


Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
గర్భం ధరించినప్పుడు ఆడవారు పౌష్టికాహారం తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి. వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు, బలవర్ధకమైన ఆహారం ఉండేలా చూసుకోవాలి. తద్వారా స్త్రీలు ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, కొవ్వు ఆమ్లాలు, ఇతర ముఖ్యమైన పోషకాలను పొందగలరు. గర్భం ధరించినప్పుడు బాదం తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. బాదం పప్పులు అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. అందువలన గర్భధారణ సమయంలో బాదం పప్పు తప్పనిసరిగా తినాలి.
బాదం పప్పులు సహజంగానే ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇవి విటమిన్‌లు, ప్రోటీన్‌లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉండే ఆహార శక్తి కేంద్రాలు. ఇవన్నీ ఆడవారికి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో. నిజంగా బాదం పప్పులు గర్భధారణ సమయంలో ఉపయోగపడతాయా అని ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఒకసారి తినే పచ్చి బాదం పప్పులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మహిళలు తమ గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడానికి చాలా ప్రోటీన్ తీసుకోవాలి. రోజూ ఒకసారి బాదంపప్పును తినడం వల్ల స్త్రీలకు 8.5% ప్రొటీన్లు అందుతాయి. గర్భం ధరించినప్పుడు బాదం పప్పు తినడం మంచిదో కాదో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారా? గర్భధారణ సమయంలో బాదం పప్పులు తినడం వలన ఇంకా ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో బాదం తినడం పూర్తిగా సురక్షితం. గర్భధారణ సమయంలో.. స్త్రీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఆమె శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం, ఆమె బిడ్డ తన ఆహారం ద్వారా అవసరమైన పోషకాహారాన్ని పొందడం. చాలా మంది మహిళలు, ఆరోగ్య నిపుణులు ఉద్దేశ్యం ప్రకారం బాదం పప్పుల్లో ఆరోగ్యకరమైనవి, పోషకాలను కలిగి ఉంటాయి. వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులలో ఎక్కువ పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. బాదం పప్పును ఉదయాన్నే అల్పాహారం, ఇతర తృణధాన్యాలలో భాగంగా, పాలతో లేదా వ్యాయామానికి ముందు లేదా తర్వాత స్నాక్‌గా కూడా తినవచ్చు. ఆకలి వేస్తోందా? కొన్ని బాదం పప్పులు తినండి. ఆరోగ్యకరమైనది కాని వాటిని స్నాక్‌గా తీసుకునే బదులు, ఆశించే తల్లులకు బాదం అవసరమైన పోషణ అందిస్తుంది.
తల్లి కాబోయే వారికి, వారి శిశువులకు బాదం పప్పు తినడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. పిండం/శిశువు పెరుగుదల, అభివృద్ధికి బాదం చాలా అవసరం. ముఖ్యంగా అవి అవసరమైన పోషకాలతో శక్తివంతంగా ఉంటాయి. తల్లి కాబోయే వారి శరీరానికి, బిడ్డ పెరుగుదలకు బాదం పప్పులు దోహదపడతాయి. అందువల్ల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు, వైద్యులు బాదం పప్పును ఎక్కువగా సిఫార్సు చేస్తారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో రీయూజబుల్ నర్సింగ్ ప్యాడ్‌లను ఉపయోగించడం సురక్షితమేనా?
కాబోయే తల్లి అవసరమైన పోషకాలు, ప్రయోజనాలను పొందడానికి మీరు క్రమం తప్పకుండా ఎన్ని బాదంపప్పులను తినాలని ఆలోచిస్తున్నారా? రోజుకు 12 నుంచి 15 బాదం తినవచ్చు. గర్భవతులు ఒక రోజుకు 20 బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది. బాదం పాలు తీసుకోవడం వల్ల మీ గర్భధారణకు.. మీ శిశువు అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో మీరు మీ పోషకాహార నిపుణుడు లేదా ఆరోగ్య నిపుణుడితో కూడా మాట్లాడి అర్థం చేసుకోవచ్చు.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)