This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

పుట్టినప్పటి నుండి 1 ఏడాది వరకు మీ పసిబిడ్డకి ఆహారంగా ఏం పెట్టాలి (What to Feed Your Baby from Birth to 1 Year in Telugu)

Diet & Nutrition
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 28, 2023
పుట్టినప్పటి నుండి 1 ఏడాది వరకు మీ పసిబిడ్డకి ఆహారంగా ఏం పెట్టాలి (What to Feed Your Baby from Birth to 1 Year in Telugu)
Likes8 Likes|
Read time7 min

కొత్తగా తల్లిదండ్రులవ్వటం సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత సవాలుగా మారుతుంది. మొదటి కొన్ని నెలలలో తల్లి పాలు లేదా ఫార్ములా పాలు ఇవ్వాలి. బిడ్డ ఎదగడం ప్రారంభించినప్పుడు, బేబీ పెరుగుదల ఇంకా అభివృద్ధి కోసం చాలా రకాల ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం మొదలుపెట్టండి. బిడ్డ ఎన్ని ఔన్సులు తీసుకోవాలి, వారు ఎప్పుడూ ఎందుకు ఆకలితో ఉన్నట్టు కన్పిస్తారు అలాగే వారు ఎప్పటినుండి ఘనపదార్థాలు తినడం మొదలుపెట్టాలి వంటి చాలా ప్రశ్నలు కొత్తగా తల్లిదండ్రులైన వారికి రావచ్చు. అందుకని ఇక్కడ, మేము పుట్టినప్పటి నుండి 1 ఏడాది వయస్సు వచ్చే వరకూ పాటించదగ్గ సమగ్రమైన పసిబిడ్డల డైట్ చార్టుని మీతో పంచుకుంటున్నాం.

పసిబిడ్డల డైట్ ఛార్టు: పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు (Baby Diet Chart: From Birth to 6 Months in Telugu)

ఈ వయస్సులో జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకని దానికి ఘన ఆహారం పడదు. అప్పుడే పుట్టిన పసిబిడ్డకి నాలుగు నెలల వరకూ తల్లి పాలు లేదా ఫార్ములా పాలు మాత్రమే ఆహారంగా పట్టండి. 0-6 నెలల పసిబిడ్డల డైట్ ఛార్టు ఇక్కడ ఇవ్వబడింది:

0-1 నెల: ప్రతి 2-3 గంటలకు తల్లి పాలు ఇంకా ప్రతి 3-4 గంటలకు ఫార్ములా పాలు (2-3 ఔన్సులు) ఇవ్వండి; అవి తల్లి పాలు అయినా లేదా ఫార్ములావి అయినా, మీ బిడ్డకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు రోజులో 8-12 సార్లు పాలుపట్టడం కొనసాగించండి.

1-2 నెలలు: తల్లి పాలు (8 నుండి 12 సార్లు/రోజుకి) ప్రతి 2-3 గంటలకు ఒకసారి లేదా ఫార్ములా పాలు (రోజులో 7-8 సార్లు) దాదాపు 4 ఔన్సులు.

2-4 నెలలు: తల్లి పాలు (రోజులో 6-7 సార్లు) ప్రతి 3-4 గంటలకి ఒకసారి లేదా ఫార్ములా పాలు, దాదాపు (6 సార్లు ఒక రోజుకి) 4-6 ఔన్సులు.

4-6 నెలలు: తల్లి పాలు (రోజుకు సుమారు 7 సార్లు) ప్రతి 3-4 గంటలకు ఒకసారి లేదా ఫార్ములా పాలు (రోజుకు 6 నుండి 7 సార్లు) సుమారు 4-8 ఔన్సులు; తృణధాన్యాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టండి.

సాధారణంగా, బిడ్డకు 4-6 నెలల వయస్సు ఉన్నప్పుడు ఘనపదార్థాలని ఆహారంగా ఎప్పుడైనా పెట్టవచ్చు. మొదటి నెలల్లో, ఘనపదార్థాలను గుజ్జుగా చేసి పెట్టాలి. 1 లేదా 2 చెంచాల కొద్ది కొద్ది పరిమాణాలలో ఘన ఆహారాన్ని పరిచయం చేయండి, అలా పరిమాణాన్ని పెంచుతూ పోండి. తల్లిదండ్రులు పిల్లలకి సంబంధించిన తృణధాన్యాలతో కూడా మొదలుపెట్టి తర్వాత గుజ్జు చేసిన పండ్లు, కూరగాయలు అలాగే మాంసాన్ని పరిచయం చేయవచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ బేబీ కోసం ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలి? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

6-నెలల పసిబిడ్డ డైట్ ఛార్టు (6-month Baby Diet Chart in Telugu)

పసిపిల్లల కోసం డైట్ ఛార్టుని రూపొందించండి, ఇందులో అన్ని ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా చూసుకోండి. ఇక్కడ మీకోసం 6-నెలల వయస్సున్న పసిబిడ్డల పూర్తి డైట్ ఛార్టు ఇవ్వబడింది:

వారం-1

  • రోజుకి ఒకసారి ఒక చెంచా ఆపిల్ గుజ్జుతో మొదలుపెట్టండి
  • సమయం గడిచేకొద్దీ ఈ గుజ్జులని రోజుకు రెండుసార్లు పెంచండి. క్రమంగా, ఒక కొత్త ఘనపదార్థం, అంటే కాయగూరలాంటిది పరిచయం చేయండి.
  • క్యారట్ గుజ్జు రోజుకి ఒక చెంచా పెట్టండి. తర్వాత రోజుకి రెండుసార్లు 3 చెంచాలకి పెంచండి.
  • ఈ వారం మొత్తం పొద్దున పూట ఆపిల్ గుజ్జుని, సాయంత్రం పూట క్యారట్ గుజ్జుని పెట్టండి.
  • తల్లి పాలు లేదా ఫార్ములా పాల కోసం మీ బిడ్డ ఎదురుచూసినప్పుడు అలా పట్టడానికి ఒక దినచర్యని అనుసరించండి.

వారం-2

ఇప్పుడు మీ బిడ్డ పాలే కాకుండా ఇతర ఘనపదార్థాల ఆహారానికి కూడా అలవాటు పడింది, తల్లి పాలు లేదా ఫార్ములా పాలతో పాటు రోజూ రెండు సార్లు ఘన పదార్థాలతో ఉన్న భోజనాన్ని పెట్టడం కొనసాగించండి. 6-నెలల పసిబిడ్డ డైట్ ఛార్టులో భాగమయ్యే కొన్ని ఆహార పదార్థాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • క్యారట్ గుజ్జు
  • బియ్యం ఉగ్గు
  • ఆపిల్ గుజ్జు
  • బార్లీ ఉగ్గు
  • బంగాళదుంప గుజ్జు
  • అరటిపండు గుజ్జు
  • గుమ్మడికాయ

వారం-3

  • ఆపిల్ గుజ్జు
  • బార్లీ గుజ్జు
  • పియర్ పండు గుజ్జు
  • రాగి జావ
  • క్యారట్ జావ
  • అన్నం ఉగ్గు
  • బార్లీ ఉగ్గు
  • చిలకడదుంప గుజ్జు
  • బంగాళదుంప గుజ్జు
  • తల్లిపాలు లేదా ఫార్ములా పాలు

వారం-4

  • ఆపిల్ గుజ్జు
  • ఓట్స్ ఉగ్గు
  • బియ్యం ఉగ్గు
  • సొరకాయ గుజ్జు
  • అవకాడో గుజ్జు
  • ఉడకబెట్టిన పప్పు
  • రాగి జావ
  • అరటిపండు గుజ్జు
  • బార్లీ ఉగ్గు

తల్లిపాలు లేదా ఫార్ములా పాలు, గుజ్జు చేసిన పండ్లు, కాయగూరలు ఇంకా తృణధాన్యాలే కాకుండా, ఈ వారం నుండి మెత్తగా ఉడికించి చిదిమిన పప్పులని కూడా పెట్టండి.

7-నెలల పసిబిడ్డ డైట్ ఛార్టు (7-month Baby Diet Chart in Telugu)

ఏడు నెలల పసిపిల్లలు సాధారణంగా ఈ పెద్ద భోజనాల మధ్య మూడుసార్లు ఘన ఆహారాలు తినడం అలాగే రెండుసార్లు చిరుతిళ్ళు తినడం చేస్తారు. మెత్తగా ఉడికించి చిదిమిన పప్పులు పెట్టడంతో మొదలుపెట్టండి. ఉదయం ఇంకా రాత్రి తల్లి పాలని ఇవ్వటం కూడా దినచర్యలో భాగమే. 7-నెలల పసిబిడ్డ డైట్ ఛార్టులో భాగంగా చేర్చదగిన కొన్ని ఘన ఆహార పదార్థాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • పండ్ల గుజ్జు
  • కాయగూరలు
  • జావ
  • మాంసపు గుజ్జు
  • గుడ్లు
  • చీజ్
  • ఖిచిడి

8-నెలల పసిబిడ్డ డైట్ ఛార్టు (8-month Baby Diet Chart in Telugu)

సాధారణంగా, 8-నెలల పసిబిడ్డ డైట్ ఛార్టులో భాగంగా చేర్చదగిన కొన్ని ఆహార పదార్థాలు:

  • పండ్లు
  • కాయగూరలు
  • చేపలు
  • టోఫూ/పనీర్
  • చికెన్
  • చీజ్
  • గుడ్లు
  • పెరుగు
  • చిక్కుళ్ళు

10-నెలల పసిబిడ్డ డైట్ ఛార్టు (10-month Baby Diet Chart in Telugu)

తల్లిపాలు అలాగే ఫార్ములా పాలతోపాటు, 10-నెలల పసిబిడ్డ డైట్ ఛార్టులో చేర్చదగిన ఆహార పదార్థాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • చిదిమిన పళ్ళు మరియు కాయగూరలు, గుజ్జు రూపంలోనివి కావు
  • చీజ్ మరియు కాటేజ్
  • తృణధాన్యాల పఫ్లు, బిస్కట్లు లేదా క్రాకర్లు అలాగే బ్రెడ్ వంటి చిరుతిళ్ళు
  • ఓట్స్,రాగి మరియు బార్లీ వంటి తృణధాన్యాలు
  • అన్నం, పప్పు ఇంకా గుమ్మడికాయ కూర
  • ఇడ్లీ
  • దోశ
  • ఖిఛిడి మరియు పెరుగు
  • వెజ్ పులావు మరియు పెరుగు
  • చపాతీ మరియు పప్పు
  • దలియా
  • చేపలు
  • ఉడకబెట్టిన చికెన్ పులుసు

1-ఏడాది వయసున్న పసిబిడ్డ డైట్ ఛార్టు (1-year Baby Diet Chart in Telugu)

ఒక సంవత్సరం వయస్సు ఉన్న పిల్లలకు ఏదో ప్రత్యేకమైన ఆహారం వండి పెట్టాలనే ఒత్తిడి పడనవసరం లేదు. ఇతర కుటుంబ సభ్యులు ఏది తింటే అదే మీ బేబీ కూడా తినవచ్చు. తల్లిపాలు అలాగే ఫార్ములా పాలతోపాటు, 1-ఏడాది పసిబిడ్డ డైట్ ఛార్టులో చేర్చదగిన ఆహార పదార్థాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • మెత్తగా వండిన కాయగూరలు ఇంకా పండు (తక్కువ పరిమాణంలో)
  • అన్నం మరియు పప్పు
  • ఇడ్లీ
  • జావ
  • బాగా-ఉడికిన చిక్కుళ్ళు
  • మాంసం యొక్క చిన్న ముక్కలు
  • చేపలు
  • పసిపిల్లల ప్రత్యేక ఫింగర్ ఫుడ్స్ (పసిపిల్లలు సులువుగా తినగలిగే తక్కువ పరిమాణాల పదార్థాలు)
  • ఐరన్ జోడించిన తృణధాన్యాలు

చివరిమాట (Closing Words)

బిడ్డకి ఆహారంగా ఏం పెట్టాలి అన్నది ప్రతి తల్లిదండ్రుల యొక్క ప్రాథమిక ఆందోళన. వారికి సరైన సమయంలో సరైన ఆహారం ఇస్తూ వివిధ ఆహార పదార్థాల పట్ల వారి ప్రతిచర్యని గుర్తిస్తూ శ్రద్ధ వహించండి. చాలా మంది పిల్లలు ఆకలితో ఉన్నా లేకున్నా వారి చేతలతో ప్రతిస్పందిస్తారు. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ఆందోళనలు ఉంటే, మీ పిల్లల డాక్టరుని సంప్రదించి వారి సహాయం తీసుకోండి.

Tags:

Baby diet chart in telugu, best foods for your baby in telugu, diet chart for your baby from birth to 1 year in telugu, Wha t to Feed Your Baby from Birth to 1 Year in English, Wha t to Feed Your Baby from Birth to 1 Year in Hindi, Wha t to Feed Your Baby from Birth to 1 Year in Tamil, Wha t to Feed Your Baby from Birth to 1 Year in Bengali.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
Feeding Tracker
Baby's feeding schedule made easy
arrow_right
undefined icon
Baby Names
Search names with meanings
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
Nayana Mukkamala
Nayana Mukkamala

Related Articles

Questions about this article

  • Asked when Mother of 7 Months Old Baby

    7 months 5days avuthuindhi madam babu ki doctor chepparu weight gain avuthaledhu anaru 7kg 300grams vunadu health ga weight avali good food cheppandi

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.