hamburgerIcon

Orders

login

Profile

Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Diet & Nutrition arrow

  • గైడ్: మీ ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికంలో శాకాహారా డైట్ ని పాటించడం (Guide: Following A Vegetarian Diet During Your Third Trimester Of Pregnancy in Telugu) arrow

In this Article

    గైడ్: మీ ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికంలో శాకాహారా డైట్ ని పాటించడం (Guide: Following A Vegetarian Diet During Your Third Trimester Of Pregnancy in Telugu)

    Diet & Nutrition

    గైడ్: మీ ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికంలో శాకాహారా డైట్ ని పాటించడం (Guide: Following A Vegetarian Diet During Your Third Trimester Of Pregnancy in Telugu)

    7 January 2026 న నవీకరించబడింది

    మీ మూడవ త్రైమాసికంలో శిశువు ఎదుగుదల వేగంగా జరుగుతుంది. ఎందుకంటే గర్భాశయం బాహ్య వాతావరణానికి అనువుగా మారేందుకు శిశువు బరువు పెరగడం మొదలవుతుంది. అందువల్ల త్వరితంగా పెరిగే మీ బరువును మీరు గమనించవచ్చు.

    మీరు సమతుల్య ఆహారాన్ని తీసుకుంటున్నట్లైతే లేదా 3వ త్రైమాసిక డైట్ చార్ట్‌ని అనుసరిస్తున్నట్లయితే, మీరు అదనపు బరువు గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. అయితే మీ బిడ్డలో కొవ్వు పొరల ఏర్పడుతున్నందువల్ల మీరు కొంచెం ఎక్కువ క్యాలరీలు తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణలోని మూడవ త్రైమాసికంలో మెట్లు ఎక్కడం సురక్షితమేనా?

    మీ ప్రెగ్నెన్సీలోని మూడో త్రైమాసికం(చివరి మూడు నెలలు)లో తీసుకోవాల్సిన విటమిన్లు (Vitamins To Consume During Your Third Trimester Of Pregnancy in Telugu)

    రక్తం గడ్డకట్టేందుకు విటమిన్ K అవసరం. ఇది డెలివరీ సమయంలో నిజంగా అవసరం. అందువల్ల మీ మీ ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలలలో సాధ్యమైనత ఎక్కువగా విటమిన్ K- అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. డెలివరీకి ముందు మీ ఆరోగ్యం కోసం ఈ విటమిన్ లోపం అనేది లేకుండా చూసుకోవాలి. అందువల్ల నేటి నుండి మూడవ త్రైమాసికపు ప్రెగ్నెన్సీలో తీసుకోవలసిన ఫుడ్ చార్ట్‌ని అనుసరించడం మొదలుపెట్టండి!

    మీ ప్రెగ్నెన్సీలోని మొదటి ఇంకా రెండవ త్రైమాసికంలో అవసరమైనటువంటిది. రక్తహీనతను రూపుమాపే ఐరన్, మూడవ త్రైమాసికంలో కూడా ఎంతో అవసరం. ఒకవేళ మీకు ఐరన్ లోపం ఉన్నాకూడా దానిని పట్టించుకోకపోతే, మీకు నెలలు నిండకనే పురిటినొప్పులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ శిశువుకి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశముంది.

    కొన్నిసార్లు మీరు సమతుల్య ఆహారంతో కూడిన ఫుడ్ చార్ట్‌ను అనుసరించడం ప్రారంభించినట్లయితే ప్రత్యేకంగా మీరు కొన్ని సప్లిమెంట్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే మీ మూడవ త్రైమాసికంలో ఏ సప్లిమెంట్ మంచిదనే విషయం గురించి తెలుసుకునేందుకు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిదని సిఫార్సు చేస్తున్నాము.

    ప్రెగ్నెన్సీలో మూడో త్రైమాసికం డైట్ చార్ట్ బేసిక్ ప్లాన్ (A Basic Plan Of Third Trimester Diet Chart in Telugu)

    ప్రత్యేకించి మీ ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలల (మూడవ త్రైమాసికం)లో ఏవైనా ప్రత్యేక ఆహారం కావాలనుకుంటే, ఈ సమయంలో ఈ డైట్ చార్ట్ వాస్తవంగా మీకు చాలా హెల్పింగ్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో మీరు తీసుకునే ఆహారాలు మీ శిశువును శారీరకమైనఇంకా ఆరోగ్యపరమైన ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. ఇంకా డైట్ చార్ట్ బేసిక్ ప్లాన్ వివిధ వారపు రోజులుగా విభజించబడింది. అందువల్ల మీరిప్పుడు సమతుల్య ఆహారాన్ని చాలా సులభంగా అందుకోవచ్చు.

    మీ స్వంత డైట్ చార్ట్‌ను మీకు నచ్చేలాగా తయారుచేసుకొనే ముందు, నిపుణులైన డైటీషియన్‌ని సంప్రదించడం ఉత్తమం. మీ డైటీషియన్ మీరు తీసుకొనే ఆహారంతో పాటు మరి కొన్ని ఆహార పదార్థాలను మీకు సూచించవచ్చు. ప్రత్యేకించి మీ ప్రెగ్నెన్సీ ఏడవ నెలలో ఇది ప్రారంభిస్తున్నట్లయితే, మీరు ఈ క్రింది 3వ త్రైమాసికపు ప్రెగ్నెన్సీ బేసిక్ డైట్ చార్ట్‌కు కట్టుబడి ఉండవచ్చు. ఈ చార్ట్‌ను అనుసరించడం వల్ల అది మీ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది. ఎందుకంటే చాలా మంది మహిళలకు మామూలుగా ఈ కాలంలో వారికి అందవలసిన అన్ని పోషకాలను చెక్ చేసుకోవడం అసాధ్యమనిపిస్తుంది.

    ఆదివారం (Sunday)

    ఆనందకరమైన ఆదివారం ఉదయం, మీరు వేయించిన పుట్టగొడుగులతో పాటు హోల్‌వీట్ టోస్ట్ తీసుకోవచ్చు. అంతే కాకుండా మీరు మీ ఉదయాన్ని రిఫ్రెష్ చేయడానికి బనాన మిల్క్ షేక్ కూడా తీసుకోవచ్చు. బ్రంచ్ స్నాక్స్ కోసం, మీరు దానిమ్మపండ్లను తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలో పొట్లకాయ ఇంకా దోసకాయ రైతాతో పాటు వెజిటబుల్ కర్రీ ఉండవచ్చు. మీరు దీనికి చపాతీ లేదా అన్నాన్ని కూడా చేర్చుకోవచ్చు. మధ్యాహ్నం స్నాక్స్ లాగా, మీరు నిమ్మరసం, మిశ్రమ నట్స్ ఇంకా ఎండుద్రాక్షలను తీసుకోవచ్చు. అంతేకాక టొమాటో సాస్‌తో పాస్తా తీసుకోవడం ఒక మంచి ఎంపిక అవుతుంది.

    సోమవారం (Monday)

    ఉదయం టిఫిన్ కోసం, మీరు లస్సీతో పాటు మెంతి పరాఠాని తీసుకోవచ్చు. స్నాక్స్‌లో బొప్పాయి లేదా మీకు నచ్చిన ఏదైనా ఇతర పండ్లను చేర్చవచ్చు. మధ్యాహ్న భోజనంలో, మీరు క్యారెట్ కూరతో పాటు పెసలు తీసుకోవచ్చు. అంతేకాకుండా, మీ మధ్యాహ్నపూ స్నాక్స్‌గా చిలగడదుంప చాట్ లేదా జీరా వాటర్ వంటి ఆరోగ్యకరమైనవి తీసుకోవచ్చు. చివరగా, మీరు డిన్నర్‌లో బొబ్బర్ల(అలసందలు)తో పాటు ముల్లంగి కూరను తీసుకోవచ్చు.

    మంగళవారం (Tuesday)

    మీ మంగళవారపు టిఫిన్‌గా సాగో ఉప్మాతో పాటు కొన్ని రుచికరమైన వేరుశెనగ గింజలు కూడా ఉంటాయి. మీరు కాఫీ లేదా టీని కూడా తీసుకోవచ్చు. ఉదయం స్నాక్స్ కోసం ఎండిన అత్తి పండ్లను చేర్చాలని తెలుసుకోండి. మధ్యాహ్న భోజనంలో మీరు వేయించిన అప్పడంతో పాటు వెజిటబుల్ కిచ్డీని తీసుకోవచ్చు. మీ మధ్యాహ్నం స్నాక్స్ విషయానికొస్తే, మీరు కొబ్బరి నీళ్ళను భుట్టా లేదా కాల్చిన మొక్కజొన్నతో కలిపి తీసుకోవచ్చు. డిన్నర్‌లో సజ్జలతో పాటు పొట్లకాయ కూర కూడా తీసుకోవాలని మర్చిపోకండి.

    బుధవారం (Wednesday)

    బుధవారం నాడు, మీరు టిఫిన్‌గా గోధుమ గంజి లేదా వోట్‌మీల్‌ని తీసుకోవచ్చు. అంతే కాకుండా, మీరు స్నాక్స్ కోసం ద్రాక్షను తీసుకోవచ్చు. మీ మధ్యాహ్న భోజనంలో బఠానీలతో పాటు బంగాళదుంపలు కూడా ఉండేలా చూసుకోండి. మధ్యాహ్నం స్నాక్స్ కోసం మీరు డోక్లా మరియు మజ్జిగ తీసుకోవచ్చు. రాత్రి భోజనం కోసం మీరు పరాటా మరియు బీట్‌రూట్ రైతాను ఒకమారు ప్రయత్నించవచ్చు!

    గురువారం (Thursday)

    మీ గురువారం టిఫిన్‌లో టీతో పాటు కాల్చిన పనీర్ శాండ్‌విచ్‌ ఉంటాయి. స్నాక్స్ కోసం మీరు జామ లేదా సపోటా పండ్లు తీసుకోవచ్చు. కాలీఫ్లవర్ కూరతో పాటు కిడ్నీ బీన్స్ మధ్యాహ్న భోజనానికి అద్భుతమైన ఎంపిక అవ్వోచ్చు. మధ్యాహ్నం స్నాక్స్ కోసం మీరు బాదం పాలు తీసుకోవచ్చు. రాత్రి భోజనంలో ఎర్ర కందిపప్పుతో పాటు బీన్స్ కూడా చేర్చండి.

    శుక్రవారం (Friday)

    ఆహ్లాదకరమైన శుక్రవారం ఉదయం, మీరు ఆపిల్ జ్యూస్‌తో పాటు టిఫిన్‌గా ఓట్‌మీల్‌ని తీసుకోవచ్చు. స్నాక్స్ కోసం సపోటాని తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలో, బంగాళదుంపతో పాటు ఉల్లిపాయ పరాఠా ఇంకా పుదీనా చట్నీని చేర్చండి. .మీ మధ్యాహ్నం స్నాక్స్ కోసం, ప్రత్యేకించి మీరు చాక్లెట్‌లను ఇస్తాపడుతూన్నట్లయితే, మీరు ఏదైనా తీపి పధార్థాన్ని తినవచ్చు! రాత్రి భోజనం కోసం, బెండకాయ కూరతో దోసకాయ సలాడ్‌ని తీసుకునేందుకు ప్రయత్నించండి. మీ ప్రత్యేక డిన్నర్ డిష్‌తో పాటు అన్నం లేదా చపాతీలను తీసుకోవచ్చు.

    శనివారం (Saturday)

    శనివారం నాడు, మీరు మజ్జిగతో పాటు రవ్వ దోశను చేర్చవచ్చు. మీరు మీ బ్రంచ్ స్నాక్ కోసం చాట్ సలాడ్ తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనంలో, మీరు శనగ పిండి రోటీతో పాటు నల్ల శనగలను చేర్చవచ్చు. మీ మధ్యాహ్నం స్నాక్స్ కోసం, పైనాపిల్ లస్సీ లేదా పఫ్డ్ రైస్‌ని తీసుకునేందుకు ప్రయత్నించండి. రాత్రి భోజనంలో ఉల్లిపాయ రైతాతో పాటు ఉలవలను కూడా తీసుకోవచ్చు!

    అంతే కాకుండా, మీరు మీ భోజనంలో మీకు కావలసింది ఏదైనా తినేందుకు ఈ రోజును అనువైనదిగా మార్చుకోవచ్చు. అందువల్ల, ప్రెగ్నెన్సీ 3వ నెలలో మీ డైట్ చార్ట్‌లో ఏదో ఒక వారాన్ని ఒక చీట్ డేగా చేర్చుకోవడం వలన ఇతర ఆహారాలపై మీకున్న ఇష్టాన్ని కూడా తీర్చుకోవచ్చు!

    ముగింపు (Conclusion)

    మీ ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికపు ప్రారంభంలో ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. నిజానికి మీరు కొంతకాలం పాటు మీ ఫుడ్ చార్ట్‌కు కట్టుబడి ఉండటం కూడా కష్టంగా అనిపించవచ్చు. అయితే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను కొద్దిమొత్తంలో తీసుకుంటే, మీరు ఎల్లవేళలా ఫుడ్ చార్ట్‌ని మీకు కావలసినంత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు. ఈ దశలో మీరు వివిధ సప్లిమెంట్ల వాడకాన్ని కూడా పరిమితం చేయాల్సి ఉంటుంది. అయితే ఏవైనా వాడటం మొదలుపెట్టే ముందు మీ డాక్టరుకి తెలపడమనేది మంచి ఆలోచన అని చెప్పవచ్చు. అంతే కాకా తల్లీ బిడ్డలిద్దరూ ఆరోగ్యపరంగా బాగున్నారని తెలుసుకొనేందుకు, మీరు నెలవారీ వైద్య పరీక్షలకు హాజరు కావడం కూడా ఎంతో ముఖ్యం.

    Tags:

    diet during pregnancy, third trimester diet during pregnancy in telugu, Guide: Following A Vegetarian Diet During Your Third Trimester Of Pregnancy in English, Guide: Following A Vegetarian Diet During Your Third Trimester Of Pregnancy in Hindi, Guide: Following A Vegetarian Diet During Your Third Trimester Of Pregnancy in Tamil, Guide: Following A Vegetarian Diet During Your Third Trimester Of Pregnancy in Bengali.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

      arrow
    • Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

      arrow
    • Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

      arrow
    • Hii 34 weeks how many months

      arrow
    • Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave