


Exercise & Fitness
3 November 2023 న నవీకరించబడింది
గర్భధారణ సమయంలో స్క్వాట్‌లు దిగువ శరీర భాగాలకు బలాన్ని పెంచడంలో సహాయపడే ఒక ప్రసిద్ధ (కాస్త కష్టమైనప్పటికీ) వ్యాయామం. ఇది ఎలాంటి పరికరాలతో పని లేకుండా చేసే అనేక వైవిధ్యాలతో కూడిన వ్యాయామం. ఇంకా దీనిని వివిధ శరీర భాగాలకు బలమివ్వడానికి లక్ష్యంగా చేసుకొని ఆచరిస్తారు. గర్భవతులు ఈ అద్భుతమైన వ్యాయామాన్ని వారి రోజువారీ లేదా వారపు ఫిట్‌నెస్ కార్యాక్రమాల్లో భద్రతా పరమైన జాగ్రత్తలు పాటించి, డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత ఇంకా ప్రారంభించే ముందు సరైన పర్యవేక్షణలో ఈ వ్యాయామం చేసుకోవచ్చు. గర్భధారణ సమయంలో స్క్వాట్ చేయడం వలన కలిగేప్రయోజనాలు ఇంకా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలను ఈ క్రింద మరింత వివరంగా పరిశీలిద్దాము.
గర్భధారణ సమయంలో స్క్వాటింగ్ చేయడమనేది కాబోయే తల్లులకు గొప్ప పటిమను పెంచే వ్యాయామం, ఎందుకంటే ఇది వారి తుంటి, కోర్, గ్లూట్స్ ఇంకా పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలంగా మరియు చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. సరిగ్గా చేసినప్పుడు, స్క్వాట్‌లు ప్రసవాన్ని సాఫీగా జరిగేలా ఇంకా ప్రసవానికి తట్టుకొనేలా కండరాలను బలోపేతం చేస్తాయి మరియు శరీర భంగిమను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గర్భధారణలో స్క్వాట్స్ చేసి ప్రయోజనాలను అందుకొనే మహిళలు బరువులు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. గర్భవతులు ఏదైనా కొత్త వ్యాయామాన్ని ప్రారంభించే ముందు, డాక్టర్ గారి ఆమోదం పొందడం ఎంతో అవసరం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్
గర్భవతిగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం తల్లీ బిడ్డలిద్దరికీ మంచిది. చాలా మంది గర్భిణీ స్త్రీలకు, ఇది చురుకుగా,సంతోషంగా, ఎలాంటి ఆందోళనలు లేకుండా ఇంకా వారి పెరుగుతున్న శరీరానికి అనువుగా నడుచుకొనేలా చేస్తుందని చెప్పడం కూడా అవసరమే. గర్భవతులు స్క్వాట్స్ ఎందుకు చేయాలో తెలుసుకొనే ఐదు కారణాలు ఇక్కడ ఉన్నాయి:
1. బాడీ వెయిట్ స్క్వాట్: బాడీ వెయిట్ స్క్వాట్ అనేది ఒక అద్భుతమైన శరీర దిగువ భాగాన్నిబలపరిచే వ్యాయామం, దీని కోసం ప్రత్యేక పరికరాలు లేదా ఎక్కువ ఖాళీ స్థలం అవసరం లేదు. ఇది సమర్థవంతమైన గర్భధారణ స్క్వాట్ వ్యాయామం, ఇది చేసే వారి కాళ్ళలోని దాదాపు అన్ని కండరాలను పనిచేయించి వాటిని బలపరుస్తుంది.
2. సుమో స్క్వాట్‌లు: లోపలి తొడ ఇంకా గ్లూట్ కండరాలు ఈ ప్రత్యేక స్క్వాట్ చేయడంలో ముఖ్య లక్ష్యాలై ఉంటాయి. అంతేకాకుండా, ఇది గొప్ప హిప్-ఓపెనర్ స్ట్రెచ్. గర్భధారణ సమయంలో కాబోయే తల్లి కీళ్ళు కాస్త వదులై ఉంటాయి. వాటిని ఎక్కువగా సాగదీయడం వల్ల సులభంగా అవి గాయపడవచ్చు. మరో మాటలో చెప్పాలంటే, గర్భిణీ స్త్రీ తనకు అవసరమైన దానికంటే ఎక్కువగా స్ట్రెచ్ చేయకూడదు.
3. బాల్ వాల్ స్క్వాట్‌లు: కాబోయే తల్లి కాళ్లు ఇంకా గ్లూట్స్‌లో బలాన్ని పెంపొందించడానికి బాల్ వాల్ స్క్వాట్‌లను చేసేందుకు బంతిని ఉపయోగించడం అనేది ఒక అద్భుతమైన పద్ధతి. గర్భిణీ స్త్రీ స్నాయువులు, తొడలు ఇంకా భుజాల కండరాలపై పని చేస్తున్నందున వారి కాళ్ళకు ఇంకా నడుముకు ఇది ఎంతో మంచిది.
4. డీప్ స్క్వాట్‌లు పెల్విక్ ఫ్లోర్ (కటి ప్రదేశంలో కండరాల) సంకోచం జరిగేలా ఉంటాయి: పెల్విక్ ఫ్లోర్ అని పిలువబడే కటి భాగంలోని కండరాల సముధాయం మూత్రాశయం, గర్భాశయం ఇంకా ఇతర పునరుత్పత్తి అవయవాలకు పట్టి ఉంచేలా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో ఈ కండరాలు బలహీనపడవచ్చు, దాని ఫలితంగా మూత్ర ఆపుకొనలేకపోవడం ఇంకా ప్రసవం తర్వాత ఇతర సమస్యలు కలుగుతాయి. గర్భధారణ సమయంలో పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలంగా ఉంచడం చాలా అవసరం, ఎందుకంటే అవి ప్రసవ సమయంలో ప్రభావం చూపిస్తాయి. పెల్విక్ ఫ్లోర్ కండరాల సంకోచంతో చేసే డీప్ స్క్వాట్‌లు తేలికగా ఇంకా తక్కువ ఎత్తులో ఉంటాయి కాబట్టి గర్భధారణ సమయంలో పెల్విక్ ఫ్లోర్‌ను బలోపేతం చేయడానికిది ఉత్తమ వ్యాయామం.
5. చైర్ స్క్వాట్‌లు: గర్భవతులు లేదా సమతుల్యతను కాపాడుకోవడంలో సమస్య ఉన్న ఎవరికైనా సరే, సాంప్రదాయ స్క్వాట్‌లకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. గ్లూట్స్, హిప్ ఫ్లెక్సర్‌లు, అబ్స్, క్వాడ్రిస్ప్స్, క్యావ్స్ ఇంకా హామ్ స్ట్రింగ్‌లు అన్నీ ఈ చైర్ స్క్వాట్‌లో మిళితమై ఉన్నాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవాన్ని వేగవంతం చేయడానికి, సురక్షితమైన ప్రసవం జరగడానికి 10 ప్రభావవంతమైన వ్యాయామాలు
ముందుజాగ్రత్తలు
గర్భధారణ సమయంలో ఈ స్క్వాట్ వ్యాయామం గర్భిణీ స్త్రీ సామర్థ్యానికి ఎటువంటి చెఱుపు కలిగించదు. అయితే, గర్భిణీ స్త్రీలు స్క్వాట్స్ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
గర్భధారణ స్క్వాట్ వ్యాయామాలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ప్రధాన భద్రతా చర్యలు క్రింది విధంగా ఉంటాయి:
గర్భవతులే తమ శరీరతీరుని సరిగ్గా అంచనా వేయగలరని గుర్తుంచుకోవాలి, కాబట్టి ఏదైనా సరిగ్గా అనిపించకపోతే, దానిని ఆపుచేసి, విశ్రాంతి తీసుకోవాలి.
స్క్వాట్‌లు గర్భవతులకు ఒక అద్భుతమైన వ్యాయామం ఎందుకంటే అవి కండరాలలో క్రొవ్వుని తగ్గించి బరువు నియంత్రణకు ఇంకా కోర్‌ను బలోపేతం చేయడానికి, గర్భవతులకు బిడ్డను మోసే సామర్థ్యాన్ని, ప్రసవాన్ని సాఫీగా ఇంకా సహజ ప్రసవం జరిగేలా చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. వారి ఆకృతిని మెరుగుపరచడంలో కూడా సహాయపడే ఒక అద్భుతమైన సమగ్ర వ్యాయామం అని దీనిని పేర్కొనవచ్చు. ఏదైనా కొత్త వ్యాయామాన్ని ప్రారంభించే ముందు గర్భవతులు ఎల్లప్పుడూ వారి వైద్యుల ఆమోదం పొందాలనేది గుర్తుంచుకోవలసిన విషయం.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)