


Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
కడుపుతో ఉన్న మహిళలు తినే డైట్లో కావలసిన అన్ని రకాల పోషకాలు చేర్చి తీరాలి. పాలకూర గర్భవతి మహిళలకి కావలసిన ప్రొటీన్, కాల్షియం, ఐరన్ అలాగే విటమిన్లు అన్నీ కలిగివుండే అద్భుతమైన ఆహారపదార్థం. ఇది అమరాంథసీ అనే వృక్ష కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క, అలాగే దీనితో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో పాలకూర తినడం మంచిదేనా? అవును, కానీ మితంగా తింటే మాత్రమే. గర్భవతులైన మహిళలు తమ డైట్లో తప్పనిసరిగా జోడించుకోవాల్సినది ఫోలిక్ యాసిడ్ ఉన్న పదార్థాలు. ఈ ఫోలిక్ యాసిడ్ పాలకూరలో ఎక్కువగా లభిస్తుంది. ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్లని తీసుకోవడం వలన పుట్టుక సమయంలో వచ్చే వైకల్యాలని నివారించవచ్చు. ఈ ఆకుకూరలో ఐరన్ కూడా ఉంటుంది, ఇది ప్రెగ్నెన్సీ సమయంలో కావలసిన మరొక విటమిన్. కానీ పాలకూరని కూడా అతిగా తినకుండా చూసుకోవాలి. ఉదాహరణగా చెప్పాలంటే కిడ్నీలలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉన్న గర్భవతులైన మహిళలు పాలకూరని పరిమితంగానే తినవలసి ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భవతిగా ఉన్నప్పుడు ఆహారంలో చిరుధాన్యాలని తినడం వలన వచ్చే లాభాలు
ప్రెగ్నెన్సీ సమయంలో పాలకూరని తినడం మంచిది. పాలకూరలో విటమిన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, అలాగే రాగి ఎక్కువగా ఉంటాయి. అదనంగా, పాలకూర పీచుపదార్థానికి, ఫ్లేవనాయిడ్లు ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకి మంచి వనరు కూడా. పాలకూరలో తల్లీబిడ్డ ఇద్దరికీ మంచి చేసే చాలా రకాల పోషకాలు ఉన్నాయి.
100 గ్రాముల పాలకూర ఈ కింది పోషకాలని అందిస్తుంది:
గర్భవతిగా ఉన్నప్పుడు పాలకూర తినటం ఈ కింది మార్గాలలో లాభదాయకంగా ఉండవచ్చు.-
1.ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్: కడుపుతో ఉన్నప్పుడు శరీరంలో రక్త పరిమాణం 30% నుండి 50% వరకూ పెరుగుతుంది. దీనివల్ల శరీరానికి ఐరన్ ఇంకా ఫోలిక్ యాసిడ్ అవసరం పెరుగుతుంది. క్రమం తప్పకుండా పాలకూరని తినడం వలన శరీరానికి అవసరమైన ఐరన్ అందటంలో సాయపడుతుంది.
2. కాల్షియం: ఒంట్లో కాల్షియం ఎక్కువ అవటం వలన తక్కువ రక్తపోటుకి దారితీస్తుంది. అయితే కాల్షియం స్థాయి తక్కువ అవటం వలన ప్రెగ్నెన్సీ-సంబంధిత రక్తపోటుకి కారణం కావచ్చు. పాలకూరలో కాల్షియం యొక్క జీవలభ్యత బిపి స్థాయిని నియంత్రించడంలో సాయపడుతుంది.
3. విటమిన్లు: విటమిన్లకి అద్భుతమైన వనరు అయిన పాలకూర వలన రోగనిరోధక వ్యవస్థ బలపడవచ్చు. గర్భవతులైన మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో పాలకూరని తింటే, వారు రోజువారీ సూచించబడిన విటమిన్ A పరిమాణాన్ని చేరుకోగలరు. పాలకూరలో విటమిన్ B కూడా ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డ యొక్క నాడీ వ్యవస్థ యొక్క ఎదుగుదలకి అవసరం.
ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా పాలకూర మంచిదే. కానీ మరీ ఎక్కువగా పాలకూరని తినడం వలన కొన్ని ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు, అవేంటంటే:
కడుపుతో ఉన్నప్పుడు భోజనంలో భాగంగా అరకప్పు పాలకూరని తినవచ్చు. గర్భసమయంలో పాలకూరని మితంగానే తినాలి ఎందుకంటే అతిగా తింటే చాలా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. పాలకూర ఆకులు తాజాగా, మచ్చలు, రంధ్రాలు లేనంతవరకూ గర్భవతి మహిళలు దాన్ని సలాడ్ గా తినవచ్చు. అదనంగా, సలాడ్లో ఆకులని వేసేముందు వాటిని బాగా కడగాల్సి ఉంటుంది, అలాగే వెంటనే తినాలి కూడా.
కడుపుతో ఉన్నప్పుడు పాలకూరని చాలా విధానాలలో తిని ఆనందించవచ్చు-
అలాగే, కడుపుతో ఉన్నప్పుడు ఆహారంలో ఏ రకమైన మార్పులు లేదా చేర్పులు చేసేముందు స్పెషలిస్టుని సంప్రదించటం ఎప్పుడూ మంచిది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏదైనా అవసరమైన ఆహారాన్ని, మందులని చేర్చేటప్పుడు లేదా తొలగించేటప్పుడు మీ గైనకాలజిస్టుని తప్పక సంప్రదించండి.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)