలో ఉండే ఈ సమస్యలలో కొన్నింటిని పరిష్కరించడానికి, సరైన సమయంలో చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి.. ముందుకు వెళ్ళండి. మీ ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలలో చేయవలసిన పనులలో దీన్ని ముందరే చేసెయ్యండి.
ప్రెగ్నెన్సీలో చేసే అల్ట్రాసౌండ్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలోని మొదటి మూడునెలలలో అసలు ఉండదు. పొత్తికడుపుపై ట్రాన్స్‌డ్యూసర్‌ని నొక్కడం వల్ల కొంతమందికి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ దాని గురించి ఏ మాత్రం భయపడనవసరం లేదు. అంతేకాకుండా.. శిక్షణ పొందిన డాక్టర్లచే సురక్షితమైన వైద్య సౌకర్యాలతో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వలన అసలు ఏ మాత్రం ప్రమాదం ఉండదని చెప్పవచ్చు.
వైద్యులు, తల్లిదండ్రులకు విలువైన సమాచారాన్ని అందించడంలో ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ చేయడం చాలా కీలకమైనది. ఉదాహరణకు.. మొదటి మూడునెలలలో అల్ట్రాసౌండ్ చేయడం వల్ల గర్భంలో కవలపిల్లలు ఉన్నారో లేదో తెలుస్తుంది. దాన్నిబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ చేయడం వల్ల ఆ స్త్రీ చిన్నారికి జన్మనివ్వడానికి సౌకర్యాలను అందించడానికి, ప్రసవానంతర సమయంలో సరైన పద్ధతిలో సంరక్షణ అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉంటారు. అంతే కాదండోయ్.. ప్రెగ్నెన్సీలో మొదటి అల్ట్రాసౌండ్ వల్ల తల్లిదండ్రులు వాళ్ళ చిన్నారిని పుట్టకముందే చూసే ఒక అపురూపమైన అవకాశం వాళ్ళకు అందుతుంది.
ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా, హై-ఎండ్ క్లినిక్‌లు 3D, 4D స్కాన్‌లను అందించడం ప్రారంభించాయి. ఎప్పటినుండో చేస్తున్న 2D స్కాన్‌లు చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఆందోళన కలిగించాయి. 3D, 4D స్కాన్‌లు చిన్నారి యొక్క స్పష్టమైన చిత్రాలు, వీడియోలను రూపొందించడానికి హై పవర్ ఇంటెన్సిటీ కలిగి ఉంటాయి. ఈ స్కాన్‌లు 2D స్కాన్‌ల కంటే ఎక్కువ పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి.. బిడ్ద వేడికి గురికావడం పెరుగుతుంది. అందువల్ల వైద్యులు ప్రెగ్నెన్సీలోని మొదటి మూడునెలలలో 3D, 4D అల్ట్రాసౌండ్ చేయించుకోవద్దని సలహా ఇస్తారు.
ఎటువంటి సమస్యలు లేని ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీలో రెండు అల్ట్రాసౌండ్ స్కాన్‌లు మాత్రమే అవసరం. ప్రెగ్నెన్సీలో మొదటి అల్ట్రాసౌండ్‌ను డేటింగ్ స్కాన్ అని అంటారు. దీన్ని ప్రెగ్నెన్సీలోని మొదటి మూడునెలలలో నిర్వహిస్తారు. రెండవ అల్ట్రాసౌండ్‌ను అనోమలీ లేదా మిడ్-ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటారు. ఇది గర్భం దాల్చిన తర్వాత 18-20 వారాల మధ్య చేస్తారు. అనోమలీ స్కాన్‌లో మీ బిడ్దకు శారీరక సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. కొన్నిసార్లు వైద్యులు మీ యొక్క, మీ బిడ్ద యొక్క ఆరోగ్యాన్ని బట్టి ప్రెగ్నెన్సీలో రెండు కంటే ఎక్కువ అల్ట్రాసౌండ్ స్కాన్‌లు చేయించుకోమని సూచించవచ్చు.
చివరిగా..
ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ చేయడం గత నాలుగు దశాబ్దాలుగా వాడుకలో ఉంది. దీని వల్ల ఇబ్బందులేమీ లేవనే రికార్డు ఉంది. ఈ స్కాన్‌లు కాబోయే తల్లికి లేదా పెరుగుతున్న పిండానికి హాని కలిగిస్తాయని ఎటువంటి శాస్త్రీయ డేటా సూచించలేదు. ఏదేమైనా.. గర్భిణీ స్త్రీలు వైద్యపరంగా అవసరమైనప్పుడు, శిక్షణ పొందిన డాక్టర్ల మార్గదర్శకత్వంలో మాత్రమే అల్ట్రాసౌండ్ చేయించుకోవడం మంచిదని సిఫార్సు చేస్తారు.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)