

Pregnancy
11 February 2026 న నవీకరించబడింది
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు నేడు సర్వసాధారణం మరియు వీటిని బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారు. గర్భధారణ సమయంలో బాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించినప్పుడు, ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. మహిళ తన ప్రెగ్నెన్సీలో 6 నుంచి 24 వారాల మధ్యలో ఉన్నప్పుడు యూటీఐ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీ డాక్టర్ మీకు యూరిన్ టెస్టు సూచించినప్పుడు వచ్చే ఫలితంలో యూటీఐని గుర్తించవచ్చు. ఒకవేళ ఫలితం పాజిటివ్ గా వస్తే దానికి వెంటనే చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకు డాక్టర్ మీకు మందులు ఇవ్వవచ్చు. అధ్యయనం ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో దాదాపు 31 శాతం మంది మహిళలు లక్షణాలతో కూడిన లేదా లక్షణాలు లేని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారినపడ్డారు.
ఉపశమనం కోసం మీరు ఇంట్లో కూడా కొన్ని టిప్స్ ని పాటించవచ్చు. యూటీఐ (యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) లక్షణాలు ఇవే:
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు చికిత్స ఇవ్వకపోతే పుట్టే బిడ్డ తక్కువ బరువుతో గానీ, నెలలు నిండక ముందే పుట్టడంగానీ జరుగుతుంది. ఒకవేళ వైద్యులు ఈ ఇన్ఫెక్షన్ కు చికిత్స త్వరగా ఇస్తే బిడ్డకు హాని జరగదు. యూరిన్ కల్చర్ రిపోర్ట్ వచ్చాక మీ డాక్టర్ 3-7 రోజులకు సరిపడా మందులు ఇవ్వవచ్చు. కేవలం మందులు మాత్రమే కాకుండా యూటీఐని తగ్గించేందుకు పలు మార్గాలు ఉన్నాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో UTIలను ఎలా ఎదుర్కోవాలి: నివారణ, చికిత్సలు
ప్రెగ్నెన్సీ సమయంలో యూరినరీ ట్రాక్ట్ అనాటమీలో మార్పులు ఉంటాయి. యుటెరస్ సాగినప్పుడు బ్లాడర్ తో పాటు యూట్రస్ (గర్భకోశం) కూడా ఒత్తిడికి గురవుతుంది. అది మూత్రపిండాలు పెద్దగా మారడానికి దోహదపడుతుంది. ప్రెగ్నెన్సీ వల్ల బ్లాడర్ కుదించబడుతుంది. ఆ సమయంలో దాన్ని ఖాళీ చేయడం కష్టంగా ఉంటుంది. మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకునే ప్రొటీన్ వల్ల, హార్మోన్ల వల్ల, చక్కెర వల్ల యూరిన్ లోని ఎసిడిటీ తగ్గుతుంది. చక్కెర ఎక్కువగా ఉండేచోటు బాక్టీరియాకు స్వర్గం లాంటిది. దీనివల్ల ప్రెగ్నెంట్ మహిళలు ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్పెక్షన్ (యూటీఐ) బారిన పడతారు. 12 నుంచి 16 వారాల ప్రెగ్నెన్సీ సమయంలో యూరినాలసిస్, కల్చర్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచన.
ప్రెగ్నెన్సీలో ఉండగా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి కొన్ని సాధారణ కారణాలేవనగా:
బోవెల్ లోని బాక్టీరియా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. స్త్రీలలోని యురెత్రా-రెక్టమ్ పొడవు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ.కొలి వంటి బాక్టీరియా సులువుగా యూరినరీ ట్రాక్ట్ లోకి ప్రవేశిస్తుంది.
పెరుగుతున్న యుటెరస్, యుటెరస్ లో నెమ్మదిగా జరిగే మూత్ర ప్రవాహం, పెరిగే హార్మోన్ స్థాయిల వల్ల బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల బ్లాడర్ లోని మూత్రం పూర్తిగా బయటకు రాదు. ఈ విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో జరిగే మార్పులు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి.
ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనడం మంచిదే. అయితే అది యూటీఐ సంక్రమించే అవకాశాలను పెంచుతుంది. యురెత్రా ద్వారా వెజైనల్ క్రిములు యూరినరీ ట్రాక్ట్ లోకి ప్రవేశిస్తాయి. సెక్స్ లో పాల్గొనే ముందు, పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేయడం ద్వారా ఆ ప్రాంతం కడగబడుతుంది. తద్వారా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
ప్రెగ్నెన్సీ సమయంలో మూత్రానికి వెళ్ళినప్పుడు నొప్పిని కలిగించే బాక్టీరియా సాధారణంగా డైజెస్టివ్ ట్రాక్ట్ లో ఉంటుంది.
ఒకవేళ మీ కిడ్నీలు దీని బారినపడితే వచ్చే పరిస్థితిని ఎక్యూట్ పైలోనీఫ్రిటిస్ అంటారు. దీనిలో సహజంగా కనిపించే లక్షణాలేవనగా:
ఒక వేళ మీ బ్లాడర్ దీని బారినపడితే వచ్చే పరిస్థితిని సిస్టిటిస్ అంటారు. దీనిలో సహజంగా కనిపించే లక్షణాలేవనగా:
ఒక వేళ మీ యురెత్రా దీని బారినపడితే వచ్చే పరిస్థితిని యురెత్రెటిస్ అంటారు. ఇందులో పలు లక్షణాలు కనిపించవచ్చు. వాటిలో మూత్రానికి వెళ్ళినప్పుడు మంటగా ఉండటం, అసాధారణ డిశ్చార్జ్ ఉండటం వంటివి ఉండొచ్చు.
యూటీఐని గుర్తించడానికి యూరిన్ కల్చర్ పరీక్ష నిర్వహిస్తారు. యూరిన్ లో బాక్టీరియా కనిపిస్తే ప్రెగ్నెన్సీలో సురక్షితమైన యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటూ, బాక్టీరియా లొంగకపోతే తప్ప యాంటీ బయాటిక్స్ ను 10 రోజులకు మించి ఇవ్వరు.
యూరినరీ ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు చికిత్స తీసుకోకపోతే వచ్చే ప్రమాదాల పట్ల అవగాహన కలిగిఉండాలి. కిడ్నీ ఇన్ఫెక్షన్ల విషయంలో ఇది తల్లీ, బిడ్డలకు తీవ్రమైన ప్రమాదంగా మారవచ్చు. అది ముమ్మాటికీ నిజం. సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా బిడ్డ తక్కువ బరువుతో, నెలలు నిండకముందే పుట్టవచ్చు. ఒక వేళ ఈ వ్యాధికి సరైన చికిత్స ఇవ్వకపోతే డెలివరీ తర్వాత కూడా తిరగబెట్టవచ్చు.
మహిళలల్లో అన్ని వయసుల వారిలో యూటీఐ తరచుగా వచ్చే అవకాశం ఉన్నందున, ఈ పరిస్థితికి పలు ప్రమాద కారణాలు ఉన్నాయి. కాబట్టి యూటీఐలకు మహిళలు బాధితులుగా మారే అవకాశం ఉంది. కొన్ని ప్రమాద కారణాలు కింద ఉన్నాయి.
మగవారి శరీర నిర్మాణంతో పోలిస్తే మహిళల శరీరంలో తక్కువ యురెత్రా ఉంటుంది. దీనివల్ల బాక్టీరియా తక్కువ దూరం మాత్రమే ప్రయాణించి ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్ కలిగించగలుగుతుంది. అంతేగాక ప్రెగ్నెన్సీ సమయంలో యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదం మరింతగా పెరుగుతుంది.
లైంగికంగా యాక్టివ్ గా లేని మహిళలతో పోలిస్తే లైంగికంగా యాక్టివ్ గా ఉన్న మహిళలు యూటీఐ బారిన పడే అవకాశాలు మరింత ఎక్కువ. అంతేగాక ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక క్రియలను పెట్టుకోవడం కూడా యూటీఐ రిస్క్ ను పెంచుతుంది.
డయాఫ్రమ్స్ వంటి గర్భ నియంత్రణ పద్ధతులను అవళంబించే మహిళలల్లో యూటీఐ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ మీరు స్పెర్మిసైడల్ ఏజెంట్స్ ఉపయోగిస్తుంటే కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిల్లో తగ్గుదల ఉంటుంది. దీని వల్ల మహిళల శరీరంలో చాలా మార్పులు ఉంటాయి. ఇది కూడా యూటీఐకి దారి తీయవచ్చు.
శిశువులో ఉండే అసహజ యూరినేషన్ వంటి కారణాల వల్ల యురెత్రా యూటీఐ బారిన పడుతుంది.
యూరినరీ ట్రాక్ట్ లో ఉండే పలు అడ్డుగోడల (బ్లాకేజెస్) వల్ల కూడా బ్లాడర్ వద్ద యూరిన్ ట్రాప్ అయిపోయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దానికి సాధారణ ఉదాహరణలు కిడ్నీలలో రాళ్లు ఏర్పడటం, ప్రొస్టేట్ వాపు.
డయాబెటిస్ వంటి పలు వ్యాధులు రోగనిరోధక వ్యవస్థను బలహీనపరచవచ్చు. దాని వల్ల క్రిములకు వ్యతిరేకంగా శరీరం పోరాడలేకపోతుంది. దీనివల్ల కూడా యూటీఐ ఏర్పడవచ్చు.
తమకై తాము మూత్ర విసర్జన చేయలేని వారికి విసర్జన కోసం శరీరంలో వేసే పైపును కాథెటెర్ అంటారు. దీని నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
ఇటీవలే మీరు యూరినరీ సర్జరీ చేయించుకొని ఉంటే, యూటీఐ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సర్జరీ సమయంలో ఉపయోగించిన మెడికల్ పరికరాల వల్ల ట్రాక్ట్ లో ఏర్పడిన పరిస్థితి కారణం.
యూటీఐని త్వరగా గుర్తించి సరైన చికిత్స ఇస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అయితే చికిత్స చేయించుకోకపోతే మాత్రం ఊహించలేని పరిణామాలకు అది దారి తీయవచ్చు. యూటీఐతో వచ్చే పలు సమస్యలు కింది ఇవ్వబడ్డాయి.
ప్రెగ్నెంట్ గా ఉండగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ సోకితే యాంటిబయాటిక్స్ ఇస్తారు. కొద్ది రోజులకు నొప్పి తగ్గినప్పటికీ, ప్రిస్కిప్షన్ పూర్తయ్యేవరకూ వాటిని వాడాల్సి ఉంటుంది.
యూరినరీ ఇన్ఫెక్షన్ ను చికిత్స అందించడం ఎంత అవసరమో, దాని నుంచి వేగంగా కోలుకోవడానికి కూడా బలమైన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పదార్థాలు కింద ఇవ్వడమైంది.
క్రాన్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటివి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి వేగంగా కోలుకోవడానికి తోడ్పడతాయి. అంతేగాక వీటిలో ఉండే ప్రొయాయంథోసైనిడిన్ వల్ల యూరినరీ ట్రాక్ట్ లైనింగ్ వెంట పెరిగే ఇన్ఫెక్షన్ కలిగించే క్రిముల వృద్ధి నియంత్రించబడుతుంది. ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో యూటీఐని నివారించడానికి బెర్రీస్ తీసుకోవడం మంచిది.
యూరినరీ ట్రాక్ట్ లో ఉండే హానికారక బాక్టీరియాను పారద్రోలేందుకు పీచు అధికంగా ఉండే పదార్థాలైన అరటి, పప్పులు, ఓట్స్ వంటివి ఉపయోగపడతాయి. దాంతో పాటు పేగు కదలికలకు, బ్లాడర్ మీద ఒత్తిడిని తగ్గించడానికి కూడా అవి ఉపయోగపడతాయి.
యూటీఐ వల్ల కలిగే మంటను ఆపడంలో చల్లని నీటిలో నివసించే చేపలోని ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు శాకాహారి అయితే, చేప ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అయినప్పటికీ మీ డైట్ లో మార్పు చేయాలనుకున్న ప్రతిసారి మీ వైద్యున్ని కలవాలి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సెక్స్ కారణంగా వ్యాప్తి చెందదనే విషయం ముందుగా తెలుసుకోవాలి. సూటిగా చెప్పాలంటే అది మహమ్మారి కాదు. అయినప్పటికీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తితో సెక్స్ లో పాల్గొనడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక మహిళ యూటీఐతో బాధపడుతుంటే, సెక్స్ చేసే సమయంలో నొప్పి, యురెత్రా వద్ద చికాకు కలిగే అవకాశం ఉంటుంది. నిజానికి వెజీనా లోపలి గోడల మీద సెక్స్ కారణంగా కలిగే ఒత్తిడి వల్ల సున్నితమైన బ్లాడర్ మీద మరింత ఒత్తిడి పడి నొప్పి ఎక్కువ అవుతుంది.
యూటీఐ పెరిగే అవకాశాలను సెక్స్ కల్పిస్తుంది. అంతేగాక సున్నితమైన యురెత్రా ప్రాంతంలోకి ప్రమాదకరమైన బాక్టీరియా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుంది. కండోమ్ ఉపయోగించినా, ఉపయోగించకపోయినా, సెక్స్ వల్ల హానికరమైన బాక్టీరియా యురెత్రా లోపలికి వెళ్తుంది. అందువల్ల యూటీఐ లక్షణాలు కనిపించగానే అన్ని రకాల సెక్సువల్ చర్యల నుంచి దూరంగా ఉండాలి.
అన్ని రకాల యూటీఐ కేసుల్లో మెడికల్ సహాయం తీసుకోవాల్సిన అవసరంలేనప్పటికీ, వైద్యున్ని కలవడం వల్ల భవిష్యత్తులో యూటీఐ మళ్లీ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్లాడర్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. తద్వారా ఫిలోనెఫ్రైటిస్ లేదా సెప్టిసేమియా రాకుండా కాపాడుకోవచ్చు. అంతేగాక మీరు ప్రెగ్నెంట్ అయ్యుండి యూటీఐ సమస్యలు రాకుండా ఉండాలన్నా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











పసి పిల్లల బట్టలు గాలిలో ఆరబెట్టడం ఎంత వరకు సురక్షితం? (How Safe Is It to Air Dry Baby Clothes in Telugu?)

6-నెలల చెక్-అప్ : టీకాలు మరియు మరిన్ని (The 6 Month Check-up: Vaccinations and More in Telugu)

తెలియకుండా అబార్షన్: దీనికి కారణాలు ఏమిటి? ఈ పరిస్థితి లక్షణాలు ఎలా ఉంటాయి?

గర్భవతిగా ఉన్న మహిళలు ఎక్కువగా నిద్రపోతారా? (Do Women Sleep A Lot During Pregnancy in Telugu?)

పిల్లలు తమంతట తాముగా ఎప్పుడు తినగలుగుతారు? దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?

డెలివరీ తర్వాత తీసుకోవలసిన స్నాక్స్ గురించి ఏమి తెలుసుకోవాలి?