
శిశువు జీవితంలో తొలి దశలో ఎక్కువగా ఇన్ఫెక్షన్లు, వైరస్‌ల బారిన పడుతూ ఉంటారు. ఇలాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేలా వారి రోగనిరోధక వ్యవస్థ సిద్ధంగా ఉండకపోవడమే ఇందుకు కారణం. చలికాలం చల్లని వాతావరణం ఎంజాయ్ చేయాలని అందరూ అనుకుంటారు. కానీ జలుబు, ఇన్‌ఫ్లుయెంజా, దగ్గు, న్యుమోనియా లాంటి ఇన్ఫెక్షన్లు కూడా ఈ వాతావరణంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వాతావరణానికి తగ్గట్టుగా, పిల్లల్ని వెచ్చగా ఉంచేలా చలికాలంలో దుస్తులు వేయాల్సి ఉంటుంది. చలికాలంలో శిశువులు వారి ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కావాల్సిన దుస్తులు లేయర్స్‌గా వేయాలి.
ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, పిల్లలకు లేయర్స్‌లో దుస్తులు వేసి, వారిని వెచ్చగా, హాయిగా ఉంచడం అవసరం. చలికాలంలో మీరు ఏ దుస్తులు వేసుకుంటే సౌకర్యవంతంగా భావిస్తారో, దానికి ఒక లేయర్ అదనంగా పిల్లలకు దుస్తులు వేయాలన్న విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇది సర్వసాధారణంగా పాటించే నియమం. మీరు చలిగా ఉందని భావిస్తే, మీ శిశువుకు కూడా చలిపెడుతుందని గుర్తుంచుకోవాలి. పిల్లలకు వేర్వేరు చోట్ల వేర్వేరు తరహా దుస్తులు అవసరం. అవేంటో తెలుసుకోండి:
కార్ సీట్లల్లో మెత్తగా, ఉబ్బుగా ఉండే స్నోసూట్స్ వేయడం సురక్షితం కాదు. లావుగా ఉండే దుస్తులు వేయడం, కార్ సీట్లకు స్లీపింగ్ బ్యాగ్స్ అటాచ్ చేయడం వద్దని కొందరు నిపుణులు సూచిస్తుంటారు. కార్ ప్రమాదానికి గురైనప్పుడు పిల్లలకు ఎక్కువగా గాయాలు కావడానికి ఇవి కారణం అవుతాయి. దాని బదులు, పిల్లలకు లేయర్స్‌లా దుస్తులు వేయాలి. ఆ తర్వాత దుప్పటితో కప్పాలి. కార్ సీట్ తయారీదారులు ధృవీకరించినంత వరకు సరిగ్గా ఫిట్ అయ్యే కవర్‌ను కొనుగోలు చేయొచ్చు. కార్ సీట్ హార్‌నెస్ స్ట్రాప్‌కు, పిల్లలకు మధ్య ఎలాంటి కవర్స్ ఉండకూడదు. చలి తీవ్రంగా ఉన్నప్పుడు, మీ పిల్లలకు వన్ పీస్ ఫుటెడ్ ఫ్లీస్ ఔట్‌ఫిట్ కింద లాంగ్ స్లీవ్డ్ వన్‌పీస్ వేయాలి. వాతావరణాన్ని బట్టి కాటన్ స్వెటర్ కూడా వేయొచ్చు. పిల్లల్ని కార్ సీట్ వరకు తీసుకెళ్లేప్పుడు వేర్వేరు బ్లాంకెట్స్ లేదా లావుగా ఉండే దుప్పటి ఉపయోగించాలి. కార్ సీట్‌లో బక్లింగ్ చేసిన తర్వాత చేతుల్ని వెనక్కి ఉంచేందుకు బ్లాంకెట్ బదులు పాత బేబీ కోట్‌ని ఉపయోగించవచ్చు.
ఇంట్లో విషయానికి వస్తే ఎక్కువగా దుస్తులు వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మీరు ధరించే దుస్తుల కన్నా ఒక లేయర్ అదనంగా వేస్తే చాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంట్లో ఉష్ణోగ్రత 66 డిగ్రీల నుంచి 72 డిగ్రీల ఫారన్‌హీట్ ఉండాలి. పిల్లలు మరీ చల్లగా లేదా వేడిగా ఉన్నారా అన్న విషయం తెలుసుకోవడానికి వారి పొట్టపై లేదా వెన్నుపై చేతి పెట్టి చూడాలి. అక్కడ వెచ్చగా ఉండాలి. చెమటగా ఉండకూడదు. చెమట పట్టడం, జుట్టు తడిగా ఉండటం, బుగ్గలు ఎర్రబడటం, వేగంగా శ్వాస తీసుకోవడం లాంటివి పిల్లల్లో వేడి పెరుగుతుంది అనడానికి సంకేతాలు. ఇలాంటి సంకేతాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఈ సంకేతాలు కనిపించినప్పుడు దుస్తుల్లో ఒక లేయర్ తీసెయ్యాలి.
చల్లని వాతావరణంలో కూడా మీ పిల్లలకు తాజా గాలి అవసరం. శిశువు ఆరోగ్యంగా ఉన్నప్పుడల్లా బయటకు 15 నుంచి 20 నిమిషాలు వాకింగ్‌కు తీసుకెళ్లొచ్చు. పిల్లలు పెద్దవాళ్ల కంటే త్వరగా వేడిని కోల్పోతుంటారు కాబట్టి వారికి లేయర్స్‌లో దుస్తులు వేయాలి. కాబట్టి మీరు పిల్లల్ని బయటకు తీసుకెళ్తున్నప్పుడు లాంగ్ స్లీవ్ ఉన్న డ్రెస్, స్వెటర్, కోట్ వేయాలి. మిట్టెన్స్, ఫిట్టెడ్ క్యాప్, వామ్ బూట్స్ కూడా వేయాలి. ఒకవేళ మీరు క్యారియర్ ఉపయోగిస్తున్నట్టైతే, మొహం కవర్ కాకుండా చూడండి. వారిని గమనిస్తూ ఉండండి.
ఒకవేళ స్ట్రోలర్ ఉపయోగిస్తున్నట్టైతే, స్లీపింగ్ బ్యాగ్ అటాచ్ చేసుకోవచ్చు. శిశువుల లేత చర్మాన్ని విండ్ బర్న్ నుంచి కాపాడేందుకు విండ్ స్క్రీన్ ఉపయోగించండి. మీ పిల్లల కళ్లల్లో నీళ్లు కనిపించినా, అసౌకర్యంగా కనిపిస్తూ ఏడవటం మొదలు పెట్టినా, వారికి ఇక చల్లని వాతావరణం చాలన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. వీటితో పాటు పెదవులు నీలంలోకి మారడం, వణుకు రావడం, ముక్కు, చెవులు పాలిపోయినట్టు కనిపించడం లాంటి హైపోథర్మియా లక్షణాలను కూడా గమనిస్తూ ఉండాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి?
పిల్లలు మీతో సంభాషించడానికి కొంత సమయం పట్టొచ్చు. అయితే వాళ్లు చల్లగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. అవేంటంటే:
చలికాలం పిల్లల వార్డ్‌రోబ్ సిద్ధం చేయడానికి, మీ దగ్గర వెచ్చగా ఉంచే దుస్తులు ఉన్నాయో లేదో చూడాలి. పిల్లలకు శీతాకాలంలో వేయాల్సిన దుస్తుల్ని ఎంపిక చేయడానికి ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
చలికాలంలో పిల్లల్ని సౌకర్యవంతంగా, వెచ్చగా ఉంచడానికి నిపుణులు ఇస్తున్న సలహాలు ఇవి:
1. పిల్లల్ని లేయర్స్‌తో డ్రెస్ చేయాలి
చలికాలంలో పిల్లల్ని వెచ్చగా, హాయిగా ఉంచడానికి ఇదే సాధారణమైన, ఉత్తమమైన మార్గం. లేయర్స్ ద్వారా డ్రెస్సింగ్ చేస్తే, వారి అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేయొచ్చు. ఉదాహరణకు బాటమ్ లేయర్‌ను లెగ్గింగ్స్, బాడీ సూట్‌తో డ్రెస్ చేయొచ్చు. దాంతో పాటు మరో లేయర్ ప్యాంట్స్ వేయొచ్చు. ఫుల్ స్లీవ్డ్ షర్ట్ కూడా వేయొచ్చు. వీటితో పాటు పిల్లల చేతులు, పాదాలు వెచ్చగా ఉంచేందుకు జాకెట్, క్యాప్, మిట్టెన్స్, వామ్ బూటీస్ వేయొచ్చు.
2· సరైన వస్త్రాన్ని ఎంపిక చేయడం
పిల్లల్ని వెచ్చగా ఉంచేందుకు అవసరమైన వస్త్రాన్ని ఎంపిక చేయడం కూడా అవసరమే. కాటన్, మస్లిన్ లాంటి బ్రీథబుల్ వస్త్రాలను మాత్రమే ఎంపిక చేయాలి. చలికాలంలో థర్మల్ దుస్తులు కూడా మంచి ఆప్షన్. వీటితో పాటు ఉలెన్, పాలిస్టర్ దుస్తులు కూడా వేయొచ్చు. అయితే చలికాలంలో అంత ప్రభావం చూపని కాటన్ దుస్తులు తీసుకోకపోవడమే మంచిది. వేరే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మొదట వాటి గురించి ఆలోచించాలి. పిల్లల్ని చలికాలంలో బయటకు తీసుకెళ్తున్నట్టైతే తేమను పీల్చుకునే దుస్తుల్ని వేయకూడదు.
3. ఔట్ డోర్ యాక్సెసరీస్
పిల్లల్ని బయటకు తీసుకెళ్తున్నట్టైతే, మంకీ క్యాప్, మిట్టెన్స్ లాంటి కొన్ని యాక్సెసరీస్ కూడా తీసుకెళ్లాలి. వీటితో మీ పిల్లలకు వెచ్చగా, హాయిగా, సౌకర్యవంతంగా ఉంటుంది. చలిని నిరోధించే సాఫ్ట్ మెటీరియల్‌తో తయారు చేసిన క్యాప్ ఎంచుకోండి.
4. బ్లాంకెట్ తీసుకెళ్లాలి
ఉష్ణోగ్రతఅకస్మాత్తుగా తగ్గే పరిస్థితి ఉంటుంది కాబట్టి అదనంగా ఓ బ్లాంకెట్ వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. అవసరమైనప్పుడు మీ పిల్లల్ని వెచ్చగా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. మీరు ఎక్కువ చల్లగా ఉండే పట్టణంలో నివసిస్తున్నట్టైతే బ్లాంకెట్ తప్పనిసరిగా ఉండాలి.
5. స్నోసూట్స్
చల్లని వాతావరణంలో స్నోసూట్స్ బాగా ఉపయోగపడతాయి. పిల్లలు చలిబారినపడకుండా కాపాడతాయి. పిల్లల తల నుంచి పాదాల వరకు కవర్ చేస్తుంది కాబట్టి చూడ్డానికి పిల్లలు క్యూట్‌గా కనిపిస్తారు.
6. జిప్ అప్స్ తీసుకోండి
జిప్ అప్స్ తీసుకుంటే సులువుగా వేయొచ్చు. తీసెయ్యొచ్చు. పిల్లల డైపర్ వెంటనే మార్చాలన్నా లేదా వేడి ఎక్కువగా ఉన్నా, కొన్ని లేయర్స్ తీసెయ్యాలన్నా జిప్ అప్స్ ఈజీగా ఉంటాయి.
7. స్లీప్ సాక్స్ తీసుకోండి
పిల్లల వింటర్ వేర్ కలెక్షన్‌లో స్లీప్ స్లాక్ కూడా మంచి ఛాయిస్. ఇది హాయిగా ఉండటమే కాదు, లోపల మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు హాయిగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది. తీవ్రమైన చలిబారినపడకుండా ఉండొచ్చు.
8. స్ట్రోలర్ ఔట్‌ఫిట్
మీరు పిల్లల్ని బయటకు తీసుకెళ్లాలనుకుంటే, పిల్లల చేతులు, పాదాలు, చెవులు, తల గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని కవర్ చేసేలా దుస్తులు ఉండాలి. లాంగ్ స్లీవ్ వన్జీతో పాటు కొన్ని ప్యాంట్స్, సాక్స్ వేయాలి. జిప్ అప్ స్వెట్‌షర్ట్ లేదా జాకెట్ వేయాలి. చక్కగా, హాయిగా ఉండే స్నోసూట్ కూడా వేసి బయటకు తీసుకెళ్లాలి. చలిని తట్టుకోవడానికి ఇవన్నీ కావాల్సినంత రక్షణ ఇస్తాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: చలికాలం ముందు లేదా చలికాలంలో పిల్లలకు ఉన్ని బట్టలు కొనడానికి సరైన సమయం ఎప్పుడు?
పిల్లలు వేడిని త్వరగా కోల్పోతారు కాబట్టి చలికాలంలో ఎక్కువ సేపు స్ట్రోలర్‌లో బయటకు తీసుకెళ్లకూడదు. బయట ఉష్ణోగ్రత 20 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే, చల్లని గాలులు వీస్తుంటే పిల్లల్ని అస్సలు బయటకు తీసుకెళ్లొద్దు. చలి, చల్లని గాలులు మరీ ఎక్కువగా లేనప్పుడు పిల్లల్ని బయటకు తీసుకెళ్తే ఇబ్బంది ఏమీ ఉండదు. పిల్లలు కాస్త అసౌకర్యంగా ఉన్నట్టు కనిపిస్తే, వారు చలితో ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోవాలి.
పిల్లల్ని రాత్రి సమయంలో వెచ్చగా, హాయిగా ఉంచడం అవసరం. పిల్లలు అధికంగా వేడెక్కితే సడెన్ డెత్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్నే కాట్ డెత్ అని కూడా అంటారు. రాత్రి వేళలో గదిని వేడి చేయడం అవసరం లేనప్పటికీ, గది వాతావరణం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. గదిలో ఉష్ణోగ్రత18 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. 16 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉన్నా ఇబ్బంది లేదు. గదిని సురక్షితమైన ఉష్ణోగ్రతలో ఉంచడానికి థర్మామీటర్ ఉపయోగించండి. పిల్లలు నిద్రపోయే చోట రేడియేటర్స్, హీటర్స్ లాంటివి ఉండకూడదు. నేరుగా సూర్యకాంతి కూడా పిల్లలపై పడకుండా చూడాలి. దీనివల్ల అధికంగా వేడెక్కే ప్రమాదం ఉంటుంది.
చలికాలం పిల్లలకు, పెద్దలకు కఠినంగా ఉంటుంది. అయితే సరైన దుస్తులు వేసి, రక్షణ తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. నివారణ కన్నా ముందుజాగ్రత్త ఉత్తమం అన్న విషయం గుర్తుంచుకోండి. చలికాలంలో పిల్లల్ని వెచ్చగా, హాయిగా, సౌకర్యవంతంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటే శీతాకాలం ఆనందంగా, గుర్తుండిపోయేలా గడుస్తుంది.
Yes
No


















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |