


Potty Training
3 November 2023 న నవీకరించబడింది
ఈరోజుల్లో, తమ పిల్లలకు పాటీ ట్రైనింగ్ అంటే కాలకృత్యాల శిక్షణ ఇవ్వడం తల్లిదండ్రులకు చాలా ముఖ్యమైన పనిగా మారింది. పిల్లలకు సరైన పాటీ సీట్ ఎంచుకుంటే వారికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, టాయిలెట్ ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఎలాంటి పాటీ సీట్ తీసుకోవాలి? ఈ విషయం తెలుసుకోవడానికి మార్కెట్లో పిల్లలకు అందుబాటులో ఉన్న బెస్ట్ పాటీ సీట్స్ గురించి చర్చించే ఈ ఆర్టికల్ చదవండి.
పిల్లలకు ఏ పాటీ సీట్ బెస్ట్ అని తెలుసుకోవాలనుకునే తల్లిదండ్రులకు, ఇక్కడ కొన్ని పాటీ సీట్స్ గురించి వివరించాం. నవజాత శిశువులు, పసిపిల్లలకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ టాయిలెట్ ట్రైనింగ్ సీట్స్ ఇవే:
పిల్లలు పాటీ సీట్‌పై ఎలా కూర్చునేలా చేయాలి, పసిపిల్లలకు ఏ పాటీ ట్రైనింగ్ సీట్ బాగుంటుంది అని కొత్తగా తల్లిదండ్రులు అయినవాళ్లు ఆలోచిస్తూ ఉంటారు. రెండు రకాల పాటీ ట్రైనింగ్ సీట్స్ బాగుంటాయి. పిల్లల అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. సాధారణంగా, పసిపిల్లలకు పాటీ ట్రైనింగ్ సీట్ బాగుంటుంది. ఇది శిశువులు, చిన్నపిల్లల కోసం రూపొందించినదాని కన్నా స్థిరంగా, సురక్షితంగా ఉంటుంది. పాటీ సీట్ ఉపయోగించే పిల్లల వయస్సు కనీసం 18 నెలలైనా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి. అయినా కొందరు పిల్లలు 2 లేదా 3 ఏళ్లకు రెడీగా ఉంటారు. అయితే ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాటీ ట్రైనింగ్ అనేది సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. పిల్లలు పూర్తిగా సౌకర్యవంతంగా, నమ్మకంగా టాయిలెట్ ఉపయోగించడానికి కొంత సమయం పడతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పసి పిల్లలకు పాటీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? అందుకోసం కొన్ని టిప్స్!
బెస్ట్ బేబీ పాటీ సీట్స్ ఉపయోగిస్తే పిల్లలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన కాలకృత్యాల శిక్షణ అనుభవం లభిస్తుంది. పిల్లలు డైపర్ల నుంచి టాయిలెట్‌కు వేగంగా మారడానికి వీటిని డిజైన్ చేశారు. అందుకోసం, మీరు బెస్ట్ పాటీ ట్రైనింగ్ సీట్ ఏదో తెలుసుకోవాలి. బెస్ట్ పాటీ ట్రైనింగ్ సీట్ అంటే కేవలం సీట్ మాత్రమే కాదు. అందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. హైట్ అడ్జెస్ట్ చేసుకోవచ్చు. స్ప్లాష్ గార్డ్స్ ఉంటాయి. పిల్లలకు కాలకృత్యాల శిక్షణ సులభంగా ఉండేలా సౌకర్యవంతమైన డిజైన్‌తో వస్తాయి.
బెస్ట్ బేబీ పాటీ సీట్స్ కొనేముందు కొత్తగా తల్లిదండ్రులు అయినవారికి రకరకాల ఆలోచనలు వస్తాయి. తమ పిల్లలకు బెస్ట్ పాటీ ట్రైనింగ్ సీట్ ఏదని ఆలోచిస్తారు. పాటీ సీట్ కొనేముందు పిల్లల వయస్సు, ఎత్తు, బరువు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పాటీ ట్రైనింగ్ సీట్స్‌లో అడ్జెస్టబుల్ హైట్ సెట్టింగ్స్ ఉంటాయి. రిమూవబుల్ పాటీ సీట్స్ ఉన్నవి తీసుకుంటే పిల్లలకు ఉపయోగించడం సులువుగా ఉంటుంది. పెద్దవారి సాయం లేకుండా వాడుకోవచ్చు.
పాటీ ట్రైనింగ్ సీట్స్ ఉపయోగించిన ప్రతీసారి శుభ్రం చేయాలి. చాలావరకు పాటీ సీట్స్ ప్లాస్టిక్‌తో తయారుచేసినవే ఉంటాయి కాబట్టి సులువుగా కడగొచ్చు. వేడి నీళ్లు, సబ్బుతో కడగొచ్చు. బట్టతో క్లీన్ చేయొచ్చు. మంచి ఫలితాల కోసం పిల్లల చర్మానికి హాని కలిగించని డిటర్జెంట్ ఉపయోగించాలి.
రెండేళ్ల పిల్లలకు మంచి టాయిలెట్ సీట్ విషయానికి వస్తే, హైట్ సెట్టింగ్ ఉన్న, పాటీ సీట్‌ను తీసివేసేలా ఉన్నది ఎంచుకోవాలి. బేబీ పాటీ ట్రైనింగ్ సీట్స్‌లో చేతులకు సపోర్ట్ ఇచ్చే డిజైన్‌తో ఉంటాయి. పాటీ ట్రైనింగ్ సమయంలో పిల్లలకు సపోర్ట్ లభిస్తుంది. మంచి పాటీ ట్రైనింగ్ సీట్స్ విషయానికి వస్తే అడ్జెస్టబుల్ హైట్, స్ప్లాష్ గార్డ్స్, సౌకర్యవంతమైన డిజైన్ లాంటివి తీసుకుంటే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాన్-స్కిడ్ అంటే పిల్లలు కూర్చున్నప్పుడు జారకుండా ఉండే సీట్ ఉన్నది తీసుకోవాలి.
పిల్లల వ్యక్తిగత అవసరాలపై ఇది ఆధారపడి ఉంటుంది. పిల్లలు టాయిలెట్ ఉపయోగించడం అలవాటు చేసుకోవడానికి పాటీ ట్రైనింగ్ సీట్స్ సాయపడతాయి. అవి వారికి ఎక్కువ స్థిరంగా, అదనపు రక్షణతో ఉంటాయి. చాలావరకు పాటీ ట్రైనింగ్ సీట్స్ టాయిలెట్ సీట్‌పైన పెట్టుకునేలా ఉంటాయి. పిల్లలు సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉపయోగించవచ్చు. పిల్లల ఎత్తు, సైజ్‌ని బట్టి పాటీ ట్రైనింగ్ సీట్స్‌ని అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
బెస్ట్ పాటీ సీట్స్ పిల్లలకు ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలు ఇప్పుడిప్పుడే పాటీ ట్రైనింగ్ ప్రారంభిస్తున్నా, వారికి పాటీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్లు ఉన్నా, పాటీ సీట్స్ ఉపయోగపడతాయి. సౌకర్యవంతంగా, మంచి సపోర్ట్ ఉంటే పిల్లలు తామే స్వయంగా బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. బెస్ట్ బేబీ పాటీ సీట్స్ ఉపయోగించడం ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని భావించవచ్చు. ఈ ఆర్టికల్‌లో, బెస్ట్ బేబీ పాటీ సీట్స్ ఏవి, సరైన పాటీ సీట్ ఎలా ఎంచుకోవాలి, పిల్లలు సౌకర్యవంతంగా ఎలా కూర్చోవాలి అని తెలుసుకున్నారుగా. ఈసారి పాటీ సీట్ కొనేముందు ఇవన్నీ పాటించండి.

Potty Seat - Green & Yellow
Baby Potty Chair | 2-in-1 Potty Training Chair with Detachable Potty Bowl | Easy to Carry & Clean
₹ 799

4.4
(56)


115 Users bought
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)