


Breastfeeding & Lactation
3 November 2023 న నవీకరించబడింది
తల్లి తన పిల్లలకు చనుబాలను ఇవ్వడం అనేది వారికి సరైన, అవసరమైన శారీరక, మానసిక పోషణను అందజేస్తుంది. అయితే, కొన్నిసార్లు కొంతమందికి ఈ విషయంలో కొన్ని సమస్యలు ఎదురౌతుంటాయి. ఉదా. తక్కువ మోతాదులో చనుబాలు ఉత్పత్తి కావటం వంటివి. తనకు ఎదురవుతున్న ఎలాంటి పరిస్థితులు పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు విఘాతం కలిగిస్తాయో తెలుసుకోవటం ప్రతి తల్లికీ తప్పనిసరి.
ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సరైన పోషక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి తల్లీ తాను మంచి ఆరోగ్యాన్ని పొందటమే కాకుండా, చనుబాల ఉత్పత్తిని కూడా మెరుగు పరుచుకోవచ్చు. ఏయే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తల్లులు చనుబాల ఉత్పత్తిని పెంచుకో గలుగుతారో ఇక్కడ వివరంగా చర్చిద్దాము.
ఈకింది ఆహారపదార్థాలను ప్రతిరోజూ ఆహారంలో పొందుపరచుకోవడం ద్వారా ప్రతి తల్లి, తమ బిడ్డకు సరిపడే పాల ఉత్పత్తిని మెరుగుపరచుకోవచ్చు.
1. మెంతులు: మెంతులు, మెంతి ఆకులు చాలా రకాల ఔషధ విలువలను కలిగి ఉంటాయి. ఇవి అనేక అనారోగ్యాలనుంచి రక్షించడమే కాకుండా పాల ఉత్పత్తిని మెరుగు పరుస్తాయి. వీటిని ఇగురు, కూర, పులుసులు, సూపు ఇలా అనేక విధాలుగా స్వీకరించవచ్చు.
2. ఓట్స్: ఓట్స్ ఒక సంపూర్ణధాన్యానికి చెందిన రకం. ఇవి తల్లులకే కాదు కుటుంబంలోని అందరి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన ఆహార పదార్థం అని చెప్పుకోవచ్చు. ఇవి తల్లులకు గర్భధారణ దశలోను, ప్రసవ సమయంలోను, బిడ్డ జన్మించిన తర్వాత వారికి కావలసిన చనుబాల ఉత్పత్తి పెరగడానికి అవసరమైన ఆక్సిటోసిన్ హార్మోను పెంపొందడంలోను కీలక పాత్ర వహిస్తాయి.
3. ఆప్రికాట్స్ (నేరేడుపండ్లు): ఆప్రికాట్ పళ్ళు ఎండినవైనా, పచ్చివైనా కూడా ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఈ పళ్లను ఆహారంగా స్వీకరించడం వల్ల జీవన క్రియలు మెరుగు పడడమే కాక, పాలను వృద్ధి చేసే ప్రోలాక్టిన్ హార్మోను స్థాయి కూడా పెరిగి, తద్ద్వారా పాల ఉత్పత్తి పెరగడానికి దోహద పడుతుంది. ఈ పండ్లు ఆహారంలో తీసుకోవడం వల్ల వచ్చే లాభాన్ని పూర్తిగా పొందాలంటే వీటిని సీరియల్ రూపంలో గాని, ఉడకపెట్టిగాని, లేదా భోజనానంతరం తినే తీపి పదార్థానికి బదులుగా గాని వాడవచ్చు.
4. బార్లీ: బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అది తల్లులలో చనుబాల తయారీ మెరుగు పడడానికి కావాల్సిన పాల ఉత్పత్తి హార్మోను స్థాయిని పెంచుతుంది. బార్లీని కూడా సూపులాగా, జావలాగా, కూరలతోను ఇలా అనేక రకాలుగా వాడవచ్చు. బార్లీ పిండితో రొట్టెలు, బిస్కట్లు, కరకరలాడే తినుబండారాలు తయారు చేసుకుని ఆహారంగా స్వీకరించవచ్చు.
5. క్యారెట్: క్యారెట్లలో ప్రాణాధారిత పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచగల ఫైటో ఈస్ట్రోజన్లు మెండుగా ఉండటం వల్ల బిడ్డలకు కావలసిన క్షీరోత్పత్తి సక్రమంగా, సమృద్ధిగా జరుగుతుంది. క్యారెట్లను పచ్చిగాను, ఉడికించిన కూరగాను కూడా తీసుకోవచ్చు.
6. సోంపు: సోంపులో కూడా తల్లిపాల ఉత్పత్తిని క్రమబద్ధం చేయగల ఫైటో ఈస్ట్రోజను ఉండటం వల్ల దీన్ని తీసుకోవటం తల్లులకు చాలా మంచిది. ఇంతేకాక ఇది తిన్న ఆహారం చక్కగా అరగడానికి కూడా తోడ్పడుతుంది. సోంపును నీటితో మరిగించి ఆ నీటిని త్రాగడం, టీ రూపంలో తీసుకోవడం, సూపులుగా, కూరల లోను ఇలా చాలారకాలుగా వాడటం బిడ్డలకు పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.
7. మునగ: మునగాకు లేక మునగకాయలు ఇనుము, క్యాల్షియం వంటి అత్యధిక పోషక పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవటం వల్ల తల్లిపాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. వీటి ఆకులను చాలారకాల ఆహార పదార్థాల తయారీలో వాడవచ్చు. మునగాకు పొడిని తయారు చేసుకుని అన్నంలోను, లేదా మునగాకును టేబ్లెట్లు రూపంలోను కూడా తీసుకోవడం ద్వారా ఎన్నో అదనపు లాభాలను కూడా పొందవచ్చు.
8. శనగలు: శనగలు అత్యధిక మొత్తంలో ప్రొటీన్లను, జీవకారక ధాతువులను సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. శనగలను నానబెట్టి, ఉడికించి వాడడం ద్వారా ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. నవజాత శిశువులకు తల్లి ద్వారా మాత్రమే అందగలిగే పాల ఉత్పత్తికి శనగల ఆహారం దోహదపడుతుంది.
9. టోఫు: సోయా గింజలద్వారా తయారు చేసే టోఫు- అత్యధిక సంఖ్యలో మాంసకృత్తులను కలిగి ఉండి తల్లులలో చనుబాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది. టోఫును ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం తల్లుల ఆరోగ్యాభివృద్ధికి దోహదపడుతుంది.
10. అవిశ గింజలు: అవిశ గింజలలో సూక్ష్మ పోషకాలను, ఆల్ఫాలినోలినిక్ యాసిడ్ ను అత్యధిక మోతాదులో కలిగి ఉంటాయి. ఇవి శిశువుల శారీరక, మానసిక వికాసానికి అత్యంత అవసరం. అందువల్ల తల్లి తన ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి. వీటి యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలంటే, పచ్చిగాగాని, వీటిని జావ రూపంలో గాని తీసుకోవచ్చు.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)