


Potty Training
3 November 2023 న నవీకరించబడింది
పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు మోకాళ్లలోతు డైపర్లలో మునిగిపోయి ఉంటారు. ప్రస్తుత కాలంలో డైపర్లు శిశువుల జీవితంలో భాగమైపోయాయి. తల్లిదండ్రులు డైపర్లను ఇంట్లో నిల్వ ఉంచే పరిస్థితి వచ్చింది. క్రిబ్‌లో డైపర్లు దాచడం దగ్గర్నుంచి, బ్యాగులో న్యాపీస్ తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. పిల్లలు కాలకృత్యాలు తీర్చుకొని తమని తాను శుభ్రం చేసుకునే రోజు ఎంతో దూరంలో ఉందని తల్లిదండ్రులకు అనిపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు కాలకృత్యాలు తీర్చుకునే ఆరోగ్యకర అలవాటును చేయించడం ఒక మైలురాయి లాంటిది. కన్నవారుగా పిల్లలు మలమూత్ర విసర్జనకు శిక్షణ అందించేలా చేయడానికి తమ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. పిల్లలకు రెండేళ్ల వయస్సు వచ్చేసరికి పాటీ ట్రైనింగ్ ప్రారంభించడం ముఖ్యం. అయితే ప్రతీ పసిబిడ్డ భిన్నంగా ఉంటారు. కాబట్టి వారిని ఇతర చిన్నారులతో పోల్చడం మంచిది కాదు.
పిల్లలకు తమ మూత్రశయంపై, పేగులపై నియంత్రణ వచ్చినప్పటి నుంచి, వారు తమని తాము తడి లేకుండా, పొడిగా ఉంచాలనుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు ముందుగా మలవిసర్జన కదలికలపై నియంత్రణను అభివృద్ధి చేసుకుంటారు.
పిల్లలు రాత్రుల్లో మూత్ర విసర్జనపై నియంత్రణ పొందుతారు. చాలావరకు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు బెడ్ వెట్టింగ్ అంటే పక్కతడిపే సమస్యను అధిగమిస్తారు. అయితే కొందరికి ఇంకాస్త సమయం పట్టొచ్చు. ఒకవేళ ఆరు సంవత్సరాలు దాటిన పిల్లలు రాత్రులు మంచంపై తడుపుతున్నట్టైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
పిల్లలు ఉన్నట్టుండి ఈ కింది విధంగా చేస్తున్నట్టయితే వారికి కాలకృత్యాల శిక్షణ అవసరం ఉందని భావించవచ్చు.
శిశువుకు కాలకృత్యాల శిక్షణ ఇవ్వడం ఎలా ప్రారంభించాలనే దానిపై రూల్ అంటూ ఏమీ లేదు. పిల్లలు నేర్చుకోవడానికి కొంత సమయం తీసుకుంటారు. డైపర్లను మానెయ్యడానికి సమయం పడుతుంది. అయితే పిల్లలకు కాలకృత్యాల శిక్షణ ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.
శిశువుకు కాలకృత్యాల శిక్షణ ఎలా ప్రారంభించాలి? చాలా మంది తల్లిదండ్రులకు ఈ ప్రక్రియ ఎలా ప్రారంభించాలన్నదానిపై సందేహాలు ఉంటాయి. పిల్లల్ని కాలకృత్యాల శిక్షణకు సిద్ధం చేయడానికి మార్గాలు ఇవి. పిల్లలు సౌకర్యవంతంగా తేలికగా మలమూత్ర విసర్జనకు శిక్షణ పొందేందుకు కొన్ని చిట్కాలు దోహదపడతాయి:
1. బాత్‌రూమ్‌లో పాటీని ఉంచాలి
2. పాటీ ట్రైనింగ్ ప్యాంట్స్
పిల్లలు కొన్ని రోజులపాటు ఉదయాన్నే పొడి న్యాపీతో నిద్రలేస్తున్నారంటే.. ఇక వారికి న్యాపీ అవసరం లేదని అర్థం చేసుకోవచ్చు. పిల్లలు నిద్రపోవడానికి ముందే బాత్‌రూమ్‌కు వెళ్లేలా ప్రోత్సహించాలి. తడి పీల్చుకోని షీట్స్ ఉపయోగించడం మంచిది.
తల్లిదండ్రులకు పాటీ ట్రైనింగ్ పెద్ద సవాలుగా ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు కనీసం 18 నెలలు వచ్చేవరకు ఆగుతుంటారు. పిల్లలు అప్పట్లోగా వారి కండరాల నియంత్రణ పొందుతారు. ఈ ఆర్టికల్‌లో చెప్పిన చిట్కాలన్నీ మీకు ఉపయోగపడి, ఈ పనిలో విజయం సాధిస్తారని భావిస్తున్నాం.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)