
కొత్తగా తల్లిదండ్రులు అయినవారు చేయాల్సిన పనుల్లో శిశువు డైపర్స్ మార్చడం లిస్ట్‌లో టాప్‌గా ఉంటుంది. ఇది వారికి కాస్త ఆందోళన కలిగించే అంశం. ఎక్కువమంది పిల్లలు కుదురుగా ఉండరు కాబట్టి, న్యాపీస్ మార్చడం కాస్త గజిబిజిగా ఉండటం మామూలే. అయితే పిల్లలు పాలు తాగి, విసర్జన చేసే ప్యాటర్న్ అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు కాస్త సమయం పడుతుంది. డైపర్ మార్చే సమయం విషయానికి వస్తే పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సాధారణంగా.. నవజాత శిశువులకు గంటకు 2-3 సార్లు డైపర్ మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులు క్లాత్ డైపర్ ఉపయోగిస్తున్నట్టైతే.. ప్రతీ 90 నిమిషాలకు ఓసారి మార్చాలి. నవజాత శిశువులకు చిట్టి బొజ్జలు ఉండటం, వారికి ఎదుగుదల అవసరం కాబట్టి ప్రతీ 2-3 గంటలకు ఓసారి తల్లిపాలు ఇవ్వాలి. వాళ్లు పెరుగుతున్నకొద్దీ ఘన పదార్థాలు తినడం మొదలుపెడతారు కాబట్టి తర్వాత శిశువు డైపర్ మార్చే సమయం తగ్గుతుంది.
శిశువుల చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకే వారి చర్మం తడిగా అయిన వెంటనే న్యాపీస్ మార్చడం అవసరం. డైపర్స్ తడిగా ఉంటే ర్యాషెస్ రావడానికి కారణం అవుతాయి. తొడలు, జననాంగాలు, పిరుదులపై చర్మం ఎరుపుగా, ప్యాచీగా కనిపిస్తుంది. దీని వల్ల పిల్లలకు చికాకుగా ఉంటుంది. డైపర్ మార్చే సమయంలో పిల్లలు గజిబిజిగా చేస్తుంటారు. పిల్లలు మూత్రానికి వెళ్తే కాస్త ఆలస్యంగానైనా డైపర్ మార్చొచ్చు. ఎందుకంటే డైపర్ మూత్రాన్ని పీల్చేస్తుంది కాబట్టి. కానీ శిశువు మల విసర్జన చేస్తే వెంటనే డైపర్ మార్చడం తప్పనిసరి.
నవజాత శిశువు రోజులో 10-20 సార్లు మూత్రవిసర్జన చేస్తారు. పుట్టిన కొన్ని వారాల వరకు మల విసర్జన రోజులో సుమారుగా నాలుగు సార్లు చేస్తుంటారు. పిల్లలు మలవిసర్జన చేసిన ప్రతీ సారి డైపర్ మార్చాలి. పిల్లలు పుట్టిన కొన్ని రోజుల వరకు ప్రతీ 2-3 గంటలకు ఓసారి డైపర్ మార్చడం మంచిది. పిల్లలు కాస్త పెద్దైన తర్వాత రోజులో 6-8 సార్లు డైపర్ మార్చితే చాలు. ర్యాషెస్ రాకుండా చూసుకునేందుకు డిస్పోజబుల్ డైపర్స్‌ని నిద్రపోవడానికి ముందు తప్పనిసరిగా మార్చాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
నవజాత శిశువుల్లో అన్ని డైపర్లను ప్రతీ 2 గంటలకు ఓసారి తప్పనిసరిగా మార్చెయ్యాల్సిందే. అంటే రోజులో 10-12 సార్లు డైపర్ మార్చాలి. కాస్త పెద్దైన పిల్లలకు మాత్రం 3-4 గంటలకు ఓసారి డైపర్ మారిస్తే చాలు. అంటే రోజులో 6-8 సార్లు డైపర్ మార్చాల్సి ఉంటుంది. క్లాత్ న్యాపీస్ ఉపయోగించడం గొప్ప ప్రత్యామ్నాయంగా చెప్పుకోవాలి. కాకపోతే వాటిని ఉపయోగించేముందు శుభ్రంగా ఉంచడానికి కాస్త శ్రమ అవసరం. క్లాత్ డైపర్లను 60 డిగ్రీల సెల్సియస్ దగ్గర మెషీన్ వాష్ చేయొచ్చు. పిల్లలకు ర్యాషెస్ రాకుండా ఉంచేందుకు రీయూజబుల్ క్లాత్ బేబీ న్యాపీస్ కింద డైపర్ లైనర్స్ ఉపయోగించాలి.
పిల్లలకు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత డైపర్ మార్చాలి. ఆకలితో ఉన్న పిల్లలు కాస్త గందరగోళం చేస్తుంటారు కాబట్టి, ఫీడింగ్ కన్నా ముందు డైపర్ మార్చడం కొత్త తల్లిదండ్రులకు కష్టంగా ఉంటుంది. అందుకే పాలు ఇచ్చిన తర్వాత పిల్లలు కాస్త శాంతం అవుతారు. అప్పుడు డైపర్ మార్చడం తల్లిదండ్రులకు సులువుగా ఉంటుంది.
రాత్రి సమయంలో పిల్లలు డైపర్ తడిపేస్తే తప్ప వాటిని మార్చాల్సిన అవసరం ఉండదు. చాలావరకు డైపర్స్ ఎలాంటి లీక్ లేకుండా 12 గంటల పాటు బాగానే ఉంటాయి. అందుకే రాత్రి సమయంలో తల్లిదండ్రులకు పిల్లల డైపర్ మార్చాల్సిన అవసరం రాదు. శిశువు పాలు తాగడానికి నిద్రలేచినప్పుడు, ఫీడింగ్ పూర్తైన తర్వాత డైపర్ మార్చొచ్చు. అయితే పిల్లలకు జీర్ణసంబంధమైన సమస్యలు ఏవైనా ఉన్నా, ఎక్కువగా మూత్ర విసర్జన లేదా మల విసర్జన చేస్తున్నా కొన్ని గంటలకు ఓసారి చెక్ చేస్తూ ఉండాలి.
కొద్ది సేపు తడిగా ఉండటం వల్ల వచ్చే ఇబ్బందేమీలేదు. ఎందుకంటే డైపర్స్ తడిని పీల్చేస్తాయి కాబట్టి మార్చాల్సిన అవసరం ఉండదు. అయితే పిల్లలు 2-3 సార్లు మూత్రం పోశారంటే డైపర్ మార్చాలని గుర్తుంచుకోవాలి. పిల్లల్ని తడిగా ఉన్న డైపర్‌లో ఎక్కువసేపు ఉంచడం వల్ల డైపర్ ర్యాష్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బేబీ మలవిసర్జన చేసినట్టైతే, వెంటనే డైపర్ మార్చడం మంచిది. కాళ్ల మధ్య డైపర్ కుంగిపోతున్నట్టు కనిపించిందంటే డైపర్ మార్చే సమయం వచ్చిందని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.
అవును, బేబీ వైప్స్ లేదా మస్లిన్ మెటీరియల్స్‌తో శిశువును వైప్ చేయడం అవసరం. వైప్స్‌తో తుడవకపోతే ర్యాషెస్ రావడం లేదా ఇన్ఫెక్షన్స్ సోకడం లాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. తల్లిదండ్రులు డైపర్స్ మార్చడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శిశువు సంరక్షణకు ఉపయోగపడతాయి. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి:
· శిశువుకు డైపర్ మార్చే సమయంలో తల్లిదండ్రులు వారి చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
· శిశువును వెచ్చని నీళ్లు, పత్తితో లేదా బేబీ వైప్స్‌తో తుడవాలి. పిల్లలు మూత్రవిసర్జన లేదా మలవిసర్జన చేసినా చేయకపోయినా డైపర్ వేసేముందు శుభ్రం చేయడం మంచిది.
· చర్మం మడతలు పడే చోట పూర్తిగా శుభ్రం చేయాలి. ముఖ్యంగా జననాంగాల దగ్గర శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
· స్నానం చేసిన తర్వాత పిల్లలు తడిగా ఉన్నట్టైతే, వారిని న్యాపీ మ్యాట్ పైన పడుకోబెట్టి, తడి ఆరిపోయేవరకు వేచిచూడాలి. ఇవన్నీ చేయకుండా న్యాపీ వేస్తే వారికి ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
· ఇక సరైన న్యాపీ సైజ్ ఎంపిక చేయడం కూడా అవసరమే. మరీ లూజ్‌గా లేదా టైట్‌గా ఉన్న డైపర్ తీసుకోవద్దు.
కొత్త తల్లిదండ్రులకు, డైపర్ మార్చడం కాస్త చిక్కైన ప్రక్రియే. అయితే డైపర్ మార్చడానికి కఠినమైన, వేగవంతమైన రూల్ అంటూ ఏమీ లేదు. రోజులు గడుస్తున్నకొద్దీ తల్లిదండ్రులే ఈ స్కిల్స్ నేర్చుకుంటారు. ప్రతీ శిశువు భిన్నంగా ఉంటారన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల రొటీన్ ఏంటో తెలుసుకొని ఎప్పుడు డైపర్ మార్చడం అవసరం అన్న విషయాన్ని గుర్తించాలి. అవసరమైతే డైపర్ ఫ్రీక్వెన్సీ చార్ట్ ప్రిపేర్ చేస్తే న్యాపీస్ మార్చే ప్రక్రియ సులువు అవుతుంది.
Yes
No


















mere grand daughter k lyh yeh diaper liyeh hai bhaut aachi quality hai and rash bhi nhi hota hai
Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |