This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో పనసపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు & సైడ్ ఎఫెక్టులు (Jackfruit in Pregnancy | Benefits, Risks & Side Effects in Telugu)

Pregnancy Best Foods
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Jan 1, 2026
గర్భధారణ సమయంలో పనసపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు & సైడ్ ఎఫెక్టులు (Jackfruit in Pregnancy | Benefits, Risks & Side Effects in Telugu)
Likes3 Likes|
Read time7 min

త్వరలో తల్లి కాబోయే వారు చాలా మంది "నేను గర్భధారణ సమయంలో పనసపండు తినొచ్చా?" అని తమని తాము ప్రశ్నించుకుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం అవును. గర్భధారణ సమయంలో ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్ల వంటి పోషకాహారం తినడం ఎల్లప్పుడూ మంచిదే. సమతుల ఆహారం పుట్టబోయే బిడ్డకు సరైన పోషకాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తల్లిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ గర్భిణీ స్త్రీలు తినకుండా ఉండాల్సిన కొన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయి. మరో పక్క పనసపండులో అనేక పోషకాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో పనసపండు ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. దాని వల్ల కలిగే ప్రమాదాలు మరియు సైడ్​ ఎఫెక్ట్స్ గురించి కూడా అవగాహన కలిగి ఉండడం మంచిదే కదా.

పనసపండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits of Jackfruit in Telugu)

పనసపండులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది మంచి మొత్తంలో కేలరీలను కలిగి ఉంటుంది. ఒక కప్పు పరిమాణంలో ఉన్న పనసపండులో 155 కేలరీలు ఉంటాయి. ఇదే సమయంలో కొవ్వు నుంచి కేవలం 5 కేలరీలు మాత్రమే లభిస్తాయి. కేలరీల కోసం ఇది చాలా ఆరోగ్యకరమైనది. పనసపండు ఈ కింది విటమిన్లకు మంచి మూలం.

  • ఫోలిక్ యాసిడ్
  • థైమిన్
  • నియాసిన్
  • రిబోఫ్లేవిన్
  • A మరియు C విటమిన్లు
  • పొటాషియం, కాల్షియం, మాంగనీస్, ఐరన్ వంటి మినరల్స్

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ పనసపండులో కేవలం కొద్ది మోతాదులో మాత్రమే సాట్యురేటెడ్ ఫ్యాట్ (అనారోగ్యకరమైన కొవ్వు) మరియు కొలెస్ట్రాల్ (రక్తనాళాల్లో పేరుకుపోయేది) ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, జీవక్రియ కోసం అవసరమైన ఫైబర్స్ అధిక మోతాదులో ఉంటాయి.

గర్భధారణ సమయంలో పనసపండు తినొచ్చా? (Can Jackfruit Be Eaten During Pregnancy in Telugu?)

చాలా మంది మహిళలు కొంత మంది వైద్యులు కూడా గర్భధారణ సమయంలో స్త్రీలు పనసపండు తినొద్దని సూచిస్తారు. పనసపండు వల్ల కలిగే ప్రయోజనాలను నిరూపించేందుకు తగినంత డేటా అందుబాటులో లేదు. గర్భధారణ సమయంలో పనసపండు తినడం వల్ల గర్భస్రావం అవుతుందని కొంత మంది మహిళలు నమ్ముతారు. కానీ అది నిజం కాదు. పనసపండుని తగినంత మొత్తంలో తినడం వల్ల తల్లికి లేదా బిడ్డకు ఎటువంటి హాని కలగదు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నన్సీ లేత నెలలలో జంపింగ్ చేయడం గర్భస్రావంకు దారి తీస్తుందా?

గర్భధారణ సమయంలో పనసపండు తినడం వల్ల కలిగే ప్రమాదాలు (Risk of Eating Jackfruit During Pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్నపుడు పనసపండు తినడం అనారోగ్యకరమైనది కానప్పటికీ దీనితో కొన్ని ప్రమాదాలు ముడి పడి ఉన్నాయి.

  • పనసపండ్లను ఎక్కువగా తినడం వల్ల గర్భవతుల్లో మధుమేహం వస్తుంది.
  • రక్తం గడ్డ కట్టేలా ప్రేరేపించే కోగ్యులేటింగ్ ఏజెంట్లు పనసపండ్లలో ఉంటాయి.
  • పనసపండుని అధిక మోతాదులో తినడం వలన విరేచనాలు మరియు ఇతర జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

గర్భధారణలో పనసపండు వల్ల కలిగే ప్రయోజనాలు (Jackfruit Benefits in Pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్న మొదటి త్రైమాసికంలో పచ్చి పనసపండు తినడం మూడో త్రైమాసికంలో అధికంగా తీసుకోవడం వలన బహుశా అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. అయినప్పటికీ గర్భధారణ సమయంలో పనసపండు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

1. పొట్టలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది (Tackles Stomach Issues)

పనసపండుని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన గర్భధారణ సమయంలో పొట్ట మీద ఏర్పడే కడుపు పూతల వంటి వివిధ రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

2. శిశువు అభివృద్ధిని ప్రేరేపిస్తుంది (Stimulates the Development of the Baby)

పనసపండు జింక్, కాల్షియం, బెటా-కెరోటిన్, ఐరన్​​ను అందిస్తుంది. ఇవి కడుపులో ఉన్న శిశువు పెరుగుదలకు ఉపయోగపడతాయి.

3. రక్తపోటుని నియంత్రిస్తుంది (Regulates Blood Pressure)

పనసపండు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయం చేస్తాయి.

4. అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది (Relieves from Tiredness)

పనసపండు వంటి శక్తివంతమైన పండ్లు మరియు కూరగాయలు తినడం వల్ల శక్తి లభించి అలసట దూరం అవుతుంది.

5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది (Improves Digestion)

ప్రతి రోజు తీసుకోవాల్సిన ఫైబర్ కంటెంట్​లో దాదాపు 10 శాతం ఫైబర్​ కంటెంట్ పనసపండు ద్వారా లభిస్తుంది. అధిక ఫైబర్ వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పేగు కదలికలు మరింత సమర్థవంతంగా ఉంటాయి

6. ఒత్తిడిని తగ్గిస్తుంది (Reduces Stress)

పనసపండు గింజలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిల్లో ప్రోటీన్ మరియు మానసిక ఒత్తిడిని తగ్గించే అనేక రకాల మినరల్స్ ఉన్నాయి.

7. రోగనిరోధకతను పెంచుతుంది (Improves Immunity)

సాధారణంగా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు విటమిన్ C చాలా అవసరం. మరీ ముఖ్యంగా గర్భవతిగా ఉన్నపుడు ఇది ఇంకా అవసరం. పనసపండులో విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో పనస గింజలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Consuming Jackfruit Seeds During Pregnancy)

పనసపండు గింజల వలన త్వరలో తల్లి కాబోయే స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

  • పనసగింజల్లో అధిక మోతాదులో ఐరన్ ఉంటుంది. రక్తహీనతకు వ్యతిరేఖంగా పోరాటం చేయడంలో ఇవి సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలు తరచూ ఐరన్ లోపానికి గురవుతారు. గర్భధారణ సమయంలో పనసపండు తీసుకోవడం వలన రక్తహీనతతో పోరాడేందుకు సహాయం చేస్తుంది.
  • పనసగింజలలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భవతులకు మెరిసే చర్మం, అందమైన జుట్టును అందజేస్తాయి.
  • పనస గింజలను తీసుకోవడం వలన మనకు సాధారణంగా చేసే జలుబు, జ్వరంతో పోరాడేందుకు సహాయం చేస్తుంది.

గర్భధారణ సమయంలో పనసపండు వల్ల కలిగే దుష్ప్రభావాలు (Jackfruit Side Effects During Pregnancy in Telugu)

పనసపండు వలన గర్భిణీ స్త్రీకి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఇవి భద్రతకు హామీ ఇవ్వలేవు.

  • అప్పుడపుడు పనసపండుని తీసుకోవడం వలన స్త్రీ రక్తంలో చెక్కర స్థాయిలు మారుతాయి. మధుమేహం ఉన్న స్త్రీలు పనసపండుకి దూరంగా ఉండాలి.
  • పనసపండు వల్ల రక్తం వేగంగా గడ్డకడుతుందని నమ్ముతారు.
  • జాక్​ఫ్రూట్ అనేది సహజ లాక్సేటివ్​గా (విరోచనాలయ్యే మందు) పని చేస్తుంది. కావున దీనిని అధికంగా తినడం వలన విరేచనాలు మరియు ఇతర విసర్జన సమస్యలు తలెత్తుతాయి.
  • కొంత మంది స్త్రీలకు పనసపండు తినడం వలన ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది.

మీ గర్భధారణ డైట్​లో పనసపండుని ఎలా చేర్చుకోవాలి (How to Include Jackfruit in Your Pregnancy Diet)

పనసపండుని అనేక రకాలుగా తినొచ్చు. పచ్చిగా ఉండే కాయ, లేదా పండిన పండు, అంతే కాకుండా దీనిని కూరగాయగా కూర కూడా వండుకోవచ్చు. గర్భవతిగా ఉన్నపుడు పనసపండు చిప్స్ తక్కువ మోతాదులో తినాలి. ముక్కలుగా చేసిన పనసపండు మీద కొబ్బరి తురుమును వేసుకొని కూడా తినొచ్చు.

పనసపండు ఎంపిక మరియు నిల్వ చేసేందుకు సూచనలు (Jackfruit Selection and Storage Instructions)

పనసపండుని కొనుగోలు చేసేటపుడు తాజాగా మరియు బరువుగా ఉండేది ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే దానిని ఎంచుకోవాలి. గర్భధారణ సమయంలో పనసపండుని తక్కువ మోతాదులో తీసుకుంటే.. దాని ప్రయోజనాలను పొందొచ్చు. దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీద అవగాహన కలిగి ఉండాలి.

Tags:

Jackfruit during pregnancy in telugu, Jackfruit benefits during pregnancy in telugu, Jackfruit side effects during pregnancy in telugu, can pregnants eat Jackfruit during pregnancy in telugu, Jackfruit in pregnancy in telugu.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Kakarla Sirisha
Kakarla Sirisha

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.