


Postnatal Care
3 November 2023 న నవీకరించబడింది
పోస్ట్ పార్టమ్ పీరియడ్ అనేది ప్రసవానంతర కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ దశను ప్రసవం యొక్క నాల్గో దశగా కూడా సూచిస్తారు. ఈ కాలంలో స్త్రీలు అనేక మానసిక మరియు శారీరక మార్పులను అనుభవిస్తుంది. కాబట్టి మీరు పోస్ట్‌పార్టమ్ (ప్రసవానంతర కాలం) పీరియడ్ అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. ఇది వివిధ దశల్లో ఉంటుంది. ఈ కాలంలో ఎదురయ్యే సవాళ్ల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
ప్రసవానంతర కాల వ్యవధి ఆరు వారాల వరకు ఉంటుంది. ఈ స్థాయిలో హార్మోన్ల స్థాయిలు, తల్లి యొక్క గర్భం సైజ్ మామూలు స్థితికి వస్తుంది. ప్రసవానంతర కాలాన్ని మూడు వేర్వేరు దశలుగా వర్గీకరించవచ్చు.
ప్రసవానంతర కాలం యొక్క మొదటి దశ బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మంత్రసానులు మరియు నర్సులు పర్యవేక్షిస్తారు. ఈ దశలో స్త్రీకి కలిగే ఒక ప్రధాన సమస్య ప్రసవానంతర రక్తస్రావం. ఈ రక్తస్రావం ప్రధానంగా గర్భాశయానికి ప్లాసెంటా జోడించిన ప్రదేశం వద్ద జరుగుతుంది. గర్భాశయం సంకోచించినంత కాలం ఈ రక్తస్రావాన్ని వైద్యులు కూడా ఆపలేరు. అంతే కాకుండా ఉమ్మనీరు ఎంబోలిజం, మరియు ఎక్లాంప్సియా వంటి సమస్యలకు దారి తీస్తుంది.
ప్రసవానంతర కాలం యొక్క రెండవ దశను సబాక్యూట్ ప్రసవానంతర కాలం అని పిలుస్తారు. ఇది రెండు నుంచి ఆరువారాల వరకు ఉంటుంది. ఈ దశలో స్త్రీ శరీరం జెనిటూరినరీ (జననేంద్రియ) శస్త్రచికిత్స, ఎమోషనల్ స్టేటస్, హెమోడైనమిక్స్ , జీవక్రియలో అనేక మార్పులకు లోనవుతుంది. ఇది నిదానమైన దశ. ప్రతి ఒక్కరూ ఈ మార్పులను స్పష్టంగా అనుభవిస్తారు. ఒక స్త్రీ ఈ మార్పులను పెరినియల్ అసౌకర్యం, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ రూపంలో ఈ మార్పులను సులభంగా అనుభవిస్తుంది. అనేక అధ్యయనాల ప్రకారం…87 నుంచి 90 శాతం మంది మహిళలు ఈ సుబాక్యూట్ పోస్ట్ పార్టమ్ సమయంలో కనీసం ఒక ఆరోగ్య సమస్యను నివేదించారు.
బిడ్డ పుట్టిన తర్వాత మూడో మరియు చివరి దశను ప్రసవానంతర కాలం అని అంటారు. ఇది ఆరునెలల పాటు ఉంటుంది. ఇది కండరాలు మరియు బంధన కణజాలాలను పునరుద్ధరించే దశ. శరీరం అనేది గర్భానికి ముందు దశకు వస్తుంది. మూత్రం మరియు మలం ఆపుకోలేని మరియు బాధాకరమైన సంభోగం వంటి చైల్డ్ బర్త్ కాంప్లికేషన్స్ నుంచి కొంత మంది కోలుకుంటారు. ఇంకా PTSD(పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్) వంటి రుగ్మతలు కూడా తగ్గుతాయి. శరీరం క్రమంగా గర్భధారణకు ముందు స్థితికి వచ్చినప్పటికీ జన్యుసంబంధ వ్యవస్థ మార్పులు పరిష్కరించేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది.
ప్రసవం తర్వాత సెక్స్ చేసేందుకు ఎప్పుడు సరైన సమయం అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత కొంత మంది మహిళలు లో లిబిడో(సెక్స్‌లో పాల్గొనాలనే ఆసక్తి తగ్గిపోవడం) లేదా లో సెక్సువల్ డ్రైవ్‌ను అనుభవిస్తారు. ఇది సాధారణ విషయం. ప్రసవం తర్వాత కనీసం ఆరువారాల పాటు సెక్స్‌లో పాల్గొనకూడదని వైద్యలు సూచిస్తున్నారు. అయితే ఒక స్త్రీ తాను సిద్ధంగా ఉన్నట్లు భావిస్తే సెక్స్‌కి ముందు వైద్యుడిని సంప్రదించాలి. ప్రసవానంతర కాలంలో లో లిబిడో, నొప్పి భయం వలన సెక్స్‌లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపెట్టరు. ఒక స్త్రీ మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే.. వారు కనీసం 12 నెలలు ఆగాల్సి ఉంటుంది. 12 నెలల తర్వాతే వారు గర్భం నుంచి పూర్తిగా కోలుకుంటారు.
బిడ్డ పుట్టిన తర్వాత లోచియా అని పిలువబడే యోని రక్తస్రావం సంభవిస్తుంది. ఇది రుతుచక్ర స్రావంతో గందరగోళం చెందకూడదు. ప్రసవం తర్వాత మొదటి పీరియడ్ ఎప్పుడు వస్తుందనేది? తల్లి తన బిడ్డకు రొమ్ము పాలు ఇస్తుందా? లేక డబ్బాపాలు ఇస్తుందా? అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. తల్లిపాలు ఇస్తుంటే.. మొదటి పీరియడ్ బిడ్డ పుట్టిన తర్వాత ఆరునెలల వరకు వచ్చే అవకాశం లేదు. మరియు కొన్ని సార్లు తల్లి తన బిడ్డకు పాలివ్వడం ఆపే వరకు రాకపోవచ్చు. తమ బిడ్డకు ఫార్ములా ఫీడింగ్ చేసే తల్లులకు ప్రసవం తర్వాత ఆరు నుంచి ఎనిమిది వారాల లోపు పీరియడ్ వచ్చే అవకాశం ఉంది.
ప్రసవానంతర ప్రారంభ లక్షణాలు ఏమిటో తెలుసుకునేందుకు ప్రసవానంతర కాలం అంటే ఏమిటో, దాని దశలు ఏమిటో అధ్యయనం చేయాలి. బిడ్డ పుట్టిన ఆరువారాల తర్వాత మరోసారి చెకప్‌కు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎవరికైనా సిజేరియన్ డెలివరీ అయినట్లయితే మరో రెండు వారాల తర్వాత డాక్టర్ చెకప్‌కు వెళ్లాలి. ప్రసవానంతరం చేసే కొన్ని వైద్య పరీక్షలు..
ఈ చెక్స్ మాత్రమే కాకుండా అదనంగా.. ఇతర చెకప్స్ మరియు టెస్టుల కోసం మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
ప్రసవానంతర కాలంలో స్త్రీ తన బరువును కోల్పోతుంది. ఎందుకంటే.. ఈ స్టేజ్‌లో ఉమ్మనీరు, ప్లాసెంటా, మరియు ఇతర ద్రవాలు శరీరం నుంచి బయటకు వెళ్తాయి. శరీరం గర్భధారణకు ముందు ఉండే స్థితిలోకి వస్తుంది.
ప్రసవానంతర కాలంలో బర్త్ కంట్రోల్ పిల్స్‌ను వాడడం మానేయాలి. ఎందుకంటే ఇవి తల్లిపాల సరఫరాపై ప్రభావం చూపుతాయి. తల్లిపాలు ఇవ్వని స్త్రీలు బిడ్డ పుట్టిన మూడు వారాల తర్వాత బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం స్టార్ట్ చేయొచ్చు.
ప్రసవానంతర కాలం ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు ఉంటుంది.
ప్రసవం తర్వాత మహిళలు పండ్లు, కూరగాయలు, మరియు తృణధాన్యాలను అధికంగా తినాలి. అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, అధిక ఉప్పు లెవెల్స్ కలిగి ఉన్న ప్యాకేజ్ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకూడదు.
ప్యూర్పెరియం మరియు పోస్ట్‌పార్టమ్ మధ్య ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే రెండూ ఒకే విషయాన్ని సూచిస్తాయి. స్త్రీలలో శారీరక మార్పులు తగ్గినపుడు వారు గర్భధారణకు ముందు స్థితికి వచ్చినపటి సమయం.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)