


Male Infertility
3 November 2023 న నవీకరించబడింది
ప్రస్తుత కాలంలో చాలా మంది జంటలు బిడ్డను కనడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది రహస్యం కాదు. తరచూ ఈ సమస్య గురించి మనకు వినిపిస్తూ ఉంటుంది. వంధ్యత్వంతో పోరాడే జంటలలో 1/3వ వంతు జంటలు పురుషుల వీర్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది జీవనశైలి ఎంపికలు, ఆరోగ్య సమస్యలు, జన్యు సమస్యలు మొదలైన వాటి వల్ల కావొచ్చు. గర్భధారణ హామీ ఇచ్చే ఖచ్చితమైన పద్ధతి లేనప్పటికీ.. ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ అనేది గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తుంది.
పురుషుల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉన్నాయి. తక్కువ స్పెర్మ్ కౌంట్, తక్కువ స్పెర్మ్ నాణ్యత, హార్మోన్ల అసమతుల్యత మరియు పునరుత్పత్తి మార్గంలో అడ్డంకులు ఇలా అనేకం ఉన్నాయి. ఈ కారణాలలో కొన్ని కారణాలు మన నియంత్రణలో లేనప్పటికీ, ఆహారం మరియు జీవనశైలి మార్పులను మెరుగుపరుచుకోవడం ద్వారా సంతానోత్పత్తిని మెరుగుపర్చుకోవచ్చు. ఫెర్టిలిటీ డైట్ ప్లాన్‌ను అనుసరించండం ఎక్కువ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు న్యూట్రీషియన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పురుషులు మరియు స్త్రీల సంతానోత్పత్తికి ముఖ్యమైనది.
యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. మరియు స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తాయి. ముదురు ఆకుకూరలు, బెర్రీలు మరియు టమోటాలు మొదలైన ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటి గురించి మిగతా బ్లాగులో వివరించబడింది.
ఫెర్టిలిటీ డైట్ ప్లాన్‌ను అనుసరించడంతో పాటుగా ఒత్తిడి స్థాయిలను మేనేజ్ చేసుకోవడం, చురుగ్గా ఉండడం వంటివి సంతానోత్పత్తిని పెంచుతాయి. వ్యాయామం అనేది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మరియు సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే విధంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ అలవాట్లు స్పెర్మ్ నాణ్యత మీద దుష్ప్రభావాన్ని చూపుతాయి.
చాలా మంది జంటలకు తెలిసిన విధంగా, గర్భం ధరించేందుకు ప్రయత్నించడం అనేది ఒక నిరాశపరిచే మరియు మానసికంగా కుంగదీసే ప్రక్రియ. గర్భం ధరించేందుకు ప్రయత్నిస్తున్నపుడు వారు ప్రతి విషయంలో తప్పు చేస్తున్నట్లు సులభంగా భావిస్తారు. వారు తాము తినే ఆహారం గురించి రెండోసారి ఆలోచిస్తారు. గర్భం దాల్చేందుకు అవకాశం ఉన్న ఆహారాలు ఇంకా ఏమైనా ఉన్నాయా (అవాయిడ్ చేయాల్సినవి) ఉన్నాయా? అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
గర్భధారణకు హామీ ఇచ్చే ఏ మ్యాజిక్ ఫుడ్ లేనప్పటికీ సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కొన్ని ఆహార ఎంపికలు ఉన్నాయి. వాటికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు... ప్రాసెస్ చేయబడిన మాంసాలు అయిన (బేకన్ మరియు సాసేజ్) తినే పురుషుల కంటే పౌల్ట్రీ మరియు చేపలు ఆహారంగా తినే వారిలో ఎక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఇతర అధ్యయనాల ప్రకారం... ఎక్కువ కొవ్వులు ఉండే డెయిరీ ఉత్పత్తులు మహిళల్లో తక్కువ సంతానోత్పత్తి కలిగేలా చేస్తాయి.
మీ ఫెర్టిలిటీ వెయిట్ లాస్ డైట్ ప్లాన్‌లో చేర్చాల్సిన ఆహారాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇక్కడ ఉన్నాయి.
1. గుడ్లు: గుడ్లు ప్రొటీన్ ఉత్పత్తికి గొప్ప మూలం. పునరుత్పత్తి ఆరోగ్యం కోసం అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్‌ను కలిగి ఉంటాయి.
2. సాల్మన్: సాల్మన్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.
3. స్పినాచ్ (బచ్చలికూర): బచ్చలికూరలో విటమిన్లు మరియు మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇది ఫోలిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియంను కలిగి ఉంటుంది. ఇవి పునరుత్పత్తి ఆరోగ్యానికి ఉపయోగకరమైనవి.
4. నట్స్ మరియు సీడ్స్: నట్స్ మరియు సీడ్స్‌లో జింక్, సెలెనియం మరియు విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు.
5. ఓట్స్: ఓట్స్ అనేవి ఫైబర్ యొక్క గొప్ప మూలం. ఇది హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలో B విటమిన్ కూడా ఉంటుంది. ఇది శక్తి ఉత్పత్తి మరియు జీవక్రియకు ముఖ్యమైది.
ఫెర్టిలిటీ డైట్ ప్లాన్ తో పాటుగా అనేక విభిన్న సప్లిమెంట్లు కూడా ఉన్నాయి. ఇవి పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయని తేలింది. ప్రజాదరణ పొందిన కొన్ని ఎంపికలు ఇక్కడ ఉన్నాయి.
1. CoQ10:
CoQ10 అనేది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది స్పెర్మ్ నాణ్యతతో పాటుగా చలనశీలతను పెంచడంలో కూడా సహాయపడుతుందని చూపబడింది.
2. L-కార్నిటైన్:
L-కార్నిటైన్ అనేది శక్తి ఉత్పత్తిలో పాల్గొనే ఒక అమైనో ఆమ్లం. ఇది కూడా స్పెర్మ్ నాణ్యతతో పాటుగా చలనశీలతను మెరుగుపరుస్తుందని చూపబడింది.
3. జింక్:
జింక్ అనేది మన శరీరంలోని అనేక ప్రక్రియలలో పాల్గొనే ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుందని మరియు టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుందని చూపబడింది.
4. విటమిన్ C:
విటమిన్ C ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా టెస్టోస్టిరాన్ స్థాయిలను కూడా పెంచుతుంది.
గర్భధారణ కోసం హామీ ఇచ్చే మ్యాజిక్ వ్యాయామాలు ఏవీ లేవు. కానీ మితమైన ఏరోబిక్ వ్యాయామాలు చేయడం మంచిది. ఇలా ప్రతి వారం కొన్ని 30 నిమిషాల సెషన్స్ వ్యాయామం చేయాలి. రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా గర్భం దాల్చడంలో సహాయపడొచ్చు. పురుషులలో సడలింపు అనేది స్పెర్మ్ కౌంట్ మరియు చలనశీలతను పెంచేందుకు సహాయపడుతుంది. మహిళల్లో రిలాక్సేషన్ అనేది ఒత్తిడి స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది. తద్వారా హార్మోన్ల స్థాయిలు ప్రభావితం అయి.. ఒవొల్యూషన్ (అండోత్సర్గము) అవకాశాలను మెరుగుపరుస్తుంది.
చివరగా
పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరిచేందుకు సమతుల్య ఆహారం ఉపయోగపడుతుందని చెప్పేందుకు చాలా డేటా ఉంది. వంధ్యత్వ సమస్యలు ఎదుర్కొనే పురుషులు ఫెర్టిలిటీ బూస్టింగ్ డైట్ ప్లాన్ (సంతానోత్పత్తిని పెంచే డైట్ ప్లాన్) తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)