

Updated on 3 November 2023
సపోటా పండును చికూ అని కూడా అంటారు. ఇది అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. అందుకే దీనిని సూపర్ ఫ్రూట్ అంటారు. సపోటా పండులో విటమిన్లు A ఇంకా C, పొటాషియం, కాల్షియం లాంటి కొన్ని ముఖ్యమైన పోషకాలే కాక యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ పండు వల్ల ఆరోగ్యకరమైన కేలరీలు కూడా ఎక్కువగానే అందుకోవచ్చు. 100 గ్రాముల సపోటా పండులో 83 కిలో కేలరీలు లభిస్తాయి.
ఈ పండు గర్భిణీ స్త్రీలకు చాలా ఆవశ్యకమైన పోషకాలను అందిస్తుంది. అయితే.. గర్భిణీ స్త్రీలు తమ వైద్యుడిని సంప్రదించకుండా వారి ఆహారంలో కొత్త పదార్థాలను జోడించకూడదు. ఎందుకంటే.. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు ఆరోగ్య సమస్యలు ఇంకా ఆహార సున్నితత్వం (ఫుడ్ సెన్సిటివిటీ) ఏర్పడటమే ఇందుకు కారణం. వైద్యులు గర్భవతుల ఆరోగ్యం చక్కగా ఉండేలా.. వారికి ఇతర ప్రమాదావకాశాలను తగ్గించేందుకు.. వారి రక్త నమూనాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారు.
గర్భిణీ స్త్రీలకు వారు రోజువారీగా తీసుకోనే తాజా పండ్ల పరిమాణాన్నిపెంచుకోవాలని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. డాక్టరు గారు వద్దంటే తప్ప, మంచి పోషక విలువలు ఉన్న సపోటా పండ్లను గర్భిణీ స్త్రీలందరూ తీసుకోవడం సురక్షితమే. గర్భధారణ సమయంలో స్త్రీలు ఎన్ని సపోటాలు తీసుకోవచ్చో అనేదానికి నిర్దిష్ట కోటా లేదు. కానీ.. పండులో కేలరీలు ఇంకా చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రోజుకు 100 గ్రాముల పండ్లను తీసుకొనేలా పరిమితం చేయడం మంచిది. అందువల్ల గర్భిణీ స్త్రీలు తమ బరువు పెరగకుడా ఇంకా ఇతర వైద్యపరమైన సమస్యలను రాకుండా చేసుకోవచ్చు.
1. తక్షణ శక్తిని అందిస్తుంది:
సపోటాలో అధిక సుక్రోజ్ ఉంటుంది. ఇది తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు భోజన విరామాల మధ్య మంచి శక్తిని పొందేందుకు ఈ పండ్లను మధ్యాహ్న స్నాక్‌గా తీసుకోవడం బాగుంటుంది.
2. జీర్ణక్రియలో మెరుగుదల:
గర్భిణీ స్త్రీలలో మలబద్ధకం కలగడం అనేది ఒక సాధారణ సమస్య. గర్భధారణ సమయంలో సపోటా తినడం జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే ఈ పండులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక.. ఇది వికారం ఇంకా కడుపులో మంట రానీయకుండా చేస్తుంది.
3. ఎముకలను బలపరుస్తుంది:
గర్భిణీ స్త్రీలకు అదనపు కాల్షియం అవసరం. అలాగే ఆరోగ్యకరమైన కాల్షియం స్థాయిలను కలిగివుండేలా.. వారికి డాక్టర్లు తరచుగా సప్లిమెంట్లను సూచిస్తారు. ఈ సపోటా పండు కాల్షియం, పొటాషియం ఇంకా ఐరన్ వంటి పోషకాలు దొరికే సహజ వనరు.
4. రక్తపోటును నియంత్రిస్తుంది:
సపోటా పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, అది గర్భిణీ స్త్రీలలో రక్తపోటును నియంత్రించవచ్చు. ఈ పండులో అధిక స్థాయిలో మెగ్నీషియం ఇంకా పొటాషియం ఉన్నాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి అవసరం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో ప్లం ఫ్రూట్ ప్రయోజనాలు: రిస్క్‌లు & సైడ్ ఎఫెక్ట్స్
గర్భవతులు తమకు ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు వారు తీసుకొనే పండ్లు ఇంకా కూరగాయలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మార్కెట్‌లో చక్కగా పండిన పండ్లు దొరకడం కాస్త కష్టం కాబట్టి మంచి సపోటా పండ్లను ఎంచుకోవడం కొంచెం కష్టతరమని చెప్పవచ్చు.
గర్భధారణ సమయంలో మితంగా సిఫార్సు చేసిన మోతాదులో సపోటా పండ్లను తీసుకొంటే.. చాల మందికి ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. కానీ, కొందరు గర్భవతులకు ఈ పండ్లను ఎక్కువగా తీసుకొన్నప్పుడు కొన్ని ఇలాంటి దుష్ప్రభావాలు కలగవచ్చు
1. బరువు ఎక్కువ పెరగడం:
సపోటా పండ్లు ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. కాబట్టి గర్భధారణ సమయంలో ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల, కాబోయే తల్లులు అనవసర బరువును పొందుతారు. ఇలా బరువు పెరగడం ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
2. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం:
సపోటా పండ్లలో అధిక స్థాయిలలో సుక్రోజ్ ఇంకా ఫ్రక్టోజ్‌లు ఉంటాయి. ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాబోయే తల్లి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి గర్భధారణలో వచ్చే మధుమేహం(జెస్టేషనల్ డయాబెటిస్) వచ్చే ప్రమాదముంది.
3. డయారియా:
గర్భవతులు సపోటా పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వస్తుంది. ఇది వేగంగా నిర్జలీకరణం(డిహైడ్రేషన్) అయ్యేలా చేసి ఇంకా ఇతర వైద్యపరమైన సమస్యలకు దారి తీస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చెర్రీపళ్ళు: ప్రయోజనాలు & దుష్ప్రభావాలు
గర్భవతులకు సిఫార్సు చేసినన్ని సపోటా పండ్లను తీసుకొనేందుకు, ఇంకా వారి సపోటా పండ్లను తినాలనే కోరికలను నెరవేర్చుకొనేందుకు చక్కటి మార్గం వాటిని మిల్క్‌షేక్‌గా మార్చుకోవడం. ఆరోగ్యకరమైన సపోటా మిల్క్ షేక్ తయారు చేసుకొనే త్వరిత విధానం ఇక్కడుంది.
చిక్కటి సపోటా మిల్క్‌షేక్ తయారీకి అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి రెండు నిమిషాలు తిప్పాలి. సపోటా పండు గర్భధారణ సమయంలో తీసుకోకూడని పండు కాదు. కానీ గర్భిణీ స్త్రీలు అదనపు బరువు పెరిగే ప్రమాదాన్ని ఇంకా గర్భధారణ మధుమేహాన్ని(జస్టేషనల్ డయాబెటిస్) నివారించుకొనేందుకు ఈ పండును మితంగా తీసుకోవాలి. గర్భవతులు తమ రోజువారీ ఆహారంలో సపోటా పండును చేర్చుకునే ముందు తమ వైద్యుల సలహాలను కూడా తీసుకోవాలి.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











গর্ভাবস্থায় আলুবোখরা: উপকারিতা ও ঝুঁকি | Prunes During Pregnancy: Benefits & Risks in Bengali

স্তনের উপর সাদা দাগ: লক্ষণ, কারণ এবং চিকিৎসা | White Spots on Nipple: Causes, Symptoms, and Treatments in Bengali

গর্ভাবস্থায় মাছ: উপকারিতা এবং ঝুঁকি | Fish In Pregnancy: Benefits and Risks in Bengali

গর্ভাবস্থায় রেড ওয়াইন: পার্শ্ব প্রতিক্রিয়া এবং নির্দেশিকা | Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali

ইনার থাই চ্যাফিং: কারণ, উপসর্গ এবং চিকিৎসা | Inner Thigh Chafing: Causes, Symptoms & Treatment in Bengali

গর্ভাবস্থায় ব্রাউন রাইস: উপকারিতা ও সতর্কতা | Brown Rice During Pregnancy: Benefits & Precautions in Bengali