
ఏ స్త్రీకైనా ప్రెగ్నెన్సీ ఒక సవాలుతో కూడుకున్న అనుభవం. ప్రసవం తర్వాత చాలా కాలం దాని పర్యవసానాలు ఉండవచ్చు. చాలా ఆడవాళ్ళకు ప్రసవం తర్వాత డిప్రెషన్, ఏడుపు, ఆందోళన వంటివి ఉంటాయి. దీనిని సాధారణంగా ప్రసవానంతర డిప్రెషన్ అని అంటారు. ఇది చాలా తీవ్రమైన అనారోగ్యం. అందువల్ల, ప్రసవానంతర డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్న స్త్రీలకు, ప్రసవానంతర డిప్రెషన్ ఎంతకాలం ఉంటుంది అనేది ముఖ్యమైన ప్రశ్న.
ప్రసవానంతర డిప్రెషన్, ప్రసవం తర్వాత తల్లి అనుభవించే ఒక రకమైన క్లినికల్ డిప్రెషన్. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియవు. మిగతా రకాల డిప్రెషన్ లాగానే, ఇది రకరకాల కారణాల వల్ల రావచ్చు. ప్రసవ సమయంలో.. ముఖ్యమైన జీవిత మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, శరీరంలో జీవసంబంధమైన మార్పుల వంటి సాధారణ కారణాల వల్ల క్లినికల్ డిప్రెషన్ కలగవచ్చు. అయితే ప్రసవానంతర డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచే అంశాలు కొన్ని ఉన్నాయి -
మీకు ఇది కూడా నచ్చుతుంది: డెలివరీ తరువాత వచ్చే ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలి?
ఎవరైనా ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్నారా అనేది లక్షణాల తీవ్రతను బట్టి, ‘అది వారికి ఎంతకాలం ఉంటుంది?’ అనే దానిని బట్టి చెప్పవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ప్రసవానంతర డిప్రెషన్ యొక్క లక్షణాలు -
ప్రసవానంతర డిప్రెషన్, ప్రసవం తర్వాత వెంటనే మొదలవుతుంది. చాలా మంది స్త్రీలు బేబీ బ్లూస్ ముగిసే వరకు కూడా దానిని గ్రహించలేరు. బేబీ బ్లూస్ అనేది ప్రసవించిన మొదటి కొన్ని వారాలలో ప్రతి స్త్రీకి కలిగే ఆకస్మిక విచారం. ఇది కొత్తగా పిల్లలు పుట్టినవారిలో ప్రతి ఐదుగురిలో నలుగురికి ఉంటుంది. ప్రసవమయ్యాక మొదటి నాలుగు నుండి ఆరు వారాలు ప్రసవానంతర కాలం. ఈ సమయంలో ఎవరికైనా ఈ డిప్రెషన్ కలగవచ్చు. అయితే.. కొన్ని సందర్భాల్లో, ఈ డిప్రెషన్ ప్రెగ్నెన్సీలోనైనా రావచ్చు, లేదా బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం తర్వాత కూడా రావచ్చు. కాబట్టి ప్రసవానంతర కాలం అయిపోయిన తర్వాత ఎవరైనా బాధపడితే.. అది డిప్రెషన్ లక్షణం కావచ్చు.
ప్రసవానంతర డిప్రెషన్ ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. దాని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. ఇది ప్రసవం తర్వాత రెండు వారాల నుండి నుండి 12 నెలల మధ్యకాలంలో స్త్రీలలో కనిపించవచ్చు. 2014లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆడవారిలో డిప్రెషన్ లక్షణాలు కాలక్రమేణా మెరుగుపడతాయి. ఈ సమస్య కనిపించిన 3 నుండి 6 వారాలలోపు పరిష్కరించబడుతుంది. అయితే ఈ అధ్యయనంలో కొంతమందికి ఆరు నెలలు దాటిన తర్వాత కూడా డిప్రెషన్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. ముప్పై నుండి యాభై శాతం మందిలో ప్రసవించిన ఒక సంవత్సరం తర్వాత డిప్రెషన్ కలిగినట్లు తెలిపారు. దీనికి విరుద్ధంగా, బిడ్డ పుట్టిన మూడు సంవత్సరాల తర్వాత కూడా వారిలో నిస్పృహ లక్షణాలను అనుభవించినట్లు సగం కంటే తక్కువ మంది తెలిపారు. అందువల్ల.. స్త్రీలలో ప్రసవానంతర డిప్రెషన్ ఎంతకాలం ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేము.
ప్రసవానంతర డిప్రెషన్ ఆడవారి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొంతమందికి ఒంటరితనం కూడా ఉండవచ్చు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP) వారు ఇలా తెలిపారు. ఒక భాగస్వామికి డిప్రెషన్ వస్తే, రెండో వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. తమ కుటుంబం, స్నేహితుల నుండి కూడా దూరం కావచ్చు. ఎందుకంటే వారు తమలాగే ప్రవర్తించరు. దురదృష్టవశాత్తూ, ఇది తల్లీబిడ్డల మధ్య సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతరం వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి?
బేబీ బ్లూస్ తర్వాత ఏదైనా విచారం, డిప్రెషన్ యొక్క ఇతర లక్షణాలు ఉన్నట్లుగా అనిపిస్తే డాక్టర్‌ని కలవవలసి ఉంటుంది. ఇది తప్పనిసరిగా చెడ్డ వార్త కాదు. దీనిలో దాచవలసినది ఏమీ లేదు. కానీ వీలైనంత త్వరగా నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా.. దాని కోసం తమను తాము నిందించుకోకూడదు. ప్రసవం తర్వాత డిప్రెషన్ సర్వ సాధారణమని అంగీకరించాలి. త్వరగా కోలుకోవడానికి సహాయం కోరాలి. ప్రసవానంతర డిప్రెషన్ గురించి స్త్రీలు తెలుసుకోవలసినది ఇంతే. ఈ లక్షణాలన్నింటినీ గుర్తుంచుకోండి; వీటిలో ఏదైనా అనుభవంలోకి వస్తే, వెంటనే డాక్టర్‌ని కలవవలసి ఉంటుంది.
1. 2 నెలల తర్వాత ప్రసవానంతర డిప్రెషన్ కలుగుతుందా?
అవును, ప్రసవించిన 2 నెలల తర్వాత ప్రసవానంతర డిప్రెషన్ కలగవచ్చు.
2. 4 నెలల తర్వాత ప్రసవానంతర డిప్రెషన్ కలుగుతుందా?
అవును, ప్రసవించిన 4 నెలల తర్వాత ప్రసవానంతర డిప్రెషన్ కలగవచ్చు. ఎందుకంటే.. ఆడవారిలో కలిగే హార్మోన్ల మార్పుల కారణంగా, వారికి ప్రసవానంతర డిప్రెషన్ అనుభవంలోనికి రావచ్చు.
3. ప్రసవానంతర డిప్రెషన్ సంవత్సరాల తరబడి కొనసాగుతుందా?
అవును, ప్రసవం తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే ప్రసవానంతర డిప్రెషన్ కారణంగా కొన్నిసార్లు స్త్రీలలో చాలా నిస్పృహ లక్షణాలు ఉండవచ్చని అధ్యయనాలు సూచించాయి. కొంతమందిలో నిస్పృహ లక్షణాలను అంచనా వేయడానికి మూడు నుండి ఆరు నెలలు సరిపోకపోవచ్చు.
Yes
No


















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |