
గర్భిణీ స్త్రీలు రెడ్ వైన్ తాగకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ కడుపులో శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఎంత మొత్తంలో మద్యం తీసుకుంటే ప్రమాదకరమో నిపుణులకు కూడా తెలియదు. అయితే గర్భవతులు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలని చాలా మంది చెబుతుంటారు. ఈ కథనం గర్భవతులు రెడ్ వైన్ తీసుకోవడం సురక్షితమేనా ఇంకా గర్భధారణ సమయంలో రెడ్ వైన్ తాగడం వల్ల కలిగే ప్రమాదాలేమిటో పరిశీలిస్తుంది.
జాతీయ ఆరోగ్య సంస్థలకు సంబంధించినంతవరకు, గర్భధారణ సమయంలో మద్యం సేవించడం ప్రమాదకరం. గర్భవతులు రెడ్ వైన్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తాగినప్పుడు, ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల, గర్భిణీ స్త్రీలు ఎటువంటి మద్యమైనా సరే సేవించకూడదు. మాయ ద్వారా ఆల్కహాల్ శిశువు రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల పుట్టుకతోనే శారీరక ఇబ్బందులు మొదలుకొని మెంటల్ రిటార్డేషన్(మానసిక మాంద్యము) వరకు అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి తీవ్ర ప్రభావాలు పుట్టిన తర్వాత లేదా బిడ్డ పెరుగుతున్నప్పుడు వ్యక్తమవుతాయి. గర్భస్థ పిండం ఆల్కహాల్ సిండ్రోమ్ కారణమయ్యే ఆల్కహాల్ పరిమాణం ఎంత అనే దాని గురించి ఎటువంటి రికార్డు లేదు, కాబట్టి గర్భవతులు గర్భధారణ సమయంలో వైన్ తీసుకోవచ్చా అనే ప్రశ్నకు సురక్షితమైన సమాధానం ఏంటంటే, వారు మద్యాన్ని తీసుకోరాదు.
ఎవరైనా మద్యం సేవించినప్పుడు, దానిలోని రసాయనాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. కాబోయే తల్లి మద్యం తీసుకున్నపుడు, మద్యం బొడ్డు తాడు ద్వారా శిశువులోనికి ప్రవేశిస్తుంది. ఎందుగుతున్న పిండం ఆ టాక్సిన్‌ను(హానికర రసాయనాన్ని) జీర్ణించుకోలేవు లేదా జీవక్రియ ద్వారా ఇముడ్చుకోలేవు. తర్వాత ఇది అనేక ప్రమాదాలను కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో ఆల్కహాల్ తాగడం వల్ల పుట్టుకతో వచ్చే అసాధారణతలు, గర్భస్రావం ఇంకా అకాల ప్రసవానికి అవకాశం పెరుగుతుందని నిర్ధారించబడింది. ఇది ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASD)కి కూడా దారితీయవచ్చు. అంటే ఇది(FASD) జీవితకాలం పాటు ఉండే వివిధ శారీరక, ప్రవర్తనా ఇంకా మానసిక సమస్యలను తెలియజేసేది. ఈ రుగ్మతలు మితంగా లేదా తీవ్రంగా కూడా ఉండవచ్చు ఇంకా వాటిని చికిత్స లేదా నయం చేయలేనివిగా ఉండవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భిణీ మహిళల రోజువారీ సమతుల్య ఆహారం: ఏం తినాలి ఇంకా ఏం తినకూడదు
ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ రుగ్మతలోని అత్యంత తీవ్రమైన రకం ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ (FAS). ఈ సిండ్రోమ్ ఉన్న శిశువులు పై పెదవి ఇంకా ముక్కు మధ్య చదునుగా ఉండటం ఇంకా చిన్నని తల వంటి అసాధారణమైన ముఖ లక్షణాలను చూపించవచ్చు. అలాగే.. వారి వయస్సులో ఉన్న పిల్లల కంటే పొట్టిగా ఇంకా తక్కువ బరువుని కలిగి ఉంటారు. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ చూపించే మరిన్నిలక్షణాలు క్రింద చూపినట్లుగా ఉంటాయి:
FAS సమస్య అనేది తరచుగా మద్యపానం లేదా అతిగా మద్యం సేవించే గర్భవతులతో ముడిపడి ఉంటుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి?
గర్భవతులు వైన్ తాగవచ్చా? గర్భంతో ఉన్న మహిళలు గర్భధారణ సమయంలో రెడ్ వైన్ తాగవచ్చా లేదా అనేదానికి క్షేమకరమైన సమాధానం ఏమిటంటే, వారు దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ మరియు పిండానికి ఇతర సమస్యల ప్రమాదావకాశం ఉన్నందున, గర్భవతులు మద్యం సేవించకూడదు. అయితే, గర్భవతులు అతిగా మద్యం సేవించినప్పుడు, ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్కహాల్ మావి ద్వారా శిశువు రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. ఇది పుట్టుకతో వచ్చే శారీరక ఇబ్బందుల నుండి మెంటల్ రిటార్డేషన్(మానసిక మాంద్యము) వరకు అనేక సమస్యలను కలిగిస్తుంది. ప్రసవం తర్వాత మరియు/లేదా ఎదిగే సమయంలో ఈ దుష్ప్రభావాలు బయటపడతాయి. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్‌కు కారణమయ్యే ఆల్కహాల్ పరిమాణమెంతో అనేది ఇంకా నిశ్చయాత్మకంగా నమోదు కాలేదు. కాబట్టి, గర్భవతులు దీనిని తీసుకోకపోవడమే మంచిది.
గర్భవతులు ఎంత మొత్తంలో లేదా ఎలాంటి ఆల్కహాల్ తాగినా, అది వారి బిడ్డకు హాని కలిగిస్తుంది. ఇంకా అది ప్రమాదకరం కూడా. ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది పిండంలో తలెత్తే అనేక ఆల్కహాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలకు వాడే ఒక విస్తృత పదం. 2017 నుండి జరిపిన ఒక అధ్యయన సమీక్షలో గర్భవతిగా ఉన్నప్పుడు మద్యం సేవించిన 13 మంది స్త్రీలలో ఒకరికి కొంత FASDతో బిడ్డను పొందినట్లు కనుగొన్నారు. గర్భవతులు ఒకవేళ మద్యం సేవిస్తే:
గర్భిణీ స్త్రీలు రెడ్ వైన్ తీసుకోకూడదు. గర్భవతులు సేవించేందుకు సురక్షితమైన ఆల్కహాల్ ఏదో, ప్రస్తుతం తెలియదు. అంతేకాక, గర్భవతులుగా ఉన్నప్పుడు అతిగా మద్యం సేవించే స్త్రీలు ఆరోగ్యవంతమైన శిశువులను పొందిన దాఖలాలు లేవు. గర్భధారణ సమయంలో ఆల్కహాల్ ఏదైనా సరే, అది ప్రమాదకరం ఇంకా అది తల్లీబిడ్డలకు ఎప్పుడైనా హాని కలిగించవచ్చు. సురక్షితంగా ఉండటానికి, పిల్లలు కావాలనుకొనే మహిళలు గర్భధారణ సమయంలో రెడ్ వైన్ లేదా ఎలాంటి ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడు రెడ్ వైన్ తాగకుండా ఉండేందుకు, మహిళలు ఆన్‌లైన్‌లో మరియు వారి స్నేహితులు ఇంకా కుటుంబసభ్యుల నుండి సహాయం పొందవచ్చు. ఖచ్చితమైన సలహాల కోసం డాక్టరు గారిని సంప్రదించాలి.
References
1. Armstrong EM. (2017). Making Sense of Advice About Drinking During Pregnancy: Does Evidence Even Matter? J Perinat Educ.
2. O'Brien P. (2007). Is it all right for women to drink small amounts of alcohol in pregnancy? Yes. BMJ.
Is it safe to drink red wine during pregnancy in Telugu, Can I drink red wine during pregnancy in Telugu, What are the side effects of red wine during pregnancy in Telugu, Red Wine During Pregnancy: Side Effects & Guidelines in English, Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Hindi, Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Tamil, Red Wine During Pregnancy: Side Effects & Guidelines in Bengali
Yes
No

















Naku eppudu 7 months baby moments teliyadam ledhu...
Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada
Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz
Hii 34 weeks how many months
Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |