


Pregnancy Best Foods
3 November 2023 న నవీకరించబడింది
గర్భిణీ స్త్రీ కడుపులో ఉన్న బిడ్డకు తగినన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకవాలి. గర్భిణీ స్త్రీ తినాల్సినవి మరియు శిశువు భద్రత కోసం ఆమె దూరంగా ఉండాల్సిన ఆహారాలు కొన్ని ఉంటాయి. ఇక్కడే బొప్పాయి పండు గురించిన ఒక మూఢ నమ్మకం వస్తుంది. గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదు.
బొప్పాయి పండు పూర్తిగా పండినపుడు గర్భిణీ స్త్రీలు తిన్నా కానీ ఎటువంటి సమస్యలు రావు. అది వారికి పూర్తిగా సురక్షితమైనది. కానీ గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయిని తినకూడదు. ఎందుకంటే అందులో లేటెక్స్(రబ్బరు చెట్ల నుంచి వచ్చే పదార్థం) ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. పచ్చి బొప్పాయిని గుర్తించడం చాలా సులభం. ఇది చూసేందుకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అంతే కాకుండా సగం పండిన బొప్పాయిని కూడా నివారించాలి. బొప్పాయి పండు అనేది శరీరంలో అదనంగా వేడిని ప్రేరేపిస్తుందని అంతా నమ్ముతారు. కావున దానిని గర్భధారణ సమయంలో తినకూడదని చెబుతారు. కానీ బొప్పాయి పండు గర్భస్రావానికి కారణమయ్యే రీతిలో లేదా ముందుగా ప్రసవం అయ్యేలా శరీరంలో వేడిని ప్రేరేపిస్తుందని చెప్పేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. స్త్రీకి పీరియడ్స్ రానపుడు బొప్పాయి తినడం వల్ల పీరియడ్స్ వస్తాయనే అపోహ కూడా ఉంది.
బొప్పాయి పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పండు అని గుర్తుంచుకోవాలి. కావున ఒక స్త్రీకి బొప్పాయి పండు తినాలని ఉంటే.. వారు ఎటువంటి చింత లేకుండా బొప్పాయిపండుని తినొచ్చు. బొప్పాయి పండు తిన్నపుడు జీర్ణక్రియలో ఏదైనా అసౌకర్యం తలెత్తితే లేదాయోని ప్రాంతంలో ఊహించని రక్తస్రావం జరిగితే బొప్పాయి తినడం మానేయాలి. అంతే కాకుండా గర్భధారణ సమయంలో బొప్పాయిని తినేటపుడు జాగ్రత్త వహించాలి. దానిని ఎక్కువ మోతాదులో తినకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది పేగు కదలికలను తీవ్రతరం చేస్తుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం? దీని అర్థం ఏమిటి? మీరు వైద్యుడిని సంప్రదించాలా?
గర్భధారణ సమయంలో బొప్పాయిని తినడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం పండిన బొప్పాయిని తిన్నపుడు మాత్రమే ఈ లాభాలుంటాయని, పచ్చిబొప్పాయిని తింటే ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో అజీర్ణానికి గల 5 కారణాలు
Papaya during pregnancy in Telugu, Papaya benefits during pregnancy in telugu, Side effects of eating Papaya during pregnancy in telugu, Papaya nutritional benefits during pregnancy in telugu, precautions to take while eating Papaya during pregnancy in telugu.
Yes
No

Written by
Swetha Rao
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)