hamburgerIcon

Search for Baby

Orders

login

Profile

Skin CareHair CarePreg & MomsBaby CareDiapersMoreGet Mylo App

Get MYLO APP

Install Mylo app Now and unlock new features

💰 Extra 20% OFF on 1st purchase

🥗 Get Diet Chart for your little one

📈 Track your baby’s growth

👩‍⚕️ Get daily tips

OR

Cloth Diapers

Diaper Pants

Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART

Article Continues below advertisement

  • Home arrow
  • Travel & Holidays arrow
  • పసిబిడ్డతో ప్రయాణాలు: ముఖ్యమైన భద్రతా చిట్కాలు (Traveling with a Newborn: Important Safety Tips in Telugu) arrow

In this Article

    పసిబిడ్డతో ప్రయాణాలు: ముఖ్యమైన భద్రతా చిట్కాలు (Traveling with a Newborn: Important Safety Tips in Telugu)

    Travel & Holidays

    views icons5

    పసిబిడ్డతో ప్రయాణాలు: ముఖ్యమైన భద్రతా చిట్కాలు (Traveling with a Newborn: Important Safety Tips in Telugu)

    31 July 2023 న నవీకరించబడింది

    చాలామంది వైద్యులు సాధారణంగా మీ పసిబిడ్డతో మీరు ఎలాంటి కష్టతరమైన ప్రయాణాలు చేయకూడదని సిఫార్సు చేస్తారు. మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లయితే ఎత్తు ఇంకా విమానం లోపలి పీడనం వంటివి మీ బిడ్డ తట్టుకోలేక అసౌకర్యానికి గురికావొచ్చు, అంతేకాక గుంపులుగా ఉన్నటువంటి జనసమూహాలలో పసిపిల్లను తీసుకెళితే పసిపాపలు అనారోగ్యం బారిన పడవచ్చు, అందువల్ల వైద్యనిపుణులు ఇలాంటి ఇబ్బందికరమైన ప్రయాణాలు మానుకోమని సలహా ఇస్తారు.

    కారు లేదా విమాన ప్రయాణం చేసి, కొత్త ప్రదేశాలను సందర్శించడం ఇంకా అనేక రకాల వ్యక్తులను కలవడం వల్ల మీ నవజాత శిశువు అంటువ్యాధులు మరియు ఇతర రకాల జబ్బుల బారిన పడవచ్చు. అలాంటి వ్యాధి సంక్రమణ లేదా జబ్బుల వ్యాప్తి గాలి, నీరు ఇంకా ఆహారం ద్వారా జరుగుతుంది. అంతేకాక మీ బిడ్డ ఆ కొత్త వాతావరణం ఇంకా ప్రదేశాలకి ఎలా తట్టుకుంటుందో లేక అలాంటి చోట ప్రతికూలతలను కలిగించే అవకాశాలు ఎంత వుందో అనే సందేహాము కూడా కలుగకమానదు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?

    Article continues below advertisment

    మీ నవజాత శిశువుతో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఎలాంటి సమస్యలు ఇంకా వ్యాధులు రానీయకుండా ఉండేందుకు మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీ సురక్షితమైన ప్రయాణానికి మేము తెలిపిన ఈ క్రింది భద్రతా చిట్కాలు పాటించాలని మీకు సిఫార్సు చేస్తున్నాము:

    • మీ పూర్తి ప్రయాణ వివరాలను మీ ప్రయాణానికి ముందే మీ డాక్టరు గారికి తెలియజేయండి, మీరు ఎందులో వెళుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఇంకా మీరు ఎవరెవరిని కలుస్తున్నారు, మీరు అక్కడ చేసే పనులేంటి అనే అన్ని వివరాలు చెప్పాలి. మీరిచ్చిన సమాచారంతో, అతను/ఆమె మీ నవజాత శిశువుకు ఏయే వ్యాధులు సంక్రమించే అవకాశముందో ఆలోచించి అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలిస్తారు.
    • మీ భీమాని తనిఖీ చేసుకోవాలి, మీరు ఇతర దేశాలలో ఉన్నప్పుడు మీ నవజాత శిశువు అనారోగ్యం పాలైతే మీ ప్రస్తుత పాలసీ ఏ కవరేజీని అందిస్తుందో అని మీ భీమాసంస్థ వారిని అడిగి తెలుసుకోవాలి.
    • మీరు కారులో లేదా విమానంలో ప్రయాణిస్తున్నా సరే, మీ బిడ్డకు ఎల్లవేళలా సీటు బెల్ట్ పెట్టి ఉంచాలి, మీ నవజాత శిశువు ఎల్లప్పుడూ బెల్ట్‌ పెట్టి ఉండేలా చూసుకోవాలి.
    • మీ బిడ్డకు మధ్య లేదా కిటికీ వైపు సీటు ఉండేలా చూసుకోవాలి, నవజాత శిశువులు బయటి ప్రపంచాన్ని అర్థంచేసుకొనేందుకు అన్వేషించేందుకు ఇష్టపడతారు, వారిని మధ్య సీట్లో కూర్చోబెట్టాలి, అందువల్ల మీరు ప్రయాణ సమయంలో వారిని జాగ్రత్తగా చూసుకోగలరు. మీ నవజాత శిశువుకు నడకదారి వైపు సీటు ఇవ్వడం అపాయాన్ని కొనితెచ్చుకోవడం అవుతుంది.
    • మీ హోటల్ గదిలోపల చుట్టూ పరికించి చూసుకోవాలి, పదునైన లేదా ప్రమాదకరమైన వస్తువేదైనా ఉందేమో అని గది మొత్తం కలియతిరిగి చూడాలి. పదునైన బల్ల అంచులు, అలమరలు, వదులుగా ఉండే కిటికీలు ఇంకా తలుపులు, వ్రేలాడే కరెంటు తీగలు మీ బిడ్డకు హాని కలిగించే అవకాశమున్న కారకాలు.
    • మీ ప్రయాణాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి, మీ గమ్యానికి నేరుగా వెళ్ళే లేదా తక్కువగా ఇతర చోట్ల ఆగే విమానాల ఛార్జీలు కాస్త ఎక్కువే కావచ్చు కానీ ఇందుకోసం ఖర్చుచేసే ప్రతి పైసాకు సరిపడా సదుపాయాలు అందుకుంటున్నారు కదా. మీ పాప నిద్రపోయే సమయాన్ని మీ ప్రయాణానికి ఎంచుకోవడం వల్ల మీరు ఒక మంచి విశ్రాంతమైన ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టే.
    • హాయిగా మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి, పిల్లలు తమ తల్లిదండ్రుల మానసిక స్థితిని పసిగట్టుతారు, కనుక మీరు ప్రయాణామంతా ఆందోళన పడినంత సేపు మీ చిన్నారి ప్రయాణం కూడా అదే ఆందోళనతో కొనసాగుతుందని మర్చిపోవద్దు.

    Tags:

    Travelling with new born in telugu, precautions to take while traveling with new born in telugu, journey with new born in telugu, tips to follow while taking new born to trips in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.