hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • ప్రసవం తర్వాత మీ ఆహారంలో చేర్చాల్సిన 5 ముఖ్యమైన పోషకాలు (Top 5 nutrients to include in your diet after childbirth in Telugu) arrow

In this Article

    Care of Mother Post Delivery

    ప్రసవం తర్వాత మీ ఆహారంలో చేర్చాల్సిన 5 ముఖ్యమైన పోషకాలు (Top 5 nutrients to include in your diet after childbirth in Telugu)

    3 November 2023 న నవీకరించబడింది

    మనం బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటే, ఆ రోజు నుండే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించాలి. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, పిండానికి అన్ని విధాలుగా పోషణ అవసరం. ఈ సమయంలో గర్భిణీ స్త్రీ తన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే, ఆమె, బిడ్డ ఇద్దరూ వారి జీవితాంతం ప్రయోజనం పొందుతారు. ఇది గర్భిణీ స్త్రీ ఏది తిన్నా, జీర్ణించుకోగలిగిన దాని యొక్క "రసం" లేదా సారం ద్వారా ఆమె లోపల ఉన్న పిండం పోషణ పొందుతుంది.

    మీరు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగించాలి. ఎందుకంటే మీరు పాలిచ్చే తల్లి, మీ బిడ్డ తల్లిపాలు ఇచ్చే సమయంలో తీసుకునే అన్ని పోషకాల కోసం మీ బిడ్డ మీపై ఆధారపడి ఉంటుంది. తల్లి పోషకాహారం తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యం, అభివృద్ధి పెరుగుతుంది. దీర్ఘకాలంలో, ఎదుగుతున్న బిడ్డకు ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే పౌష్టికాహారం తల్లి తన శరీరాన్ని బలోపేతం చేయడానికి, ఆమె సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి సహాయపడుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతర కాలం (ప్యూర్​పెరియం) దశలు ఏమిటి?

    ప్రసవానంతర ఆహారం యొక్క ప్రాముఖ్యత (Importance of a postnatal diet in Telugu)

    బిడ్డను ప్రసవించిన తర్వాత, 45 రోజుల పాటు మీ ప్రసవానంతర ఆహారం మీ బిడ్డకు, తల్లులకు చాలా అవసరం. కింద పేర్కొన్న కారణాల వల్ల ఇది చాలా ముఖ్యమైనది:

    (i) వేగంగా కోలుకోవడానికి సమతుల్యమైన, పోషకాలు ఉన్న ఆహారం అవసరం. ముఖ్యంగా సి-సెక్షన్ సర్జరీ విషయంలో, మీరు త్వరగా కోలుకోవడానికి మీ ఆహారం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి.

    (ii) మీ శిశువు అభివృద్ధికి చాలా ముఖ్యమైన తల్లి పాల సరఫరాను పెంచడానికి కొన్ని పోషకమైన ఆహారాలు కూడా అవసరం.

    (iii) కొత్తగా తల్లి అయిన వారు తమ బిడ్డ కోసం 24*7 పని చేస్తారు. దీని కోసం అదనపు శక్తి, బలం కోసం ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం అవసరం.

    ప్రసవానంతరం కొన్ని ఉత్తమ ఆహారాలు (Some best foods for Postpartum)

    ప్రసవానంతర ఆహారాలు, సాధారణ ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం మధ్య ఎక్కువ తేడా ఉండదు. మీ రోజువారీ ఆహారంలో చేర్చవలసిన ముఖ్యమైన పోషకాలు ఏమిటో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది-

    (i) పాలకూర, క్యారెట్, గుమ్మడికాయ, పొట్లకాయ, బ్రోకలీ, అవకాడో, క్యాబేజీ మొదలైన ఆకుపచ్చ ఆకు కూరలు.

    (ii) మామిడి, అరటి, నారింజ మొదలైన కాలానుగుణ, తాజా పండ్లు. యాపిల్స్, దానిమ్మపండ్లు తప్పనిసరిగా ప్రతిరోజూ తీసుకోవాలి.

    (iii) గోధుమలు, క్వినోవా, ఓట్స్, ముడి బియ్యం మొదలైనటువంటి తృణధాన్యాలు.

    (iv) పెరుగు, పాలు వంటి తక్కువ కొవ్వు ఉండే పాల ఆహారాలు. తల్లి పాల సరఫరాను పెంచడానికి పాలు కూడా అవసరం.

    (v) మీరు మాంసాహార ఆహారాన్ని తీసుకుంటే, కొవ్వు లేని మాంసం, గుడ్లు వంటి తక్కువ ఉండే కొవ్వు ప్రోటీన్‌లను భోజనంలో చేర్చండి.

    అలాగే మీ గైనకాలజిస్ట్ ఒమేగా 3, అయోడిన్, ఫ్యాటీ యాసిడ్స్, క్లోరిన్ వంటి అవసరమైన పదార్థాలను కలిగి ఉన్న కొన్ని మందులను మీకు సూచిస్తారు. వాటిని కూడా ఆహారంలో తీసుకునేలా చూడండి.

    ప్రసవానంతర డైట్ చార్ట్‌ను సిద్ధం చేయడానికి సంబంధించిన అంశాలు

    మీ డైట్ చార్ట్‌ను సిద్ధం చేస్తున్నప్పుడు, మీ డైట్ చార్ట్‌లో ఏమి చేర్చాలి, ఏవి ఉండకూడదు అనే దానిపై దృష్టి పెట్టండి -

    (i) జీవన శైలి - ఉద్యోగం చేసే మహిళ, తన బిడ్డను ప్రసవించిన తర్వాత ఉద్యోగం కొనసాగించాలనుకునే వారికి, నిశ్చల జీవనశైలితో పోలిస్తే మీ డైట్ చార్ట్ మరింత పోషకమైనదిగా ఉండాలి.

    (ii) చనుబాలు ఇవ్వడం - చనుబాలు ఇవ్వని లేదా పాక్షికంగా చనుబాలు ఇచ్చే వారితో పోలిస్తే, చనుబాలు ఇచ్చే తల్లులకు అవసరమైన పోషకాహారం భిన్నంగా ఉంటుంది.

    (iii) ఆహార ఎంపికలు - శాఖాహారులు, మాంసాహారులు, గుడ్డు తినేవారు, శాకాహారులు వారి పోషకాహార మూలం భిన్నంగా ఉన్నందున వారి డైట్ చార్ట్‌లు భిన్నంగా ఉంటాయి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మహిళలు బరువు తగ్గేందుకు డైట్ ప్లాన్

    ప్రసవానంతర ఆహార ప్రణాళిక నమూనా

    (i) అల్పాహారం - మీరు వోట్స్, ఫైబర్, పొటాషియం, విటమిన్‌లు పుష్కలంగా ఉన్న పండ్లను తీసుకోవచ్చు. అలాగే మీరు ఒక గ్లాసు పాలు లేదా ఒక కప్పు పెరుగు మొదలైనవి తీసుకోవచ్చు.

    (ii) మధ్యాహ్న భోజనం - మీరు కూరగాయలు, పప్పు, చపాతీ, సలాడ్ తీసుకోవచ్చు. లేదా శనగ పిండితో చేసిన అట్టు, పెరుగు, మొలకలు కూడా మీరు తీసుకోవచ్చు. లేదా రవ్వ ఇడ్లీ, సాంబార్, సలాడ్.

    (iii) రాత్రి భోజనం - వేయించిన బ్రోకలీ, క్యాబేజీ, బెల్ పెప్పర్ వంటి కూరగాయలతో తక్కువ-వేయించిన కొవ్వు లేని చికెన్‌ను తీసుకోవచ్చు. పప్పు, అన్నం, చపాతీ, సలాడ్ కూడా మీరు తీసుకోవచ్చు. లేదా ఒక కప్పు కాలానుగుణ కూరగాయలతో దాల్ ఖిచిడీ.

    (iv) మిడ్ మీల్ స్నాక్ - గ్రీక్ యోగర్ట్ లేదా స్మూతీ, వేయించిన శనగలు, ఖఖ్రా, పాప్‌కార్న్, గింజలు.

    ముగింపు

    అలాగే కొత్తగా తల్లి అయినా వారు, డెలివరీ తర్వాత వారి శరీరాన్ని తిరిగి మునుపటి స్థితికి తీసుకొని రావడానికి చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడే కొన్ని భారతీయ ఆహారాలు ఉన్నాయి. వీటిలో వాము, మొలకెత్తిన ధాన్యాలు, తినదగిన గమ్ (మునగ ఆకులు), డ్రై ఫ్రూట్స్, మెంతి గింజలు, జీలకర్ర, అల్లం గింజలు, వెల్లుల్లి, నువ్వులు, పసుపు మొదలైనవి ఉన్నాయి. ఇవి రోజువారీ పదార్థాలే కాబట్టి, మీరు ఎక్కువ శ్రమ లేకుండా పైన పేర్కొన్నవన్నీ చేర్చవచ్చు. ఆల్కహాల్, కెఫిన్, ఎక్కువ నూనె, కారంగా ఉండే ఆహారాలు, అలర్జీని కలిగించే ఆహారాలను తీసుకోకూడదు.

    Tags:

    Nutrients food after delivery in telugu, Must take foods after delivery in telugu, Top 5 nutrients to include in your diet after childbirth in English, Top 5 nutrients to include in your diet after childbirth in Hindi, Top 5 nutrients to include in your diet after childbirth in Bengali, Top 5 nutrients to include in your diet after childbirth in Tamil.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.