hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Getting Pregnant arrow
  • తక్షణ (అర్జెంట్) శ్రద్ధ(అటెన్షన్) అవసరమయ్యే కొన్ని రకాల చర్మ సమస్యల గురించి ఇక్కడ చూద్దాం arrow

In this Article

    తక్షణ (అర్జెంట్) శ్రద్ధ(అటెన్షన్) అవసరమయ్యే కొన్ని రకాల చర్మ సమస్యల గురించి ఇక్కడ చూద్దాం

    Getting Pregnant

    తక్షణ (అర్జెంట్) శ్రద్ధ(అటెన్షన్) అవసరమయ్యే కొన్ని రకాల చర్మ సమస్యల గురించి ఇక్కడ చూద్దాం

    3 November 2023 న నవీకరించబడింది

    గర్భధారణ, హార్మోన్ల అసమతుల్యత, రుతుచక్రాల కారణంగా మహిళలు సాధారణంగా చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని రకాల చర్మ సమస్యలు సాధారణమయినవే అయినప్పటికీ వాటికి తక్షణ చికిత్స అవసరం. మహిళలు సాధారణంగా ఎదుర్కొనే చర్మ సమస్యలు, వాటి చికిత్స విధానాల జాబితా ఇక్కడ చూద్దాం.

    సాధారణ ముఖ చర్మ సమస్యలు

    1. మొటిమలు

    మొటిమలు అనేవి అన్ని రకాల వయసుల మహిళల్లో కనిపించే సాధారణ చర్మ సమస్య. మొటిమల గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

    • చర్మంలోని చర్మ గ్రంధులు హెయిర్ ఫోలికల్స్​ను నిరోధించడం (బ్లాక్ చేయడం) మరియు ఎక్కువ ఆయిల్ (నూనె) ఉత్పత్తి చేయడం వలన మొటిమలు ఏర్పడతాయి.
    • స్త్రీలు తమ పీరియడ్స్​​కి ముందు మొటిమలను సర్వసాధారణంగా గుర్తిస్తారు. గర్భధారణ సమయంలో కూడా మొటిమలు ఏర్పడతాయి.
    • ఇవి సాధారణంగా ముఖం, ఛాతి, మరియు వెనక ప్రాంతాల్లో ఏర్పడతాయి.
    • వీటికి చికిత్స చేయనపుడు నల్లటి మచ్చలు, మరకలు ఏర్పడే ప్రమాదం ఉంది.
    • క్రీమ్స్, జెల్స్, లోషన్స్, నోటి ద్వారా తీసుకునే మందుల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు.
    • ఆరోగ్యకరమైన చర్మం కోసం మొటిమలు ఏర్పడే సమయంలో చర్మ నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

    2. రొసేసియా (మొటిమల రూపంలో ముక్క, బుగ్గలు మొదలయిన వాటి మీద ఏర్పడే వ్యాధి)

    రొసేసియా అనేది ఒక రకమైన ముఖ చర్మ సమస్య. ముఖం మీద కనిపించే రక్తనాళాలు ఎర్రబడడం వల్ల రొసేసియాను గుర్తించవచ్చు.

    రొసేసియాకు సంబంధించిన కొన్ని ఇతర విషయాలు ఇక్కడ ఉన్నాయి:

    • వాపు వచ్చిన ఎర్రటి గడ్డలు, మండుతూ లక్షణాలుగా కనిపిస్తాయి.
    • ఇది దీర్ఘకాలిక చర్మ సమస్య. ఇది తగ్గిపోయి.. మరలా తిరిగి వస్తుంది.
    • ఇది ఆల్కహాల్, సూర్య రశ్మికి ఎక్కువగా గురికావడం, మసాలా ఫుడ్స్ (స్పైసీ ఫుడ్స్) మరియు పొట్టలో బ్యాక్టీరియా వల్ల ఇది సంభవిస్తుంది.
    • మధ్య వయసులో ఉన్న స్త్రీలలో ఇది సర్వసాధారణం.
    • దీనికి వైద్య చికిత్స చాలా అవసరం.
    • దీనికి సాధారణంగా యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేస్తారు.

    సాధారణ దురద తో కూడిన చర్మ సమస్యలు

    1. ఎగ్జిమా (తామర వ్యాధి)

    ఎగ్జిమా (తామర వ్యాధి)ని డెర్మటిట్స్ (చర్మ శోథ) అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలోని ఏ అవయానికైనా రావచ్చు. ఇది అధిక నొప్పితో మరియు దురదతో ఉండే చర్మ సమస్య.

    తామర అనేది కింద పేర్కొన్న అనేక కారణాల వల్ల సోకుతుంది:

    • ఇరిటెంట్స్ (చికాకులు) (సబ్బులు, డిటర్జెంట్లు మరియు షాంపూలు)
    • చల్లని, పొడి, మరియు తేమతో కూడిన వాతావరణం.
    • దుమ్ము, పెంపుడు జంతువుల బొచ్చు, మరియు పుప్పొడి.
    • ఒత్తిడి

    మంచి మాయిశ్చరైజర్లు, యాంటీ ఇచ్​ (యాంటీ దురద) క్రీమ్స్ వాడడం వలన ఈ చర్మ సమస్యను తగ్గించుకోవచ్చు. ఎవరైనా ఎగ్జిమాతో (తామర) బాధపడుతుంటే చర్మ దురదను నివారించడం చాలా ముఖ్యం.

    2. కాంటాక్ట్ డెర్మటైటిస్

    రసాయనాలు, ఆహారం, సౌందర్య సాధనాలతో సహా ఏదైనా పదార్థానికి ఎలెర్జీ ప్రతిచర్య కారణంగా ఏర్పడే దురదే చర్మపు దద్దుర్లు. కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేవి వాటంతట అవే స్వతహాగా తగ్గిపోతాయి. కానీ చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించడం అవసరం. కాంటాక్ట్ డెర్మటైటిస్ వ్యాధికి యాంటీ ఇచ్చింగ్ (దురద) మందులతో చికిత్స చేస్తారు.

    ఇతర సాధారణ రకాల చర్మ సమస్యలు

    1. వడదెబ్బ

    ఇది మహిళల్లో సాధారణం అయినప్పటికీ ఈ చర్మ సమస్య చాలా ప్రమాదకరం. మహిళల్లో సున్నితమైన చర్మం ఉంటుంది. ఇది హానికారకమైన UV కిరణాల వల్ల ప్రభావితం అవుతుంది. కాలిన గాయాల నుంచి రక్షించబడని చర్మం కాలక్రమేణా క్యాన్సర్​కు గురవుతుంది.

    తేలికపాటి నుంచి మితమైన వడదెబ్బకు చికిత్స:

    • 30+ SPFతో సన్ స్క్రీన్ లోషన్.
    • మైల్డ్ సబ్బుతో కూల్ (చల్లటి) స్నానం చేయడం.
    • ద్రవాలను అధికంగా తీసుకోవడం ద్వారా చర్మాన్ని హైడ్రేటెడ్ (నీటితో ఉంచడం) గా ఉంచడం
    • నూనె లేని తేలికపాటి మాయిశ్చరైజర్లను వాడడం.
    • జ్వరం మరియు నొప్పితో కూడిన తీవ్రమైన గాయాలకు తక్షణ వైద్య సహాయం అవసరం.

    2. సెల్యులైట్ (పిరుదుల మీద ఏర్పడే కొవ్వు)

    దాదాపుగా 90 శాతం మంది మహిళల్లో సెల్యులైట్ అనేది ఉంటుంది. దీని వల్ల ఎక్కువ శరీరంలో ఎక్కువ కొవ్వు నిక్షిప్తం అయ్యే ప్రాంతాలలో చర్మం మసకబారినట్లు కనిపిస్తుంది. ప్రముఖంగా ఎగువ కాళ్లు (తొడలు, పిరుదులు మరియు పొత్తి కడుపుపై ఇది సంభవిస్తుంది. హార్మోన్ల కారణంగా ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చర్మ సమస్యకు ఎటువంటి చికిత్స లేదు.

    3. చర్మం మీద మరకలు

    ఇది అన్ని రకాల వయసుల స్త్రీలలో కనిపించే సాధారణ చర్మ సమస్య. గర్భధారణ తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగినపుడు లేదా తగ్గినపుడు చర్మం చాలా త్వరగా సాగుతుంది. ఇటువంటి సందర్భాల్లో చర్మం మీద మరకలు ఏర్పడతాయి. ఇది చర్మం మీద తెలుపు లేదా పర్పుల్ (నీలం రంగు) మరకల్ని ఏర్పరుస్తుంది. కొన్ని సార్లు ఇది దురదగా ఉంటుంది. ఇది సాధారణం. సరైన చికిత్స వల్ల మరకలను తగ్గించవచ్చు. కానీ పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు.

    4. దద్దుర్లు లేదా ఉర్టికారియా

    ఆహారం, మందులు, కీటకాల కాటు వలన చర్మం ఉపరితలంపై ఎలర్జీలు, దద్దుర్లు, దురద, ఎరుపు గడ్డలు ఏర్పడతాయి. దీనిని ఒక శరీర భాగం మీద చూడొచ్చు. లేదా ఎక్కువ ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగానే నయం అవుతుంది. కాబట్టి ఎటువంటి చికిత్స అవసరం లేదు.

    5. పులిపిరి కాయలు (మచ్చలు)

    పులిపిరి కాయలు (మచ్చలు) అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా కాళ్లు, చేతుల మీద ఏర్పడతాయి. ఇవి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరిలో ఏర్పడతాయి. ఇవి చిన్నగా ఉండే నల్ల చుక్కలతో కాలీఫ్లవర్ లాగా కనిపిస్తాయి. పాదాల వంటి ఒత్తిడి అధికంగా కలిగే ప్రదేశాలలో ఇవి చాలా బాధను కలుగజేస్తాయి. ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఒకరి నుంచి మరొకరు సులభంగా వ్యాపిస్తుంది.

    ఈ పులిపిరి కాయలకు చికిత్స చేయాలని వైద్యుడు సూచించినపుడు.. ఓవర్ ది కౌంటర్ మందులు ((డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసే మందులు) ఉపయోగించవచ్చు. ఇది నొప్పిగా ఉన్నపుడు శస్త్ర చికిత్స చేసి తొలగించాలని వైద్యుడు సూచించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో పులిపిరికాయలు వాటంతట అవే తగ్గిపోతాయి.

    6. అథ్లెట్ ఫుట్ (ఒక రకమైన ఫంగస్ వల్ల వచ్చే వ్యాధి)

    ఇది పాదాల మీద కనిపించే సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్. దీని వలన పాదాల మీద తీవ్రమైన దద్దుర్లు, ఎరుపుదనం, మరియు పగుళ్లు ఏర్పడవచ్చు. ఓవర్ ది కౌంటర్ మందులతో (డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసే మందులు) అథ్లెట్ పాదాలకు చికిత్స చేయొచ్చు. కానీ ఈ మందులతో తగ్గనపుడు వైద్యుడిని సంప్రదించడం అవసరం.

    చివరగా...

    చర్మం అనేది ఒక అతిపెద్ద అవయవం. ఇది మొత్తం శరీర ఉపరితలాన్ని కవర్ చేస్తుంది. ఇది ప్రతి రోజు ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కుంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు ఎలాగైతే శ్రద్ధ వహిస్తామో.. చర్మ సమస్యలు వచ్చినపుడు కూడా శ్రద్ధ వహించడం అవసరం. తమ చర్మ సమస్యలను ఎవరూ ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. సరైన చర్మ వ్యాధి నిపుణుడితో జట్టు కట్టడం సరైన విధంగా వ్యాధిని గురించి తెలుసుకోవడం మరియు సరైన చికిత్స ప్రణాళికను నిర్ధారించడంలో సహాయపడుతుంది.

    మైలో మహిళల ఆరోగ్యం కోసం అనేక రకాల చిట్కాలను అందజేస్తుంది. గర్భధారణ సంరక్షణ, శిశువు సంరక్షణ, మదర్ కేర్ మరియు సాధారణ జీవన శైలి సలహాలను గురించి మరింత తెలుసుకునేందుకు మా బ్లాగులను చదువుతూ ఉండండి.

    Coconut Oil - 200 ml

    Reduces Dandruff | Strengthens Hair | Soothes Baby's Rashes

    ₹ 300

    4.5

    (4947)

    31758 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Sarada Ayyala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.